
త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు మన యంగ్ హీరో. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్‍ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా.. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్‌లో జరగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరీకీ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment