టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment