
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్ ఫుల్ ఫ్యామిలీ మ్యాన్‌లా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అంతే కాదు.. ఊర మాస్ ఫైట్స్‌తో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. గోపీ సుందర్ కంపోజ్ చేసిన 'దేఖొరో దెఖో' అనే సాంగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్ వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ఫ్యామిలీ అంటే వీక్‌నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్‌లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకునే పాత్రలో విజయ్ కనిపించారు. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్ షాక్.. ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది. టీజర్ చివర్లో హీరోయిన్ మృణాల్ 'నేను కాలేజ్‌కు వెళ్లాలి.. కొంచెం దించేస్తారా..' అని అడిగితే..'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా' అనే డైలాగ్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sorry thalli, ochestundi..❤️
Next few minutes lo teaser upload aipotundi.. Ee saari naa guarantee.. https://t.co/TbfzSDgWOf— Vijay Deverakonda (@TheDeverakonda) March 4, 2024