విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంటోంది.
అయితే మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై దిల్ రాజు స్పందించారు. మే కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి వస్తుందని దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
దిల్ రాజు మాట్లాడూతూ..'ఈ సినిమాను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కొంతమంది కావాలని నెగెటివ్ వైబ్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ స్ప్రెడ్ చేయడం బాధాకరం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా రీచ్ అయింది. మేము మంచి సినిమానే తీశాం. మంచిగా తీయలేదంటే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. నేను కలిసిన వాళ్లు చాలామంది బయట ఎందుకు ఇంత నెగెటివ్ ఉంది? అని అడుగుతున్నారు. కొందరు కాల్ చేసిన సినిమా చాలా బాగుంది అంటున్నారు. మంచి సినిమానా? కాదా? అనేది మీరు థియేటర్‌కు వస్తే మీకే తెలుస్తుంది.' అని అన్నారు.
నెగెటివ్ ప్రచారంపై మాట్లాడుతూ.. 'కేరళలో కోర్ట్ మొదటి మూడు రోజుల వరకు రివ్యూ ఇవ్వకుండా తీర్పు ఇచ్చారట. అలాంటిది మన దగ్గర వస్తే బాగుంటుంది. లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకడం కష్టం. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది నిర్మాతలే. ఎంతో కష్టపడి చేసే సినిమాను ఆడియన్స్ థియేటర్‌కు రాకుండా చేయడమనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరిగితే పోను పోను ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక సినిమాలు ఏం తీస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ పద్ధతి ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment