మృణాల్, విజయ్ దేవరకొండ, ‘దిల్’ రాజు
విజయ్ దేవరకొండ
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్‌కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’.
‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్‌లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్‌కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్‌లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్‌కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్‌కి ఇస్తాను’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్‌గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్.
Comments
Please login to add a commentAdd a comment