గీత గోవిందం.. ఆరేళ్ల కింద వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అంతేనా.. మ్యూజికల్ హిట్ కూడా! ఇన్నాళ్ల తర్వాత గీతా గోవిందం కాంబో రిపీట్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకుడిగా, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫ్యామిలీ స్టార్ తెరకెక్కింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కల్యాణి.. వచ్చా.. వచ్చా పాట జనాలకు ఇట్టే కనెక్ట్ అయింది. గురువారం ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
స్వామీ చెడగొట్టకు
'స్వామీ, నువ్వు కొత్తగా నా లైఫ్‌లో బ్రేకులేమీ ఇవ్వాల్సిన పని లేదు. ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు' అని దేవుడిని హీరో వేడుకోవడంతో ట్రైలర్ మొదలవుతుంది. హీరోయిన్.. హీరో కుటుంబంతో కలిసిపోవడం.. తర్వాత సమస్యలు ఎదురవడం.. ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని చెప్పిన హీరోయే చివరికి హీరోయిన్ వెనకాల తిరగడం సరదాగా అనిపిస్తాయి. భయపడాలి.. ఇంకోసారి.. ఎవరైనా.. చులకనగా మాట్లాడాలంటే.., నేను నీ లైఫ్‌లోకి రావడమే ప్రాబ్లమ్.. వంటి డైలాగ్స్ బాగున్నాయి.
చెంప చెళ్లుమనిపించింది
ట్రైలర్ ముగింపులో హీరో చెంప చెళ్లుమనిపించే సీన్ మాత్రం హైలైట్! ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. మరి థియేటర్లలో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
చదవండి: సినిమా మొత్తం ఒకే పాత్ర... ఓటీటీలో తెలుగు హారర్ మూవీ
Comments
Please login to add a commentAdd a comment