కల్యాణి... వచ్చా వచ్చా...  | Vijay Deverakonda: Family Star Second Single Kalyani Vaccha Vacchaa Out | Sakshi
Sakshi News home page

కల్యాణి... వచ్చా వచ్చా... 

Published Wed, Mar 13 2024 3:18 AM | Last Updated on Wed, Mar 13 2024 3:18 AM

Vijay Deverakonda: Family Star Second Single Kalyani Vaccha Vacchaa Out - Sakshi

‘కల్యాణి.. వచ్చా వచ్చా...’ అంటూ పాట పాడేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా పరశురామ్‌ పెట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించారు. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘కల్యాణి.. వచ్చా వచ్చా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్‌.

వివాహ వేడుకల్లో భాగంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, మంగ్లీ, కార్తీక్‌ పాడారు. ‘కల్యాణి... వచ్చా వచ్చా, పంచ కల్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది. ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌  చేస్తాం’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, క్రియేటివ్‌ ప్రోడ్యూసర్‌: వాçసూ వర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement