గుర్తుండే ఫ్యామిలీ స్టార్‌  | Vijay Devarakonda and Mrunal Thakur Family Star Trailer Launch | Sakshi
Sakshi News home page

గుర్తుండే ఫ్యామిలీ స్టార్‌ 

Published Fri, Mar 29 2024 2:12 AM | Last Updated on Fri, Mar 29 2024 2:12 AM

Vijay Devarakonda and Mrunal Thakur Family Star Trailer Launch - Sakshi

‘‘ఇరవైఒకటేళ్ల కింద ఏప్రిల్‌ 5న ‘దిల్‌’ సినిమా నిర్మాతగా ‘దిల్‌ రాజు’గా మారాను. 21 ఏళ్ల తర్వాత ఇదే తేదీన మా ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా రిలీజ్‌ అవుతోంది. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే కథతో ఈ చిత్రం రూపొందింది’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ వచ్చే నెల 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో ‘దిల్‌’ రాజు ఇంకా మాట్లాడుతూ – ‘‘తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్‌ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ (ప్రేక్షకులు) ఫ్యామిలీ స్టార్స్‌ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్‌ అవ్వాలని కోరుకుంటారు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్, విజయ్‌ కాంబి నేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ సమ్మర్‌లో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని, విజయ్‌ దేవరకొండను, మృణాల్‌ ఠాకూర్‌ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు’’ అని పరశురామ్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement