
మృణాళ్ ఠాకూర్, విజయ్ దేవరకొండ
‘గీతగోవిందం’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘‘ఏమండి.. నేను కాలేజీకి వెళ్లాలి... కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్), ‘ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’(విజయ్ దేవరకొండ)’ వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం గోపీ సుందర్, కెమెరా: కేయూ మోహనన్.
Comments
Please login to add a commentAdd a comment