
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడి పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు.
అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా.. దిల్ రాజు తమ్ముడి కుమారుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. టాలీవుడ్‌లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment