
ఇటీవల ఎక్కువగా సినీతారల పెళ్లి వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కొత్త ఏడాదిలోనూ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది.గతేడాది సైతం పలువురు టాలీవుడ్ ప్రముఖులు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. 2023లో పెళ్లి చేసుకున్న వారిలో మంచుమనోజ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయారు. తన పెళ్లికి రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి వివాహా ఆహ్వాన పత్రికను అందించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా?
ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడే. తాజాగా నిర్మాత దిల్‌రాజుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వచ్చే నెలలోనే ఆశిష్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
కాగా.. ఆశిష్ ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందే 2022లో రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Dil Raju and Shirish personally invited Man of Masses NTR @Tarak9999 for the joyous occasion of Shirish's son, @AshishVoffl 's wedding. pic.twitter.com/5lX1Gw5O90
— Vamsi Kaka (@vamsikaka) January 31, 2024