సాక్షి, హైదరాబాద్: ఆశిష్ రెడ్డి (59) అర్ధ సెంచరీ సాధించడంతో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏతో జరుగుతున్న ‘ఎ’ డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్రా బ్యాంక్ 76 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆశిష్‌తో పాటు కిరణ్ కుమార్ (39 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించాడు. ఎస్‌సీఆర్ బౌలర్లలో ఎం.సురేశ్ 71 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సాధ్యం కాలేదు.
ఆంధ్ర 229/8
బరోడాతో ప్రారంభమైన అండర్-19 మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సూరజ్ ప్రీతమ్ (55) హాఫ్ సెంచరీ చేయగా...టి. శ్రీకృష్ణ (49), జ్ఞానేశ్వర్ (35) రాణించారు. బరోడా బౌలర్లలో గుర్జీనర్ సింగ్ మాన్ 64 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
రాణించిన ఆశిష్ రెడ్డి
Published Tue, Aug 20 2013 11:47 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement