చైత్రతో ప్రేమ | Selfish poster release | Sakshi
Sakshi News home page

చైత్రతో ప్రేమ

Published Sun, Apr 23 2023 5:47 AM | Last Updated on Sun, Apr 23 2023 5:47 AM

Selfish poster release - Sakshi

ఇవానా, ఆశిష్‌

‘రౌడీ బాయ్స్‌’తో ఆకట్టుకున్న ఆశిష్‌ రెడ్డి హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సెల్ఫిష్‌’. కాశీ విశాల్‌ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ , ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇవానా కథానాయిక. ఆమె పాత్ర పేరు చైత్ర. ఆందోళనగా ఉన్న చైత్రను హీరో తదేకంగా చూస్తున్న పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగే ఈ మాస్‌ లవ్‌స్టోరీలో ఆశిష్‌ ఓల్డ్‌ సిటీ కుర్రాడి పాత్ర చేస్తుండగా, ఇవానా ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: ఎస్‌. మణికందన్, సహనిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్‌ బండ్రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement