
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘సింగిల్’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడురోజుల్లోనే రూ. 16.30 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా నటించారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.
సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా విడుదలరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సింగిల్ చిత్రం.. ఊహించినదానికంటే భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. శ్రీవిష్ణు కెరీర్‌లో మరో భారీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. దీంతో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని పలు థియేర్స్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సందడి చేస్తున్నారు.
సింగిల్ సినిమా జైత్రయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా మీ ఊరి థియేటర్స్‌కే నేటి నుంచి వచ్చేస్తున్నారు.
మే 12న సాయంత్రం 6గంటలకు వైజాగ్‌లోని మెలోడీ థియేటర్, మే 13న ఉదయం 11గంటలకు రాజమండ్రి అప్సర, మధ్యాహ్నం 2గంటలకు ఏలూరులోని ఎస్‌వీసీ, సాయంత్రం 6గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్స్‌కు వారు రానున్నారు. మే 14న ఉదయం 11గంటలకు గుంటూరు మైత్రీ, మధ్యాహ్నం 2గంటలకు నరసరావుపేట గీతా మల్టీఫ్లెక్స్‌లో చిత్ర యూనిట్ సందడి చేయనుంది.