selfish
-
కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు చూడరు
‘‘ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలిక కాదు. ‘బలగం, దసరా, విరూ పాక్ష’.. ఇలా కొత్తదనంతో నూతన దర్శకులు తీసిన చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేని సినిమాలు చూడటానికి రెడీగా లేరు.. అది ఇవ్వడానికి రాత్రీపగలు కష్టపడాల్సిందే’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆశిష్, ఇవానా జంటగా కాశీ విశాల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెల్ఫిష్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్‌పై ‘దిల్’ రాజు–శిరీష్ నిర్మిస్తున్నారు. ఆశిష్ పుట్టినరోజు (మే 1)ని పురస్కరించుకుని ‘సెల్ఫిష్’లోని ‘దిల్ ఖుష్..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, జావేద్ అలీ పాడారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను, సుకుమార్ సపోర్ట్‌గా ఉంటాం. కానీ, ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను కష్టపడాలి’’ అన్నారు. ‘‘సెల్ఫిష్’ కోసం నేను, కాశీ ప్రాణం పెట్టి కష్టపడుతున్నాం’’ అన్నారు ఆశిష్. ‘‘మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది’’ అన్నారు విశాల్ కాశీ. ఈ చిత్రానికి సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి. -
సెల్ఫిష్ బాయ్: ఫస్ట్ సాంగ్ రిలీజయ్యేది అప్పుడే
‘రౌడీ బాయ్స్’తో హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సెల్ఫిష్’. నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, ‘దిల్’ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్వార్థానికి చిరునామాలా ఉండే పాత బస్తీ కుర్రాడి పాత్రలో కనిపిస్తారు హీరో ఆశిష్. ఇవానా హీరోయిన్. ఈ చిత్రంలోని తొలి పాట ‘దిల్ ఖుష్..’ను మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఆశిష్ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం, ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: మణికందన్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
చైత్రతో ప్రేమ
‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సెల్ఫిష్’. కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇవానా కథానాయిక. ఆమె పాత్ర పేరు చైత్ర. ఆందోళనగా ఉన్న చైత్రను హీరో తదేకంగా చూస్తున్న పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగే ఈ మాస్ లవ్‌స్టోరీలో ఆశిష్ ఓల్డ్ సిటీ కుర్రాడి పాత్ర చేస్తుండగా, ఇవానా ఫైనాన్షియల్ ఎనలిస్ట్ పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: ఎస్. మణికందన్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
మంచి మాట: అతి అనర్థమే!
‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే అతి ఎల్లవేళలా విడిచిపెట్టాలి అని పెద్దలు ఏనాడో చెప్పారు. అతి అన్న మాటకు ఎక్కువగా, అధికంగా, అవసరమైన దానికన్నా అని అర్థం. అవసరానికి మించినది ఎక్కువ ఏ విషయంలోనూ కూడదని దీని తాత్పర్యం. మన నడతలో, ఆహార్య ఆహారాదులలో, భాషణ, భూషణాది విషయాలలో ఒక హద్దు, నియమం ఒక పరిమితి ఉండాలి. అంతకుమించి పోరాదు. పరిమితి, హద్దు అనేవి ప్రకృతికే కాదు, మనిషి జీవితానికి అవసరం. అవి మనకొక క్రమాన్ని, హద్దును ఏర్పరచి జీవితం, సత్సంబంధాలు హాయిగా కొనసాగేటట్టు చేస్తాయి. మనిషి నాగరికతను, సంస్కారాన్ని సూచించేవి దుస్తులు. సభ్యతతో సమాజంలో సంచరించటానికి చక్కని వస్త్రధారణ కావాలి. అవి మనకు ఒక హుందాను, నిండుదనాన్ని ఇవ్వాలి. సరైన కొలతలతో ఉన్న దుస్తులు మన ఒంటికి చక్కగా అమరుతాయి. అందాన్నిస్తాయి. పరిమాణంలో అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉన్న ఉడుపులు చూపరులకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది. ఉత్సాహాన్నిచ్చి మన పనులు చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఆహారం మనకు అందించే కేలరీలు శరీరానికవసరమైన స్థాయిలో ఉంటే చక్కని ఆరోగ్యం. ఇవి అతిగా ఉంటే ఊబకాయం. పనులు చేసుకోవటం కష్టమవుతుంది. అలాగే వీటి సంఖ్య తగ్గితే అనారోగ్యమే. ఈ కేలరీలను నియంత్రించుకోవాలంటే జిహ్వను అదుపులో పెట్టుకోవాలి. ‘నాలుక కోరుతోంది కాబట్టి తింటాను’ అనే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే మితమైన లేదా సరిపడా ఆహారం తీసుకోవాలి. అలసిన శరీరం మళ్లీ శక్తిని పుంజుకుని, మరుసటి రోజు పనులకు ఆయత్తమవాలంటే నిద్ర మనకు చాలా అవసరం. సేదతీరిన కాయం కొంత సమయం తరువాత చైతన్యవంతమవుతుంది. మన దినచర్య లోకి వెళ్ళమని సూచిస్తుంది. కొంతమంది అవసరమైన సమయంకన్నా ఎక్కువసేపు నిద్రపోతుంటారు.అటు వంటివారిలో ఒక మందకొడితనం వస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గి చైతన్యం మటుమాయం అవుతుంది. ఈ దురలటువాటు మన జీర్ణ వ్యవస్థను ఛిద్రం చేస్తుంది అందుకే అతినిద్ర చేటు అని వివేకవంతులు చెప్పారు. ‘కేయురాణి న భూష యంతిం’ అన్న శ్లోక భావార్థం ఇదే. పెద్దలు, పండితులు, మహానుభావుల సమక్షంలో ఒదిగి, వినమ్రంగా ఉండాలి. వినయంతో సంచరించాలి. ఇది వారి జీవితానుభవాన్ని, విద్వత్తును, ఘనతను గుర్తెరిగి ప్రవర్తించటం. కొందరు అవసరానికి మించిన వినయాన్ని చూపిస్తారు. అది ధూర్తుల లక్షణం. వీరి అతివినయపు లక్ష్యం ఒక స్వార్థ ప్రయోజనమే. వినయాన్ని చూపుతూనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అపుడే దానికొక ఒక గౌరవం, ప్రశంస. అతిపరిశుభ్రత వల్ల సమయం, శక్తి వృథా. అతి ప్రేమ, కాముకత, అహంకారం, జాత్యహంకారం వల్ల ఎందరో, ఎన్నో దేశాలు నాశనమయ్యాయో చెప్పే చరిత్ర పాఠాలు విందాం. మనిషికి మాత్రమే ఉన్న అద్భుత ఆలోచనా శక్తి అతణ్ణి జంతుప్రపంచం నుండి విడిపడేటట్టు చేసింది. భాషను కనుగొనేటట్టు చేసింది. దీనికితోడు, సృష్టిలో ఏ ఇతరప్రాణికి లేని అతడి స్వరపేటిక, నాలుక, ఊపిరితిత్తుల కుదురైన అమరిక అతడి భావోద్వేగాలను వ్యక్తం చేసే గొప్పసాధనమైంది. సందర్భానికి కావలసిన అర్థవంతమైన మాటలను మనలో ఎంతమంది వాడగలరు? వేళ్ళమీద లెక్కపెట్టగలిగే వారే కదా! చాలామంది అధిక ప్రసంగం చేసేవారే. క్లుప్తత, ఔచిత్యత, వివేచనలతో సందర్భశుద్ధిగా భాషించే వాళ్ళు మనలో చాలా తక్కువమందే. ఈ వదరుబోతుల వల్ల కాలహరణమే కాక సంభాషణ పెడదారి పడుతుంది. అందుకే మాట్లాడటం ఒక కళ అన్నారు. అది కొందరికే అలవడుతుంది. అపుడు భాషణం గొప్ప భూషణమే అవుతుంది. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
గురువాణి – 3: ఆ.. నలుగురి కోసం కూడా...
వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు. ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు. గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు. నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది. నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘సెల్ఫిష్’ చిత్రం ప్రారంభం
-
ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
బీసీసీఐ ఓ సెల్ఫీష్ : ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డే/నైట్ టెస్టు ప్రతిపాదనను తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరించందన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని, ఈ దేశాలతో టెస్ట్ క్రికెట్‌కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నామని వా ఓ రేడియో చానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత జట్టులో సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్, స్పిన్నర్లు, పేసర్లతో పటిష్టంగా ఉండగా అసలు బీసీసీఐ డే/నైట్ టెస్టుకు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావడలేదన్నాడు. టీమిండియాకు డే/నైట్ టెస్టులు సరిగా సరిపోతాయన్నాడు. డే/నైట్ టెస్టులు చూడటం తాను ఇష్టపడతానని తెలిపాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ సైతం ఇదే విధంగా బీసీసీఐని తప్పుబట్టాడు. మరోవైపు మార్క్ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. ఇక భారత్ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల కోసం నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. -
అమ్మ
అనగనగా సూర్యుడికో కూతురుండేది. తండ్రిలాగే ఆమె కూడా ప్రచండ తేజస్విని. సూర్యుడు తన వెలుగంతా ఆమెకే ఇవ్వాలనుకున్నాడు. వేళ్లకు నక్షత్రాల వుంగరాలతో, కాళ్లకు, నడుముకు, మెడకు వివిధ కాంతిపుంజాల ఆభరణాలతో, ధూమకేతు చేలాంచలాలతో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఆకాశంలో ఆడుకునేది, వెలుగు ప్రసరించిన విశ్వాంతరాళం ఆమె సామ్రాజ్యం. గులకరాళ్లలా అంతటా విస్తరించిన గ్రహాలను దాటి దారితప్పి దూరంగావున్న మరో గ్రహంవైపు పయనించింది. అది ఆకుపచ్చగానూ, నీలం రంగులోనూ కనిపించింది. ‘‘ఆహా! ఎంత అందమైన ప్రదేశం. ఆ నీల, హరిత లోకంలో నక్షత్ర ఖచితసింహాసనం అధిష్ఠిస్తాను. అక్కడే కలకాలం వుండిపోవాలని వుంది’’ అని చెప్పింది తండ్రితో. సూర్యుడు నిట్టూర్చాడు. తన కూతురి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అతనూహించగలడు. ‘‘నా ఆధీనంలో ఉన్న అన్ని గ్రహాలూ నీవే. ఎక్కడికైనా నువ్వు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. కానీ ఆ గ్రహం మీద ఉండాలంటే నీ కాంతి, వేడి బాగా తగ్గించుకోవాలి. నీ ఉంగరాలూ, ఆభరణాలూ, దుస్తులు ఆ గ్రహం భరించలేదు. ఆ హరిత వాతావరణం చాలా సుకుమారమైనది. నీ శరీర ఉష్ణానికి నీలిగా కనిపించేదంతా ఆవిరైపోతుంది. అందువల్ల ప్రస్తుతమున్న నీ అలంకరణలకు బదులు మరో మూడు వరాలు కోరుకో తక్షణమే ఇస్తాను’’ అన్నాడు సూర్యుడు దిగులుగా. ‘‘నన్నాలోచించుకోనీ’’ అన్నది పిల్ల. ఏళ్లు గడిచాయి. అనంతకాలంలో లక్షసంవత్సరాలన్నా ఓ క్షణంతో సమానమే గద. మరికాసేపాలోచించి, ‘‘నాకా గ్రహాన్ని తల్లిలా చేరదీయాలనిపిస్తున్నది, ఇదే నా కోరిక’’ అంది. ‘‘నా ముద్దుల తల్లీ, నీ యిష్టానికి నేనెప్పుడూ అడ్డుచెప్పను. ఎప్పుడు నీకు తిరిగి రావాలనిపిస్తే అప్పుడేరా. నీకోసం నేను నిరీక్షించని రోజుండదు. అక్కడికి వెళ్లాక నా కాంతికి నీ కళ్లు మూసుకోవచ్చు జాగ్రత్త’’ అన్నాడు సూర్యుడు ఆప్యాయంగా. అలా, ఆ పిల్ల వదిలేసిన వుంగరాలు, కాళ్ల కడియాలు, నక్షత్రహారాలు, ధూమకేతువులు సూర్యుడి చుట్టూ పాలపుంతలా పరచుకున్నాయి. అవి గుర్తులుగా ఆమె తన తండ్రి దగ్గరకి ఎప్పుడైనా తిరిగిరావచ్చు. ఒక పార, రోలు, రుబ్బురాయి, గంప, నీళ్లకుంట, గొడ్డలి, చాప, కప్పుకోవటానికో దుప్పటి, తినటానికి వెదురు బొంగులతో అల్లిన కంచాలు తీసుకుని అటుగా పయనించిన ఒక నక్షత్రం మీద ఎక్కి తన కొత్త నివాసానికి ప్రయాణమైందామె. మరెంతో కాలం విశ్వాంతరాళంలో విహరించి, హరిత గ్రహానికి చేరుకుంది. అక్కడ విస్తారంగా పెరిగిన అరణ్యాలు, పచ్చిక మైదానాలు, వివిధ జాతుల మొక్కలు చూసి ఆమె మనసు ఆనందంతో నాట్యం చేసింది. రంగురంగుల పువ్వులు – పసువు, నారింజ, ఎరుపు, తెలుపు, నిమ్మరంగు, నీలి, వూదా– వాటి కలయికతో ఏర్పడిన మరెన్నో రంగులు ఆమె అదివరకెప్పుడూ చూడలేదు. ‘‘ఇంత సంతోషాన్ని నేనొక్కదాన్ని భరించలేను. నాకు పిల్లలు కావాలి. చాలామంది పిల్లలు. అందర్నీ నేను పోషించగలను. కేరింతలు కొడుతూ, పాటలు పాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ, ఈ పర్వతాలు ప్రతిధ్వనించేలా కేకలు పెడుతూ ఆడుకుని, సేవచేసి, ప్రశాంతంగా నా కళ్లు మూసే పిల్లలు’’. ఆ క్షణమే ఆమె కోరిక తీరింది. వందలు, వేలు, లక్షల్లో పిల్లలు నలుదెసలా తిరుగాడారు. మగ, ఆడ, పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, లావు, సన్నం అన్ని రకాల పిల్లలు వచ్చి ఆ తల్లిని ఆలింగనం చేసుకున్నారు. అలాగ, అన్నాళ్లు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించిన ఆ నక్షతం మరోగ్రహం మీద జీవరాసులన్నింటికీ తల్లిగా మారింది. తారతమ్యం లేకుండా ఆమె అందర్నీ ఒక్కలాగే ప్రేమించింది. బలవంతులు, బలహీనులు, అందగాళ్లు, కురూపులు, చతురులు, మూర్ఖులు అన్న తేడా ఆమెకు లేదు. పిల్లలు నడిచారు. పరిగెత్తారు. రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కొందరు అంతా తమకే కావాలన్నారు. కొందరు రోజుగడిస్తే చాలన్నారు. కొందరు తప్పులు చేసి చెయ్యలేదన్నారు. కొందరు అందరి తప్పులు తమమీద వేసుకున్నారు. కొందరు అంతా తమకే తెలుసన్నారు. కొందరు ఏమీ తెలియదన్నారు. కొందరి పనులు పక్కవాళ్లకు ప్రాణాంతకంగా మారాయి. కొందరు ఆత్మరక్షణ కోసం తండ్రి ప్రేమతో పంపిన ఎండ, తన పిల్లల్ని చలినుండి రక్షించింది. వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. శిశిరమూ, చలికాలమూ వచ్చి మొక్కల్ని కూడా నిద్రపుచ్చాయి. తన పారతో నేలను గుల్లగా చేసింది. పిల్లలు ఎంత తిన్నా తరగనంత భోజనం సమకూర్చింది. ఈ పిల్లల తల్లి తన సంతానం కోసం చెయ్యనిదంటూ లేదు. ఏళ్లు గడిచాయి. పిల్లల్లో మార్పు వచ్చింది. ‘‘నా గురించి ఇప్పుడెవరూ ఆలోచించరు. తమస్వార్ధమే తప్ప తల్లి అవసరమేమిటో ఎవరికీ పట్టదు’’ అని తండ్రితో చెప్పుకుని విలపించిందామె. ‘‘వాళ్లు నీ పిల్లలు. నీ ఇష్టంతో నువ్వు వాళ్లనీలోకంలో సృష్టించావు. విద్యాబుద్ధులు నేర్పించి, బాధ్యతల గురించి కూడా కాస్త చెప్పాలి మరి’’ అన్నాడు సూర్యుడు. కానీ వాళ్లు తన మాట వినరు. అస్తమానమూ తమలో తాము కీచులాడుకుంటారు. ఎంతిచ్చినా ఇంకా కావాలి అనే దురాశ బాగా పేరుకుపోయింది. ‘‘నాకు ఆకలేస్తోంది. నాకు నీళ్లు కావాలి. ఇన్ని కష్టాలా? మరింత సుఖం కావాలి’’ అంటూ వాళ్లు ఆమెను సతాయించని క్షణంలేదు. తన సంతానంలో ఎవరికే బాధకలిగినా పిల్లల తల్లి మనసు చివుక్కుమంటుంది. గాయమైందంటే లేపనం రాస్తుంది. ఆకలికి కొత్త పంటలు, దాహానికి కొత్త కాలవలు. కానీ వాళ్ల ఆశకు అంతులేదు. గిల్లి, రక్కి తనను వాళ్లు గాటుపెట్టని చోటులేదు. తల్లి ఇచ్చిన దానితో తృప్తిపడక ఒకర్నొకరు చంపుకుని ‘ఇదే మా విజయం’ అనుకున్నారు. తల్లి హృదయం క్షోభించింది. ఆమె ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. తమ కష్టాలన్నింటికీ పిల్లలు తల్లినే నిందించడం ఆనవాయితీగా మారింది. తనలో మొదటి ఉత్సాహం లేదు. తల్లిమీద కనికరంలేని పిల్లలు. తన పాలు కాదు. నెత్తురు తాగుతున్నారు. తనను కోసుకుని తిని అదే రుచికరమైన ఆహారమనుకుంటున్నారు. ఆమెకు విసుగొచ్చిన క్షణాన మహోధృతంగా గాలివీచి, చెట్లను కూకటివేళ్లతో పెకలిస్తుంది. కన్నీరు కార్చినప్పుడు సముద్రాలు పొంగుతాయి. పక్షుల కిలకిలా రావాలకు బదులు భీకర శబ్దాలతో కంపిస్తుంది. పర్వతాల మీద మంచు తుంపరలకు బదులు చల్లగాలి కంబళీ కప్పుకుంటుంది.ఆమె కుంచించుకుపోయిన తన అరణ్యాలను చూసి విలపించింది. తల్లిని వివస్త్రను చేసిన పిల్లలు ఎక్కడ తలదాచుకుంటారు. ఈ మారణ హోమాన్ని ఆపేదెట్లా? తల్లికి పిల్లల గురించి తప్ప మరో ధ్యాస లేదు. కానీ వాళ్లు ఆమె గుండెల్ని గునపాలతో తవ్వారు. విలువైన ఖనిజాలు, లోహాలు కావాలట. కండల్ని పీకి ఆనందించారు. నెత్తురు వరదలై కారింది. ఒకప్పుడు తల్లి జోలపాటలతో నిద్రపుచ్చింది. ఇప్పుడామె హాహాకారాలు కూడా వాళ్లకు వినిపించవు. ఒకప్పుడు తన ఒడిలో ఆడుకున్న పాపాయి ఇనప గోళ్లతో ఇప్పుడు తనను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. తిరగగలిగినంత భూమి ఉంది అందరికీ. కానీ బలవంతుడు వచ్చి బలహీనుల భూమిని కబ్జాచేసి ‘ఇదినాదే’ అంటూ నిత్యం కలహించుకుంటే తనెన్ని తగువులని తీర్చగలదు? భూమి మాత్రమే కాదు. రాళ్లు రప్పల గురించి తలలు పగల కొట్టుకుంటున్నారు. స్వేచ్ఛగా విహరించే పక్షుల్ని, జంతువుల్ని పంజరాలలో బోనులలో బంధించారు. నదిలోని చేపల్ని ఇళ్లలో నీటి తొట్లలో వేశారు. అలా, అంతులేని మనోవ్యధతో కృంగి కృశించి ఒకనాడు కన్ను మూసింది పిల్లలతల్లి. కానీ పిల్లలకా విషయం కూడా తెలియదు. మరణం తర్వాత ఆమె రెండో కోరిక తీరింది. తన అవశేషాలను ఒక నల్లటి గుడ్డలోకట్టి పిల్లల అవసరాలకోసం తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడామె ఒక ప్రేతంలాగున్నది. ఎవరూ గుర్తుపట్టలేదు. అయినా, తల్లి గురించి ఆలోచించటం పిల్లలెప్పుడో మానేశారు. అప్పుడప్పుడూ పర్వతాలలో, అరణ్యాలలో, సముద్రంమీద తుపానులాగ ఆమె రోదించింది. ఇంత మందిని కన్నా, ఒకే పిల్లకు మాత్రం తనంటే ప్రేమ, నల్లటి జుత్తు, అందమైన కళ్లతో చక్కగా పెరిగిందా అమ్మాయి. ఆమెను చూస్తే తల్లి హృదయం పొంగుతుంది. ఇన్ని కోట్ల మందిలో ఒక్కరైనా తనగురించి ఆలోచిస్తున్నందుకు తల్లికి తన ప్రయత్నం వృ«థా కాలేదనిపించింది. తన తర్వాత తన పని కొనసాగించటానికి ఈ పిల్ల చాలు. ఒక వాయు ప్రళయం వచ్చి ఆమెను రజనుగా మార్చి ఆకాశంలోకి తీసుకెళ్లింది. అక్కడ ఘనీభవించిన ఆ రజనే మనం చూసే చంద్రుడు. తండ్రి ప్రకాశాన్ని తనలో జీర్ణించుకొని, చల్లని చూపులతో భూమి మీద తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నదా తల్లి. ఆమె చలువ వల్లనే మన గ్రహం ఇంత పచ్చగా, చల్లగా ఉన్నది. నిత్యం పోట్లాడుకుంటున్న పిల్లల్ని చూసి కన్నీరు కారుస్తున్నదా తల్లి. ఈ ఘోరాలు చూడలేక ఆమె కనుమరుగై, సన్నటి వంకలా మారుతుంది. పిల్లల్లో మార్పు వస్తుందేమోనని ప్రతినెలా వెన్నెల కురిపిస్తుంది. తల్లిని ప్రేమించటం ఎప్పుడు నేర్చుకుంటారీ పిల్లలు!? -
డబ్బుతోపాటొచ్చే దరిద్రం ఏమిటో తెలుసా?
న్యూయార్క్: డబ్బూ, డబ్బూ, డబ్బూ....డబ్బుతోటిదే లోకం. డబ్బుంటే సకల సౌకర్యాలు కనుసన్నల్లోకి వస్తాయని భావించేవాళ్లు, పాపిష్టిది డబ్బు, ప్రపంచాన్ని పాపపంకిలం చేస్తుందని ఈసడించేవాళ్లూ ఉంటారు. సమస్యలను తీర్చే, సమస్యలను తెచ్చే డబ్బు గురించి ఎవరి అనుభవాలనుబట్టి వారు నిర్వచనాలు ఇస్తుంటారు. డబ్బుతోబాటు డాబు, దర్పం వస్తుందని, దాన్ని వెన్నంటే స్వార్థం, పిసినారి తనాన్ని కూడా మూటగట్టుకొస్తుందని ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ పలు శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపించింది. డబ్బున్న మారాజులు విందు, వినోదాల్లో తేలిపోవచ్చుగానీ వారికి సామాజిక జీవితం తక్కువని, ఎక్కువ శాతం వారు ఒంటరిగానే గడుపుతారని, అదే డబ్బులేని పేదవాళ్లు ఎక్కువగా సామాజిక జీవితం గడుపుతారని, అంటే బంధు, మిత్రులతో సుఖ సంతోషాలు పంచుకుంటారని ఈ అధ్యయనాల్లో తేలింది. తోటివారు ఏమైనా చెబుతుంటే దండిగా డబ్బున్న వాళ్లు వారి మాటలు వినిపించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంటారు. అదే మధ్యతరగతి వాళ్లు తోటి వాళ్లు తమ కష్ట సుఖాల గురించి వివరిస్తుంటే అసహనంగా కదులుతూ మొబైల్ ఫోన్ లేదా పేపరు చూస్తూ అప్పుడప్పుడు మాత్రమే తలాడిస్తూ ఉంటారు. ఇక తక్కువ ఆదాయం కలిగిన కష్ట జీవులు తమ కష్టాల గురించి ఏకరువు పెడుతుంటే రెప్ప వాల్చకుండా చెప్పేవారి కళ్లలోకి చూస్తూ తలాడిస్తుంటారు. దయతో వారి మాటలను అర్థం చేసుకుంటారు. మొత్తంగా డబ్బున్న వారిలో ఔదార్యం మరీ తక్కువగాను, మధ్య తరగతి కుటుంబాల్లో కాస్త ఎక్కువగాను, దిగువ తరగతి పేదల్లో మరీ ఎక్కువగాను ఉంటుందని సామాజిక ప్రయోగాల ద్వారా తేల్చారు. కాయకష్టం చేసుకొని బతికే పేదవాళ్లలోనే తొటివారికి సేవచేయాలనే పెద్ద మనసు ఉంటుందని, వారు ఎక్కువ సామాజిక జీవితాన్ని గడపడం ద్వారానే వారికి ఈ గుణం అబ్బిందని అధ్యయనంలో వెల్లడైంది. పాత, చౌక కారును నడిపే యజమానులు బాటుసారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఎక్కువసార్లు ఆగి, వారు దాటాకనే కారు నడుపుతారని, ఖరీదైన కార్లలో వెళ్లేవాళ్లు బాటసారుల కోసం కారును ఆపకుండా వీలైనంత వరకు దూసుకెళ్లేందుకే ప్రయత్నిస్తారని మరో అధ్యయనంలో రుజువైంది. దీన్నిబట్టి ఎక్కువ డబ్బున్నవారి, తక్కువ డబ్బున్న వారి మనస్తత్వం తీరును అర్థం చేసుకోవచ్చు. డబ్బున్న వారే ఎక్కువ మోసాలకు పాల్పడతారని, వారిలో చోర గుణం (స్టడీస్ ఆఫ్ షాప్లిఫ్టింగ్లో పేర్కొన్న అంశాల ప్రకారం)కూడా ఎక్కువగానే ఉంటుందట. డబ్బుకు సంబంధించిన ఓ వీడియో గేమ్‌ను డబ్బున్న వాళ్లతో, డబ్బులేని వాళ్లతో ఆడించగా డబ్బున్న వాళ్లు ఆ గేమ్‌లో మోసానికి పాల్పడ్డారు. వారిలో ఎక్కువ మంది పన్ను ఎగవేసేవారు ఉన్నట్లు కూడా తేలింది. అంతేకాకుండా తక్కువ డబ్బున్న వారే తమ డబ్బులో ఎక్కువ శాతం సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నట్లు, ఎక్కువ డబ్బున్న వాళ్లు సామాజిక కార్యక్రమాలకు అతి తక్కువ విరాళాలు ఇస్తున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ప్రజల మధ్య ఎక్కువ ఆర్థిక అసమానతలున్న దేశాల్లో ధనవంతుల్లో దుర్మార్గం ఎక్కువ, ఔదార్యం తక్కువగా ఉందని, తక్కువ ఆర్థిక అసమానతులున్న దేశాల్లో ధనవంతుల్లో ఔదార్యం ఎక్కువగా ఉందని కూడా అధ్యయనకారులు సూత్రీకరించారు. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో సామాజిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు, జీవించే ప్రామాణిక కాలం, ఆరోగ్య వసతులు తక్కువ. శిశు మరణాలు ఎక్కువ. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పాళ్లు, సంతోషం పాళ్లు తక్కువే. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల మాట్లాడుతూ సమకాలీన సమాజంలో ఆర్థిక అసమానతులను అధిగమించడమే అసలైన సవాల్ అని అన్నారు. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, పన్నుల వ్యవస్థను సరళీకరిస్తుందని ఆయన చెప్పారు. -
మల్లన్నసాగర్ పై అనవసర రాద్ధాంతాలు వద్దు
♦ కాంగ్రెస్‌పై అధికార పార్టీ ధ్వజం ♦ పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామనే పేరుతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంతోపాటు నిజాంసాగర్‌లో ఆ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాన్సువాడలో ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదంటూ టీఆర్ఎస్ నేతలు, రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మేయర్ సుజాత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని టీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామనే పేరుతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా జిల్లాలో పలుచోట్ల ఆందోళనలకు దిగారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు తట్టుకోలేక అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తోందన్నారు. కానీ విపక్షాల నేతలు నిర్వాసితులకు అండగా ఉంటామనే పేరుతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జి ల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీ ఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఏఎస్ పోశెట్టి, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం నిజాంసాగర్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అ డ్డుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని శుక్రవారం మం డల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. కాళేశ్వరం పథకాన్ని అడ్డుకోవాలని రైతులను కాంగ్రెస్ రెచ్చగొడుతోందంటూ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ నీటి సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతుల అవసరాల కోసం ప్రభుత్వం మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తుందన్నారు. ముంపు గ్రామాలతో పాటు 6 వేల ఎకరాల భూములు నష్టపోతున్న రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నిర్వాసితులను రెచ్చగొడుతూ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్‌హుస్సేన్, బంజపల్లి సర్పంచ్ బేగరి రాజు, టీఆర్ఎస్ రైతు నాయకులు పోచాగౌడ్, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'అబ్బాయిలంతే.. వాడుకుని వదిలేస్తారు'
లాస్ ఎంజెల్స్: అబ్బాయిలు తమ స్వార్థం తాము చూసుకుంటారని, వాడుకుని వదిలేస్తారని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తెలిపింది. అందుకే ఇప్పుడు తనకు ఎవరితో గడపాలో కూడా అర్థంకానీ పరిస్థితి తయారైందని వాపోయింది. దాదాపు ఏడాదికాలంపాటు క్రిస్ మార్టిన్ తో కలిసి డేటింగ్ చేసిన ఆమె ఇటీవల బ్రేకప్ చేసుకుంది. ఆయనతో సంబంధం తెగదెంపులు చేసుకోవడానికి కారణాలపై ప్రశ్నించగా.. ఇందులో తన తప్పేం లేదని చెప్పింది. 'ఈ విషయంలో ఎవరూ నన్ను ఏ విధంగా నిందించాల్సిన పనిలేదు. బయటకు రా అని ఇప్పుడు నన్ను ఎవరూ పిలవడం లేదు. ప్రతి శనివారం నేను ఒంటరిగానే ఉంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. అబ్బాయిలు ముందు తనపట్ల ఆకర్షణతో ఉంటూ అనంతరం ఒంటరిగా వదిలేస్తారని, తాను చెప్పిన సమయానికి డేటింగ్‌కు రాకుండా ఏవో కారణాలతో వ్యతిరేకిస్తుంటారని, అందుకే తన దృష్టిలో అబ్బాయిలంటే స్వార్థపరులు, వాడుకుని వదిలేసి రకం అంటూ ఆక్రోశం వెల్లగక్కింది. -
స్వార్థంతోనే వ్యతిరేకిస్తున్నారు
హైదరాబాద్: రాజధాని వస్తే భూముల ధరలు పెరుగుతాయని, అప్పుడు ఎక్కువ ధరలకు అమ్ముకుని లబ్ధి పొందొచ్చన్న స్వార్థంతోనే కొందరు రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. గురువారం జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'ఏ ఒక్క రైతునూ బెదిరించలేదే.. ప్రజాస్వామ్యంలో బెదిరించడం సాధ్యమా' అని అన్నారు. 'రాజధాని నిర్మాణానికి రైతులే స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. రేపు అక్కడ రాజధాని వచ్చిన తర్వాత వాళ్లు వ్యవసాయం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో కమ్యూనిస్టులు, వైఎస్సార్సీపీ నేతలు పర్యటించి.. భూములు ఇవ్వొద్దని రైతులకు సూచించినా.. వారు వినలేదన్నారు 'రాజధాని నిర్మాణానికి 1,000 ఎకరాలు చాలునని కమ్యూనిస్టులు చెబుతున్నారు.. వారి పార్టీ కార్యాలయాల కోసం పదెకరాల భూమి అవసరమా?' అని ప్రశ్నించారు. భూములు ఇవ్వడానికి నిరాకరిస్తోన్న రైతులు సైతం రాజధాని ఆ ప్రాంతంలోనే కావాలంటున్నారని వివరించారు. వ్యవసాయం చేస్తే ఆదాయం రాదని.. ఓ పరిశ్రమో.. ఓ నాలుగు లేన్ల రహదారినో నిర్మిస్తే వస్తుందన్నారు. భూముల విలువ పెరగాలంటే రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంపై విశ్వాసంతోనే జపాన్ ప్రభుత్వం తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకుందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక జపాన్, సింగపూర్, దావోస్‌లలో వందలాది మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యానని.. ఇటీవల ముంబైకి కూడా వెళ్లానని వివరించారు. జపాన్ కంపెనీలకు చెందిన వంద మంది ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యానని.. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జూన్ ఆఖరునాటికి సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను అందిస్తుందని.. ఓ ఏజెన్సీని కూడా నియమిస్తుందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం నియమించే ఏజెన్సీతో కలసి రాజధాని ప్రాంతంలో ఎక్కడ పరిపాలన భవనాలు నిర్మించాలి?.. ఎక్కడ పరిశ్రమలను ఏర్పాటుచేయాలి? ఎక్కడ రోడ్లు వేయాలి? ఎక్కడ నివాస గృహాలను నిర్మించాలనే విషయాన్ని నిర్ణయిస్తామని వివరించారు. ఆయనేమన్నారో నాకు తెలీదు రాజధాని భూసేకరణపై జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియదనీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించొద్దు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల విషయంలో తీవ్రస్థాయిలో స్పందించకూడదని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలను ఆదేశించారు. ఈ విషయంలో తీవ్రంగా స్పందించొద్దంటూ పార్టీ కార్యాలయం నుంచి నేతలకు సమాచారం పంపించారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయండి ఇక్కడి సహజ వనరులకు సాంకేతిక సహకారాన్ని జోడించి రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయాసియాకు తమ రాష్ట్రం గేట్‌వే, లాజిస్టిక్ హబ్‌గా ఉందన్నారు. నగరంలోని ఓ హోటల్లో గురువారం సీఎం జపాన్ పారిశ్రామికవేత్తలతోసమావేశమయ్యారు. -
నేను స్వార్థపరురాలిని!
సామాజిక మాధ్యమాల ద్వారా ఏదో ఒక సంచలన సందేశాలను పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే సమంత... తాజాగా తన కెరీర్ గురించి, తన సినిమాల ఫలితాల గురించి ఆసక్తికరమైన మెసేజ్‌ని పోస్ట్ చేశారు. ‘‘నేను నటించిన కొన్ని సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. అప్పుడు నేను కృంగిపోలేదు. ఆ మాటకొస్తే... విజయాలను అందుకున్నప్పుడు పొంగిపోలేదు కూడా. నేను స్వార్థపరురాలిని. సినిమా జయాజయాలతో అస్సలు సంబంధాలు పెట్టుకోను. అవి పూర్తిగా నిర్మాతకు మాత్రమే చెందినవి అనేది నా అభిప్రాయం. సినిమాలో నేనెలా చేశాననే విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటాను. ఆ విధంగా చూస్తే... నా ఫ్లాప్ సినిమాలు కూడా నాకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. సో... నటిగా నాకు అపజయం ఇప్పటి వరకూ లేదు. ‘సమంత సరిగ్గా నటించలేదు’.. అనే మాట వినిపించినప్పుడు స్వచ్ఛందంగా సినిమాల నుంచి తప్పుకుంటా’’ అని పేర్కొన్నారు సమంత. -
అనుకరణ అనర్థదాయకం
బౌద్ధనీతి ఒక అడవిలో ఒక మహా సరోవరం ఉంది. దాన్నిండా కలువలూ, తామరలు విరబూసి ఉంటాయి. తామర తూడులు, దుంపలూ మంచి బలవర్ధకమైన ఆహారం. ఆ సరోవరం ప్రాంతంలో ఒక ఏనుగు నివసిస్తూ ఉంటుంది. అది ప్రతి రోజూ ఆ సరోవరంలో దిగి, స్నానం చేస్తూ కొన్ని తామర తూడుల్ని, దుంపలతో సహా పీకి, వాటిని తొండంతో ఝాడించి, దుంపలకంటిన బురదని శుభ్రం చేసుకుని తినేది. వాటి వల్ల అది ఆరోగ్యంగా, అందంగా, పుష్టిగా తయారైంది. అక్కడికి దగ్గర్లోనే ఒక నక్క కూడా ఉండేది. అది ఏనుగును చూసి దాని పౌష్టికత్వానికీ, ఆరోగ్యానికీ అసూయ పడింది. అసలు ఏనుగు ఏం తింటుందో గమనించి, తానూ ఆ సరోవరంలోకి దిగి, తామర దుంపల్ని పీకి, శుభ్రం చేసుకోవడం కుదరక, ఆ బురదతోనే వాటిని తినడం మొదలు పెట్టింది. తనకు తగని ఆహారం కావడం వల్ల తామర తూడులు దానికి అరగలేదు. దుంపల కంటిన బురద కడుపులో పేరుకుపోయింది. దాంతో నక్క రోజు రోజుకీ క్షీణించి, చివరికి మరణించింది. బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘భిక్షువులారా! చూశారా! దురాశ వల్ల తనకు తగని విషయాల్లో ఇతరులను అనుకరించడం వల్ల, తనకు కాని పనులను చేయడం వల్ల నక్కకు ఏ గతి పట్టిందో!’’ అని ధర్మం ప్రబోధం చేశాడు. - బొర్రా గోవర్ధన్ -
మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్!
న్యూయార్క్:అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ పేరు విననివారుండరంటే నమ్మండి. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపారు. కర్దాషియాన్ తన మనసులోని మాటలను కొన్నింటిని తరుచు బయటపెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. అయితే మొన్నామధ్య 'సెల్పిష్' బుక్ తో వస్తున్నానని ప్రకటించిన కర్దాషియాన్.. ప్రస్తుతం ఆ పనిలోనే నిమగ్నమైందట. ఆ సెల్పీ బుక్ ను తప్పకుండా అభిమానుల ముందుకు తీసుకువస్తానని గారాలు పోతుంది ఈ 33 ఏళ్ల చిన్నది. అసలు తనకు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా వ్యక్తికరీంచింది. ఒకానొక వాలైంటెన్స్ డే సందర్భంలో చూసిన 'సెక్సీ పొలారాయిడ్'ఫోటోలే తన మదిలో ఆలోచనలో రేకిత్తించాయని.. దాంతోనే ఆ పుస్తకాన్ని రాయడానికి శ్రీకారం చుట్టడానికి పూనుకొంటున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది కానీ అభిమానుల చెంతకు చేరదు. ఈ 'సెల్ఫిష్' పుస్తకం ఏప్రిల్ 7 వ తేదీ నాటికి విడుదల చేస్తానని కిమ్ స్పష్టం చేసింది. 352 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఖరీదు దాదాపు రూ.1,200.