'అబ్బాయిలంతే.. వాడుకుని వదిలేస్తారు' | Guys are so mean to me: Jennifer Lawrence | Sakshi
Sakshi News home page

'అబ్బాయిలంతే.. వాడుకుని వదిలేస్తారు'

Published Fri, Nov 13 2015 7:50 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

'అబ్బాయిలంతే.. వాడుకుని వదిలేస్తారు' - Sakshi

'అబ్బాయిలంతే.. వాడుకుని వదిలేస్తారు'

లాస్ ఎంజెల్స్: అబ్బాయిలు తమ స్వార్థం తాము చూసుకుంటారని, వాడుకుని వదిలేస్తారని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తెలిపింది. అందుకే ఇప్పుడు తనకు ఎవరితో గడపాలో కూడా అర్థంకానీ పరిస్థితి తయారైందని వాపోయింది. దాదాపు ఏడాదికాలంపాటు క్రిస్ మార్టిన్ తో కలిసి డేటింగ్ చేసిన ఆమె ఇటీవల బ్రేకప్ చేసుకుంది. ఆయనతో సంబంధం తెగదెంపులు చేసుకోవడానికి కారణాలపై ప్రశ్నించగా.. ఇందులో తన తప్పేం లేదని చెప్పింది.

'ఈ విషయంలో ఎవరూ నన్ను ఏ విధంగా నిందించాల్సిన పనిలేదు. బయటకు రా అని ఇప్పుడు నన్ను ఎవరూ పిలవడం లేదు. ప్రతి శనివారం నేను ఒంటరిగానే ఉంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. అబ్బాయిలు ముందు తనపట్ల ఆకర్షణతో ఉంటూ అనంతరం ఒంటరిగా వదిలేస్తారని, తాను చెప్పిన సమయానికి డేటింగ్కు రాకుండా ఏవో కారణాలతో వ్యతిరేకిస్తుంటారని, అందుకే తన దృష్టిలో అబ్బాయిలంటే స్వార్థపరులు, వాడుకుని వదిలేసి రకం అంటూ ఆక్రోశం వెల్లగక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement