కత్తి కిందపడేయ్‌! దగ్గరకు రావద్దు!! | Los Angeles Police Release Bodycam Video Of Thief Shot Dead By Police | Sakshi
Sakshi News home page

కత్తి కిందపడేయ్‌! దగ్గరకు రావద్దు!!

Jan 15 2020 5:35 PM | Updated on Jan 15 2020 7:58 PM

Los Angeles Police Release Bodycam Video Of Thief Shot Dead By Police - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లాస్‌ ఏంజిల్స్‌ : నవంబర్‌ 25 మధ్యాహ్నం 1:30 గంటల సమయం. లాస్‌ ఏంజిల్స్‌ వీధుల్లో నాథెల్‌ పిన్‌కాక్‌ పిచ్చిపట్టిన వాడిలా కత్తిపట్టుకుని పరుగెడుతున్నాడు. అంతకు క్రితమే అతడు ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో దొంగతనం చేసి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని చుట్టుముట్టడంతో అతనికి ఊపిరిఆడటం లేదు. కోపంతో తనను పట్టుకోవటానికి వచ్చిన ఓ పోలీసుపై దాడి చేయటానికి సిద్ధపడ్డ పిన్‌కాక్‌ కత్తితో అతడివెంట పడ్డాడు. ‘ కత్తి కిందపడేయ్‌! దగ్గరకి రావద్దు. ఆగు ’ అంటున్నా వినిపించుకోకుండా పోలీసు అధికారి మీదకు ఉరికాడు. దీంతో ఆ పోలీసు తన చేతిలోని తుపాకికి పనిచెప్పాడు. అయినా పిన్‌కాక్‌ ఆగలేదు. దీంతో ఆ పోలీసు పరిగెత్తలేక కిందపడిపోయాడు. ఆ వెంటనే పిన్‌కాక్‌ అతనిపై కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు. కొన్ని క్షణాలైతే పోలీసు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.

కానీ, అటువైపు పరిగెత్తుతూ వచ్చిన మరో పోలీసు పిన్‌కాక్‌ను తుపాకితో కాల్చేశాడు. దీంతో అతడు అక్కడే కుప్పకూలాడు. నవంబర్‌ 25న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలను లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు తాజాగా విడుదల చేశారు. సంఘటన జరిగినపుడు బాడీ క్యామ్‌ల ద్వారా వారు ఈ దృశ్యాలను చిత్రీకరించారు. సంఘటన గురించి ప్రజలకు మరింత అర్థమయ్యేలా వివరించేందుకు, కాల్పులు జరపడానికి గల కారణాలను తెలిపేందుకే వీడియోలను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement