US: Two People Killed Five Injured In Shooting At Park In Los Angeles - Sakshi
Sakshi News home page

Los Angeles Park: అమెరికాలో కాల్పుల కలకలం... ఇద్దరు మృతి

Published Mon, Jul 25 2022 11:05 AM | Last Updated on Mon, Jul 25 2022 12:51 PM

Two People Killed Five Injured In Shooting At Park In Los Angeles  - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ పార్క్‌లో కాల్పులు జరిగినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. ఈ మేరకు శాన్‌ పెడ్రోలోని పెక్‌ పార్క్‌ వద్ద కాల్పులు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా...ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. ఈ మేరకు పెక్‌పార్క్‌ వద్ద ఇరువర్గాల మధ్య తలెత్తిని వివాదం కాల్పులకు దారితీసినట్లు పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎక్కువమంది షూటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేగాదు ఈ ఘటనలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో సహా దాదాపు ఏడుగురు గాయపడినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకుని వేగవంతంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో గాయపడిని ఏడుగురిని ఆస్పత్రికి తరలించామని, ఇద్దరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడించారు.

(చదవండి: చైనాలో భారీ ఇసుక తుపాను...దాదాపు 4 గంటలు...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement