California Shooting: కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజేల్స్‌లో చైనీస్ లూనార్ న్యూయర్ వేడుకల్లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కాల్పులకు తెగబడింది 72 ఏళ్ల వృద్ధుడా! అని ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ ఘటన జరిగిన రోజు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. అదీగాక ఒక దుండగుడు మారిటెక్ పార్క్‌లోని డ్యాన్స్ క్లబ్‌లో మెషిన్ గన్‌తో కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షుల చెప్పడంతో ఆ పోలీసుల ఆ దిశగా నగరమంతా జల్లెడ పట్టారు. అందులో భాగంగా ఒక అనుమానిత వ్యాన్‌ని పోలీసులు చుట్టుముట్టారు. అంతే నిందితుడు పట్టుబడిపోతానన్న భయంతో తనను తాను గన్‌తో పేల్చుకుని చనిపోయాడు.
ఆ నిందితుడిని 72 ఏళ్ల కెన్‌ట్రాన్‌గా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మాట్లాడుతూ..అతడు ఆ రోజు రాత్రి 10 గంటలకు మారిటెక్ పార్క్‌లో ఉన్న డ్యాన్స్ కబ్‌లో కాల్పులకు పాల్పడిన తర్వాత మళ్లీ రెండోసారి కాల్పులకు తెగబడుతుండగా కొంతమంది అతడిని గన్‌ని లాక్కున్నట్లు సమాచారం. ఆ తర్వాత అతన్ని అక్కడ నుంచి వ్యాన్‌లో పరారయ్యాడు.
ఐతే అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్‌ని గమనించి ట్రేస్ చేసే ప్రయత్నంలో భాగం చుట్టుమట్టారు. ఒక పోలీస్ అతని వ్యాన్‌ను సమీపిస్తుండగా పెద్దగా గన్ పేలిన శబ్దం వినిపించింది. పోలీసులు వెంటనే వచ్చే వ్యాన్ వద్దకు చూసేటప్పటికే నిందితుడు చనిపోయాడు. బహుశా నిందితుడు పట్టుబడతానన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నటట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇతర అనుమానితులెవరూ కూడా పరారీలో లేరు. అతను ఈ దాడులకు ఆటోమేటిక్ అసాల్ట్ పిస్టల్‌ని ఉపయోగించినట్లు వెల్లడించారు.
ఐతే నిందితుడు ఈ సాముహిక కాల్పులకు తెగబడటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి?, లేదా ఏదైనా మానసిక సమస్య ఉందా అనేది తెలియాల్సి ఉందన్నారు షెరీఫ్. కాగా, ఈ కాల్పుల ఘటనలో సుమారు 10 మంది దాక అక్కడికక్కడే మరణించగా, పలువురి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సాముహిక కాల్పుల బాధితు గౌరవార్థం అని పబ్లిక్ భవనాల వద్ద జెండాలను అవనతం చేయాలని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది.
(చదవండి: కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి)
Comments
Please login to add a commentAdd a comment