లాస్ ఏంజిల్స్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. లాస్ ఏంజెల్స్‌లోని ట్రేడర్ జోయ్స్ స్టోర్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒక యువతి మృతి చెందారు. అనంతరం స్టోర్‌లోని పలువురిని బందీగా చేసుకొని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి సాయుధుడిని అరెస్టు చేసి.. స్టోర్‌లోని బందీలను విడిపించారు. కాల్పులకు తెగబడిన యువకుడి వయస్సు 28 సంవత్సరాలు ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రియురాలిపై కోపంతోనే అతను కాల్పులకు దిగాడని, ఈ కాల్పుల్లో అతని ప్రియురాలు మృతిచెందిందని కథనాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment