shooting case
-
గచ్చిబౌలి కాల్పుల కేసు.. బస్సులో పరిచయం.. సీన్ కట్ చేస్తే
సాక్షి, హైదరాబాద్: ప్రిజం పబ్బు కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్‌ను గచ్చిబౌలి పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్‌పై కోర్టు.. సోమవారం విచారణ చేయనుంది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న(గురువారం) సాఫ్ట్వేర్ రంజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. . ప్రభాకర్‌కు రంజిత్ బస్సులో పరిచయం అయ్యాడు. ప్రభాకర్‌కు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చి హెల్ప్ చేసిన రంజిత్.. ఇద్దరు బీహార్‌కు వెళ్లి గన్స్ కొనుగోలు చేశారు. ప్రభాకర్ అరెస్ట్‌తో పారిపోయిన రంజిత్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ జరిగింది..పశ్చిమగోదావరి జిల్లాలోని గోపవరం గ్రామానికి చెందిన మిన్నీ రంజిత్ 2022లో రాజమండ్రిలో ఓ ఆర్టీసీ బస్సులో బత్తుల ప్రభాకర్‌కు పరిచయమయ్యాడు. ఈ నెల 1వ తేదీన ప్రభాకర్, రంజిత్, రోహిత్‌లు కారులో బీర్లు తాగుతూ ఐటీ కారిడార్‌లో తిరిగారు. ఈ క్రమంలో కారు బ్రేక్‌డౌన్ కావడంతో గ్యారేజ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే ప్రభాకర్ ఫోన్‌చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రీజం పబ్‌కు వెళ్లాడు. ఊహించని రీతిలో పోలీసులు పట్టుకోవడంతో కాల్పులు జరపగా, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి గాయాలైన విషయం తెలిసిందే. బిహార్‌లో ఉద్యోగం చేస్తున్న రంజిత్‌కు 2023లో ఐటీ కారిడార్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కేపీహెచ్బీలో ఉంటున్న సమయంలో తరచుగా ప్రభాకర్ అతని వద్దే ఉండేవాడు. అక్కడి నుంచి రంజిత్ వట్టినాగులపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఇరుకుగా ఉందని చెప్పి నార్సింగిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్‌ను రంజిత్ పేరిట బత్తుల ప్రభాకర్ అద్దెకు తీసుకున్నారు. కొద్ది నెలల తర్వాత ఒడిశాకు చెందిన ఓ యువతితో ప్రభాకర్ సహజీవనం చేశాడు.ఇదీ చదవండి: మమత హత్య కేసు.. వీడిన మిస్టరీదీంతో రంజిత్ గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో స్నేహితుడు రోహిత్‌తో కలిసి ఉంటున్నాడు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి రంజిత్ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకొని ఆ తర్వాత డబ్బు తిరిగిఇచ్చేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడటంతో రంజిత్ యూపీఐలు, క్రెడిట్ కార్డులను ప్రభాకర్ వాడుకున్నాడు. రంజిత్ పేరిట కొనుగోలు చేసిన కారులోనే పబ్‌లు, జిమ్‌లకు వెళ్లేవారు.గన్లు కావాలని అడగ్గా, రంజిత్ బిహార్‌లో తనకు తెలిసిన వారిని పరిచయం చేశాడు. వారి ద్వారా మూడు కంట్రీమేడ్ గన్లను ప్రభాకర్ కొనుగోలు చేశాడు. గన్ల కొనుగోలులో రంజిత్ ప్రమేయం ఉండటం, బ్యాంక్ లావాదేవీలు రంజిత్ ద్వారానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు కారులో రంజిత్‌తో పాటు రోహిత్ కూడా ఉన్నాడని, ప్రభాకర్ లావాదేవీలు, చోరీల్లో అతని ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. ఏ 2 రంజిత్ నుంచి కారు, కేటీఎం బైక్, ఫోన్, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రభాకర్ నుంచి ఘటన స్థలంలోనే రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో బస చేసిన ప్రభాకర్.. వైజాగ్ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. జైలులో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్ర పన్నినట్లు సమాచారం.కాగా, కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి బుల్లెట్ గాయమైంది. ఏపీలోని చిత్తూరు జిల్లా సోముల గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్.. ఏపీ, తెలంగాణలో అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అతడిపై రెండు రాష్ట్రాలలో 70కి పైగా కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లకు పట్టుబడ్డాడు!సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే 16 చోరీ కేసులున్నాయి. 2023 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రభాకర్ తరచు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌కు వెళ్తున్నాడని గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్‌రెడ్డి, వీరస్వామి, ప్రదీప్‌రెడ్డి ప్రిజం పబ్ వద్ద కాపు కాశారు. ప్రభాకర్ పబ్ వద్దకు రాగానే నిర్బంధించేందుకు ప్రయత్నించాడు.దీంతో అతడు తనవద్ద ఉన్న దేశీయ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వెంకట్‌రెడ్డి ఎడమ పాదంలోంచి దూసుకెళ్లింది. అయినా వెనుకడుగు వేయకుండా పబ్‌లోని బౌన్సర్ల సాయంతో మిగిలిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ప్రభాకర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు. -
రిచర్డ్ మూర్కు మరణశిక్ష అమలు
కొలంబియా: స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్ మూర్(59)కు సౌత్ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్ కుటుంబం చేసిన వినతిని గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ తోసిపుచ్చారు. దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్ మూర్కు విషం ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్లో స్పార్టన్బర్గ్లోని ఓ రిటైల్ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్ డ్రగ్స్ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్ మెక్ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్ మాస్టర్ నిరాకరించారు. మూర్ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్ తెలిపింది. స్పెయిన్ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు. -
అమెరికాలో కాల్పుల కలకలం... ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ పార్క్‌లో కాల్పులు జరిగినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఈ మేరకు శాన్ పెడ్రోలోని పెక్ పార్క్ వద్ద కాల్పులు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా...ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. ఈ మేరకు పెక్పార్క్ వద్ద ఇరువర్గాల మధ్య తలెత్తిని వివాదం కాల్పులకు దారితీసినట్లు పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎక్కువమంది షూటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేగాదు ఈ ఘటనలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో సహా దాదాపు ఏడుగురు గాయపడినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకుని వేగవంతంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో గాయపడిని ఏడుగురిని ఆస్పత్రికి తరలించామని, ఇద్దరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడించారు. (చదవండి: చైనాలో భారీ ఇసుక తుపాను...దాదాపు 4 గంటలు...) -
చెడు అలవాట్లకు బానిసై.. దోపిడీకి స్కెచ్ వేసి!
సిద్దిపేట కమాన్: సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు ఛేదించారు. చెడు అలవాట్లకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.43.50 లక్షలు దోచుకెళ్లిన ఈ ఘటనపై సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.34 లక్షలు రికవరీ చేసి, మూడు వాహనాలు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వకులాభరణం నర్సయ్య తన ప్లాట్‌ను శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్ చేయడానికి జనవరి 31న సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇద్దరూ వచ్చారు. ప్లాట్ కొనుగోలుదారుడు చెల్లించిన రూ.43.50 లక్షల నగదు బ్యాగును నర్సయ్య తన కారు డ్రైవర్‌కు ఇచ్చి కార్యాలయంలోనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదుబ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఆదివారం ఎడమ సాయికుమార్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ముగ్గురు నిందితులు గజ్జె రాజు(26), బలిపురం కరుణాకర్ (28), సికింద్రాబాద్‌లోని చాచా నెహ్రూనగర్‌కు చెందిన బిగుళ్ల వంశీకృష్ణ (20)లను అదుపులోకి తీసుకున్నారు. పాత నేరస్థులే... ప్రధాన నిందితుడైన సిద్దిపేట జిల్లా కొం డపాక మండలం మంగోల్‌కి చెందిన గజ్జె రాజు(26) మేడ్చల్ జిల్లాలోని బండ్లగూడలో నివాసముంటున్నాడు. రాజుకు బండ్లగూడకు చెందిన ఎడమ సాయికుమార్(22) సమీప బంధువు. వీరిపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు 2021, ఆగస్టులో పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. సెప్టెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చారు. జల్సాలకు అలవాటు పడిన వీరికి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని ఈ ఘటనకు పాల్పడ్డారు. గన్‌పై ఆరా కాల్పుల ఘటనలో ఉపయోగించిన గన్ను నిందితులు ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారు.. ఇంతకు ముందు ఎక్కడైనా దానిని వినియోగించారా, ఈ కేసులో ప్లాటు క్రయ విక్రయదారుల ప్రమేయం ఉందా? లేదా ? అనే విషయాలపై దర్యాప్తు కోసం సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
ఆ ‘మూడే’ కాల్పులకు దారితీశాయా..?
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తఫాపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఎంఐఎం నేత షానవాజ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం ముస్తఫానే ఇచ్చి ఉంటాడన్న అనుమానమే ముస్తఫాపై కాల్పు లు జరగడానికి కారణంగా పోలీసులు భావి స్తున్నారు. దీంతోపాటు మరో రెండు కారణాలు కూడా పోలీసులు చెబుతున్నారు. షాన్వాజ్ కుమారుడు జుబేర్, ముస్తఫాలు కలసి నగర శివారు ప్రాంతాల్లో మూడు ఓపెన్ లే అవుట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఆర్థిక విషయాల్లోనూ ముస్తఫా చేతి వాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనికితోడు జుబేర్ ప్రేమించిన అమ్మాయితో ముస్తఫా సన్నిహితంగా ఉండటం కూడా కాల్పులకు దారి తీసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలన్నీ పోలీసు అదుపులో ఉన్న జుబేర్ స్నేహితులు విచారణలో ప్రస్తావించినట్టు తెలిసింది. చికిత్స పొందుతున్న బాధితుడు ముస్తఫా వాంగ్మూలం నమోదు చేసేందుకు ఆస్పత్రికి వెళ్లిన పోలీసులతో ఆయనేమీ మాట్లాడలేదు. అసలు ఏం జరిగిందో తర్వాత చెబుతానంటూ సైగలు చేశాడు. దీంతో ఈ కేసులో ఏ పురోగతి సాధించలేదని పోలీసులు చెబుతున్నారు. కింగ్స్ కాలనీలోని జుబేర్ కార్యాలయంలోనే కాల్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆదివారం మరోసా రి క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. మిగతా వారు ఎక్కడ..? జుబేర్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన విందులో 10 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముస్తఫాను ఐదుగురు యువకులు ఓ కారులో తీసుకొచ్చినట్లు ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఆస్పత్రికి ఎంత వేగంగా వచ్చారో... అంతే వేగంగా ఆ యువకులు వెళ్ళిపోయారు. వారు ఎవరన్నది ప్రస్తుతం పోలీసులు నిర్ధారించే పనిలో పడ్డారు. ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు. -
వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్ ప్లానే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్ గౌడ్‌ను పోలీసులు చేర్చారు. దీంతోపాటు ఆయనపై నాలుగు అదనపు సెక్షన్లను కూడా చేర్చినట్లు వెల్లడించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదుపులో అనంతపురానికి చెందిన ముఠా ఉంది. పట్టుబడ్డ నిందితులను పోలీసులు బుధవారం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. పలు అనుమానాలతో ప్రారంభమైన ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. విక్రమ్ గౌడ్ కావాలనే ఇలా చేయించినట్లు తెలిసింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన ముఠాకు విక్రమ్ గౌడ్‌కు గతంలోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన డైరెక్షన్లోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాను మూడు నెలల కిందటే కట్ చేయించుకున్నారట. దాంతోపాటు కాల్పుల తర్వాత పోలీసులకు ఏం చెప్పాలనే విషయంలో కూడా ఆయన తన భార్యకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి సానుభూతిని సంపాధించుకునేందుకు విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. రూ.50లక్షలు తమకు సుపారి ఇచ్చినట్లు విక్రమ్ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం టాస్క్‌ఫోర్స్ సోదాల్లో ఒక పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, విక్రమ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.