వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్ ప్లానే
ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన ముఠాకు విక్రమ్ గౌడ్‌కు గతంలోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన డైరెక్షన్‌లోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాను మూడు నెలల కిందటే కట్ చేయించుకున్నారట. దాంతోపాటు కాల్పుల తర్వాత పోలీసులకు ఏం చెప్పాలనే విషయంలో కూడా ఆయన తన భార్యకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.
మొత్తానికి సానుభూతిని సంపాధించుకునేందుకు విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. రూ.50లక్షలు తమకు సుపారి ఇచ్చినట్లు విక్రమ్ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం టాస్క్‌ఫోర్స్ సోదాల్లో ఒక పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, విక్రమ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.