vikram goud
-
TS: పార్టీ హైకమాండ్‌కు విక్రమ్ గౌడ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ మాత్రం తప్పటడుగులు వేస్తూ ఇప్పటివరకు స్థిరంగా నిలదొక్కుకోలేకపోయాడు. తాజాగా బీజేపీకి కూడా రాజీనామా చేశాడు విక్రమ్. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం పనిచేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ విక్రమ్ గౌడ్ విమర్శలు చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు ఆయన లేఖ రాశారు. ఇక, లేఖలో..‘పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రజా బలం లేనివారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు’ తెలిపారు. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చే విషయంలోనూ విక్రమ్ వేసిన తప్పటడుగులు.. ఆయన కెరియర్ను దెబ్బతీశాయి. గన్నుతో తనను తాను కాల్చుకుని సానుభూతి పొందాలనుకోవడం సంచలనంగా మారింది, కేసులకు దారి తీసింది. ఆ తర్వాత కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తొందరగా పార్టీలు మారడం విక్రమ్ ఎంత వరకు మేలు చేస్తాయో.. ముందు ముందు చూడాలి. -
ఆకట్టుకుంటున్న ‘విక్రమ్ గౌడ్’ స్పెషల్ పోస్టర్
కన్నడ యంగ్ హీరో కిరణ్ రాజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘బడ్డీస్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకులు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిరణ్ రాజ్ పుట్టిన రోజు(జూలై 5) సందర్భంగా ‘విక్రమ్ గౌడ్’ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్లో కిరణ్ రాజ్ పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు విపరీతమైన స్పందన లభించింది. -
ఆసక్తికరంగా ‘విక్రమ్ గౌడ్’టీజర్
కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న బైలింగ్వెల్ ఫిల్మ్ ‘విక్రమ్ గౌడ్’. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి కణిదరపు వెంకాయమ్మ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై సుహాసిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ‘రెండు తెలుగు రాష్ట్రాలలో 30 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నాం..’ అనే పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్.. నేటి రాజకీయ పరిస్థితులను తెలియజేస్తుంటే.. ‘మళ్లీ తెలుగు రాష్ట్రం అంతా ఒకటే కావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని’ చెప్పడం సరికొత్త ఆలోచనలని రేకెత్తిస్తోంది. డేటింగ్‌కి ఒకరు, చాటింగ్‌కి మరొకరు, నిశ్చితార్థానికి ఇంకొకరు.. అని హీరో కిరణ్ రాజ్ చెప్పే డైలాగ్ నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేస్తుంది. హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ.. హీరో చెప్పే లెంగ్తీ డైలాగ్స్ ఈ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ చిత్రానికి ‘మంత్ర’ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. -
బీజేపీలో చేరిన విక్రం గౌడ్
సాక్షి, సిటీబ్యూరో: బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. దుబ్బాక విజయం తర్వాత పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ పా ర్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ తదితరులు బీజేపీ జాతీయ నేత భూపేంద్రయాదవ్ సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విక్రంగౌడ్ మాట్లాడుతూ... నగర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగింపలకనున్నాయని జోస్యం చెప్పారు. మాజీ కార్పొరేటర్ అరుణాజయేందర్ దంపతులు బీజేపీ నేత లక్ష్మణ్ సమక్షంలో పారీ్టలో చేరారు. వీరితో పాటు గాంధీనగర్, చిక్కడపల్లి డివిజన్లోని కార్యకర్తలు పార్టీలో చేరారు. బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన యాకుత్‌పురా: జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని పాతబస్తీలో శనివారం నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ తె లిపారు. లాల్‌దర్వాజా మోడ్ అల్కా థియేటర్ ప్రాంగణంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను నిన్న (శుక్రవారం) ఆమె పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం అరుణ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలో నగరాభివృద్ధి తిరోగమన దిశలో ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధే స్ఫూర్తిగా జీహెచ్ఎంసీని తీర్చిదిద్దే దిశగా తాము ముందుకెళుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. సేవ్ హైదరాబాద్... ఓట్ ఫర్ బీజేపీ నినాదంతో ముందుకెళు తున్నామన్నారు. దుబ్బాక ఎన్నికల్లో మాదిరిగానే జీహెచ్ఎంసీలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర, బీజేపీ నాయకులు ఉమామహేంద్ర, కుమార్, రూప్‌రాజ్, పొన్న వెంకటరమణ పాల్గొన్నారు. -
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సర్వే!
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. మరోసారి గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుండగా.. తమ ప్రభావం చూపించాలని కమలదళం కసితో ఉంది. ఇరు పార్టీలు విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల విషయంలో ఆచితూచీ వ్యవహరించిన అధికార, విపక్షం.. చివరి వరకూ ఎదురుచూసి అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇతర పార్టీలకు చెందిన అసమ్మతి నేతలను చేర్చుకుని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నాయి. (టీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జీల జాబితా ఇదే!) మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవడం, ప్రచారం సంగతి అలాఉంచితే.. పార్టీలో ఉన్న నేతల్ని కాపాడుకోవడం నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న 100 ఏళ్ల చరిత్రగల పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. టికెట్ పంపకాల విషయంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. (రాజధానిలో వేడెక్కిన రాజకీయం) జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీఫారంల పంచాయతీ తారాస్థాయికి చేరకోవడంతో టీపీసీసీకి రాజీనామాల బెదిరింపులు వరుస కడుతున్నాయి. గోశామహల్ నియోజకవర్గంలో తాను టికెట్ ఇచ్చినవారికి బీఫారం ఇవ్వకపోతే... రాజీనామా చేస్తానంటున్న ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ బెదిరింపులకు దిగారు. తన వర్గం నేతలకు సీటు కేటాయించి తీరాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కేంద్రమాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత సర్వే సత్యనారాయణ సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నేతైన తనకు ఏమాత్రం గౌరవం దక్కడంలేదని, టీపీసీసీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీని వీడుతున్నట్లు ఇదివరకే ప్రకటించారని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన బీజేపీ పెద్దలను సైతం కలిశారని, చేరికకు లైన్‌క్లీయర్ అయ్యిందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన విశ్వేశ్వరరెడ్డి.. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోనూ తనకు మంచి స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని, ఆ పరిచయంతోనే వారితో కలుస్తున్నాని వివరణ ఇచ్చారు. తను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని ట్విటర్ పోస్ట్ ద్వారా కొట్టిపారేశారు. I just heard a rumour.... I am joining BJP. Yes it is a just a rumour. I have lot of friends and aquaintances in all parties inuding TRS, MIM and BJP. — Konda Vishweshwar Reddy (@KVishReddy) November 20, 2020 -
చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు?: జాజుల
గజ్వేల్ రూరల్: జనాభాలో 54.5 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను ఎందుకు కల్పించరని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బీసీల రాజకీయ చైతన్య యాత్ర (బస్సుయాత్ర) బుధవారం సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు చేరుకుంది. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వరకు బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బీసీల బతుకులు మారుతాయనుకుంటే ఎక్కడ వేసి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు మొదటగా అమరుడైంది బీసీ బిడ్డనేనని గుర్తు చేశారు. బీసీల వాటా బీసీలకే దక్కాలని.. రాయితీలతో రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ప్రతి కులానికి రూ. కోటి ఇవ్వడంతో పాటు భవనాలను నిర్మించి ఇవ్వాలని, కులానికి ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అన్నారు. అన్ని ప్రధాన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
విక్రంగౌడ్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఇద్దరూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామానికి చెందిన మంచింటి వెంకట రమణ(38), కదిరి మండలం నిజాముల్ కాలనీకి చెందిన షేక్ మహ్మాద్ గౌస్(33)లని పోలీసులు తెలిపారు. కాల్పుల సంఘటన జరిగిన రోజు నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీళ్లిద్దరినీ పట్టుకుని రిమాండ్‌కు తరలించామని అధికారులు చెప్పారు. (తనపై కాల్పులకు పథకం రచించింది విక్రమ్‌గౌడే) -
నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం
-
విక్రమ్ గౌడ్‌కు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : కాల్పుల కేసులో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే సొంత పూచీకత్తుతో పాటు పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని సూచించింది. కాగా గత నెల 28న తనపై కాల్పులు జరిగాయంటూ విక్రమ్ గౌడ్ నాటకం ఆడిన విషయం విదితమే. ఆయన సుపారీ ఇచ్చి మరీ తనపై కాల్పులు జరుపించుకున్నారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
విక్రమ్ గౌడ్‌కు బెయిల్ మంజూరు
-
పోలీస్ కస్టడీకి విక్రమ్‌గౌడ్
-
పోలీసుల కస్టడీలో విక్రమ్‌గౌడ్
హైదరాబాద్: సుపారీ ఇచ్చి మరీ తనపై కాల్పులు జరుపించుకున్న విక్రమ్ గౌడ్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసును పూర్తిగా చేధించామని ప్రకటించినా ఇందులో మరికొన్ని ట్విస్టులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు విక్రమ్‌గౌడ్‌ను బుధవారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. వారిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విక్రమ్ సహా ఐదుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు లాయర్ సమక్షంలో నిందితులను పోలీసులు విచారించనున్నారు. -
ఒక్క ఐడియా జైలుకు పంపింది..!
-
విక్రమ్‌గౌడ్ అరెస్టు.. వీల్‌ఛైర్‌పై కోర్టుకు!
హైదరాబాద్: సంచలనం రేపిన కాల్పుల డ్రామా కేసులో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు, కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ వెంటనే పోలీసులు విక్రమ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని.. వీల్‌ఛైర్ మీదనే ఆయనను కోర్టుకు తరలించారు. జనాల్లో సానుభూతి కూడగట్టుకునేందుకు విక్రమ్ గౌడ్ ఈ కాల్పుల డ్రామాకు తెరతీశారని పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. విక్రమ్ గౌడ్‌పై జరిగిన కాల్పులు వెనుక ప్రధాన సూత్రధారి కూడా ఆయనేనని, పథక రచన, కాల్పులకు కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆయుధాన్ని దాచి పెట్టడం, నిందితులకు షెల్టర్ ఇవ్వడం.. ఇలా ప్రతి అంశాన్నీ విక్రమ్ స్వయంగా పర్యవేక్షించాడని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇలా తనపై తాను కాల్పులు జరిపించుకోవడం వెనుక ప్రధాన కారణాలను పోలీసులు గుర్తించారు. కాల్పుల పథక రచన వెనుక విక్రమ్ గౌడ్‌కు ఈ కింది ఉద్దేశాలు ఉన్నట్టు వెల్లడించారు.. ♦ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ టికెట్, తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పొందడం.. ♦ తన శత్రువులపై పోలీసుల దృష్టి పడేలా చేయడం, అప్పులవాళ్లు తన జోలికి రాకుండా చేయడం.. ♦ ఒడిశాలో మైనింగ్ రంగానికి సంబంధించి సాంబశివరావు దగ్గర తాను పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి తెప్పించుకోవడం.. ♦ కొంతకాలంగా దూరంగా ఉంటున్న కుటుంబంతో పాటు స్నేహితుల నుంచీ సానుభూతి పొందటం.. ♦ గతంలో రద్దయిన ఆయుధ లైసెన్స్ తిరిగి పొందటంతో పాటుపోలీసులే గన్మన్లను ఏర్పాటు చేసేలా చేయడం.. -
బ్రేకింగ్:వీల్‌ఛైర్‌పైనే విక్రమ్‌గౌడ్ అరెస్టు
-
విక్రమ్‌గౌడ్ ‘గన్’ కథా చిత్రమ్!
-
‘గన్’ కథా చిత్రమ్!
కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. విక్రమ్‌గౌడ్ ⇒ తనపై కాల్పులకు తానే పథక రచన చేసిన వైనం ⇒ అనంతపురం ముఠాకు రూ.50 లక్షలకు కాంట్రాక్ట్ ⇒ కేసులో నిందితులుగా మొత్తం పదకొండు మంది ⇒ ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు ⇒ డిశ్చార్జ్ అయ్యాక విక్రమ్ అరెస్టు: సీపీ మహేందర్‌రెడ్డి కాల్పుల పథక రచన వెనుక విక్రమ్ గౌడ్ ఉద్దేశాలివేనన్న పోలీసులు ♦ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ టికెట్, తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పొందడం.. ♦ తన శత్రువులపై పోలీసుల దృష్టి పడేలా చేయడం, అప్పులవాళ్లు తన జోలికి రాకుండా చేయడం.. ♦ ఒడిశాలో మైనింగ్ రంగానికి సంబంధించి సాంబశివరావు దగ్గర తాను పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి తెప్పించుకోవడం.. ♦ కొంతకాలంగా దూరంగా ఉంటున్న కుటుంబంతో పాటు స్నేహితుల నుంచీ సానుభూతి పొందటం.. ♦ గతంలో రద్దయిన ఆయుధ లైసెన్స్ తిరిగి పొందటంతో పాటుపోలీసులే గన్మన్లను ఏర్పాటు చేసేలా చేయడం.. సాక్షి, హైదరాబాద్ మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ తనపై తాను కాల్పులు జరిపించుకోవడం వెనుక ప్రధాన కారణాలను పోలీసులు గుర్తించారు. పథక రచన, కాల్పులకు కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆయుధాన్ని దాచి పెట్టడం, నిందితులకు షెల్టర్ ఇవ్వడం.. ఇలా ప్రతి అంశాన్నీ విక్రమ్ స్వయంగా పర్యవేక్షించాడని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో విక్రమ్‌తో పాటు 11 మందిని నిందితులుగా గుర్తించగా.. ఐదుగురిని అరెస్టు చేశామని, విక్రమ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌జోన్ డీసీపీలు బి.లింబారెడ్డి, ఎ.వెంకటేశ్వరరావుతో కలసి బుధవారం తన కార్యాలయంలో మీడియాకు కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. సినిమాల్లో అవకాశం కోసం వస్తే.. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలు నిర్మించిన విక్రమ్‌కు ‘క్లాప్ షాట్’పేరుతో ఓ కార్యాలయం ఉంది. ఇందులో పనిచేస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్ ద్వారా పులివెందులకు చెందిన ఎ.గోవింద్‌రెడ్డి విక్రమ్‌కు పరిచయమయ్యాడు. తనకు నటనపై ఆసక్తి ఉందని, నటించే అవకాశం ఇవ్వాలని కోరగా.. భవిష్యత్తులో ఇస్తానని విక్రమ్ చెప్పాడు. విక్రమ్ తనపై కాల్పులకు ఏప్రిల్‌లోనే పథకం వేశాడు. దీన్ని అమలులో పెట్టడానికి ప్రసాద్ ద్వారా గోవింద్‌ను సిటీకి పిలిపించాడు. తన ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసి తన పథకాన్ని వివరించాడు. దీన్ని పక్కాగా అమలు చేస్తే రూ.50 లక్షలు చెల్లిస్తానని చెప్పిన విక్రమ్ అడ్వాన్స్‌గా గోవింద్‌కు రూ.5 లక్షలు చెల్లించాడు. ఈ పని చేయడానికి గోవింద్ తనకు పరిచయస్తుడైన కదిరి వాసి ఎస్.నందకుమార్‌ను సంప్రదించాడు. పథకాన్ని అతడికి వివరించిన గోవింద్ అడ్వాన్స్‌గా రూ.3.5 లక్షలు చెల్లించాడు. విక్రమ్ ఇంటికి వచ్చి కలిసిన నంద.. నందను మే నెల్లో సిటీకి తీసుకువచ్చిన గోవింద్ అతడిని విక్రమ్‌కు పరిచయం చేశాడు. ప్లాన్‌ను అమలు చేయడానికి అంగీకరించిన నంద తన స్వస్థలానికి వెళ్లి అనువైన వ్యక్తుల కోసం గాలించాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడైన కదిరి వాసి కె.బాబుజాన్ ద్వారా అదే ప్రాంతానికి చెందిన షేక్ అహ్మద్ పరిచయమయ్యాడు. ఇతడికి రూ.5 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతడి స్నేహితుడైన తాహెర్ ఆ ప్రాంతంలో చికెన్షాపు నిర్వహిస్తుంటాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చికెన్ దుకాణం నిర్వహించే రయీస్ఖాన్తో అతనికి పరిచయం ఉంది. గతంలో వీరిద్దరూ కలుసుకున్నప్పుడు అవసరమైతే తమ ప్రాంతం నుంచి అక్రమ ఆయుధాలు సమకూర్చుతానంటూ రయీస్ చెప్పాడు. దీంతో అక్కడ నుంచే ఆయుధం తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్ విషయాన్ని నంద బాబూజాన్తో పాటు తన స్నేహితుడైన కదిరికే చెందిన వెంకట రమణ అలియాస్ చిన్నాకు చెప్పాడు. ఆయుధం 20 రోజుల నుంచీ విక్రమ్ వద్దే.. గత నెల 6న నంద నుంచి రూ.1.9 లక్షలు తీసుకున్న అహ్మద్, బాబూజాన్, చిన్నా హైదరాబాద్ నుంచి విమానంలో ఇండోర్ వెళ్లారు. అక్కడ రయీస్‌ను కలసి రూ.30 వేలు చెల్లించి ఆయుధం, తూటాలు తీసుకున్నారు. తిరిగి వచ్చేప్పుడు మిగిలిన ఇద్దరూ విమానంలోనే రాగా.. చిన్నా, రయీస్ స్నేహితుడైన జావేద్ బస్సులో హైదరాబాద్ వచ్చారు. బాలానగర్‌లో వీరిని కలసిన విక్రమ్.. ఆయుధంతో పాటు తూటాలను ఇంటికి తీసుకువచ్చి ప్లాన్ అమలయ్యే రోజు వరకు భద్రంగా దాచాడు. మధ్యలో నంద పుట్టపర్తి వెళ్లిపోవడంతో.. గత నెల 17న అక్కడకు వెళ్లిన విక్రమ్ అతడిని కలసి వచ్చాడు. గత నెల 21న నంద, చిన్నా, బాబూజాన్, షేక్ అహ్మద్ సిటీకి వచ్చి విక్రమ్ ఇంట్లోనే అతడిని కలసి పథకంపై చర్చించారు. 23న కదిరి వెళ్లిపోయిన నంద, షేక్ అహ్మద్ కాల్పుల తర్వాత పారిపోవడానికి అనువుగా ఉండేందుకు గోవింద్‌ని ఓ బైక్ కావాలని అడిగారు. అతడు ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలకు బైక్ ఖరీదు చేసి ఇవ్వగా.. ఆ మరుసటి రోజు దీన్ని తీసుకుని అహ్మద్ హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్‌లోని రాయల్ లాడ్జిలో బస చేశాడు. 25న బాబూజాన్ స్నేహితుడు గౌస్‌తో కలసి చంద్రాయణగుట్ట వెళ్లిన అహ్మద్ బైక్ ఇంజన్, ఛాసిస్ నంబర్లు కనిపించకుండా తుడిచి వేయించాడు. గత బుధవారమే ప్లాన్ అమలు కావాల్సింది.. వాస్తవానికి గత బుధవారమే ప్లాన్ అమలు కావాల్సి ఉంది. ఆ రోజే సిటీకి వచ్చిన నంద మిగిలిన నిందితులు గౌస్, బాబూజాన్తో కలసి తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో విక్రమ్ ఇంటికి వచ్చాడు. గౌస్, చిన్నా ఇంట్లోకి వచ్చి డ్రాయింగ్ రూమ్‌లో కాల్పులు జరపాలని, అహ్మద్ ద్విచక్ర వాహనంపై బయట వేచి ఉండాలని, కాల్పుల తర్వాత కాస్త దూరంలో వేచి ఉండే నంద, బాబూజాన్లతో కలసి వారి కారులో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే భయాందోళనకు గురైన అహ్మద్ ద్విచక్ర వాహనం తీసుకుని రాకపోవడంతో పథకం అమలు వాయిదా పడింది. దీంతో నిందితుల బసను విక్రమ్ తన ఇంటి సమీపంలోనే ఉన్న ‘తేజ నివాస్’గెస్ట్‌హౌస్‌కు మార్చాడు. ఆ రోజు సమావేశమైన నిందితులు ప్లాన్ అమలు చేయడం సాధ్యంకాదని భావించి విరమించుకోవాలనుకున్నారు. ఆపై ప్లాన్ మార్చిన నంద షేక్.. అహ్మద్ ద్వారా రయీస్‌ను పిలిపించాడు. 27వ తేదీ ఉదయం బస్సులో వచ్చిన అతడిని అహ్మద్ ఎర్రగడ్డలోని హోటల్ సన్మాన్లో ఉంచాడు. కాల్చేందుకు అంగీకరించిన రయీస్.. విషయం తెలుసుకున్న నంద కదిరి నుంచి వాహనంలో నేరుగా గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. కొంత సేపటికి విక్రమ్ సైతం అక్కడకు చేరుకున్నాడు. అర్థరాత్రి 1.45 గంటలకు నంద, అహ్మద్, రయీస్లను తన కారులో ఎక్కించుకున్న విక్రమ్ కాల్పుల తర్వాత పారిపోవాల్సిన రూట్ చూపిస్తూ రెండుసార్లు తిప్పాడు. 2.30 గంటల ప్రాంతంలో వారితో కలసి ఇంటి వద్దకు వచ్చినా.. కాస్త దూరంలో మిగిలిన వారిని దింపి విక్రమ్ ఒక్కడే కారులో వచ్చాడు. గేట్ తాళం వేయవద్దని వాచ్‌మన్‌కు చెప్పి 10–15 నిమిషాల తర్వాత వారిని పిలిపించాడు. కాల్పులు జరగబోయే గదిలోనే సమావేశమయ్యారు. ఆయుధం తీసుకువచ్చి వీరికి అప్పగించిన విక్రమ్ తనపై రయీస్ మూడు రౌండ్లు కాల్చాలని, అహ్మద్ మాత్రం ద్విచక్ర వాహనంపై బయట వేచి ఉండాలని చెప్పాడు. అప్పుడే నందకు మరో రూ.4 లక్షలు చెల్లించిన విక్రమ్.. ఆపరేషన్‌లో తనకు ప్రాణనష్టం వాటిల్లితే మిగిలిన మొత్తం మీకు రాదని, జాగ్రత్తగా చెయ్యాలని చెప్పాడు. ఇలా కాల్పులు అమలు కాగా.. పారిపోతూ రయీస్ తుపాకీని కొత్త చెరువులో పారేసి.. కొద్దిదూరంలో వాహనాన్నీ వదిలేసి అంతా పారిపోయారు. కొత్త చెరువు నుంచి ఆయుధం స్వాధీనం ఈ కేసులో విక్రమ్‌తో పాటు నంద, అహ్మద్, రయీస్, బాబూజాన్, గోవింద్, చిన్నా, గౌస్‌లను నిందితులుగా చేర్చారు. బుధవారం నాటికే ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రయీస్‌ను ఇండోర్‌లో పట్టుకోగా.. మిగిలిన వారిని వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, రూ.5.3 లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిన్నా, గౌస్ పరారీలో ఉన్నారు. పరోక్షంగా సహకరించిన ప్రసాద్, తాహెర్, జావేద్ సైతం నిందితులే అని పోలీసులు చెప్తున్నారు. విక్రమ్ భార్య షిపాలీ తన భర్త చెప్పిందే తమకు చెప్పారని, అదే ఫిర్యాదు చేశారని, కేసులో ఆమె ప్రమేయం ఇప్పటి వరకు బయటపడలేదని పోలీసులు వివరిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన ఆయుధాన్ని కొత్త చెరువు నుంచి భారీ అయస్కాంతాల సాయంతో గురువారం ఉదయం రివకరీ చేశారు. సినిమా స్టైల్లో సెల్ఫ్ స్కెచ్.. అతడు సినిమాలో చూపినట్లు ‘సెల్ఫ్ స్కెచ్’వేసుకున్నాడు విక్రమ్‌గౌడ్. ఈ పథకం వేసిన నాటి నుంచి విక్రమ్ దాన్ని ఎప్పుడు అమలులో పెట్టేద్దామా అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అసహనంతో గడిపినట్లు వెల్లడైంది. నంద మినహా మరెవరికీ నేర చరిత్ర లేదు. అంతా కొత్త వారిని ఎంపిక చేసుకుని, డబ్బు ఆశ చూపి తన పథకాన్ని అమలులో పెట్టాలని విక్రమ్ ఆదుర్ధా ప్రదర్శించాడు. ఈ ఆపరేషన్ కోసం విక్రమ్ రూ.14.5 లక్షల వరకూ ఖర్చు పెట్టాడు. ఈ నిందితులతో సంప్రదింపులకు విక్రమ్ తన సెల్‌ఫోన్‌నే వాడాడు. పోలీసుల దర్యాప్తులో విక్రమ్ కాల్ డిటేల్స్ ఆధారంగానే సగం చిక్కుముడి వీడింది. నిందితుల నంబర్లు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వారి కోసం గాలించారు. మరోవైపు అనేకసార్లు నిందితుల్ని ఇంటికి తీసుకువెళ్లడంతో వారిని పనిమనిషి, వాచ్మెన్ చూశారు. పరిస్థితి పట్టించుకోని రయీస్.. కాల్పులకు కొన్ని నిమిషాల ముందు తనపై మూడు రౌండ్లు కాల్చాలంటూ విక్రమ్ చెప్పాడు. దీంతో రయీస్ తొలితూటాను విక్రమ్ కుడిచేయి ఎత్తిపెట్టి కాల్చాడు. ఆ దెబ్బకు తేరుకోలేకపోయిన విక్రమ్.. రెండో చెయ్యి ఎత్తలేకపోతున్నా పట్టించుకోని రయీస్ శరీరానికి అనుకుని ఉన్న ఎడమ చేతిపై కాల్చాడు. ఈ తూటానే పక్కటెముకల ద్వారా వెన్నుముక వరకు వెళ్లడంతో విక్రమ్ సోఫాలో కుప్పకూలిపోయాడు. దీన్ని పట్టించుకోని రయీస్... మూడో తూటా కాల్చడానికి సిద్ధమయ్యాడు. గన్ స్ట్రక్ కావడంతో అది సాధ్యం కాలేదు. ఈ తూటా పేల్చి ఉంటే విక్రమ్ బతికే అవకాశాలు తక్కువయ్యేవని పోలీసులు చెప్తున్నారు. -
జనంలో సానుభూతి కోసమే విక్రమ్ అలా..
- థ్రిల్లర్‌ను తలదన్నేలా విక్రమ్ గౌడ్ క్రైమ్ ప్లాన్ - సానుభూతితోపాటు విరోధులకు భయం పుట్టించాలనే! - రూ.50 లక్షలు సుపారీ ఇచ్చి తనపైనే హత్యాయత్నం డ్రామా - అడ్డొస్తే భార్యపైనా కాల్పులు జరపాలని షూటర్లకు ఆదేశం - ఫిలింనగర్ కాల్పుల కేసు వివరాలను మీడియాకు తెలిపిన సీపీ - మోటివేషన్ చేసిమరి కాల్పించుకున్న కాంగ్రెస్ నేత - సూత్రధాని, పాత్రధారి, ఏ1 ముద్దాయి.. అన్నీ విక్రమ్ గౌడే హైదరాబాద్: సూపర్‌హిట్ తెలుగు సినిమా ‘అతడు’ గుర్తుందికదా! అందులో ముఖ్యమంత్రి కావాలనుకున్న ఓ రాజకీయ నాయకుడు తనపై హత్యాయత్నం జరపాలని నేరస్తులను సంప్రదిస్తాడు. కానీ అనూహ్యంగా అతనే చనిపోతాడు!! ఇటీవల హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం కూడా ‘అతడు’ను తలపించేదే. అయితే సినిమాకు విరుద్ధంగా తనను తాను చంపించుకువాలనుకున్న వ్యక్తి.. చివరికి చట్టానికి చిక్కడం రియల్ లైఫ్ ట్విస్ట్!! అవును. కాంగ్రెస్ యువనాయకుడు విక్రమ్ గౌడ్‌పై జరిగిన హత్యాయత్నంలో కర్త, కర్మ, క్రియ, బాధితుడు, నిందితుడు.. అన్నీ తానేనని ఒప్పుకున్నాడు. సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు.. షూటర్లు, ఆయుధాల కోసం పడరానిపాట్లు.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు, కాంగ్రెస్ యువనాయకుడైన విక్రమ్ గౌడ్.. గత జీహెచ్ఎంపీ ఎన్నికల్లో జాంబాగ్ డివిజన్ నుంచి పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్న ఆయన.. నియోజకవర్గంలోని ప్రజలకు తనపై సానుభూతి కలగలాలని భావించాడు. అదే సమయంలో విరోధులు తన జోలికి రాకుండా గట్టి షాక్ ఇవ్వాలనుకున్నాడు. రకరకాలుగా ఆలోచించి, చివరికి ‘అతడు’ ప్లాన్‌ను ఓకే చేసుకున్నాడు. అటుపై షూటర్లకోసం వెతుకులాడాడు. ఆ క్రమంలోనే విక్రమ్.. తనకు పరిచయస్తుడైన అనంతపురం జిల్లా కదిరి వాసి గోవిందరెడ్డిని సంప్రదించాడు. ఇంతకుముందు ఇలాంటివి చేసిఉండకపోవడంతో గోవింద్.. నందకుమార్ అనే వ్యక్తి(ఇతనికి 7 కేసుల్లో ప్రమేయం ఉంది)ని సంప్రదించాడు. రూ.50 లక్షలకు బేరం కుదిరింది. తుపాకుల కోసం కదిరికే చెందిన షేక్ అహ్మద్, బాబూజాన్లను సంప్రదించగా, వారు.. ఇండోర్(మధ్యప్రదేశ్)కు చెందిన రియాజ్ పేరును సూచించారు. వెంకటరమణ అనే మరో వ్యక్తిని వెంటపెట్టకుని గోవింద్, నందూ, అహ్మద్‌లు విమానంలో ముంబై మీదుగా ఇండోర్ వెళ్లి, రియాన్‌ను కలిసి 30 వేలు చెల్లించి, తుపాకిని కొన్నారు. మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు విక్రమ్‌గౌడ్ మానిటర్ చేస్తూనేవచ్చాడు. ఇండోర్ నుంచి తెప్పించిన తుపాకిని విక్రమ్ తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. నిత్యం గ్యాంగ్‌తో హత్యాయత్నం ఎలా చెయ్యాలనేది చర్చించేవాడు. ఈ క్రమంలోనే 26 తేది రాత్రి ఫిలింనగర్‌లోని విక్రమ్‌గౌడ్ ఇంటికి గ్యాంగ్ మొత్తం వచ్చింది. ఆ రోజే కాల్పులు జరగాల్సిఉంది. కానీ గ్యాంగ్‌లోని గోంవింద్, నందులు కాస్త తటపటాయించడంతో టాస్క్ వాయిదా పడింది. ఒక దశలో మేం చెయ్యలేమని వాళ్లు చేతులెత్తేశారు. దీతో విక్రమ్ ఖంగుతిన్నాడు. ఆ తర్వాత గౌస్ అహ్మద్ సలహా మేరకు ఇండోర్ నుంచి రియాజ్ ను రప్పించి, ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. స్వస్థలం పులివెందుల(కడప జిల్లా)కు వెళ్లిపోయిన నందకుమార్.. రియాజ్ వస్తున్న విషయం తెలుసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. అడ్డొస్తే భార్యను కాల్చేయండి..! 27 రాత్రి, 28 తెల్లవారుజామున టాస్క్ అమలు చేశారు. ఈ క్రమంలో ఎవరైనా అడ్డొస్తే ఏం చెయ్యాలో విక్రమ్‌గౌడ్ తన గ్యాంగ్ సభ్యులకు ముందే చెప్పాడు. తన భార్య అడ్డొస్తే ఆమెపై ఒక రౌండ్ పేల్చాలని, వాచ్మెన్ వచ్చినా అదేపని చేయాలని విక్రమ్ సూచించాడు. రియాజ్ ఇంట్లోకి వెళ్లగా, అహ్మద్ బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. వాళ్లిద్దరినీ అక్కడి నుంచి తప్పించేందుకు నందూ కారుతో జూబ్లీహిల్స్ రోడ్డు వద్ద వెయిట్ చేశాడు. స్వయంగా విక్రమ్‌గౌడ్ తీసుకొచ్చి ఇచ్చిన తుపాకితో రియాజ్.. మొదట ఎడమ భుజంపై కాల్చాడు. దెబ్బకు విక్రమ్ సోఫాలో కూలబడ్డాడు. విక్రమ్ చెయ్యి సరిగా ఎత్తలేక పోవడంతో భుజంలోకి వెళ్లాల్సిన రెండో బుల్లెట్.. కడుపులోకి దూసుకెళ్లింది. రియాజ్ మూడో తూటా పేల్చడానికి ప్రయత్నించగా.. తుపాకి చెడిపోయింది. ఇక చేసేదేమీలేక ప్లాన్ ప్రకారం అక్కడి నుంచి పారిపోయాడు. ముందే కక్కేసిన విక్రమ్..! కాల్పుల అనంతరం గాయపడ్డ విక్రమ్ గౌడ్‌ను అతని భార్య షిఫాలి ఆస్పత్రిలో చేర్పించింది. అయితే, కాల్పులు ఎలా జరిగాయనేదానిపై విక్రమ్ ఆమెకు ముందే ఓ కట్టుకథ చెప్పడంతో, ఆమె కూడా అదే విషయాలను పోలీసులకు చెప్పారు. ఆమె చెప్పిన విషయాల్లో కొన్ని విరుద్ధంగా తోచడంతో అధికారులు తమదైన శైలిలో విక్రమ్‌ను ప్రశ్నించారు. విచారణలో బ్రేకైపోయిన విక్రమ్.. ప్లాన్ మొత్తాన్ని పోలీసుల ముందు కక్కేశాడు. దీంతో విక్రమ్‌గౌడ్‌ను ఏ1గా, కాల్పులు జరిపిన రియాజ్‌ను ఏ2గా పేర్కొంటూ మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో ఆరుగురు అరెస్ట్‌కాగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. విక్రమ్ భార్యకు ఏమీ తెలియదు.. కాగా, విక్రమ్ క్రైమ్ ప్లాన్ గురించి ఆయన భార్య షిఫాలికి ఏమీ తెలియదని సీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. కొద్ది రోజులుగా తన భర్త ఆందోళనలో ఉన్న విషయం గుర్తించానని షిఫాలి పోలీసు విచారణలో తెలిపనట్లు సీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను.. డిశ్చార్జి కాగానే అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
జనంలో సానుభూతి కోసమే విక్రమ్ అలా..
-
డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్ అరెస్ట్!
-
డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్ అరెస్ట్!
హైదరాబాద్ : కాల్పుల డ్రామా ఘటనలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌తో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మధ్యాహ్నం మూడు గంటలకు సుపారీ గ్యాంగ్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. కాగా కాల్పుల ఘటనలో సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తేల్చారు. దీంతో ఆయనపై ఆయుధాల చట్టం కింద బుధవారం కేసు నమోదు చేశారు. A-1గా విక్రమ్ గౌడ్, A-2 నందు, A-3 అహ్మద్ ఖాన్‌ను చేర్చారు. మరోవైపు షేక్ పేట్ చెరువులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇవాళ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విక్రమ్ గౌడ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. -
కాల్పుల స్కెచ్ ప్లాన్ అంతా విక్రమ్‌దే..!
-
స్కెచ్ విక్రమ్‌దే..!
తనపై కాల్పులకు పథకం రచించింది విక్రమ్‌గౌడే ► అమలులో పెట్టేందుకు సహకరించిన సన్నిహితుడు ► విక్రమ్‌ను నిందితునిగా చేర్చిన పోలీసులు ► మంగళవారం నాటికి అదుపులో నలుగురు నిందితులు ► తుపాకీ కొత్తచెరువులో పారేసినట్లు అనుమానాలు సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్ నివాసంలో శుక్రవారం జరిగిన కాల్పుల కేసు కొలిక్కి వచ్చింది. ఈ ‘ఆపరేషన్’కు పథకరచన చేసింది విక్రమ్గౌడేనని దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిసింది. విక్రమ్‌కు సన్నిహితంగా ఉండే నందు అనే వ్యక్తి ఈ పథకం అమలులో సూత్రధారిగా వ్యవహరించినట్టు వెల్లడైందని సమాచారం. పథకాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నిందితులు అమలు చేయగా.. మంగళవారం నాటికి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో బాధితుడిగాఉన్న విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు నిందితుడిగా మార్చారు. నందూకు స్కెచ్ అమలు బాధ్యతలు తనపై ఎవరైనా తుపాకీతో కాల్చడం ద్వారా హత్యాయత్నం చేస్తే.. సానుభూతితో కుటుంబం దగ్గర కావడం, భయంతో ఫైనాన్షియర్లు కొన్ని నెలల పాటు తన దగ్గరకు రాకుండా ఉండటం జరుగుతుందని విక్రమ్ భావించారు. దీన్ని అమలులో పెట్టే బాధ్యతల్ని తనతో సన్నిహితంగా ఉండే నందూ అనే వ్యక్తికి అప్పగించారు. ముందుగా లోకల్ షూటర్ల గురించి ఆరా తీసినా వారు ప్రొఫెషనల్ షూటర్లు కాదనే కారణంతో వెనక్కి తగ్గారు. చివరికి నందు తనకు ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో అనంతపురానికి చెందిన ముఠాను సంప్రదించారు. విక్రమ్‌కు ఎలాంటి ప్రాణహానీ లేకుండా కాల్పులు జరిపి వెళితే ఒక్కొక్కరికీ రూ.50 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ‘ఆపరేషన్’కోసం అనంతపురం ముఠా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వారిని రంగంలోకి దింపింది. చివరి నిమిషంలో మారిన ప్లేస్.. తొలుత వేసుకున్న ప్లాన్ ప్రకారం విక్రమ్‌పై కాల్పులు బయటి ప్రాంతంలో ఎక్కడైనా జరగాల్సి ఉంది. ఈ మేరకు నిందితులు రెక్కీ సైతం పూర్తి చేసి తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే బహిరంగ ప్రదేశంలోనో, రోడ్డు పైనో ప్లాన్ అమలు చేస్తే సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాలు లభించే అవకాశాలు ఉండటంతో ‘ప్లేస్’ను విక్రమ్ ఇంటికే మార్చారు. రోడ్డుపై జన సంచారం తక్కువగా ఉంటుందనే తెల్లవారుజాము సమయాన్ని ఎంచుకున్నారు. ప్లాన్ అమలు కోసం ఇంట్లోని సీసీ కెమెరాలను విక్రమ్ ముందుగానే తొలగించినట్టు తెలుస్తోంది. ఇక నిందితులకు అవసరమైన వాహనాన్ని నందూ సమకూర్చినట్లు సమాచారం. కాల్పులకు రెండు రోజుల ముందు షూటర్లతో కలసి విక్రమ్ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రౌండ్లు కాల్చాలని సూచించారు. ప్లాన్ అమలు.. అప్పటికే పలుమార్లు రెక్కీ పూర్తి చేసుకున్న నిందితులు శుక్రవారం ఉదయం అనంతపురం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నందూ సమకూర్చిన వాహనంపై విక్రమ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఒకరు బయటే వేచి ఉండగా.. మరొకరు ఇంట్లోకి వెళ్లి మొదట ఒక రౌండ్ కాల్చాడు. విక్రమ్ చెప్పడంతోనే రెండో రౌండ్ సైతం కాల్చి పారిపోయారు. వీరికి సహకరించిన మరో నిందితుడు ఆ ఇంటికి కొద్దిదూరంలో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్ మీదుగా పారిపోయారు. వెళ్తూ ఆయుధాన్ని కొత్త చెరువులో విసిరేసి షేక్‌పేట వెళ్లి అక్కడి నుంచి ఓల్డ్ ముంబై రోడ్డు ద్వారా నానక్‌రాంగూడ చేరుకున్నారని సమాచారం. అక్కడ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనుసరించి సిటీ దాటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్త చెరువును జల్లెడ పడుతున్న పోలీసులు మంగళవారం సాయంత్రానికి విక్రమ్, నందూ, అహ్మద్, రాజు, మురళి, రాజశేఖర్‌లను నిందితులుగా చేరుస్తూ కేసులో మార్పులు చేశారు. అనంతపురం, కర్ణాటకల్లో ప్రత్యేక బృందాలు నలుగురిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో మురళి కాల్పులు జరిపిన వ్యక్తిని ద్విచక్ర వాహనంపై విక్రమ్ ఇంటికి తీసుకువచ్చినట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి కోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గాలిస్తున్నారని తెలిసింది. నిందితుల్ని బుధవారం అరెస్టు ప్రకటించే ఆస్కారం ఉందని తెలిసింది. కాల్పులకు వినియోగించిన ఆయుధం కోసం పోలీసులు మంగళవారం కొత్త చెరువులో ముమ్మరంగా వెతికారు. దాదాపు 20 మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొత్త చెరువును జల్లెడ పట్టారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో బుధవారం మరోసారి వెతకనున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విక్రమ్ అనేక చోట్ల అప్పులు చేశారు. ఇటీవల కాలంలో రుణం ఇచ్చిన ఫైనాన్షియర్ల నుంచి తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి పెరిగింది. మరోవైపు విక్రమ్‌ను ఆయన కుటుంబం కూడా దూరంగా ఉంచుతుండటంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో ఏదైనా పథకం వేయడం ద్వారా అటు కుటుంబానికి దగ్గర కావడం, ఇటు ఫైనాన్షియర్ల ఒత్తిడి తగ్గించుకోవడం చేయాలని విక్రమ్ భావించారు. కొన్ని చిత్రాలను నిర్మించడం ద్వారా సినీరంగంతోనూ సంబంధాలు ఉన్న ఆయన సినీ ఫక్కీలోనే ఈ సమస్యలకు ‘పరిష్కారం’ వెతకాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిందే హత్యాయత్నం ఐడియా. ఆరు నెలల నుంచి కాల్పుల ఉదంతానికి ప్రణాళిక రచించారు. -
వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్ ప్లానే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్ గౌడ్‌ను పోలీసులు చేర్చారు. దీంతోపాటు ఆయనపై నాలుగు అదనపు సెక్షన్లను కూడా చేర్చినట్లు వెల్లడించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదుపులో అనంతపురానికి చెందిన ముఠా ఉంది. పట్టుబడ్డ నిందితులను పోలీసులు బుధవారం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. పలు అనుమానాలతో ప్రారంభమైన ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. విక్రమ్ గౌడ్ కావాలనే ఇలా చేయించినట్లు తెలిసింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన ముఠాకు విక్రమ్ గౌడ్‌కు గతంలోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన డైరెక్షన్లోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాను మూడు నెలల కిందటే కట్ చేయించుకున్నారట. దాంతోపాటు కాల్పుల తర్వాత పోలీసులకు ఏం చెప్పాలనే విషయంలో కూడా ఆయన తన భార్యకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి సానుభూతిని సంపాధించుకునేందుకు విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. రూ.50లక్షలు తమకు సుపారి ఇచ్చినట్లు విక్రమ్ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం టాస్క్‌ఫోర్స్ సోదాల్లో ఒక పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, విక్రమ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. -
వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్ ప్లానే
-
విక్రమ్ గౌడ్ డైరెక్షన్లో కాల్పుల డ్రామా
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో మిస్టరీ ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురానికి చెందిన నలుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు, విక్రమ్ గౌడ్‌కు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అంతేకాకుండా ఈ కాల్పుల సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సానుభూతి కోసమే విక్రమ్ కాల్పుల పథకం రచించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినవారితోనే తతంగం నడిపినట్లు సమాచారం, తన ఇంటి వెనుక కొత్త చెరువులో గన్ పడేసినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, ఆయుధ లైసెన్స్ పునరుద్ధరణ, కుటుంబానికి దగ్గర కావడం తదితర కారణాల నేపథ్యంలో ఈ కథ మొత్తానికీ విక్రమ్‌గౌడే సూత్రధారా అన్న కోణాన్నీ పరిగణలోకి తీసుకుని ఆరా తీశారు. ఉదంతం జరిగిన విక్రమ్‌గౌడ్ ఇంటికి సమీపంలోనే ఆపోలో ఆస్పత్రి సైతం ఉండటంతో ఇంటినే స్పాట్‌గా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విక్రమ్ ప్రమేయం బయటపడి, ఆయన ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిగినట్లు లేదా కాల్చుకున్నట్లు తేలితే ఆయనతో పాటు సంబంధం ఉన్న వారిపైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. అగంతకులు వాడిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్న అతడు ఈ కాల్పుల డ్రామాకు తెరతీశాడు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు విక్రమ్‌తో పాటు అతడి భార్య షిపాలీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసులో పురోగతి
-
కాల్పుల వెనుక ‘అనంత’ ముఠా!
-
వీడని విక్రమ్‌గౌడ్ కాల్పుల మిస్టరీ
-
ఆ బైక్ ఎవరిది?
⇒ విక్రమ్ ఇంటి సమీపంలో సీసీ కెమెరాల్లో రికార్డు ⇒ అతడి వాంగ్మూల కోణంలోనూ సాగుతున్న దర్యాప్తు ⇒ అనంతపురంలో ఆరా తీస్తున్న ప్రత్యేక బృందం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీని ఛేదించడానికి పది ప్రత్యేక బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఘటనా స్థలి పరిశీలన నుంచి పోలీసులు ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం లేదని అనుమానిస్తున్నారు. ఉదంతం జరిగిన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా మొండికేసిన విక్రమ్ శనివారం నోరు విప్పి ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి వాంగ్మూలాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే విక్రమ్ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న ఓ సీసీ కెమెరాలో బైక్ కదలికలు రికార్డయ్యాయి. దీంతో విక్రమ్ వాంగ్మూలంలో సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తూ ఆధారాలు సేకరించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం జిల్లాలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు బైక్‌పై వచ్చారు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో ఓ స్నేహితుడిని కలసి 5 నిమిషాల్లోనే జూబ్లీహిల్స్ రోడ్ నం.86లోని తన ఇంటికి వచ్చానని, స్నానం చేసి భార్య షిపాలిని సిద్ధం కావాల్సిందిగా చెప్పానని వాంగ్మూలంలో విక్రమ్ పోలీసులకు వివరించారు. పైఅంతస్తు నుంచి కిందికి వచ్చి డ్రాయింగ్ రూమ్ మెయిన్ డోర్ తెరిచి ఎదురుగా సోఫాలో కూర్చున్నానని, కూర్చున్న రెండు నిమిషాల్లోనే మంకీ క్యాప్ ధరించిన పొట్టిగా ఉన్న వ్యక్తి లోనికి ప్రవేశించి ఒక రౌండ్ కాల్పులు జరిపాడని, తాను తేరుకునేలోపే మరో రౌండ్ కాల్చడంతో కుప్పకూలిపోయానని తెలిపారు. ఆ సమయంలో బయట మరో వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడని, కాల్పుల అనంతరం ఇద్దరూ బైక్‌పై తమ ఇంటి సమీపంలోని దర్గా వైపు పారిపోయినట్లు తాను గమనించానని వివరించారు. తనకు అప్పులు ఉన్నట్లు, తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. ఘటనపై తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ముమ్మాటికీ నిజమేనని చెప్పారు. అనంతపురంలోనూ ప్రత్యేక బృందం విక్రమ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని అనంతపురం జిల్లాకు పంపారు. దర్యాప్తు అధికారులు విక్రమ్‌గౌడ్ ఫోన్ కాల్‌డేటా సేకరించగా.. అందులో ఆయన అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం, వినియోగించిన ఆయుధంతో అనంతపురం వ్యక్తికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్ కాల్‌డేటాతో పాటు వాట్సాప్ వ్యవహారాలను కూడా అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. విక్రమ్ కాల్పుల కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యం ఇస్తున్నామని, సోమవారం నాటికి స్పష్టత రావచ్చని కేసును పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాలో బైక్ ఆనవాళ్లు.. దర్గా సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను పోలీసులు పరిశీలించారు. అందులో శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగిన సమయంలో ఓ బైక్‌పై ఇద్దరు వేగంగా వెళ్లడం రికార్డు అయింది. అయితే అందులో ఆగంతకుల ఆహార్యం, బైక్ నంబర్ స్పష్టంగా లేకపోవడంతో వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ విధానంలో ఫీడ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దర్గా నుంచి అన్ని వైపులకు వెళ్లే రోడ్లలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను సైతం సేకరించి విశ్లేషించాలని నిర్ణయించారు. విక్రమ్ చెప్పినట్లు వీరిద్దరూ వచ్చి అతడిపై కాల్పులు జరిపారా? లేదంటే ముందు నుంచీ అనుమానిస్తున్నట్లు విక్రమ్ వేసిన పథకంలో ఇద్దరూ పాత్రధారులా అన్నది తేల్చడంపై దృష్టి పెట్టారు. కాల్పుల ఉదంతం విక్రమ్ సృష్టే అయితే ఆ ఇద్దరూ ఆయుధం అందించి, మళ్లీ తీసుకెళ్లి ఉండచ్చని భావిస్తున్నారు. -
కాల్పులు ఎవరు జరిపారో అంతు చిక్కలేదు.
-
సంచలన విషయాలు వెల్లడించిన షిపాలి
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. గంటగంటకు ఈ కేసులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలో తాజాగా విక్రమ్ భార్య షిపాలి పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇదరు ఆగంతకులు తమ ఇంటికి వచ్చి.. విక్రమ్‌పై కాల్పులు జరిపి పారిపోయారని ఆమె చెప్పారు. 'అర్ధరాత్రి తర్వాత ఇద్దరు ఆగంతకులు బైక్‌పై మా ఇంటికి వచ్చారు. అందులో ఒకరు హెల్మెట్ ధరించారు. మరొకరు మాస్క్ ధరించారు' అని ఆమె తెలిపారు. అయితే, షిపాలీ చెప్పిన విషయాలకు, విక్రమ్‌గౌడ్ చెప్పిన వివరాలకు మధ్య ఎక్కడ పొంతన లేకపోవడంలో పోలీసులను అయోమయానికి గురిచేస్తోంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి తనపై కాల్పులు జరిపారని, అనంతరం కారులో పారిపోయారని విక్రమ్ చెప్పారు. అయితే, అందుకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు ఒకరు హెల్మెట్ ధరించి.. మరొకరు ముసుగు ధరించి బైక్‌పై వచ్చారని షిపాలి చెప్పడంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాదాపు పది పోలీసు ప్రత్యేక బృందాలు ఈ కేసు దర్యాప్తును ముమ్మరంగా చేపడుతున్నా.. కాల్పులు ఎవరు జరిపారనేది అంతుచిక్కడం లేదు. విక్రమ్ గౌడ్ నివాసం సమీపంలో ఉన్న పలు సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు రావడం గానీ, ఒకరు ముసుగు ధరించి రావడంగానీ పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులకు కూడా ఈ కేసులో అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులకు విక్రమ్‌గౌడ్ వాంగ్మూలం!
హైదరాబాద్: తనపై జరిగిన కాల్పుల విషయంలో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. కాల్పులు జరగ్గానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరిచానని తెలిపారు. తన అరుపులు విని భార్య షిపాలి కిందకు వచ్చిందని, 108కు ఫోన్ చేయాలని తానే ఆమెకు సూచించానని చెప్పారు. అంబులెన్స్ రాకపోవడంతో కారులోనే ఆస్పత్రికి భార్య తీసుకొచ్చిందని, ఆమెకు డ్రైవర్, వాచ్మెన్ సహకరించారని తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. నొప్పి ఎక్కువగా ఉండటం వల్లే నిన్న పోలీసులతో మాట్లాడలేకపోయానని చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రమ్ గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పటికే మీడియాతో మాట్లాడిన విక్రమ్ గౌడ్ భార్య షిపాలీ.. కాల్పుల విషయంలో మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. తమకు మంచి చేయకపోయినా పర్వాలేదుకానీ దుష్ర్పచారం చేయకండని ఆమె కోరారు. కాగా, విక్రమ్ గౌడ్ వెన్నుపూస భాగంలో బుల్లెట్ దిగిందని ఎంఆర్ఐ స్కానింగ్‌లో వైద్యులు గుర్తించారు. -
విక్రమ్‌పై వస్తున్న కథనాలు అవాస్తవం: షిఫాలీ
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా కాల్పుల ఘటనకు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీ తెలిపారు. మీడియాలో విక్రమ్‌పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు చెప్పామని, విక్రమ్‌పై ఎవరు దాడి చేశారో పోలీసులే గుర్తించాలన్నారు. తమకు మంచి చేయకపోయినా దుష్ప్రచారం చేయవద్దని షిఫాలీ విజ్ఞప్తి చేశారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని షిఫాలీ చెప్పారు. మరోవైపు సంఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ పోలీసులు ఎలాంటి నిర్థారణకు రాలేకపోతున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు పలుదఫాలుగా ప్రశ్నించినప్పటికీ విక్రమ్ గౌడ్ నోరు మెదపనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విక్రమ్ భార్య షిఫాలీని ఇవాళ పోలీసులు మరోసారి విచారణ చేశారు. కాగా కాల్పుల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదని నిర్ధారించిన పోలీసులు, విక్రమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అలాగే విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా 2015లోనే రెన్యువల్ ముగిసినప్పటికీ అనధికారికంగా రెండేళ్లుగా ముఖేష్ వద్దే తుపాకీ ఉన్నట్లు సమాచారం. -
బుల్లెట్ ఎవరిది?
♦ మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కొడుకుపై కాల్పులు! ♦ రెండు భుజాల్లోకి దూసుకెళ్లిన తూటాలు ♦ శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఘటన ♦ అన్నదానానికి దర్గాకు వెళ్లే యత్నాల్లో ఉండగా కాల్పులు ♦ ఎవరు కాల్చారన్న అంశంపై నోరు విప్పని విక్రమ్ గౌడ్ ♦ అప్పులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తానే కాల్చుకున్నారా అని అనుమానాలు సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాల్పుల ఘటనపై విక్రమ్ నోరు మెదపట్లేదు. దీంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం, సమీపంలో కెమెరాలు లేకపోవడంతో కీలకాధారాలు లభించలేదు. అప్పులు పెరిగిపోవడంతోపాటు తనను దూరంగా ఉంచుతున్న కుటుంబీకులను బెదిరించేందు కు ఆయనే కాల్చుకొని ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి ఇంటికి వచ్చి.. విక్రమ్ భార్య షిపాలి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.86లోని ప్లాట్ నం.459లో విక్రమ్ తొమ్మిది నెలల క్రితం అద్దెకు దిగారు. భార్యా పిల్లలతో కలసి నివసిస్తున్నారు. కొన్ని చిత్రాలు కూడా నిర్మించిన విక్రమ్ గౌడ్ ప్రస్తుతం అందుకు సంబంధించి ఓ కార్యాలయం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బయట నుంచి ఇంటికొచ్చిన విక్రమ్ 9 గంటలకు మరోసారి వెళ్లారు. ఫిల్మ్‌నగర్ రోడ్ నం–1 సమీపంలో ఉండే చాంద్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత తెల్లవారుజామున 2–2.20 గంటల మధ్యలో ఇంటికి వచ్చారు. డూప్లెక్స్ ఇంటిపై భాగంలో నిద్రిస్తున్న భార్యను నిద్రలేపి సమీపంలో ఉన్న హకీంబాబా దర్గాలో పేదలకు అన్నదానం చేద్దాం.. సిద్ధమవాలని సూచించారు. రెడీ అయి 3.20 గంటల ప్రాంతంలో కిందికి వచ్చి డ్రాయింగ్ రూమ్‌లో విక్రమ్ కూర్చున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో భార్య కిందకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె మెట్లు దిగుతుండగా.. డ్రాయింగ్ రూమ్ నుంచి కాల్పుల శబ్దం, భర్త అరుపులు వినిపించాయి. దీంతో ఆమె కంగారుగా డ్రాయింగ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా.. విక్రమ్ సోఫాలో రక్తపుమడుగులో కనిపించారు. ఎవరో వచ్చి తనపై కాల్పులు జరిపారని భార్యతో చెప్పారు. వెంటనే షిపాలి వాచ్మెన్ శ్రీనివాస్‌తో పాటు డ్రైవర్లు శ్రీకాంత్, గోపీల సాయంతో కారులో చేర్చి అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో కుడి చేతి భుజంలో దిగిన తూటా బయటకు వచ్చేయగా.. ఎడమ భుజంలో దిగి ఇరుక్కుపోయిన బుల్లెట్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి తీశారు. ఇంటి చుట్టూనే తిరిగిన శునకం.. ఘటనా స్థలంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్టీమ్లతో పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసు డాగ్ ఇంటి చుట్టూనే తిరిగిందని, ఒకసారి గేటు బయటకు వచ్చి మళ్లీ లోనికి వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు. డ్రాయింగ్ రూమ్‌లో రెండు ఖాళీ తూటాలు (ఖాళీ క్యాట్రిడ్జ్), విక్రమ్ కుడి భుజం నుంచి బయటకు వచ్చిన మరో కాల్చిన తూటాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న రక్తాన్ని వాచ్‌మన్ శ్రీనివాస్ కొంతమేర తుడిచేయగా.. ఆయన కుమారుడు నాగేంద్ర అడ్డుకున్నారు. సోఫా, నేలపై పడిన రక్తపు మరకల నుంచి పోలీసుల నమూనాలు సేకరించారు. కాల్పులకు వాడింది నాటు పిస్టల్గా భావిస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు ఎంతగా ప్రశ్నించినా.. తనపై కాల్పులు జరిపింది ఎవరో తెలుసునని, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటానని చెప్పారు. కేసు దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేసినట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు. విక్రమ్ తనకు తాను కాల్చుకున్నారా? లేక ఎవరైనా కాల్పులు జరిపారా? అన్న కోణాలనూ పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆద్యంతం మిస్టరీ.. షిపాలి ఫిర్యాదు, ఘటనాస్థలి, వాచ్మెన్ చెబుతున్న విషయాలు, గాయాలను పరిశీలించిన పోలీసులు, ఫొరెన్సిక్ నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ఇటీవల అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. విక్రమ్ ఇటీవలే ఓ స్టూడియో ఏర్పాటు చేశారని, అది రెండున్నర నెలల్లో రూ.1.5 కోట్ల నష్టాల్ని తెచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఆయన ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. తమకు చెల్లించాల్సిన రూ.లక్షలు తిరిగి ఇవ్వాల్సిందిగా కొందరు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఆయన్ను కోరినట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 35 సందేశాలను గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే కొద్దిరోజుల నుంచి కుటుంబ కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది. తన తండ్రి నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేదని విక్రమ్ కొద్దిరోజుల నుంచి స్నేహితులతో చెప్పుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి ఇవి కూడా కారణమా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఇష్క్’ సినిమాలకు విక్రమ్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విక్రమ్ ఇంట్లో పోలీసులు దాదాపు ఆరు గంటలపాటు తుపాకీ ఆచూకీ కోసం గాలించినా దొరకలేదు. ఇటీవల రద్దయిన తన ఆయుధ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవడానికి విక్రమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు హకీంబాబా దర్గాలో పేదలకు అన్నదానం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు జరిగినట్లు విక్రమ్ భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ దర్గా నిర్వాహకులు మాత్రం తమ వద్ద అన్నదానాలు వంటివి జరగవని, తమకు విక్రమ్ ఆయన సంబంధీకుల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. వాచ్‌మన్‌ను పోలీసులు విచారించగా.. కాల్పుల శబ్దం వినిపించిందని, ఆ సమయంలో ఎవరూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు లేదని తెలిపాడు. -
కాల్పుల కేసులో మిస్టరీ వీడుతోంది
-
విక్రమ్ గౌడ్‌కు పూరీ జగన్నాథ్ పరామర్శ
హైదరాబాద్ : కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్ గౌడ్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా విక్రమ్‌గౌడ్ సినిమా ప్రొడ్యూసర్‌గా కూడా చిత్రపరిశ్రమకు పరిచయం. సినీ హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డితో కలిసి ఆయన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఇష్క్, గుండెజారి గల్లంతైయ్యిందే సినిమాలను నిర్మించారు. అలాగే విక్రమ్‌గౌడ్...కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విక్రమ్‌గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. మరోవైపు అలంపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా విక్రమ్ గౌడ్‌ను పరామర్శించారు. గత కొద్దిరోజులుగా విక్రమ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. -
‘నా భర్తను ఎవరో చంపడానికి యత్నించారు’
హైదరాబాద్ : కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్‌గౌడ్ భార్య శిఫాలి మాత్రం తన భర్తపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. దర్గాలో అన్నదానం కోసం ఉదయం రెండున్నర గంటలకు నిద్ర లేచామని తనకంటే ముందు భర్త హాల్లోకి వెళ్లారని తెలిపారు. ఇంతలోనే కాల్పుల శబ్ధం రావడంతో.... కిందకు దిగానని అప్పటికే విక్రమ్ గౌడ్ రక్తపు మడుగులో ఉన్నారని చెప్పరు. ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని భర్త విక్రమ్‌గౌడ్ తనతో చెప్పాడని శిఫాలి చెప్పారు. తన భర్తను ఎవరో చంపడానికి యత్నించారని ఆరోపించిన ఆమె, కాల్పులు జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని... బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా విక్రమ్ గౌడ్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం కిందటే గన్ లైసెన్స్ కోసం అప్లయి చేయగా పోలీసులు తిరస్కరించారన్నారు. తెలిసినవాళ్లే కాల్పులు జరిపారని, ఒక్కరే వచ్చి కాల్పులు జరిపినట్లు విక్రమ్ చెప్పాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. విక్రమ్ కోలుకున్న తర్వాత నిందితుడి పేరు చెబుతాడన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం: సీపీ
హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ రెడ్డి కాల్పుల ఘటన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. రోజు తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు జరిగాయన్నారు. ఆ సమయంలో వాచ్మెన్, అతని భార్య, ఇంకో పనిమనిషితో పాటుగా భార్యాభర్తలు (విక్రమ్ గౌడ్, శిఫాలీ) మాత్రమే ఉన్నారని, సంఘటన జరగటం బాధాకరమని,ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. విక్రమ్ శరీరంపై రెండు గాయాలున్నాయని, ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా వెస్ట్ జోన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ కూడా విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. విక్రమ్ గౌడ్ నివాసంలో ఆధారాలు సేకరించామని, క్లూస్‌టీమ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. తెల్లవారుజామున పెద్దమ్మ గుడికి వెళ్లే సమయంలో కాల్పుల శబ్ధం వినిపించిందని విక్రమ్ భార్య తెలిపారని, ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో విక్రమ్ స్పృహలోనే ఉన్నారని సీపీ పేర్కొన్నారు. ఏం జరిగిందనేది కొంత సమయం తర్వాత చెబుతానన్నాడని, విక్రమ్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇక కాల్పుల సమయంలో ఫ్లోర్‌పై రక్తం పడి ఉందని, తుడిచి వేసినట్లుగా కనిపిస్తోందన్నారు. తెలియక తుడిచానని వాచ్మెన్ చెబుతున్నాడని సీపీ చెప్పారు. విక్రమ్ వద్ద ఎలాంటి ఆయుధం లేదని, సమీపంలోని అన్ని సీసీ ఫుటేజ్‌లు సేకరించామన్నారు. వాహనాల కదలికలను పరిశీలిస్తున్నామని, నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. కాగా ఘటన జరిగి ఏడు గంటలు దాటుతున్నా....కాల్పుల కారణాలపై పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారు. బయట వ్యక్తులే తమ వాడిపై కాల్పులు జరిపాడని...విక్రమ్‌గౌడ్ బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కొన్ని రోజులుగా విక్రమ్‌గౌడ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అని కూడా బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగితేకానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే ఆగంతకులే కాల్పులు జరిపారనే దాన్ని తోసిపుచ్చుతున్నారు. ఆ మేరకు ఆధారాలు లభించనందు వల్లే పోలీసులు ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఆగంతకులకు సంబంధించిన ఎలాంటి విజువల్స్ రికార్డు కాలేదని తెలిసింది. ఒక సమయంలో ఆత్మహత్యాకోణంపైనే పోలీసులు ఎక్కువుగా దృష్టి సారించారు. అయితే ఈ కోణంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆయుధం ఏమూంది? దాన్ని ఎవరు మాయం చేశారు?. ఆత్మహత్యే అయితే దాన్ని దాచాల్సిన అవసరం బంధువులకు ఎందుకొచ్చింది? అనేది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే అసలు విక్రమ్‌గౌడ్‌కు లైసెన్స్ వెపనే లేదని పోలీసులు చెబుతున్నారు. మరి లైసెన్స్ గన్ లేకపోతే కాల్పులకు కారణమైన గన్ ఎవరిది?. విక్రమ్‌గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారా? మరెవరిదైనా ఇంట్లో పెట్టుకున్నారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కాల్పులు జరిగింది పిస్టల్తోనో, రివాల్వర్తోనూ అనేది కూడా అంతుపట్టడం లేదు. అయితే తాము అన్ని కోణాల్లో శాస్త్రీయ విచారణ చేసిన తర్వాతే ఒక నిర్ణయానికొస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. విక్రమ్‌గౌడ్‌పై ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపినట్టు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ విక్రమ్‌కు వచ్చాయా లేదా అనేది తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మిస్టరీగా మారిన కాల్పుల కేసులో అన్ని కోణాల్లో విచారిస్తున్నామంటున్న డీసీపీ తెలిపారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశామని, సీసీ కెమెరా, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు!
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్ గౌడ్‌కు అసలు లైసెన్స్ ఆయుధమే లేదని పోలీసులు చెబుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి బయటి నుంచి దుండగులు వచ్చినట్లు ఆనవాళ్లు లభించలేదు. అంతేకాకుండా సంఘటనా స్థలంలో భార్యాభర్తలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో ఔట్ హౌస్‌లో సెక్యూరిటీ గార్డు ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్‌పై కాల్పులు జరిపిందెవరు?. బయట నుంచి ఎవరు రాకుంటే లోపల ఉన్నదెవరు? ఇంట్లోనే ఉన్నవారు కాల్పులు జరిపారా? లేక విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక తన ఫిర్యాదులో కూడా విక్రమ్ భార్య శిఫాలీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. అలాగే ఘటనా స్థలంలో రక్తం మరకలు తుడిచేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం.. కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఇద్దరు (భార్యభర్తలు) మాత్రమే ఉన్నారు. బయట వ్యక్తులు వచ్చి కాల్పులు జరపటానికి అవకాశాలు లేవు. కాల్పులకు వాడింది...7.9 ఎమ్ఎమ్ పిస్తోలుగా అనుమానిస్తున్నాం. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇక కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. విక్రమ్ గౌడ్‌కు ఆయుధాల లైసెన్స్ లేదు. ఇక దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారు’ అని డీసీపీ వెల్లడించారు. కాగా విక్రమ్ పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన విక్రమ్ గౌడ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతడి శరీరం నుంచి రెండు బుల్లెట్లను వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉంది. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ మరోవైపు సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్ వెపన్‌కు సంబంధించి రెండు ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలం నుంచి ఎటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని డీసీపీ చెప్పడం గమనార్హం. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా విక్రమ్ గౌడ్ ఇంటి పరిసరాల్లోనే తచ్చాడినట్లు సమాచారం. స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు: శిఫాలీ ఈ కాల్పుల సంఘటనపై విక్రమ్ గౌడ్ భార్య శిఫాలీ మాట్లాడుతూ...‘శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయమే గుడికి వెళ్లాలనుకున్నాం. నేను స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చాను.’ అని తెలిపారు. గత తొమ్మిది నెలలుగా ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, తమ కుటుంబంలో ఎవరికీ కలహాలు లేవని విక్రమ్ బాబాయ్ మధు గౌడ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరో తెలియదని అన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు!
-
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
-
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్: నగరంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విక్రమ్ గౌడ్‌పై జరిగిన దాడిలో ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ తర్వాత దుండగులు ఘటనాస్ధలి నుంచి పారిపోయారు. విక్రమ్ నివాసంలోనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. నెత్తురోడుతున్న ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అత్యవసర విభాగానికి ఆయన్ను తరలించిన వైద్యులు రెండు బుల్లెట్లను శరీరంలో నుంచి వెలికితీశారు. విక్రమ్ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉన్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత విక్రమ్ ఇంటికొచ్చారని చెప్పారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం ఉందని, గుడికి వెళ్దామని భార్యతో చెప్పినట్లు వెల్లడించారు. రెడీ అయి గుడికి బయల్దేరుతున్న సమయంలో దాడి చేసిన దుండగులు విక్రమ్‌ను తీవ్ర గాయపరిచారని చెప్పారు. కుటుంబ కలహాలే కాల్పులకు కారణమని భావిస్తునట్లు తెలిపారు. కాగా, తమ కుటుంబంలో ఎవరికీ కలహాలు లేవని విక్రమ్ బాబాయ్ మధు గౌడ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరో తెలియదని తెలిపారు. -
హైదరాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 29న దిగ్విజయ్ సింగ్, 30న గులాం నబీ ఆజాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్ నేతలతో మాట్లాడి ఎన్నికల ప్రచార వ్యూహం ఖరారు చేస్తామని విక్రమ్ గౌడ్ చెప్పారు. మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం ఉందన్న విషయం స్పష్టమైందని అన్నారు. -
బరిలో... అబ్బాయ్ - బాబాయ్!?
గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్లో అబ్బాయి-బాబాయిలు బరిలో ప్రత్యర్థులుగా నిలిచే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండగా...ముఖేష్ గౌడ్ సోదరుడు మధుగౌడ్ బీజేపీ నుంచి ఇదే స్థానంలో పోటీ చేసేందుకు ఉద్యుక్తుడవుతున్నారు. మధు గౌడ్ గతేడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వాస్తవానికి విక్రంగౌడ్ గన్‌ఫౌండ్రి డివిజన్‌పై ఆశలు పెట్టుకోగా ఆ స్థానం మహిళలకు రిజర్వు అయింది. వెంటనే ఆయన తాను జాంబాగ్ నుంచి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. తానేమీ తక్కువ కాదంటూ మధుగౌడ్ సైతం జాంబాగ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తన అనుచరులతో కలిసి ప్రకటించారు. దీంతో ఈ స్థానంలో అబ్బాయి-బాబాయిల పోటీ చూడాల్సి వస్తుందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. - అబిడ్స్ -
మరో ప్రేమకథతో...
ప్రేమకథల వైపు అడుగులేయడం నితిన్ ఎప్పుడు మొదలుపెట్టారో... అప్పట్నుంచి ఆయన్ను విజయాలు వరించడం మొదలుపెట్టాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... విజయాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న మరో ప్రేమకథ ‘చిన్నదాన నీ కోసం’. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి మాట్లాడుతూ-‘‘కరుణాకరన్ మార్క్ స్టోరీ ఇది. నితిన్ గత విజయాలకు దీటుగా ఈ సినిమా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెల 27న పాటల్నీ, డిసెంబర్ 19న సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మిస్తీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఐ.ఆండ్రూ, సమర్పణ: విక్రమ్ గౌడ్. -
ముఖేష్ గౌడ్ కుమారుడు పై కేసు నమోదు
-
ముఖేష్ తనయుడి వీరంగం, కేసు నమోదు
మాజీ మంత్రి, గోషామహల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బుధవారం గౌలిగూడలో వీరంగం వేశాడు. తన తండ్రికి అనుకూలంగా ఓటు వేయ్యలేదంటూ బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగాడు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లలోకి వచ్చి విక్రమ్ గౌడ్ తమపైన, తమ కుటుంబసభ్యులపైన దాడి చేశాడని వారు అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దాంతో విక్రమ్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.