హైదరాబాద్ : కాల్పుల కేసులో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే సొంత పూచీకత్తుతో పాటు పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని సూచించింది. కాగా గత నెల 28న తనపై కాల్పులు జరిగాయంటూ విక్రమ్ గౌడ్ నాటకం ఆడిన విషయం విదితమే. ఆయన సుపారీ ఇచ్చి మరీ తనపై కాల్పులు జరుపించుకున‍్నారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.