మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై జరిగిన కాల్పుల కేసు కొలిక్కి వస్తోంది. ఈ వ్యవహరం వెనుక అనంతపురానికి చెందిన ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి నాటికి అనంతపురం జిల్లాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నాయి. అతడు ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. సూత్రధారి చిక్కితేనే ఈ కేసులో చిక్కుముడులు వీడే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. శనివారం విక్రమ్‌గౌడ్ ఇచ్చిన వాంగ్మూలం, ఆయన ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో లభించిన ద్విచక్ర వాహనం ఆనవాళ్లు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక మరికొందరు ఉన్నారని భావించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందాలు సోమవారం అనంతపురంలో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాయి.
Published Tue, Aug 1 2017 6:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement