
విక్రం గౌడ్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ సిటీ: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన ఇద్దరూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామానికి చెందిన మంచింటి వెంకట రమణ(38), కదిరి మండలం నిజాముల్ కాలనీకి చెందిన షేక్ మహ్మాద్ గౌస్(33)లని పోలీసులు తెలిపారు. కాల్పుల సంఘటన జరిగిన రోజు నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీళ్లిద్దరినీ పట్టుకుని రిమాండ్‌కు తరలించామని అధికారులు చెప్పారు.
(తనపై కాల్పులకు పథకం రచించింది విక్రమ్‌గౌడే)