పోలీసుల కస్టడీలో విక్రమ్‌గౌడ్
Published Wed, Aug 9 2017 12:12 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
హైదరాబాద్: సుపారీ ఇచ్చి మరీ తనపై కాల్పులు జరుపించుకున్న విక్రమ్ గౌడ్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసును పూర్తిగా చేధించామని ప్రకటించినా ఇందులో మరికొన్ని ట్విస్టులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు విక్రమ్‌గౌడ్‌ను బుధవారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు.
ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. వారిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విక్రమ్ సహా ఐదుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు లాయర్ సమక్షంలో నిందితులను పోలీసులు విచారించనున్నారు.
Advertisement
Advertisement