
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన యువతి కేసులో విచారణను వేగవంతం చేశారు. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మందిని ఇదివరకే విచారించారు. అనంతరం ప్రధాన నిందిడుడైన రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతన్ని శుక్రవారం సీసీఎస్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని.. నగరంలోని నాంపల్లి కోర్టుకు తరలించారు.
డాలర్ బాయ్ ఒక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడుపై 376, 184, 185,509, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. యువతి వాంగ్మూలం ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని వివరాల కోసం అతన్ని రిమాండ్‌లోకి తరలించే అవకాశం. కాగా యువతి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment