సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు రెండవ రోజు విచారిస్తున్నారు. నిన్న(సోమవారం) ఏసీపీని అరెస్టు చేసిన అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీలోని సర్వే నెంబర్ 64లో 2 వేల గజాల భూ వివాదంపై ఇవాళ(మంగళవారం) నర్సింహారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: రియల్ ఎస్టేట్ పేరిట కోట్లు గడించిన ఏసీపీ)
అయితే ఏసీపీ పలువురు రియల్టర్లతో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్ బిజినెస్‌లో 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు విచారణలో తెలిసింది. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులను కూడా విచారించిన ఏసీబీ అధికారులు హైటెక్ సిటీలోని రెండు గజాల ప్రభుత్వ భూ వివాదంలో పలు రెవెన్యూ అధికారులను కూడా విచారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment