narsimha reddy
-
రెండుసార్లు ఎమ్మెల్యే అయినా అద్దె ఇంట్లోనే..
సాక్షి,యాదాద్రి: ఓ దఫా కౌన్సిలర్‌గా గెలిస్తే చాలు.. రూ.కోట్లు కూడగట్టేసుకుంటున్న నేటి రోజుల్లో ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు కూడా కూడగట్టుకోలేని నిజాయితీకి నిలువుటద్దం కొమ్మిడి నర్సింహారెడ్డి. సర్పంచ్‌గా ప్రజా జీవితం ప్రారంభించి, సమితి ప్రెసిడెంట్‌గా, భువనగిరి ఎమ్మెల్యేగా రెండు దఫాలు సేవలందించిన కొమ్మిడి ప్రజా సమస్యలే ఎజెండాగా ఎంచుకున్న నిస్వార్థ రాజకీయనాయకుడు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నా మర్రి చెన్నారెడ్డి లాంటి వారి కోటరీలో ఉన్నా తనకంటూ ప్రత్యేకంగా ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. చివరకు అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్న కొమ్మిడి ఆదర్శ ప్రస్థానం ఓసారి చూద్దాం రండి. ఎన్టీఆర్ ప్రభంజనాన్నీ ఎదుర్కొని గెలిచి.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి నర్సింహారెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. తొలిదశ తెలంగాణ పోరాటసమయంలో 1969లో బ్రాహ్మణ పల్లి సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ› నుంచి భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1983లో ఎన్టీ.రామారావు టీడీపీ ప్రభంజనంలో కూడా ఆయన రెండవ సారి భువన గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డబ్బులు లేవని పోటీకి దూరం 1985 మధ్యంతర ఎన్నికల్లో కొమ్మిడి నర్సింహారెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి తప్పుకున్నారు. 1978 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ఖర్చు సుమారు రూ.7 వేలు కాగా, రెండోసారి ఎన్నికల నాటికి ఆ ఖర్చు రూ.2 లక్షలకు పెరిగింది. మూడోసారి పోటీ చేసే అవకాశం ఉన్నా.. డబ్బు లేదని పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఆ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పోటీ చేయమని కోరినా కొమ్మిడి నర్సింహారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పరిహారం వస్తే ఇల్లు కట్టుకుంటా నా సొంత భూమి బొల్లేపల్లి కాల్వ తవ్వడం కోసం ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న భూమికి పరిహారం డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుంటా. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా. సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పరిహారం డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి భూ పరిహారం డబ్బులు ఇప్పించాలి. – కొమ్మిడి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూములను పేదలకు పంచారు బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో తన వాటాగా వచ్చిన సాగు భూమిని నర్సింహారెడ్డి పేదలకు పంచారు. 83 సంవత్సరాల వయసులో సైతం ఆయన ఇప్పటికీ దీర్ఘకాలిక ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. భువనగిరి ప్రాంత సమస్యలతో పాటు రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా చేసుకుని పోరాటం కొనసాగిస్తున్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. గోదావరి నదీ జలాల సాధన, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యం నివారణ, నిమ్స్, సీసీఎంబీ కోసం గతంలో ఆమరణ దీక్ష చేశారు. గతంలో స్కూటర్‌పైనే ప్రయాణం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నర్సింహారెడ్డి వాహనం బజాజ్ చేతక్‌ను ఉపయోగించేవారు. వృద్ధాప్యం వల్ల ప్రస్తుతం స్కూటర్‌ను వాడడం లేదు. అప్పట్లో అసెంబ్లీ, సీఎం ఇల్లు, సచివాలయం, అధికారుల వద్దకు ఎక్కడికి వెళ్లినా ఆయన తన స్కూటర్ పైనే వెళ్లేవారు. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఎందరితోనో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నప్పటికీ.. ఎప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. తన ప్రజాసమస్యల పోరాట నావను ఆపలేదు. -
నాయిని.. గరీబోళ్ల లీడర్
కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జీవితాంతం పేదలు, కార్మికుల పక్షాన పోరాడి గరీబోళ్ల లీడర్‌గా చెరగని ముద్ర వేశారని మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. నాయిని ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సుభాష్‌రెడ్డి, సాయన్న, ఎమ్మెల్సీ ప్రభాకర్, ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్, నాయిని కుటుంబసభ్యులు, బంధువులు, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు పేదలకు విద్య, వైద్యసేవలు అందించేందుకుగాను నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్‌ను ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ లోగోను మహమూద్ అలీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 45 అంగన్వాడీ సెంటర్లకు కార్పెట్ల ను అందజేశారు. ఫౌండర్‌గా సమతారెడ్డి, వైస్ చైర్మన్‌గా నాయిని దేవేందర్‌రెడ్డి కొనసాగుతారు. -
చీటింగ్ కేసు: నాపై అన్యాయంగా కేసు నమోదు చేశారు
సాక్షి, హైదరాబాద్: రూ.100 కోట్ల విలువైన స్థలం అభివృద్ధి పేరుతో ఖాజాగూడ వాసి సింధూర రెడ్డిని నమ్మించి రూ.85 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో యాంకర్ శ్యామల భర్త లక్ష్మీ నర్సింహ్మారెడ్డితో పాటు అరెస్టు అయిన తిలక్‌నగర్ వాసి మట్ట జయంతి గౌడ్ గురువారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. అందులో జయంతి మాట్లాడుతూ... ‘నా తప్పు ఏమీ లేదు. అనుకోని పరిస్థితుల్లో రెండు నెలల క్రితం నర్సింహ్మారెడ్డి నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఓ అమ్మాయి నాకు కాల్ చేసి వేధిస్తోంది అని చెప్తే మాములుగా ఆమెకు కాల్ చేశాను. అప్పుడు ఆ అమ్మాయే నన్ను వేధించిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నర్సింహ్మారెడ్డిని తీసుకువెళ్లి రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఆ అమ్మాయిపై ఫిర్యాదు ఇప్పించా.. మా ఫిర్యాదును పక్కన పెట్టిన పోలీసులు అంతకు ముందు ఆ అమ్మాయి ఇతడిపై ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆమె అనేక మంది నుంచి ఇలానే డబ్బులు తీసుకుంటోంది. నేను ఆమెకు రెండుసార్లు కాల్ చేస్తే ఆమె నాకు నాలుగు సార్లు కాల్ చేసింది. ఆమె బండారం బయటపడకుండా ఉండటానికి మాపై కేసు నమోదు చేయించింది. మాకు న్యాయం చేయకపోతే కమిషనర్‌ను కలుస్తానంటూ పోలీసుస్టేషన్లో చెప్పాను. దీంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులు ఆమె ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేయకుండా నాపై చర్యలు తీసుకున్నారు’ అని ఆరోపించారు. అయితే జయంతి చేస్తున్న ఆరోపణలను రాయదుర్గం పోలీసులు ఖండిస్తున్నారు. సింధూర రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. చదవండి: దారుణం: రూ.15 వేల కోసం.. అమ్మకానికి కూతురు -
చీటింగ్ కేసు : వీడియో రిలీజ్ చేసిన యాంకర్ శ్యామల భర్త
ఓ మహిళ నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు నుంచి బెయల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, మరో రెండు రోజుల్లో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తుందని చెప్పారు. 'నాకు చట్టాలు, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నాపై పెట్టింది తప్పుడు కేసేనని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అన్ని సాక్షాలతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మీకే తెలుస్తుంది నాపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని. కొన్నిసార్లు మనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. వీటిలో నిజనిజాలేంటో ఫ్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు' అంటూ నర్సింహారెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకున్న నర్సింహారెడ్డి ఇప్పటిదాకా తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది.కాగా ఇదే విషయంపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. కాగా బెయల్‌పై విడుదలైన నర్సింహారెడ్డి తాజాగా తనపై పెట్టింది తప్పుడు కేసంటూ వీడియోలో పేర్కొన్నాడు. చదవండి : మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ 'బిగ్‌బాస్ తర్వాత అందుకే మాకు ఛాన్సులు రాలేదు' -
మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ గురువారం పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డిని ఏసీబీ విచారించింది. కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. నర్సింహారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు , బినామీలను ఏసీబీ విచారించింది. నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకున్నారు. హైటెక్ సిటీలో సర్వే నెంబర్ 64లో ఉన్న 2వేల గజాల భూమిని తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నట్లు విచారణలో తేలింది. 2 వేల గజాల భూమిని ఏసీబీ ప్రభుత్వ భూమిగా తేల్చింది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులను ఏసీబీ విచారించింది. తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు హోటల్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. చదవండి: అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి! -
2వ రోజు కొనసాగుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు రెండవ రోజు విచారిస్తున్నారు. నిన్న(సోమవారం) ఏసీపీని అరెస్టు చేసిన అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీలోని సర్వే నెంబర్ 64లో 2 వేల గజాల భూ వివాదంపై ఇవాళ(మంగళవారం) నర్సింహారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: రియల్ ఎస్టేట్ పేరిట కోట్లు గడించిన ఏసీపీ) అయితే ఏసీపీ పలువురు రియల్టర్లతో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్ బిజినెస్‌లో 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు విచారణలో తెలిసింది. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులను కూడా విచారించిన ఏసీబీ అధికారులు హైటెక్ సిటీలోని రెండు గజాల ప్రభుత్వ భూ వివాదంలో పలు రెవెన్యూ అధికారులను కూడా విచారించనున్నారు. -
ఏసీపీ నర్పింహారెడ్డి అక్రమాస్తుల గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం విచారిస్తున్నారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిగింది. నర్సింహారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాకలు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఏసీపీ పదవిని అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ రిమాండ్ నివేదికలో వెల్లడించింది. ఈ కేసులో ఎ2 నుంచి ఎ13 నిందితులంతా ఉద్దేశపూర్వకంగానే ఆయనకు సహకరించారని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ సర్వే నెంబర్ 64 లోని 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నిందితులు కబ్జా చేసి 2 వేల గజాల భూమిని 490 గజాల చొప్పున విభజించి.. నాలుగు డాక్యుమెంట్లు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు మొదట తండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. తర్వాత కొడుకుల పేరిట గిఫ్ట్ డీడ్‌గా మార్చారని, గిఫ్ట్ డీడ్ నుంచి నర్సింహారెడ్డి భార్య పేరుతో పాటు మరో నలుగురు బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. నర్సింహారెడ్డి 2 వేల గజాల భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా తెల్చినట్లు ఏసీబీ పేర్కొంది. అయితే ఈ భూమిపై ఎలాంటి హక్కు లేనప్పటికి నిందితులు ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు భారీ స్థాయిలో ఏసీపీ బీనామీ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లో నాలుగు నివాస గృహాలు, అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూములు నర్సింహారెడ్డి బీనామీల పేరిట ఉన్న ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డితో పాటు మరో 13 మందిని నిందితులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ఎ1 నిందితుడు ఏసీపీ నర్సింహారెడ్డి, ఎ2-గోపగాని రాజలింగం, ఎ3-గోపగాని సజ్జన్ గౌడ్, ఎ4- పోరేటి వెంకట్‌రెడ్డి, ఎ5-పోరేటి తిరపతి రెడ్డి, ఎ6- ఎర్ర శంకయ్య, ఎ7- ఎర్ర చంద్రశేఖర్, ఎ8- అర్జుల గాలిరెడ్డి, ఎ9-అర్జుల జైపాల్‌రెడ్డి, ఎ10-మధుకర్ శ్రీరామ్, ఎ11- చంద్రారెడ్డి, ఎ12- బత్తిని రమేష్, ఎ13- అలుగువెళ్లి శ్రీనివాస్‌రెడ్డిగా అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశామని మరో ఇద్దరూ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
‘గవర్నర్ కోటా’పై ఆశావహుల కన్ను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్ఎస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలుంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటాలో మండలికి ఎన్నిౖకైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయ న పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగి సింది. గతంలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 19న ముగిసింది. మండలిలో ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 17న ముగియనుంది. దీంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. మరోమారు నాయిని, కర్నెకు అవకాశం? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన నాయినికి మరోమారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు తిరిగి గవర్నర్ కోటాలో అవకాశం లభిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై నాయిని ఒకటి, రెండు సందర్భాల్లో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన అభ్యర్థిత్వ అవకాశాలపై ఎంతమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కర్నె ప్రభాకర్‌ను కూడా గవర్నర్ కోటాలో మండలికి సీఎం కేసీఆర్ మరోమారు నామినేట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఆశావహుల జాబితాలో ఇంకొందరు... గవర్నర్ కోటాలో ఒకేసారి మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహుల జాబితా కూడా పెరుగుతోంది. సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు రెండోవారంలో రాష్ట్ర కేబినెట్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశం ఉంది. -
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్
సాక్షి, సిద్ధిపేట : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్దిపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో హాజరు పరచగా, ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నర్సింహారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా అక్రమ ఆస్తుల ఆరోపణలతో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బినామీల ఇళ్లపై గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సిద్ధిపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్‌నగర్‌తో పాటు ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలోనూ దాడులు చేశారు. సోదాల్లో కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల 33వేలు నగదు, నర్సింహారెడ్డి బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గొల్కొండలో ఒక విల్లా, శంకర్‌పల్లిలో 14 ఫ్లాట్లు, జహీరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. రెండు కార్లు సీజ్ చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. -
సిద్దిపేట ఏఎస్పీ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సిద్దిపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవిందు నర్సింహారెడ్డి నివాసంపై, ఆయన స్వగ్రామం, అనుచరులు, అనుమానితులపై బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భూ పత్రాలు, బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సిద్దిపేటలో ఉన్న ఇంటితోపాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. బుధవారం తెల్లవారుజామున సిద్దిపేట సీపీ కార్యాలయంలోని ఏఎస్పీ చాంబర్‌తోపాటు ఆయన నివాసంలోను సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి భార్య అఖిలారెడ్డి పేరుపై ఉన్న 4 ఎకరాలతోపాటు వేరే వారి పేర్లపై ఉన్న మరో నాలుగెకరాల భూ పత్రాలతోపాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ల్లో ఉన్న వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలతోపాటు, ఇతర ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటి విలువ సుమారుగా రూ.30 కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. నర్సింహారెడ్డితో సన్నిహితంగా ఉండే వన్‌టౌన్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా సోదాలు చేసేందుకు వెళ్లగా ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుతిరిగారు. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. -
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ అయిదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,26,028 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఆయన ప్రత్యర్థి వేమిరెడ్డి(టీఆర్ఎస్)కి 5,00,346 ఓట్లు వచ్చాయి. నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో (2014) ఈ స్థానం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఒక దశలో కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత కనిపించింది. ఏఐసీసీ ఆదేశాలతో ఉత్తమ్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి గెలుపు తీరాలను చేరుకున్నారు. ఉత్తమ్.. ఆరోసారి! టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిలటరీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉత్తమ్ మొదటిసారి 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, 1999లో అదేస్థానం నుంచి ఆయన గెలుపొంది ఇక వెనుదిరిగి చూడలేదు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ కోదాడ నుంచి ఆయన విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించడం విశేషం. మొత్తం మీద వరుసగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలుపొందిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపును సాధించారు. టీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారు ‘తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అసహ్యించుకుంటున్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలే’ అని నల్లగొండ లోక్‌సభ స్థానం విజేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌లో అహంభావ ధోరణి పెరిగిందని, దాన్ని తెలంగాణ ప్రజలు సహించకనే ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజల్లో టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో పాటు వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. -
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేయనున్నారు. పదేళ్ల పాటు నల్గొండ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడిగా, సహా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు పీఆర్టీయూ టీచర్లతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి పీఆర్టీయూ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉంటారని ఇప్పటికే పీఆర్టీయూ ప్రకటించగా, ప్రస్తుతం నర్సింహారెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. -
ఇద్దరు అవినీతి ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులను సస్పెం డ్ చేస్తూ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. తాండూర్ సీఐ సైదిరెడ్డి, హుజూర్నగర్ సీఐ నర్సింహారెడ్డిలు అవినీతికి పాల్పడ్డట్లు అంతర్గత విచారణలో తేలింది. భారీస్థాయిలో ఇసుక దందాకు సహకరించడం, లారీలు, ట్రాక్టర్ల నుంచి డబ్బుల వసూళ్లు, గుట్కా కార్యకలాపాలు సాగిస్తున్న వారితో సంబంధాలు, మట్కా స్థావరాలు తెలిసినా కేసులు పెట్టకుండా మేనేజ్చేస్తూ రావడం లాంటి అంశాలపై పోలీసుశాఖ అంతర్గత విచారణ జరిపించింది. తాం డూర్ సీఐ సైదిరెడ్డి 3 హత్య కేసుల్లో నిందితులను కాపాడే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ తెలిపింది. సీఐ నర్సింహారెడ్డి ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను అధికారికంగా తొలగించి అనధికారికంగా వసూళ్లు చేస్తున్నట్లు రుజువైందని అధికారులు తెలిపారు. కాకినాడలో బెదిరిం పులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యా దు వచ్చిందని, దీనిపై విచారణ జరపగా నిజమేనని తేలిందన్నారు. వీరిద్దరిపై మౌఖిక విచారణకు ఆదేశించామని, బాధితులు ఎవరున్నా నేరుగా ఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. -
పోలీస్ కమిషనర్‌పై కేసు నమోదు
దుబ్బాక(సిద్దిపేట): సిద్దిపేట సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు వీరే కారణమని వారి కుమారుడు ప్రేమ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ప్రజాసంఘాలతో కలిసి దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన చిట్టిబాబు కుమారుడికి నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై ఐపీసీ 302, సీఆర్పీసీ 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు(శనివారం) దుబ్బాక బంద్‌కు పిలుపునిచ్చారు. -
ప్రజా పోలీస్... ప్రభుత్వ లక్ష్యం
సంగారెడ్డి మున్సిపాలిటీ: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు లండన్ తరహాలో నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇందుకోసం 3జీ, 4జీ టెక్నాలజీ గల వాహనాలతో పాటు గల్లీ గల్లీలో గస్తీ నిర్వహించేందుకు 1,500 మోటర్ సైకిళ్లు, 2వేల సీసీ కెమెరాలు ఉపయోగిస్తామన్నారు. గురువారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరాలను అరికట్టేందుకే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా సంఘటన జరిగితే 10 నిమిషాల్లోపు సంఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసు శాఖకు అధునాతన టెక్నాలజీ గల 1,650 ఇన్నోవా వాహనాలను సమకూరుస్తున్నామన్నారు. అంతేకాకుండా సున్నిత ప్రాంతాలకు పోలీసులు వేగంగా చేరుకునేందుకు 1,500 మోటర్ సైకిళ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. డీజీపీ, డీఐజీ పర్యవేక్షణలో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసి నేరాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లను మూసివేయించామని, జిల్లా స్థాయిలో కూడా అలాంటి క్లబ్‌లను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నిరంతర ప్రజాసేవలో ఉండే పోలీసులు కుటుంబంతో కలిసి ఓ రోజు గడిపేందుకు వారాంతపు సెలవు మంజూరు చేస్తున్నామన్నారు. పోలీసుల యూనిఫాంపై కూడా చర్చిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు ఎస్పీలకు ఉత్తర్వులిచ్చామన్నారు. జెన్కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని హోంమంత్రి తెలిపారు. జెన్కో ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అందువల్ల ప్రభుత్వమే జెన్కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుందని నాయిని తెలిపారు. నిధులు...నీరు...ఉద్యోగం తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ మేరకు పాలన ఉంటుందన్నారు. సమావేశంలో కార్మిక శాఖ జాయింట్ సెక్రటరీ అజయ్, డి ప్యూటీ సెక్రటరీ నరేశ్‌కుమార్, ఇన్చార్జి కలెక్టర్ శరత్‌లు ఉన్నారు. -
అజాత శత్రువుకు అశ్రునివాళి
అంత్యక్రియల్లో పాల్గొన్న అభిమానులు మంచిర్యాల అర్బన్ న్యూస్‌లైన్ : పార్లమెంట్ మాజీ సభ్యుడు గడ్డం సర్సింహరెడ్డికి అభిమానులు, రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, అధికారులు, పుర ప్రముఖులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న నర్సింహరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెం దిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని స్వగృహంకు తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీఎస్పీ రమణకుమార్, సీఐ సురేశ్, మంచిర్యాల, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు కమలాకర్‌రావు, కొత్త సత్తయ్య, మాజీ చైర్మన్లు పెంట రాజయ్య, బుచ్చన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు, కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగల దయానంద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరవింద్, మాజీ కౌన్సిలర్లు మినాజ్, రైసాభాను, సువ్వాబాయి, మమతా సూపర్ బజార్ చైర్మన్ యాదగిరిరావు, బీజేపీ నాయకుడు కెవీ ప్రతాప్, టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, పొన్నం మురళీధర్, మంచాల రఘువీర్, మాదం శెట్టిసత్యనారాయణ, గోగుల రవిందర్‌రెడ్డి, శ్యాంరావు, వెంకటేశ్వర్రావు, ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం నాయకుడు బాలాజీ, బంధువులు నర్సింహరెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన తన యులు ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, గంగారెడ్డి, అచ్యుతమ్త్రెడ్డిలకు సంతాపం ప్రకటించారు. ఓదార్పు నిచ్చారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించారు. స్థానిక గోదావరి తీరాన హిందు సాంప్రదాయం ప్రకారం వేద పండితులు శాస్త్రో్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు.