![Malkajgiri Former ACP Narsimha Reddy Taken in to Remind For 14 Days - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/8/ACP.jpg.webp?itok=FXBJ5nEt)
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ గురువారం పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డిని ఏసీబీ విచారించింది. కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. నర్సింహారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు , బినామీలను ఏసీబీ విచారించింది.
నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకున్నారు. హైటెక్ సిటీలో సర్వే నెంబర్ 64లో ఉన్న 2వేల గజాల భూమిని తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నట్లు విచారణలో తేలింది. 2 వేల గజాల భూమిని ఏసీబీ ప్రభుత్వ భూమిగా తేల్చింది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులను ఏసీబీ విచారించింది. తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు హోటల్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment