పోలీస్‌ కమిషనర్‌పై కేసు నమోదు | case filed on siddipet police commissioner shivakumar | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కమిషనర్‌పై కేసు నమోదు

Published Sat, Mar 4 2017 8:46 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

పోలీస్‌ కమిషనర్‌పై కేసు నమోదు

పోలీస్‌ కమిషనర్‌పై కేసు నమోదు

దుబ్బాక(సిద్దిపేట): సిద్దిపేట సీపీ శివకుమార్‌, ఏసీపీ నర్సింహారెడ్డిలపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు వీరే కారణమని వారి కుమారుడు ప్రేమ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు.

శుక్రవారం రాత్రి ప్రజాసంఘాలతో కలిసి దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేసిన చిట్టిబాబు కుమారుడికి నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్‌ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీ శివకుమార్‌, ఏసీపీ నర్సింహారెడ్డిలపై ఐపీసీ 302, సీఆర్‌పీసీ 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు(శనివారం) దుబ్బాక బంద్‌కు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement