chittibabu
-
వాల్తేరు చిట్టిబాబు
-
జనం లేరు.. షాక్‌లో సార్!
సాక్షి, తిరుపతి: నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా జన సమీకరణకు టీడీపీ నేతలు పడుతున్న తిప్పలు, సీనియర్ నాయకుల హెచ్చరికలు సాక్ష్యాధారాలతో బహిర్గతమయ్యాయి. కుప్పంలో మొదలైన లోకేశ్ పాదయాత్ర గురువారం గంగాధర నెల్లూరు నియోజక వర్గానికి చేరుకుంది. జన సమీకరణపై బుధవారం రాత్రి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరికలు చేశారు. ఈ ఆడియో లీక్ కావడంతో కలకలం రేగింది. సంభాషణ సాగిందిలా... చిట్టిబాబు నాయుడు (టీడీపీ గంగాధర నెల్లూరు ఇన్చార్జి): అన్నా డీఎస్పీ ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకుంటున్నా. మీరు చెప్పినట్లుగా ఉదయాన్నే వెయ్యి మంది వచ్చేందుకు వాహనాలు అరేంజ్ చేశా. రోజూ పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోపు ఆరు మండలాల్లోనూ 50 వాహనాలు ఏర్పాటు చేశా. 300 వాహనాలకు డబ్బులు కూడా ఇచ్చేశా. నాలుగు రోజులకు బుక్ చేశా. రోజూ 3 వేల మంది పాదయాత్రకు రావాలని చెప్పాం అన్నా. ► అచ్చెన్నాయుడు: మొన్న చూశారు కదా..! చిత్తూరులో చూసి నేను, సార్ (చంద్రబాబు) చాలా బాధపడ్డాం. ►చిట్టిబాబు నాయుడు: అన్నన్నా.. అలా జరగదన్నా. మా నియోజకవర్గంలో అలా జరగదన్నా. నేను చేస్తా. చిత్తూరులో ఏమైందో నాకు తెలియదు. ►అచ్చెన్నాయుడు: ఏంటంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలో జనం ఉండడం లేదు. పలుచగా ఉంటున్నారు. సాయంత్రం మాత్రం ఓ మోస్తరుగా వస్తున్నారు. జనం పలుచబడడం అనేది ఉండకూడదు. ఒక గ్రామం నుంచి వచ్చిన వారు మరో గ్రామం వరకు వచ్చేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. ►చిట్టిబాబు నాయుడు: అలాగే అన్నా. ప్రతి కిలోమీటర్‌కు వెల్కమ్ పాయింట్లు ఏర్పాటు చేశా. అలా 10 ఏర్పాటు చేశానన్నా. వెల్కమ్ పాయింట్ల వద్ద వెయ్యి మంది ఉండేలా చూస్తున్నాం. డ్రమ్స్, మైక్‌లు ఉంటాయి. వచ్చిన వారికి మజ్జిగ ఇస్తున్నాం. పూలు చల్లడం, టపాకాయలు కాల్చడం, అక్కడే మహిళలు వచ్చి హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు కొట్టడం.. ఇవన్నీ ప్రతి జంక్షన్లో చేస్తున్నాం అన్నా. తమిళనాడు నుంచి జెండాలు కట్టేందుకు 5 వేల పైపులు తీసుకొచ్చాం. 14 కి.మీ జెండాలు కడతాం అన్నా. ►అచ్చెన్నాయుడు: ఓకే ఓకే.. థ్యాంక్యూ థ్యాంక్యూ. ఏదైనా ఉంటే నాకు చెప్పు. మండల, యూనిట్ ఇన్చార్జీలు బాధ్యత తీసుకోవాలి. జనం మొబిలైజేషన్ లేకపోతే మాకు తెలుస్తుంది. వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో మాదిరిగా కాకుండా విజయవంతం చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీ అందరికీ నమస్కారం. -
చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడిన ఎమ్యెల్యే చిట్టిబాబు
-
ఎగ్జిక్యూటివ్ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సోమవారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగసంఘాల నేతలు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, జీవీఎంసీ సంఘం నేత ఆనందరావు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణా: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సోమవారం ప్రవేశపెట్టడంతో మద్దతుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలోని కైకలూరు తాలూకా సెంటర్ దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు శ్రీకాకుళం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా జిల్లాలోని నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ధర్మన పద్మప్రియ ఆధ్వరంలో సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి: మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సుకుమార్ సినిమాలో చరణ్ పేరేంటో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాపికొండలు ప్రాంతంలో జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర పేరు కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు చిట్టిబాబు అన్న ప్రచారం జరుగుతోంది. సినిమా పేరులో కూడా ఇదే ఫ్లేవర్ కనిపించేలా రేపల్లె పెట్టే ఆలోచన చేస్తున్నారట. పూర్తి క్లాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ కెరీర్లో మరో మైల్ స్టోన్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. -
రూ.5వేలు ఎస్ఐ ప్రాణాలు తీశాయా?
► చిట్టిబాబు ఆత్మహత్య వెనుక అసలు రహస్యం ఏంటి? ► నెలనెలా డబ్బు ఇవ్వాలని చెప్పిన ‘సారు’ ► క్షేత్రస్థాయికి చేరవేసిన పోలీసు సిండికేటు గ్రూపు ► డబ్బుల్వికపోవడంతోనే కక్షగట్టిన ఉన్నతాధికారి ► ఆయనతో ఘర్షణ పడిన ఎస్ఐ ► ఈ నేపథ్యంలోనే బలవన్మరణం రూ.5వేలు దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు ఉసురు తీశాయా..? ఆయన ఆత్మహత్యకు రూ..5 వేలే కారణమా..? నెల నెలా ఆ డబ్బు ఇవ్వలేకనే చిట్టిబాబు అధికారులతో ఘర్షణ పడ్డారా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే వినిపిప్తోంది. ఒక్క చిట్టిబాబు ప్రాణాలు మాత్రమే కాదు.. ఈ రూ.5వేలు జిల్లాలో మరికొందరు ఎస్ఐలను బలి తీసుకునేలా ఉంది. ఉన్నతాధికారులు పోలీసు శాఖను ప్రక్షాళన చేయకపోతే యువ పోలీసు అధికారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. సాక్షి, సిద్దిపేట : గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పోలీసుస్టేషన్ నుంచి ‘పెద్ద సారు’కు లిక్కర్ మామూళ్ల కింద నెలకు రూ.5 వేలు, 100 లీటర్ల డీజిల్ ఇవ్వాలనే చట్ట విరుద్ధమైన నిబంధన అమల్లోకి వచ్చింది. సిండికేటు గ్రూపులోని ఓ ఎస్ఐ, ఒక సీఐ ఈ నిబంధనను క్షేత్రస్థాయి ఎస్హెచ్ఓలకు, ఎస్ఐలకు చేరవేశారు. కొంతమంది ఎస్ఐలు దీన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. మరి కొంతమంది ఎస్ఐలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలిసింది. మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘన చేయడం లేదని, ఎమ్మార్పీ వయొలేషన్ లేకుండా వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం కుదరదని, బలవంతం చేస్తే వ్యాపారులు ఏసీబీని ఆశ్రయిస్తే తమ భవిష్యత్తుకు నాశనం అవుతుందని కొందరు తెగేసి చెప్పినట్టు తెలిసింది. ఎమ్మార్పీ ఉల్లంఘన లేకుంటే బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, వాటి మీద దృష్టి సారించి, దాడులు చేసి వ్యాపారులను లొంగదీసుకోవాలని, సిండికేటు గ్రూపు పోలీసులు సలహా ఇచ్చినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగానే బెల్టు దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సెట్ కాన్ఫరెన్స్‌ల్లో బెల్టు దుకాణాలు, ఇసుక రవాణాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారని, క్రైం రివ్యూకు అతి తక్కువ సమయం కేటాయించే వారని తెలుస్తోంది. ఉన్నతాధికారి ఉద్దేశాన్ని అర్ధం చేసుకున్న కొంత ఎస్ఐలు గొడవలు ఎందుకులే అనే ఆలోచనతో రూ.5 వేల ఇచ్చి.. ‘సారు’ స్టేషన్ పర్యవేక్షణకు వచ్చిన ప్రతిసారీ వాహనంలో డీజిల్ పోసి చేతులు దులుపుకొన్నారు. కాగా ఇందుకు నలుగురైదుగురు ఎస్ఐలు మాత్రం ఒప్పుకోనట్లు తెలిసింది. మొదటినుంచి చిట్టిబాబు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మనుసులో పెట్టుకున్న సదరు ఆ జిల్లా అధికారి మండలంలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, ఇసుక అక్రమ రవాణా నడుస్తుందని వీటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నామని సెట్ కాన్ఫరెన్స్‌లో నిలదీసినట్టు సహచర పోలీసుల ద్వారా తెలుస్తోంది. తన పోలీసుస్టేషన్ పరిధిలో ఎలాంటి బెల్టు దుకాణాలు నడవడం లేదని, దాదాపు 60 మందికిపైగా కేసులు పెట్టానని, అనుమతిస్తే పీడీ యాక్ట్ పెట్టడానికైనా సిద్ధమే అని ఆ ఉన్నతాధికారికి చెప్పినట్టు సమాచారం. దీన్ని మనుసులో పెట్టుకున్న పై అధికారి ఆయన శిక్షణ కోసం వెళ్లిన సమయంలో స్పెషల్ పార్టీ పోలీసులతో దుబ్బాక పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అదేపనిగా అన్వేషణ చేయించి, చివరికి తిమ్మాపూర్ అనే గ్రామంలో ఒక గీత కార్మికుని ఇంట్లో ఉన్న మద్యం సీసాలు పట్టుకొని కేసు చేసినట్టు తెలిసింది. ఇదే ప్రధాన కారణంగా చూపిస్తూ చిట్టిబాబునును సస్పెండ్ చేసి సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకోవాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఇదే అంశాన్ని తను ఆత్మహత్య చేసుకోవటానికి కంటే మూడు గంటల ముందు ఎస్ఐ చిట్టిబాబు స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దృష్టికి తీసుకుపోయారని, సస్పెండైయితే తల ఎత్తుకోలేనని, తనను ఎలాగైనా కాపాడాలని కోరినట్టు తెలసింది. దీనిపై స్పందించిన రామలింగారెడ్డి తాను రాంసాగర్ గ్రామంలో ఉన్నానని, వెంటనే ఇక్కడకు రమ్మని, అవసరమైతే ఇక్కడి నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. తన భార్య సరోజను ఇంటి వద్ద దించేసి వస్తానని ఎమ్మెల్యేతో చెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇంతలోనే ఆయన తన భార్యను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా సదరు ఉన్నతాధికారి తల ఎగిరేసి నిలబడిన ఎస్ఐలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నామని కొందరు ఎస్ఐలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులను రక్షించేందుకు ప్రయత్నం చేయడంకంటే విచారణ అధికారులు వాస్తవ పరిస్థితులను వెలికితీసి పోలీసుశాఖను బతికించాలని వారు కోరుతున్నారు. -
పోలీస్ కమిషనర్‌పై కేసు నమోదు
దుబ్బాక(సిద్దిపేట): సిద్దిపేట సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు వీరే కారణమని వారి కుమారుడు ప్రేమ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ప్రజాసంఘాలతో కలిసి దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన చిట్టిబాబు కుమారుడికి నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై ఐపీసీ 302, సీఆర్పీసీ 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు(శనివారం) దుబ్బాక బంద్‌కు పిలుపునిచ్చారు. -
పోలీసులపై హత్య కేసు పెట్టాలి
సీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో అక్టోబర్‌లో జరిగిన బూటకపు ఎ¯ŒSకౌంటర్‌కు సంబంధించి పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు వి చిట్టిబాబు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఆ ఎ¯ŒSకౌంటర్‌కు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం సీఎల్సీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఓగూరి బాలాజీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ అక్టోబర్ 24 నుంచి 27వ తేదీ వరకూ పోలీసులు నిర్వహించిన బూటకపు ఎ¯ŒSకౌంటర్లో 32 మంది మృతి చెందారన్నారు. ఎ¯ŒSకౌంటర్ పేరుతో పోలీసులు వారిని హత్య చేశారన్నారు. వారిలో 9 మంది సాధారణ ఆదీవాíసీలు ఉన్నారన్నారు. వివిధ రాష్ట్రాల హక్కుల సంఘాల ప్రతినిధుల బృందం 32 మంది నవంబరు 6, 7 తేదీల్లో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, అటవీ గ్రామాల్లోని ఆదివాసీలను కలుసుకుని సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను కలిసి వాస్తవాలు తెలుసుకున్నామన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు కార్పొరేట్ చేతుల్లో బందీలుగా మారిపోయారన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించేవన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే వినే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ సహజ వనరులు బాక్సైట్‌ను విదేశీయులకు దోచిపెట్టేందుకే ఎ¯ŒSకౌంటర్లు చేస్తున్నారన్నారు. తొండంగి, పోలవరం తదితర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలను అణచిపెట్టడం కోసమే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియ¯ŒS రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ఏఓబీలో జరిగిన ఎ¯ŒSకౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జా¯ŒSరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు రమణ, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె మనోహర్ పాల్గొన్నారు. పోటీగా పోలీసు కుటుంబాల ఆందోళన.... ఒక పక్క సమావేశం జరుగుతుంటే... మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన కుటుంబాల పరిస్థితి ఏంటని పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు అంబేద్కర్ భవ¯ŒS వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మేమూ బాధితులమే... మాకూ న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు పోలీసు కుటుం» సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
దర్యాప్తు మిస్సింగ్
అనంతపురం జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న పెద్దన్నకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఒకరైన శిల్ప కర్నూలు దేవనగర్లోని నారాయణమ్మ వసతిగృహంలో ఉంటూ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. డిసెంబర్ 21, 2012న కాలేజీకి వెళ్లిన ఈ యువతి అదృశ్యమైంది. జనవరి 2, 2013న తల్లిదండ్రులు కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే కళాశాలలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్న చిట్టిబాబుపై అనుమానం వ్యక్తం చేసినా.. ఇతను కానిస్టేబుల్ కుమారుడు కావడంతో దర్యాప్తును తొక్కిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిల్ప తల్లిదండ్రులు నవంబర్ 11, 2013న ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించారు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీ వీడకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అదృశ్యం కేసుల్లో పోలీసుల అలసత్వానికి ఇదో ఉదాహరణ మాత్రమే. కర్నూలు, న్యూస్‌లైన్: మతిస్థిమితం సరిగా లేకపోవడం..చదువుపై అనాసక్తి.. ప్రేమించిన వారిని విడిచి ఉండలేకపోవడం.. కారణం ఏదైతేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయేవారు ఇటీవల ఎక్కువయ్యారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. అయితే వాటిని ఛేదించడంలో ఆ శాఖ సిబ్బంది ఉత్సాహం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో గతేడాది 119 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 388 మంది మహిళలు తప్పిపోగా తిరిగి ఇళ్లకు చేరుకున్న సంఖ్య అంతంత మాత్రమే. కేసు నమోదు చేసుకుని పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప విచారణపై పోలీసులు ఆసక్తి చూపడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో వివాహితలు ఎక్కువగా కనిపించకుండా పోతున్నారు. పట్టణాల్లో ఉపాధి కల్పిస్తామని ఆశ పెట్టి కొందరు దళారులు వ్యభిచార కూపంలోకి మహిళలను నెడుతున్నారు. వివిధ కారణాల రీత్యా ఇంటి నుంచి బయటికి వెళ్లి అష్టకష్టాలు పడి కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యుల శ్రమతో ఇంటికి చేరుతున్నారు. పోలీసులు విచారణ జరిపి తప్పిపోయిన వారిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించిన కేసులు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ల నుంచి పరారీ అవుతున్నారు. గత నాలుగేళ్లలో 364 మంది ఆడపిల్లలు తప్పిపోగా 324 మంది తిరిగి ఇంటికి చేరుకున్నారు. 40 మంది బాలికలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళనలతో పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.