సుకుమార్ సినిమాలో చరణ్ పేరేంటో తెలుసా..? | ram charan as chittibabu in sukumar movie | Sakshi
Sakshi News home page

సుకుమార్ సినిమాలో చరణ్ పేరేంటో తెలుసా..?

Published Sun, Apr 23 2017 2:31 PM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

సుకుమార్ సినిమాలో చరణ్ పేరేంటో తెలుసా..?

సుకుమార్ సినిమాలో చరణ్ పేరేంటో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాపికొండలు ప్రాంతంలో జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా మాస్ లుక్లో కనిపిస్తున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర పేరు కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు చిట్టిబాబు అన్న ప్రచారం జరుగుతోంది. సినిమా పేరులో కూడా ఇదే ఫ్లేవర్ కనిపించేలా రేపల్లె పెట్టే ఆలోచన చేస్తున్నారట. పూర్తి క్లాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలుస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement