- సీఎల్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు
పోలీసులపై హత్య కేసు పెట్టాలి
Published Thu, Dec 29 2016 11:28 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో అక్టోబర్‌లో జరిగిన బూటకపు ఎ¯ŒSకౌంటర్‌కు సంబంధించి పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (సీఎల్‌సీ) రాష్ట్ర అధ్యక్షుడు వి చిట్టిబాబు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఆ ఎ¯ŒSకౌంటర్‌కు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం సీఎల్‌సీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఓగూరి బాలాజీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ అక్టోబర్ 24 నుంచి 27వ తేదీ వరకూ పోలీసులు నిర్వహించిన బూటకపు ఎ¯ŒSకౌంటర్‌లో 32 మంది మృతి చెందారన్నారు. ఎ¯ŒSకౌంటర్ పేరుతో పోలీసులు వారిని హత్య చేశారన్నారు. వారిలో 9 మంది సాధారణ ఆదీవాíసీలు ఉన్నారన్నారు. వివిధ రాష్ట్రాల హక్కుల సంఘాల ప్రతినిధుల బృందం 32 మంది నవంబరు 6, 7 తేదీల్లో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, అటవీ గ్రామాల్లోని ఆదివాసీలను కలుసుకుని సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను కలిసి వాస్తవాలు తెలుసుకున్నామన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు కార్పొరేట్ చేతుల్లో బందీలుగా మారిపోయారన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించేవన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే వినే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ సహజ వనరులు బాక్సైట్‌ను విదేశీయులకు దోచిపెట్టేందుకే ఎ¯ŒSకౌంటర్లు చేస్తున్నారన్నారు. తొండంగి, పోలవరం తదితర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలను అణచిపెట్టడం కోసమే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియ¯ŒS రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ఏఓబీలో జరిగిన ఎ¯ŒSకౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జా¯ŒSరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు రమణ, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె మనోహర్ పాల్గొన్నారు.
పోటీగా పోలీసు కుటుంబాల ఆందోళన....
ఒక పక్క సమావేశం జరుగుతుంటే... మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన కుటుంబాల పరిస్థితి ఏంటని పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు అంబేద్కర్ భవ¯ŒS వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మేమూ బాధితులమే... మాకూ న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు పోలీసు కుటుం» సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement