ఎగ్జిక్యూటివ్‌ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం | Employees Union Leaders Happy On Visakhapatnam Executive Capital Bill | Sakshi
Sakshi News home page

ఎగ్జిక్యూటివ్‌ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం

Published Mon, Jan 20 2020 5:28 PM | Last Updated on Mon, Jan 20 2020 5:41 PM

Employees Union Leaders Happy On Visakhapatnam Executive Capital Bill - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సోమవారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌గా ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగసంఘాల నేతలు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, జీవీఎంసీ సంఘం నేత ఆనందరావు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

కృష్ణా: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును  సోమవారం ప్రవేశపెట్టడంతో మద్దతుగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు జిల్లాలోని కైకలూరు తాలూకా సెంటర్‌ దగ్గర బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.
చదవండి: రాజధాని రైతులకు వరాలు

శ్రీకాకుళం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా జిల్లాలోని నరసన్నపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ధర‍్మన పద్మప్రియ ఆధ్వరంలో సోమవారం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్సార్‌ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు.

తూర్పు గోదావరి: మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పి గన్నవరం  నియోజకవర్గం అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement