shivakumar
-
సిక్స్ ప్యాక్‌తో కండలవీరుడుగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రియుడు (ఫోటోలు)
-
Afzalgunj Incident: కోలుకున్న ‘బీదర్ క్షతగాత్రుడు’
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని బీదర్‌లో ‘అఫ్జల్‌గంజ్ దుండగులు’ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శివకుమార్ నగరంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అంటూ చేసిన వీడియోను ఆయన సమీప బంధువు గురువారం విడుదల చేశారు. బీదర్‌లోని శివాజీ సర్కిల్ వద్ద గత గురువారం (ఈ నెల 16) ఉదయం భారీ దోపిడీ చోటు చేసుకుంది. బైక్‌పై వచి్చన ఇద్దరు దుండగులు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ సంస్థకు చెందిన వాహనంపై విరుచుకుపడ్డారు. ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డు, గన్‌మెన్ లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. కస్టోడియన్లుగా ఉన్న శివకుమార్, గిరి వెంకటే‹Ùలపై తుపాకీతో కాల్పులు జరిపి రూ.83 లక్షలతో ఉన్న అల్యూమినియం బాక్సు ఎత్తుకెళ్లారు. నాలుగు తూటాలు దిగిన వెంకటేష్ అక్కడిక్కడే చనిపోగా... ఛాతిలోకి ఓ తూటా దూసుకుపోయిన శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు రాత్రి వారు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ పైనా కాల్పులు జరిపిన ఇరువురూ పారిపోయారు. బీదర్ పోలీసులు తొలుత శివకుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారి సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న శివకుమార్ నాటి ఉదంతానికి సంబంధించిన వివరాలు చెబుతుండగా చిత్రీకరించిన ఓ వీడియోను ఆయన సమీప బంధువు శివయోగి కన్నడ మీడియాకు విడుదల చేశారు. అందులో శివకుమార్ చెప్పిన వివరాలివీ... ‘ఆ రోజు నగదు తీసుకుని సీఎంఎస్‌కు చెందిన చెస్ట్ నుంచి బయటకు వచ్చాం. ఇద్దరు దుండగులు నేరుగా మాపై దాడికి దిగారు. కస్టోడియన్‌గా ఉన్న నాతో పాటు నా సహచరుడి పైనా కాల్పులకు పాల్పడ్డారు. నేను తొలుత తప్పించుకున్నా.... వెంకటేష్‌పై కాల్పులు జరుపుతుండటంతో తుపాకీ చేతిలో ఉన్న వ్యక్తిని చూసి అరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశా. దీంతో అతడు నా వైపు గురిపెట్టి కాలి్చన తూటా నా ఛాతిలోకి దూసుకుపోయింది. ఇది నాకు పునర్జన్మ లాంటిది’ అని పేర్కొన్నారు.మళ్లీ తెరపైకి మనీష్ పేరు..అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసులు బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను సేకరించారు. వీటిని కర్ణాటక అధికారులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా మాదిరిగా ఉన్నాడు అంటూ బీహార్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడే సూత్రధారిగా రెండు నేరాలు జరిగినట్లు భావించారు. అతడి కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. అయితే గత శుక్రవారం రాత్రి బీహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వారు వాటిని చూసి తమ కుమారుడు కాదని చెప్పడంతో ఆ విషయాన్ని నగర పోలీసులకు చెప్పారు. దీంతో అతడు సూత్రధారి కాదనే ఉద్దేశంతో పోలీసులు మరికొన్ని కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా మహేష్ తల్లిదండ్రులు తమ కుమారుడిని రక్షించడానికి తప్పుదోవ పట్టించి ఉంటారనే అనుమానం పోలీసులకు వచ్చింది. దీనికితోడు మహేష్ ఆచూకీ సైతం లేకపోవడంతో అతడి పాత్రను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో మహేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. -
కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట!
తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు. కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు.ఇద్దరు నిందితుల అరెస్టు..టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. -
'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ
వచ్చే వారం దీపావళికి బోలెడన్ని పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దాదాపు అరడజనుకి పైగా చిన్న చిత్రాలు రిలీజయ్యాయి. వాటిలో ఓ మూవీనే 'నరుడి బ్రతుకు నటన'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)కథేంటి?సత్య (శివకుమార్) నటుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. యాక్టింగ్ నీకు చేతకాదని తండ్రి (దయానంద్ రెడ్డి) కాస్త పద్ధతిగా తిడతాడు. ఒక్కగానొక్క ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వరస్ట్ యాక్టర్ అని సత్య ముఖంపైనే చెబుతారు. దీంతో ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో కేరళ వెళ్లిపోతాడు. పరిచయమే లేని డి.సల్మాన్ (నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి ఇంట్లో ఇతడు ఉండాల్సి వస్తుంది. కేరళలో ఇతడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని మంచి ఫీల్ గుడ్ సినిమాలు చూసినప్పుడు.. అసలు మన దగ్గర కూడా ఇలాంటివి తీయొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సినిమాలు మహా అయితే ఓసారి చూడొచ్చు. హీరో కోసం ఇంకోసారి చూడొచ్చేమో గానీ ఫీల్ గుడ్ చిత్రాలు మళ్లీ మళ్లీ చూడొచ్చు. అలాంటి ఓ సినిమానే 'నరుడు బ్రతుకు నటన'. ఏంటి అంత బాగుందా అని మీరనుకోవచ్చు. నిజంగా చాలా బాగా తీశారు.నువ్వో వరస్ట్ యాక్టర్.. జీవితంలో కష్టాలు తెలిస్తేనే నువ్వో మంచి నటుడివి అవుతావ్ అని హీరో సత్యని ఫ్రెండ్ తిడతాడు. అంతకుముందు ఊరు పేరు తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ తిడతాడు. తండ్రి కూడా కాస్త పద్ధతిగా తిడతాడు. దీంతో కోపమొచ్చి కేరళ వెళ్లిపోతాడు. కాస్త డబ్బులు ఉండటం వల్ల కొన్నిరోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో డబ్బులు అడగాలంటే అహం. దీంతో చేతిలో ఉన్న ఫోన్ అమ్మాలనుకుంటాడు. అదేమో ఓ పిల్లాడు తీసుకుని పారిపోతాడు. అలా అన్ని కోల్పోయిన సత్యకి సల్మాన్ పరిచయమవుతాడు. అతడితో అన్ని షేర్ చేసుకుంటాడు. వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఏమో గానీ చూసే ప్రేక్షకుడికి చాలా విషయాలు నేర్పిస్తారు.డబ్బు ఉంటే చాలు.. జీవితం ఆనందంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయని ఈ సినిమాలో చూపించిన విధానం సూపర్. ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ అక్కడక్కడ కాస్త కామెడీ టచ్ చేస్తూ చివరకు ఓ మంచి అనుభూతి ఇచ్చేలా మూవీని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అసలు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు అని అందరితో తిట్టించుకున్న సత్య.. తనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ పలికిస్తాడు. చూస్తున్న మనం కూడా అతడితో పాటు ఫీల్ అవుతాం!చిన్న పాప ఎపిసోడ్, ప్రెగ్నెంట్ అమ్మాయి ఎపిసోడ్ మనల్ని భావోద్వేగాన్ని గురిచేస్తాయి. ఇక సల్మాన్ లవ్ స్టోరీ, మందు పార్టీ, వేశ్య దగ్గరకు వెళ్లిన సీన్స్‌లో సత్య-సల్మాన్ చేసిన సందడి నవ్విస్తుంది. చూస్తున్నంతసేపు ఓ మలయాళ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తగ్గట్లే అక్కడక్కడ మలయాళ పాటలు కూడా వినిపించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇవి వస్తున్నప్పుడు మనకు భాషతో ఇబ్బంది కూడా అనిపించదు. అంతలా లీనమైపోతాం. రెండు గంటల సినిమా అప్పుడే అయిపోందా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన శివకుమార్.. ఇందులో సత్యగా నటించాడు. హీరో అనడం కంటే మనలో ఒకడిలానే అనిపిస్తాడు. నితిన్ ప్రసన్న చేసిన డి.సల్మాన్ పాత్ర అయితే హైలైట్. సరదా సరదాగా సాగిపోతూనే చాలా విషయాలు నేర్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే దాదాపు కేరళలో షూటింగ్ అంతా చేశారు. సినిమా అంతా నేచురల్‌గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. దర్శకుడు రిషికేశ్వర్ మంచి పాయింట్ తీసుకున్నాడు. అంతే నిజాయతీగా ప్రెజెంట్ చేశాడు. కాకపోతే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకుని, మూవీని కాస్త ప్రమోట్ చేసుంటే బాగుండనిపించింది. ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అస్సలు మిస్సవొద్దు!రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ) -
తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.పెద్ద కుమారుడు శివకుమార్(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
టీడీపీకి శివకుమార్ వార్నింగ్
-
సరికొత్త టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. క్రేజీ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘అందుకోవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. 'మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు. లెజెండరీ సింగర్ చిత్ర మా పాటను పాడటం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అని అన్నారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా మూవీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి అందుకోవా అనే పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎబెనెజర్ పాల్ సంగీతమందిస్తున్నారు. -
పరీక్షకు ఆలస్యం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జైనథ్: పరీక్షకు ఆలస్యం కావడంతో ఆవేదన చెందిన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘జీవితంలో మొదటిసారి ఎగ్జామ్ మిస్సయ్యాను. క్షమించు నాన్నా..’అంటూ లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకాడు. గురువారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము, పంచపుల దంపతుల రెండో కుమారుడు శివకుమార్ (16). ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఇంటర్ సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మొదటి పరీక్ష ఉండగా.. ఉదయం 8.30గంటలకు గ్రామం నుంచి ఆటోలో ఆదిలాబాద్‌కు బయల్దేరాడు. మధ్యలో ఉండగా ఆలస్యం అవుతోందని ఆవేదన చెందాడు. ఆ సమయంలో ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ పరిచయమున్న వ్యక్తి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్‌చౌక్ వద్దకు చేరుకునే సరికే.. సమయం 9 గంటలు దాటిపోయింది. అక్కడే దిగిపోయిన శివకుమార్.. టీఎస్టీడబ్ల్యూ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆలస్యం కావడంతో పరీక్షకు రానివ్వరని దిగులు చెందాడు. ఆటో ఎక్కి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టు వద్ద ఆటో దిగాడు. సూసైడ్ నోట్ రాసి, దానితోపాటు చేతి వాచీ, పెన్ను, పర్సు వంటివి ఒడ్డుపై ఉంచి ప్రాజెక్టులో దూకేశాడు. కాసేపటికి దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మధ్యాహ్నం సమయంలో శివకుమార్ మృతదేహం లభ్యమైంది. ‘‘నాన్నా నన్ను క్షమించు.. నాకోసం ఎంతో చేశావు.. నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను.. జీవితంలో మొదటిసారి ఎగ్జామ్ మిస్ అయ్యాను..’’అని శివకుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పరీక్షకు ఆలస్యంగా వెళ్తే రానివ్వరనే ఆందోళనతో శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘నిమిషం నిబంధన వద్దు’.. దీని కారణంగానే ఇప్పుడిలా..
ఆదిలాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఐఈవో రవీందర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బీ రాహుల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి టేకం శివకుమార్ ‘నిమిషం’ నిబంధన కారణంగా పరీక్షకు దూరమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తూ శివకుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్‌కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్, ఏఎస్యూ జిల్లా కార్యదర్శి అశోక్, టీఎస్ఎఫ్ నాయకుడు సత్యనారాయణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సిడం సాయికుమార్, ఎస్వీఏ జిల్లా అధ్యక్షుడు గొప్లే సుజయ్, నాయకులు ఇఫ్తెఖార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి.. ఇంటర్ విద్యార్థి శివకుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీలో శివకుమార్ మృతదేహాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. నిమిషం నిబంధన వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆత్రం కిష్టన్న, లక్ష్మణ్ తదితరులున్నారు. ఇవి చదవండి: హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్! -
ఆ బ్యాడ్‌న్యూస్ ఇదేనా? ప్రియాంకకు దూరంగా..
సీరియల్ నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక జైన్. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓసారి ప్రియుడు శివకుమార్ వచ్చినప్పుడు ఎమోషనలైంది నటి. పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడే, ఇక్కడే! అంటూ అతడిని క్షణం కూడా వదల్లేకపోయింది. అటు శివకుమార్ నీకో గుడ్‌న్యూస్, బ్యాడ్‌న్యూస్ రెండూ చెప్తానన్నాడు. షో అయిపోయాక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆ శుభవార్తను బయటపెట్టాడు. తాజాగా అతడు అమెరికా షిఫ్ట్ కాబోతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వీసా కోసం తిప్పలు అతడు చెప్తానన్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ప్రియాంకను వదిలి దూరంగా వెళ్లిపోతున్నాడా? అని అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక తన యూట్యూబ్ వీడియోలో వీసా పొందడానికి ఢిల్లీ వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడో వివరించాడు. శివకుమార్ మాట్లాడుతూ.. యూఎస్ ఎంబసీ ముందు వీడియోలు తీస్తే ఫోన్లు లాగేసుకుంటారట. అందుకని అక్కడ వీడియో చేయలేకపోయాను. కానీ మొదటి ప్రయత్నంలోనే వీసా వచ్చేసింది. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను. ప్రియాంకతో పాటు అమ్మ ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. 20 సెకన్లలోనే ఇంటర్వ్యూ అయిపోయింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఆమె న్యూయార్క్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అని అడిగింది. నేను తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. ఈ మధ్యే సీరియల్ అయిపోయింది. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నాను. ఈ సమయంలో న్యూయార్క్ వెళ్లి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. వార్షిక జీతం, ఎవరెవరు వెళ్తున్నారని అడిగింది. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. చివరకు వీసా అప్రూవ్ అని చెప్పడంతో సంతోషమేసింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది' అని చెప్పుకొచ్చాడు. అసలు శివకుమార్ అమెరికాకు వెకేషన్ వెళ్తున్నాడా? లేదంటే అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలున్నాయా? ఏంటనేది వీడియోలో స్పష్టంగా చెప్పలేదు. చదవండి: భర్తకు నళిని విడాకులు.. ఆ తర్వాత కూడా నాన్న కొట్టేవాడన్న నటి కూతురు -
ఆపరేషన్ థియేటర్లో బిగ్‌బాస్ ప్రియాంక.. ఏమైందంటే?
సీరియల్ ద్వారా బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జైన్. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ ద్వారా జనాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన ఆటతో, మాటలతో టాప్ 5లో చోటు దక్కించుకుంది. త్వరలోనే తన ప్రియుడు, నటుడు శివకుమార్‌ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ సీరియల్ నటి ఆస్పత్రిపాలైంది. ఆమెకు ఆపరేషన్ జరిగిందంటూ శివకుమార్ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏడో తరగతిలో సైట్.. 'ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. కళ్లు ఎర్రబడిపోయి, నొప్పితో విలవిల్లాడిపోయాను. లాసిక్ సర్జరీ చేశాక దాదాపు 8-10 గంటల పాటు కళ్లు తెరవలేము. ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటోంది' అని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. 'నాకు ఏడో తరగతిలో సైట్ వచ్చింది. అప్పటినుంచే కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇవి ధరించడం వల్ల ఇరిటేషన్ వస్తోంది. అందుకే సర్జరీ చేయించుకుందామనుకుంటున్నాను' అని చెప్పింది. కంటి ఆపరేషన్ సక్సెస్ తర్వాత తను ఆస్పత్రికి వెళ్లిన మొదటి రోజు నుంచి ఏమేం జరిగిందో వివరంగా వీడియోలో చూపించారు. శివకుమార్ ఆమె గురించి భయపడుతున్నా ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేసింది. చివరకు ఆస్పత్రిలో తన కంటి ఆపరేషన్ ఎలా చేశారన్నది కూడా వీడియోలో క్లియర్‌గా చూపించారు. మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రియాంకకు ఎట్టకేలకు దాన్నుంచి విముక్తి లభించింది. ఈ సర్జరీ విజయవంతమైందని, ఇక కళ్లజోడుతో తనకు పని లేదని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. చదవండి: ఒకప్పుడు జేబు నిండా నోట్ల కట్టలు.. చివరకు కారు డిక్కీలో తెలుగు కమెడియన్ శవం -
'అమ్మా.. ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను.. నీతోనే ఉంటానని' అనంత లోకాలకు
కరీంనగర్: ‘అమ్మ.. ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఇక నీతోనే ఉంటాను..’ అని చెప్పిన ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అనంతలోకాలకు వెళ్లాడు. రాజస్థాన్ డియోలి సీఐఎస్ఎఫ్ 16వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం జగ్గారావుపల్లికి చెందిన కానిస్టేబుల్ చాడ శివకుమార్(23) జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. గ్రామస్తులు, కుటంబసభ్యులు తెలిపిన వివరాలు. జగ్గారావుపల్లికి చెందిన చాడ భాగ్యమ్మ–గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు గంగారెడ్డి సిరిసిల్లలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు శివకుమార్ రెండేళ్ల క్రితం సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత డిసెంబర్ 16న కార్యాలయ పరిసరాల్లో శివకుమార్ ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయం కావడంతో రక్తం గడ్డ కట్టి శివకుమార్ కోమాలోకి వెళ్లాడు. చికిత్స పొందుతున్న శివకుమార్ సోమవారం మృతిచెందినట్లు జగ్గారావుపల్లి లోని కుటుంబ సభ్యులకు అక్కడి ఉద్యోగులు సమాచారం అందించారు. కొత్త సంవత్సరం రోజు గ్రామంలో విషాదం.. నూతన సంవత్సరం తొలి రోజే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శివకుమార్ మృతిచెందడంతో జగ్గారావుపల్లిలో విషాదం నెలకొంది. కానిస్టేబుల్‌గా ఎంపికై న శివకుమార్ పోస్టింగ్ వస్తే జిల్లాకు వచ్చేవాడు. కానీ కానిస్టేబుల్ ఫలితాలపై కోర్టులో కేసు ఉండడంతో పోస్టింగ్‌లు ఆగిన విషయం తెలిసిందే. శివకుమార్ మృతితో అతని స్నేహితులు, కుటుంబసభ్యులు విషన్నవదనంలో ఉన్నారు. మంగళవారం మృతదేహం స్వగ్రామానికి వస్తుందని తెలిపారు. ఇవి చదవండి: నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం! -
గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ..
తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. గత కొన్నేళ్లుగా నటుడు శివకుమార్‌తో ప్రేమలో మునిగి తేలుతోందీ నటి. ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో తాను శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు, అతడు హౌస్‌లోకి రాగానే పెళ్లెప్పుడు చేసుకుందాం.. బిగ్‌బాస్ అయిపోగానే భార్యాభర్తలుగా కొత్త జర్నీ మొదలుపెడదాం అంటూ ఎమోషనలైంది. అప్పుడే పెళ్లి అటు శివకుమార్ సైతం.. ప్రియురాలిని ముద్దులతో ముంచెత్తి ఆప్యాయంగా హత్తుకున్నాడు. బిగ్‌బాస్ 7లో టాప్ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మూహూర్తం ఫిక్స్ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని, అవన్నీ మరో వీడియోలో చెప్తానంది. శోభా పెళ్లి కూడా అప్పుడే! ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా తన జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక.. తన హెయిర్ ఇంకాస్త పొడుగ్గా అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంది. పనిలో పనిగా మరో సీక్రెట్ కూడా బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శోభా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సీక్రెట్ రివీల్ చేసింది. దీంతో అభిమానులు వీరిద్దరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: నాకోసం ఎవరూ ముందుకు రాలే.. దుస్తులు కొనుక్కునే స్థోమత లేక.. -
రేవంత్.. భట్టి.. ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్‌గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుంటారా? కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం. అమాత్యులెవరంటే...! మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు. ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. ఎంపికలో ఇవే కీలకం సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు. ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్‌లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
చాలా బాగుందే...
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చాలా బాగుందే...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, చైతు సత్సంగి, లిప్సిక పాడారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘తిరగబడర సామీ’. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలపై వచ్చే ‘చాలా బాగుందే..’ పాట మనసుని హత్తుకునే అద్భుతమైన మెలోడీగా సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి యంఎన్. -
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
రేవంత్, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వార్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లి డి.కె.శివకుమార్‌ను కలిసిన ఫొటోను పోస్టు చేస్తూ ‘అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడం’ అని కవిత ట్విట్టర్లో జత చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ దండం పెడుతున్న ఫొటోతో రీట్వీట్ చేశారు. ‘గల్లీల్లో సవాళ్లు.. ఢిల్లీలో వంగివంగి మోకరిల్లి వేడుకోళ్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు, జగమెరిగిన నిక్కర్ లిక్కర్ లాజిక్కు’ అని పోస్టు చేశారు. -
31.29 గంటల్లో 72 కి.మీ. ఈత!
కాచిగూడ: భారత్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ ఈతగాళ్లు ఇంగ్లండ్–ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లిష్ చానల్ (అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ భాగం)ను రెండు వైపులా రిలేగా ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన కోచ్ రాజోరియా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు శివకుమార్‌తోపాటు ఎన్ఏ స్నేహన్ (తమిళనాడు), ఎల్విస్ అలీ హజారికా (అస్సాం), రిమో సాహా (పశ్చిమ బెంగాల్), సత్యేంద్రసింగ్ (మధ్యప్రదేశ్), జయంత్ దూబ్లే (మహారాష్ట్ర)తో కూడిన బృందం ఇంగ్లిష్ చానల్ ఈదడానికి ఈ నెల 8న లండన్‌కు వెళ్లారు. ఈ నెల 18న కెంట్లోని డోవర్లో సమీపంలో ఉన్న షేక్స్పియర్ బీచ్ నుంచి ఈత ప్రారంభించి ఉత్తర ఫ్రాన్స్‌లోని విస్సంట్ ఒడ్డును చేరుకొని తిరిగి డోవర్ వద్ద ఉన్న ఓల్డ్ సౌత్ ఫోర్‌ల్యాండ్ లైట్‌హౌస్ వద్దకు ఈ నెల 19న చేరుకున్నారు. భారీ అలలు, జెల్లీఫిష్‌లు సహా ఇతర ప్రమాదకర సముద్ర జీవుల నుంచి తప్పించుకుంటూ మొత్తం 72 కి.మీ. దూరాన్ని కేవలం 31 గంటల్లోనే ఈదారు. తద్వారా ఇంగ్లిష్ చానల్‌ను రిలేగా ఈదిన ఆసియా ప్రాంత వాసులుగా రికార్డు సృష్టించారు. -
కుప్పంలో టీడీపీ గూండాగిరి
సాక్షి, చిత్తూరు/కుప్పం: ప్రశాంతమైన కుప్పంలో టీడీపీ నేతలు గూండాగిరి ప్రదర్శించారు. పోలీస్ అధికారులపైనే దాడులకు తెగబడ్డారు. అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ శివకుమార్ కిందపడేలా తోసేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం తెలుగు తమ్ముళ్లు సుమారు 150 మందికిపైగా గుమికూడారు. టీడీపీ కుప్పం ఇన్చార్జ్ పి.ఎస్.మునిరత్నం, ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ నేతృత్వంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్ , మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, యూత్ ప్రెసిడెంట్ మణి, నాయకులు త్రిలోక్, గోపీనాథ్ కార్యకర్తలతో కలిసి పోలీసుల అనుమతి తీసుకోకుండానే టీడీపీ జెండాలతో రోడ్డుపైకి ప్రదర్శనగా వచ్చారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసు అధికారులపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగారు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. టీడీపీ వారు బలంగా నెట్టేయడంతో అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ శివకుమార్ కింద పడిపోయారు. వారిపైన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున పడ్డారు. పోలీసులు సీఐ, ఎస్ఐలను పైకి లేపడంతో వారు తేరుకున్నారు. టీడీపీ నేతలు అరుపులు కేకలతో నినాదాలు చేస్తూ మరింతగా రెచ్చిపోతూ.. దిష్టిబొ మ్మ దహనానికి ప్రయత్నించారు. పోలీసులు ఆ దిష్టిబొ మ్మను స్వాదీనం చేసుకుని దూరంగా పడేశారు. టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి ఆ దిష్టిబొ మ్మను తగులబెట్టి సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలకు సంబంధించి 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు తెగబడిన మరింతమందిని గుర్తించేపనిలో నిమగ్నమయ్యారు. -
ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు.. నిజంగానే విడిపోయారా?
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. టాలీవుడ్ అభిమానుల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దియా, దేవ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. పిల్లలు పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందులో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. తాజాగా భార్య జ్యోతిక కారణంగానే సూర్య తన తండ్రి, తమ్ముడితో విడిపోయారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ప్రముఖ తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యాడని.. సూర్యకు ఆయన తండ్రి శివకుమార్‌కు సంబంధాలు సరిగా లేవన్నారు. సూర్య, జ్యోతికల ప్రేమను శివకుమార్ మొదట వ్యతిరేకించారని.. తర్వాతే కుమారుడి కోసం ఒప్పుకున్నారు. అయితే పెళ్లి తర్వాత జ్యోతికను సినిమాల్లో నటించవద్దని ఆదేశించాడు. అందువల్లే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని బైల్వాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిక సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జ్యోతిక మళ్లీ సినిమాల్లో నటించడాన్ని శివకుమార్ స్వాగతించలేకపోతున్నారని సమాచారం. దీనివల్లే తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య, జ్యోతిక 2డి అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్నారు. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ సక్సెస్ఫుల్ జంటగా నిలిచిన సూర్య, జ్యోతిక మొదట చెన్నైలో ఉమ్మడి కుటుంబంలోనే జీవించారు. అయితే ఇటీవలే ఇద్దరూ ముంబైలో కొత్త ఇల్లు కొని సెటిల్ అయ్యారు. -
ఏపీ ఫోరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివకుమార్ అనుమానాస్పద మృతి
-
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
కర్ణాటక కాంగ్రెస్ నేత అరెస్ట్
-
నిర్మాతకు రజనీకాంత్ బహుమతి!
చెన్నై: తనను హీరోను చేసిన నిర్మాతకు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ స్థిర నివాసం కల్పించారా? ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి భైరవా అనే చిత్రాన్ని నిర్మించారు ప్రఖ్యాత కథా రచయిత కలైజ్ఞానం. ఆ చిత్రం రజనీకాంత్ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో కలైజ్ఞానంకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నటుడు శివకుమార్ తెలిపారు. అంతే కాదు కలైజ్ఞానంకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. అదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వనని, తానే కలైజ్ఞానంకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. అంతే కాదు 10 రోజుల్లో అందుకు డబ్బును తాను అందిస్తానని చెప్పారు. దీంతో దర్శకుడు భారతీరాజా కలైజ్ఞానం కోసం కోటి రూపాయల్లో ఒక ఇంటిని చూసినట్లు, దాన్ని రజనీకాంత్ కొనుగోలు చేసి నిర్మాత కలైజ్ఞానంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై విచారించగా రజనీకాంత్ ఇంకా ఇల్లును కొనలేదని, దర్శకుడు భారతీరాజా ఇల్లు కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. అదే విధంగా కలైజ్ఞానంకు ఇంటిని కొనడానికి రజనీకాంత్ రూ.కోటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. రజనీతో ఎలాంటి బంధంలేదు.. దీనిపై నిర్మాత కలైజ్ఞానం స్పందిస్తూ తనకు నటుడు రజనీకాంత్‌తో ఎలాంటి అనుబంధం, రక్త సంబంధంగానీ లేదన్నారు. ఆయన్ని హీరోగా పరిచయం చేసి చిత్రం నిర్మించానంతేనని పేర్కొన్నారు. అలాంటిది తనకు రజనీకాంత్ ఎంత పెద్ద సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన మానవత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. కాగా రజనీకాంత్ ఇంతకు ముందు నటించిన అరుణాచలం చిత్రానికి తనతో చిత్రాలు చేసి ఆ తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఏడుగురిని భాగస్వాములుగా చేశారు. ఆ చిత్రానికి వచ్చిన లాభాలను వారికి పంచారు. అందులో నిర్మాత కలైజ్ఞానం ఉన్నారన్నది గమనార్హం. -
మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో
చెన్నై: తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సెలబ్రెటీస్ పంచుకుంటారు. లెజండరీ నటుడు శివాజీ గణేషన్ మనువడు శివకుమార్.. తనకు కుమారుడు జన్మించాడని ట్విటర్ వేదికగా తెలిపాడు. ఆయనకు ప్రముఖ హీరోయిన్ సుజావరుణీలకు గత సంవత్సరం వివాహం జరిగిన సంగతి తెలిసిందే. శివకుమార్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. కుమారుడు జన్మించడం చాలా ఆనందంగా ఉందని, తమ సింబా వచ్చాడని త్వరలో మీముందుకు రాబోతున్నాడంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఆగస్టు 21 అనేది జీవితంలో మరిచిపోలేని రోజు అని అన్నారు. శివాజీ గణేషన్ మనవడిగా శివకుమార్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. అంతగా సక్సెస్‌కాలేకపోయారు. ఇక సుజా విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు, మలయాల చిత్రాలలో నటించింది. తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వెలుగులోకి వచ్చింది. -
జగన్ సమక్షంలో గబ్బర్‌సింగ్ చేరిక
తూర్పుగోదావరి, కాట్రేనికోన (ముమ్మిడివరం): పల్లంకుర్రుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్‌వర్మ (గబ్బర్‌సింగ్) హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామకృష్ణంరాజుతోపాటు గబ్బర్‌సింగ్ పార్టీలో చేరారు. ఆయన చేరికపై ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, నాయకులు భూపతిరాజు సుబ్రమణ్యంరాజు (బుల్లిరాజు), నడింపల్లి సూరిబాబు, పెన్మెత్స రామకృష్ణంరాజు (గెడ్డం కృష్ణ), నేల కిషోర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ఫ్యాన్‌కి ఫోన్
ప్రముఖ నటులు శివకుమార్ (హీరోలు సూర్య, కార్తీల తండ్రి) ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు రాహుల్ అనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోబోయాడు. దీంతో అతని ఫోన్‌ను శివకుమార్ విసిరేయడం చర్చనీయాంశమైంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఆ తర్వాత వీడియో సందేశం ఇచ్చారు. అది రాహుల్‌కి నచ్చలేదు. ‘‘శివకుమార్ చాలా గొప్ప నటుడే కావచ్చు. కానీ ఆయన అలా ప్రవర్తిస్తారని ఊహించలేదు. ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పలేదు. నా లైఫ్‌లో ఇకపై ఏ సెలబ్రిటీతోనూ సెల్ఫీ దిగను. ఇది నాకో గుణపాఠం’’ అని రాహుల్ ఓ పోస్ట్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై శివకుమార్ మరోసారి స్పందిస్తూ ‘‘నేను చేసింది తప్పని ఇప్పటికీ మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. నేను అలా చేసి ఉండకూడదు’’ అన్నారు. ఆ తర్వాత రాహుల్‌కి రూ.21 వేల ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను కొనిచ్చారు శివకుమార్. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ పూర్వపు జాయింట్ కలెక్టర్ కె.శివకుమార్ నాయుడుకు 30 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అధికారులు అకారణంగా జైలుపాలు చేసినందుకు పిటిషనర్‌కు ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని హెకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు ఉత్తర్వులను 3 వారాలపాటు నిలిపేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో బుచ్చయ్య అనే ప్రభుత్వ మాజీ ఉద్యోగికి చెందిన స్థలంలో కల్యాణ మంటపం నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి జేసీ పనులు చేయరాదని 2017 జూలై 1న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై బుచ్చయ్య హైకోర్టు నుంచి ఆగస్టు 29న స్టే ఉత్తర్వులు పొంది నిర్మాణ పనులు ప్రారంభించారు. సెప్టెంబర్‌లో జేసీ ఆదేశాల మేరకు పోలీసులు బుచ్చయ్యను అరెస్టు చేసి 2 నెలల 29 రోజులు జైల్లో పెట్టారు. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి తనను జైల్లో పెట్టారని బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పునిచ్చింది. -
ప్రతి రైతు.. ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా
సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై డా. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రం గురువారం విడుదల కానుంది. ఇందులో కశిస్ వోహ్రా కథానాయిక. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రచయితలు సప్తగిరి కోసం డిఫరెంట్ కథలు రాస్తారు. రామానాయుడుగారు బతికి ఉంటే చరణ్ లక్కాకులకు చాన్స్ ఇచ్చేవారు. మంచి లీగల్ పాయింట్ ఉన్న సినిమా ఇది. ప్రతి రైతు, ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా. చివరి 45 నిమిషాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లు, పాటలను విడుదల చేసిన సెలబ్రిటీలందరికీ థ్యాంక్స్. వారి వల్ల సినిమాకు హైప్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు. ‘‘నేను పరుచూరి బ్రదర్స్గారి దగ్గర వర్క్ చేశాను. నా తొలి సినిమాకు వాళ్లు డైలాగ్స్ రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చరణ్ లక్కాకుల. ‘‘సాయికుమార్‌గారు, శివప్రసాద్‌గారు హీరోలుగా చేసిన ఈ సినిమాలో నేను చిన్న పాత్ర చేసినట్లు అనిపిస్తోంది. పరుచూరి బ్రదర్స్ మా సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతకు రుణపడి ఉంటా’’ అన్నారు సప్తగిరి. -
సీఎంపై శివకుమార్‌తల్లి ఆగ్రహం!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివకుమార్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై దాడులకు సిద్ధరాయయ్యే కారణమని శివకుమార్ తల్లి గౌరమ్మ శుక్రవారమిక్కడ ఆరోపిస్తున్నారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారని గౌరమ్మ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీవాళ్లతో పాటు సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లోనే తన కొడుకుకు అనేకమంది శత్రువులు ఉన్నారన్నారు. ఐటీ దాడుల వెనుక సీఎం హస్తముందని ఆమె ఆరోపించారు. ‘నా కొడుకుపై అందరూ అసూయపడ్డారు, అతనిని హాని చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓవైపు నా కొడుకును ఉపయోగించుకుంటూనే మరోవైపు పదే పదే అతనిని మోసం చేసాడు. నా కొడుకులు ఇద్దరు పార్టీ కోసం ఎంతో పని చేస్తున్నారు. తన కుమారుడి అండతోనే సీఎం రాజకీయంగా మనగలుగుతున్నారు. నా కొడుకులు దేశం కోసం పని చేస్తున్నారు. ఇతరుల నుంచి దొంగతనమేమీ చేయలేదు. ఐటీ దాడుల వ్యవహారంపై సీఎం ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు. కాగా రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ ఈ దాడులు చేయించారని గౌరమ్మ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం మంత్రి శివకుమార్ నివాసంపై ఐటీ దాడులు కేంద్ర బీజేపీ సర్కారు రాజకీయ కక్ష సాధింపేనని వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శివకుమార్ తల్లి ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ...ఆమె ఎందుకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తమకు తెలియదని, దీనిపై మంత్రి శివకుమారే స్పందించాల్సి ఉందన్నారు. ఐటీ దాడులతో హస్తం ప్రతీకారం! కాగా శివకుమార్ నివాసంపై ఐటీ దాడులతో కంగుతిన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అధినేత్రి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి ఎంతో దగ్గరివాడైన డీకే శివకుమార్‌పై ఐటీ దాడులు ఆ పార్టీని కదిలించాయి. కసి తీర్చుకోవడానికి వారి ఆదేశాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పథకం రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శాసనసభ ఎన్నికలు మరో పదినెలల్లో రానున్న నేపథ్యంలో ఈ దాడుల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై పార్టీ ముఖ్య నేతలతో సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. విపక్షాలకు ఈ ఐటీ దాడి ఓ ప్రధాన అస్త్రం కానుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఐటీ దాడులు, వాటి మీద జనాభిప్రాయంపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సిద్ధు సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ హై కమాండ్‌కు తెలియజేస్తున్నారు. కేసులపై కాంగ్రెస్ పెద్దలకు నివేదిక! ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నిన్న రాష్ట్ర ఏసీబీ, లోకాయుక్త అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ, జేడీఎస్ నేతలపై ఈ రెండు దర్యాప్తు సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పతో పాటు ఎంపీ శోభకరంద్లాజే, కేంద్రమంత్రి అనంతకుమార్, ఎంపీలు పీ.సీ మోహన్, శ్రీరాములు, సీనియర్ నేతలు ఆర్.అశోక్, కట్టాసుబ్రహ్మణ్యం తదితర 17 మంది నాయకులపైనున్న కేసుల వివరాలను తెప్పించుకున్నారు. ఇక జేడీఎస్‌కు సంబంధించి కుమారస్వామి గురించి కూడా సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిపై ఏయే కేసులు, ఎక్కడెక్కడ నమోదైందీ అధికారులు సీఎంకు వివరించారు. ఈ వివరాలన్నింటినీ సిద్ధరామయ్య పార్టీ ఢిల్లీ పెద్దలకు ఒకటి రెండు రోజుల్లో నివేదిక పంపించనున్నారు. ఏసీబీ, లోకాయుక్తకు బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని కేసుల దర్యాప్తును ప్రారంభించాలని సిద్ధరామయ్య సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
‘శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు’
విజయవాడ: శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమ అన్నారు. ఎమ్మెల్యేగా న్యాయం చేయాల్సిన బాధ్యత బోండా ఉమామహేశ్వరరావుకు లేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 రోజులుగా తన గోడు చెబుతున్నా బోండా ఉమ స్పందించలేదని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల వల్లే ఇల్లు అమ్ముకోలేక, తన బిడ్డను కోల్పోయానని సుమ భోరున విలపించారు. సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు. మరోవైపు సుమను వైఎస్ఆర్ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ పరామర్శించారు. కాగా బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ నిన్న మధ్యాహ్నం ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. -
నాన్నా.. నన్ను బతికించవూ..
-
నాన్నా.. నన్ను బతికించవూ..
ఓ చిన్నారి ఆఖరి ఆర్తనాదం ► క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసిన చిన్నారి ► వైద్యం చేయించడానికి అష్టకష్టాలు పడిన తల్లి ► వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్ముతుంటే అడ్డుకున్న తండ్రి ► ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయుల దౌర్జన్యం ► మాతృ దినోత్సవం రోజున విజయవాడలో ఓ తల్లికి కడుపుకోత పిల్లలకు జ్వరమొస్తేనే తల్లడిల్లిపోతాం.. నిమిషానికోసారి చేయి పట్టుకుని చూస్తాం.. డాక్టర్, మందులు అంటూ హడావుడి చేస్తాం.. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రపోకుండా సపర్యలు చేస్తాం.. అలాంటిది క్యాన్సర్‌తో బాధ పడుతున్న కన్న బిడ్డ ‘నాన్నా.. నన్ను బతికించు ప్లీజ్.. నేను స్కూల్కెళ్లి ఎన్ని నెలలైందో.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది.. నీతో మాట్లాడాలని ఉంది..’ అంటూ కన్నీటితో వేడుకున్నా ఆ తండ్రి గుండె కరగలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో తల్లీబిడ్డను వీధిన పడేశారు. చరమాంకంలో ఆ బిడ్డ తన తండ్రికి పంపిన వీడియోలోని ఒక్కో మాట వింటుంటే కళ్లెంట నీరు ఆగలేదు.. నేను ఎక్కువ రోజులు బతకనంట డాడీ.. ‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్.. కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ.. ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ.. నన్ను బ్రతికించు డాడీ.. నేను స్కూల్కెళ్లి ఎన్ని మంత్స్ అయిందో నీకు తెలుసు కదా డాడీ.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది.. దయచేసి నాకు ట్రీట్మెంట్ చేయిస్తే హ్యాపీగా నేను టెన్త్ క్లాస్ చదువుకుంటా.. స్కూలుకెళ్తా.. నా ప్రాణాలు కాపాడు డాడీ.. నీకు దండం పెడతా.. చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ.. నీకు దండం పెడదామంటే చేయి వాచిపోయి నొప్పిగా ఉంది డాడీ.. కాళ్లు కూడా వాచి పోయాయి డాడీ.. కుంటుతూ నడుస్తున్నా డాడీ.. ఎప్పుడూ నన్ను మీ అమ్మతో పోలుస్తావుగా డాడీ.. వెంకట సుబ్బమ్మ అంటావుగా.. మీ మమ్మీకే డిసీజ్ వచ్చిందనుకుని నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ.. నాకు ఇపుడు ట్రీట్మెంట్ అవసరం అంట డాడీ.. నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకనంటా.. అమ్మ దగ్గర డబ్బుల్లేవు డాడీ.. నిజంగా అమ్మ దగ్గర డబ్బుల్లేవు.. ఒకవేళ నీ డబ్బులు ఏమైనా మా మమ్మి తింటుందనుకుంటే మాకెవ్వరికీ డబ్బులివ్వద్దు.. నువ్వే నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిం చు డాడీ.. నాకు అవసరమైనప్పుడల్లా ఆ డబ్బులు నువ్వే ఆస్పత్రిలో కట్టు డాడీ.. మమ్మీకి కూడా ఇవ్వద్దు.. నాకేమన్నా అయితే మీ నలుగురే దానికి బాధ్యత వహిస్తారు డాడీ.. మాదంశెట్టి శివకుమార్ నువ్వు నా తండ్రిగా, నీ కొడుకులు మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారాం కృష్ణ, నీ భార్య మాదంశెట్టి కృష్ణకుమారి.. మీరు నలుగురూ కలసి ఈ ఆస్తికి అడ్డు వస్తానని ఇన్‌డైరెక్టుగా నన్ను చంపేయాలనుకుంటున్నారు.. మీ చేతికి మట్టి అంటకుండా నా కొచ్చిన జబ్బుతోనే చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ.. దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్‌లో నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ.. ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ.. నేనే మాట్లాడుతా.. కనీసం నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ.. కొంచెమన్నా నా మీద జాలి చూపించు డాడీ.. నేను కూడా నీ కూతురునే కదా డాడీ.. ప్రేమ కాకపోయినా కనీసం జాలి అయినా చూపించు డాడీ.. ట్రీట్మెంట్ చేయించు డాడీ.. ప్లీజ్ డాడీ..’ సాక్షి, అమరావతి బ్యూరో: బిడ్డను బతికించుకోవాలన్న ఆ తల్లి వేదన అరణ్య రోదనే అయ్యింది. కుమార్తెకు వైద్యం చేయించేందుకు ఆమె పడిన ఆరాటం ఫలించలేదు. బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీ యులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ (13) ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. బొండా ఉమా వర్గీయుల రౌడీయిజానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన రాజధాని విజ యవాడలో కలకలం రేపింది. మాదంశెట్టి సుమశ్రీ తన కుమార్తె సాయిశ్రీతో కలసి విజయవాడ దుర్గానగర్‌లోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. సుమశ్రీ భర్త మాదంశెట్టి శివకుమార్ ఆ ఫ్లాట్‌ను కుమార్తె సాయిశ్రీ పేరిట రాశారు. సంరక్షకుడిగా తన పేరే పెట్టుకున్నారు. అయితే కొంత కాలంగా సుమశ్రీ, శివకుమార్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ క్యాన్సర్ బారిన పడింది. ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప ఫలితం ఉండదని వైద్యులు చెప్పారు. దీంతో తాము ఉంటున్న ఇంటిని విక్రయించి కుమార్తెకు వైద్యం చేయించాలని తల్లి సుమశ్రీ భావించారు. ఆ ఇల్లు మైనర్ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్ సమ్మతించాల్సి ఉంది. ఇందు కు ఆయన అంగీకరించలేదు సరికదా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లీకూతుళ్లు తల్లడిల్లిపోయారు. ఎమ్మెల్యే బొండా వర్గీయుల బెదిరింపులు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గీయులు కొందరు ఇటీవల ఆ ఫ్లాట్‌కు వచ్చారు. ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారంటూ ఆ ఇల్లు ఖాళీ చేయాలన్నారు. శివకుమార్ ఆ ఇంటిని తమకు అమ్మేశారని బెదిరించారు. దీనిపై సుమశ్రీ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఉంటున్న ఫ్లాట్‌ను అమ్మేయడం ఏమిటి? కుమార్తె అనారోగ్య సమస్యల్లో ఉండగా ఈ దౌర్జన్యమేమిటి? అని ప్రశ్నించారు. ఇదేమీ పట్టించుకోని బొండా ఉమా వర్గీయులు మరింతగా చెలరేగిపోయారు. కుమార్తె సాయిశ్రీని తీసుకుని వైద్యం కోసం సుమశ్రీ హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఆ ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. సామాన్లను బయట పడేసి ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుమశ్రీని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో ఓ రోజు రాత్రంతా ఆమె ఇంటిబయటే పడిగాపులు కాశా రు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల్లో ఫ్లాట్ ఖాళీ చేయాలని హెచ్చరించి ఎమ్మెల్యే బొండా వర్గీయులు వెళ్లిపోయారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఆ ఇంటిని విక్రయించాలన్న సుమశ్రీ ప్రయత్నాలు ఫలించలేదు. అసలు శివకుమార్ ఉద్దేశపూర్వకంగా అందుబాటులో లేకుండాపోయారు. ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించ లేదు. దీంతో అంతా ఒక్కటై ఉద్దేశ పూర్వకంగా సుమశ్రీ, సాయిశ్రీలను వేధించారని స్పష్టమైంది. బొండా ఉమా బాధ్యత వహించాలి ‘నా బిడ్డ సాయిశ్రీ మృతికి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బాధ్యత వహించాలి. నా బిడ్డ ప్రాణాల మీదకు వచ్చినా వైద్య ఖర్చుల కోసం మా ఇంటిని అమ్ముకోనివ్వలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా అండతో ఓ రౌడీషీటర్ మమ్మల్ని బెదిరించారు. ఇంటిని అమ్మి బిడ్డ ప్రాణాలు కాపాడాలని నా భర్త మాదంశెట్టి శివకుమార్‌ను వేడుకున్నాను. ఇంటిని అమ్ముకోవడాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే బొండా ఉమాను పలుసార్లు ప్రాథేయపడ్డాను. వారు ఏమాత్రం కనికరించలేదు. పైగా వైద్యం చేయించకపోతే సాయిశ్రీ చనిపోతుందని, అప్పుడు ఇంటిని దక్కించుకోవచ్చని శివకుమార్ పథకం వేశాడు. అందుకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ శేషగిరిరావు, అతని కుమారుడు సహకరించారు. నా భర్త శివకుమార్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు స్నేహితుడు కావడంతో అతనికి అండగా నిలిచి దౌర్జన్యం చేశారు. దీంతో నా కూతురుకు సరైన వైద్యం చేయించలేకపోయాను. అనారోగ్యంతో తీవ్ర వేదన అనుభవిస్తూ నా కూతురు ప్రాణాలు విడిచింది. దీనికి ఎమ్మెల్యే బొండా ఉమా బాధ్యత వహించాలి. ఆయనకూ పిల్లలు ఉన్నారు. ఓ తల్లిగా నా ఆవేదనను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.’ – సాయిశ్రీ తల్లి సుమశ్రీ ప్రాణాలు విడిచిన సాయిశ్రీ రోజురోజుకు సాయిశ్రీ ఆరోగ్యం క్షీణిం చింది. డబ్బులు లేక సుమశ్రీ తన కుమార్తెను మెరుగైన వైద్యం కోసం మళ్లీ హైదరాబాద్ తీసుకువెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సాయిశ్రీ ఆదివారం మధ్యా హ్నం ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించింది. శివకుమార్‌కు సహకరించిన వారందరిని కఠినంగా శిక్షిస్తేనే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని కన్నీటిపర్యంతమైంది. సాయి శ్రీ చివరిసారిగా తన తండ్రికి పంపిన వీడియోను మీడియాకు చూపించింది. -
‘రక్షించండి నాన్న అని ఆఖరి సెల్ఫీ వీడియో’
-
22 ఏళ్లుగా ఆ ఇంటికి వాటర్ బిల్లే లేదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సీనియర్ శాస్త్రవేత్త గత 22 ఏళ్లుగా నీటి బిల్లు కట్టడం లేదు. ఎందుకంటే ఆయన ఇంటికి అసలు ప్రభుత్వ కుళాయి కనెక్షన్ కూడా లేదు. అదేమిటీ బెంగళూరులాంటి నగరంలో అసలు కుళాయి కనెక్షన్ లేకుండా ఎలా జీవితాన్ని గడుపుతున్నారని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఏఆర్ శివకుమార్ అనే వ్యక్తి ఓ శాస్త్రవేత్త. అతడు కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన తన నివాసాన్ని హరిత గృహంగా నిర్మించారు. రోజుకు కనీసం 400 లీటర్ల వర్షపు నీటిని స్టోర్ చేసేలా కట్టుకున్నారు. ఈ విధంగా నీటి కష్టాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఎదుర్కొంటున్నా తన ఇంట్లో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా హాయిగా గడిపేస్తున్నారు. మొత్తం మీద ఆయన ఇంటికి దాదాపు 45వేల లీటర్ల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంది. శక్తివనరులు, వర్షపు నీటిని తిరిగి వినయోగించుకుకోవడం ఎలా అనే విభాగంలో పని చేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3లక్షల లీటర్ల నీరు సరిపోతుందని చెప్పారు. రోజుకు 400 లీటర్ల చొప్పున అవసరం అవుతుందని, 100 రోజులకు 40000 లీటర్ల నీరు అవసరం ఉంటుందని, కానీ తమకు 45వేల లీటర్ల నిలువ నీటి సామర్థ్యం ఉందని అన్నారు. -
పోలీస్ కమిషనర్‌పై కేసు నమోదు
దుబ్బాక(సిద్దిపేట): సిద్దిపేట సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు వీరే కారణమని వారి కుమారుడు ప్రేమ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ప్రజాసంఘాలతో కలిసి దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన చిట్టిబాబు కుమారుడికి నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై ఐపీసీ 302, సీఆర్పీసీ 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు(శనివారం) దుబ్బాక బంద్‌కు పిలుపునిచ్చారు. -
నోట్ల రద్దుపై కాంగ్రెస్ నిరసనలు
2 నుంచి 11 వరకు కార్యక్రమాలు: ఉత్తమ్ ► జనవరి రెండో వారంలో రాష్ట్రానికి రాహుల్‌గాంధీ! ► గాంధీభవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ► హాజరైన ఏఐసీసీ పరిశీలకులు కేబీ కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి శివకుమార్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేపట్టనున్న నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రకటించారు. జనవరి 2న జిల్లా కేంద్రాల్లో, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత జనవరి 5, 6, 7 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని, 9న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వివరించారు. అనంతరం 11వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని నిర్ణయించామని, మండల, జిల్లా కేంద్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను ఉత్తమ్ మీడియాకు వివరించారు. జనవరి రెండో వారంలో రాష్ట్రానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జనవరి 11 తర్వాత 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలిపారు. ప్రజల డబ్బుపై ఆంక్షలెందుకు..? పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ తరఫున పీసీసీ సమావేశానికి పరిశీలకుడిగా హాజరైన కర్ణాటక మంత్రి శివకుమార్ అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 15 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరిం చారు. ప్రజలు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల పై ఎందుకు ఆంక్షలు పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. నల్ల ధనాన్ని వెలికితీయడానికి తాము వ్యతిరేకం కాదని, చిన్న వ్యాపా రులకు పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు కేబీ కృష్ణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం, బలవంతపు భూసేకరణ చట్టమేనని, సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని పీసీసీ సమా వేశంలో నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం వ్యవహారశైలి తెలంగాణ పరువు తీసేలా ఉందని, 2013 భూసేకరణ చట్టాన్ని యూపీఏ సర్కార్ పార్లమెంట్ లో తీసుకొచ్చినప్పుడు, ఆరోజు కేసీఆర్ ఎం దుకు వ్యతిరేకించలేదని నేతలు మండిపడ్డారు. కొత్త భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. -
30 మంది విద్యార్థినులపై రేప్
తమిళనాడులో ట్యూషన్ సెంటర్ నిర్వాహకుల కీచకం సాక్షి ప్రతినిధి, చెన్నై: ట్యూషన్ విద్యార్థినులకు మత్తుమందిచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న ముగ్గురు ట్యూషన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలక్కోడుకు చెందిన శివకుమార్ (25) తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలసి పాలక్కాడు, ధర్మపురిలో ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ సెంటర్లలో టెన్త్, ఇంటర్మీడియెట్‌కు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ట్యూషన్ కు వచ్చే అమ్మాయిలను స్పెషల్ క్లాసుల పేరుతో శివకుమార్ ఎక్కువసేపు ఉంచేవాడు. ఆ సమయంలో టీ/ శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించి తర్వాత వారితో తన కోరిక తీర్చుకునేవాడు. ఆ దారుణాలనూ వీడియో తీసేవాడు. స్నేహితులు ఈశ్వరన్, శివలు సైతం వీడియోలను బయటపెడతామని బెది రించి, విద్యార్థినులను లొంగదీసుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థినులు వీరి దురాగతాలకు బలయ్యారు. -
శివకుమార్ అంటే ఐ‘డర్’
సాక్షి, సిటీబ్యూరో: చైనా బైక్స్ పేరుతో దేశ వ్యాప్తంగా 60 మందికి పైగా టోకరా వేసిన శివకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసుల శనివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హయత్‌నగర్ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న గోడౌన్‌ను సీజ్ చేసిన అధికారులు అందులో ఉన్న బైక్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘరానా మోసగాడు అనేక మంది యువతులనూ వంచించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో తమకు ఫిర్యాదులు రాలేదని, వస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ఐడర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే బ్రాండ్‌తో బైక్స్ తయారు చేసి విక్రయించాలని శివకుమార్ ప్రయత్నాలు చేశాడు. చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తరహాలోనే ఇవీ ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇలాంటి వాహనాల తయారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని వాహనాలు తయారు చేయించి ప్రదర్శించాడు. మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 60 మంది నగదు చెల్లించి డీలర్షిప్స్ తీసుకున్నారు. ఈ నయవంచకుడు కొందరు యువతులకూ ప్రేమ పేరుతో వల వేసి వారినీ వంచించాడు. ఆయా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో వారికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవాడు. వీటిని చూపించి ఆ యువతులను బెదిరించే వాడని, అలా తన డీలర్ల వద్దకు వారిని పంపుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించే వాడని తెలిసింది. రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వరకు డిపాజిట్లుగా, మరికొంత మొత్తం బైక్స్ కోసం అడ్వాన్స్‌గా చెల్లించే డీలర్లు చివరకు మోసపోయామని తెలుసుకునే వారు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే ‘దృశ్యాలు’ ఉన్నాయంటూ వారినీ బ్లాక్మెయిల్ చేసే వాడని తెలుస్తోంది. ఇతడి కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులకు రెండు ఈ తరహాకు చెందిన సీడీలు లభించాయని సమాచారం. పోలీసులు మాత్రం తమకు ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఇతడిపై ఇప్పటికే జూబ్లీహిల్స్, కాచిగూడ, మీర్‌చౌక్, సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదై ఉండగా... తాజాగా సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. శివకుమార్ మాటలు నమ్మిన అనేక మంది డీలర్లు కొన్ని నెలలుగా షోరూమ్స్, కార్యాలయాలు, సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి వాటి అద్దెలు, వారికి జీతాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇప్పుడు మోసపోయామని తెలియడంతో లబోదిబోమంటున్నారు. -
స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను మూడింతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజులను తీసుకోవడం లేదని అన్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు రాజు, కార్యదర్శి ఓంప్రకాష్, నాయకులు వెంకట్రాములు, బాలరాజు, అంజి, నరేష్, నవీన్, శివ, గోపి, రఘు తదితరులు పాల్గొన్నారు. -
నేడు విద్యాసంస్థల బంద్
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈనెల 8వ తేదీన విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌తో పాటు కలెక్టరేట్, ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం స్కాలర్షిప్లు పెంచడంతో పాటు రూ. 3100 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మా ఓట్లతో గెలిచి మాపైనే పెత్తనమా?
హిమాయత్‌నగర్: లక్షల జీతాలు తీసుకుంటున్న ఉన్నతాధికారుల సభలు, సమావేశాల ఖర్చు కార్మికులపై మోపుతున్నారని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన కార్మికులపై రుబాబు చేయడమేగాక ఇళ్లలో పాచి పనిని చేయించుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మున్సిపల్ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని, కార్మికులకు కనీస వేతనాలను రూ. 15వేలకు పెంచుతామన్న నేతలు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేటర్ల బర్త్‌డేలు, ఫంక్షన్లకు కార్మికులు కేకులు తీసుకెళ్లి కట్ చేయాల్సి వస్తుందన్నారు. లేకపోతే వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కార్మికులకు మాస్క్‌లు, షూలు. గ్లౌవ్స్ ఇవ్వటం లేదన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ , మహబూబ్‌నగర్ అటవీ ప్రాంతాల వద్ద పనిచేసే కార్మికులు జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో రషీద్, కృష్ణ. ఆనంద్, సుధాకర్ గౌడ్, సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్‌కు ఉప ఎన్నికల భయం పట్టుకుంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని టీవైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ వ్యాఖ్యానించారు. నగరంలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించి రూపొందించిన పాటల సీడిని ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు. -
'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఇతర మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ విమర్శించారు. హైదరాబాద్‌లో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో భయంకరమైన కరువు నెలకొందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ వైఎస్ఆర్ సీపీ రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని టీవైఎస్ఆర్సీసీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ తెలిపారు. -
10న మహబూబ్‌నగర్ జిల్లా బంద్
మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలమండలికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అధికార టీఆర్ఎస్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినిమా థియేటర్ల యజమానులు సహకరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ కోరారు. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ బంద్‌కు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. -
శివకుమార్ 7/30
త్రిపుర 151 ఆలౌట్ సాక్షి, ఒంగోలు: ఆంధ్ర బౌలర్ దువ్వారపు శివకుమార్ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. త్రిపురతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 30 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. పదో నంబర్ బ్యాట్స్‌మన్ రాణా దత్తా (64 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, రాకేశ్ సోలంకి (39 బంతుల్లో 37; 7 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించాడు. అనంతరం ఆంధ్ర బ్యాటింగ్ కూడా తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ కైఫ్ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. శ్రీరామ్ (23), ప్రదీప్ (12), ప్రశాంత్ (4), భరత్ (0) వెనుదిరిగారు. ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 54 పరుగులు వెనుకబడి ఉంది. -
అంబేద్కర్ ఆశయసాధనకు పాటుపడుదాం
కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలకు ఆరాధ్యదైవమని, ఆ మహానీయుని ఆశయ సాధన కోసం పాటుపడాలని కరీంనగర్, ధర్మపురి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్,నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, డెప్యూటీమేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్,సాంఘిక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ అనాడే గ్రహించి రాష్ట్రాల విభజన సమయంలో అడ్డంకులు ఏర్పడకుండా ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి పూర్తి అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంబేద్కర్ భిక్ష వల్లే తెలంగాణరాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు. అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్లతో చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగాకొనసాగుతున్నామని అన్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన లక్ష్య సాధన కోసం ప్రజలు ముందుకు సాగాలని అన్నారు. కార్పొరేటర్లు, వివిధ దళిత, ఉద్యోగ సంఘాల నాయకులు కట్ల సతీష్,కంసాల శ్రీనివాస్,అంజన్‌కుమార్, బండారి వేణు, సత్యనారాయణరెడ్డి, అర్ష మల్లేశం, సునీల్‌రావు,కన్న కృష్ణ, కర్ర రాజశేఖర్, గంట కళ్యాణిశ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, మెండి చంద్రశేఖర్, కొరివి వేణుగోపాల్,కన్నం అంజయ్య, దళిత సంఘాల నాయకులు మేడి రాజవీరు, జానపట్ల స్వామి, వి.రాజమల్లయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి ఏర్పాట్లపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వర్రావుతో దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. -
వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బుధవారం ఎస్పీ శివకుమార్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. త న కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. అంతా ప్రశాంతం మానకొండూర్ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ శివకుమార్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొమ్మిదివేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట కరీంనగర్ రూరల్ సీఐ కమలాకర్డ్డి ఉన్నారు. -
శిక్షణ ఐపీఎస్‌లకు ఎన్నికల విధులపై అవగాహన
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: సార్వత్రికల ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల విధులు, అధ్యయనం కోసం విచ్చేసిన యువ శిక్షణ ఐపీఎస్ అధికారులకు ఎస్పీ శివకుమార్ సోమవారం ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సుమారు 20 మంది ఐపీఎస్ అధికారులు జిల్లాకు వచ్చారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు చేపడుతున్న చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ విధులపై వారికి ఎస్పీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సుబ్బారాయిడు, ఎలక్షన్ సెల్ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కొత్త ఎస్పీగా శివకుమార్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కొత్త ఎస్పీగా ఉప్పుల శివకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ ఎస్పీగా ఉన్న వి.రవీందర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. శివకుమార్ ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. గ్రూప్-1కు ఎంపికైన ఆయన 1994లో డీఎస్పీగా నియమితులయ్యా రు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో తొలి పోస్టింగ్ పొందారు. తర్వాత ఆవనిగడ్డ, కరీంనగర్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై విజయనగరంలో అదనపు ఎస్పీగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలోబాధ్యతలు నిర్వర్తించారు. కోసావో ఐక్యరాజ్య సమితి మిషన్‌లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఏడేళ్లు పనిచేసిన ఆయన ఈ ఏడాది జనవరి 1న మల్కాజిగిరిడీసీపీగా బదిలీ అయ్యారు. అక్కడ పది నెలలు పనిచేసి.. కరీంనగర్ ఎస్పీగా వస్తున్నారు. 1952 జూలై 9న వరంగల్‌లో జన్మించిన ఆయన.. వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఐదేళ్లపాటు ఇంజినీరింగ్ పనిచేశారు. -
పెను విషాదం
పండగ శోభ ఇంకా తగ్గలేదు. దసరా సందడి ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే ఓ దుర్వార్త అయిదు కుటుంబాలను వణికించింది. బెజవాడ కనకదుర్గ దర్శనానికి టవేరా వాహనంలో బయల్దేరిన వారిలో అయిదుగురు రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతుల్లో నలుగురు యువకులే. సోమవారం రాత్రి డ్రైవర్‌తో సహా తొమ్మిది మంది పెదగంట్యాడ కొత్త కర్ణవానిపాలెం నుంచి బయల్దేరారు. మంగళవారం వేకువజామున తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జాతీయరహదారి సమీపంలోని సుద్దకొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో శివకుమార్, రమేష్, అప్పల శ్రీను, శ్రీనివాసరావుతో పాటు వాహనం డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో శ్రీనివాసరావుకు అయిదు నెలల క్రితమే వివాహమైంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరిన భవానీ భక్తులు మార్గంమధ్యలో రోడ్డు ప్రమాదంలో అశువులు బాశారు. రాజమండ్రి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదంలో పెదగంట్యాడ మండలం కొత్త కర్ణవానిపాలెం గ్రామానికి చెందిన నలుగురు, ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్‌కు చెందిన వాహన డ్రైవర్ దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కొత్త కర్ణవానిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. న్యూస్‌లైన్, పెదగంట్యాడ దేవీనవరాత్రుల సందర్భంగా గ్రామానికి చెందిన గొన్న శివకుమార్(26), గద్దె శ్రీనివాసరావు (27), వెంకటేష్ (24), వానపల్లి అప్పలరాజు (24)లు భవానీ మాలలు ధరించారు. సోమవారం రాత్రి అనుపోత్సవం నిర్వహించి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. వారితో పాటు యర్రా రమేష్(26), విరోతి అప్పలశ్రీను (28) అతని భార్య శిరీష (23), చిననడుపూరు గ్రామానికి చెందిన గురుభవానీ పగడాల జోగారావు (45), ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్ చెందిన దమన్‌సింగ్ శంకర్(26) (డ్రైవర్) టవేర వాహనంలో ప్రయాణిస్తూ తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జాతీయరహదారి సమీపంలోని సుద్దకొండ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో శివకుమార్, రమేష్, అప్పలశ్రీను, శ్రీనివాసరావుతో పాటు వాహనం డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోళనలో కుటుంబసభ్యులు విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు సంఘటన స్థలానికి పయనమయ్యారు. కొందరు ఇంటి వద్దే ఉంటూ సమాచారం తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులు రాజ మండ్రి, కాకినాడలోని ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువులు, స్నేహితుల పరామర్శలతో కొత్త కర్ణవానిపాలెంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. పెద్ద దిక్కు దూరం.. దేవునిదే భారం యర్రా రమేష్ దుర్మరణంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండ్రి దేముడు పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి వెంకయ్యమ్మ ఇతర అనారోగ్య కారణాలతో సతమతమవుతుంది. రమేష్‌కు పదో తరగతి చదువుతున్న తమ్ముడు నగేష్ ఉన్నాడు. షిప్‌యార్డులో ఓ ప్రైవేటు ఫ్యాబ్రికేషన్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న రమేష్ మరణించినట్టు తల్లిదండ్రులకు తెలియపర్చలేదు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సోదరుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన తరుణం గొన్నా శివకుమార్ ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని మరణ వార్త వారిని కలిచివేసింది. అతని తల్లిదండ్రులు రామారావు, అప్పలనర్సమ్మ గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రామారావుకు కుమార్తె భాగ్యలక్ష్మితో పాటు శివకుమార్, కనకరాజు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. రెండో కుమారుడైన కనకరాజు బీకాం చదువుతున్నాడు. వివాహమైన ఐదు నెలలకే.. రెండేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన గద్దె శ్రీనివాసరావుకు ఈ ఏడాది మే 30న కశింకోట గ్రామానికి చెందిన నాగమణితో వివాహమైంది. ప్రస్తుతం ఫార్మాసిటీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు మరణవార్తతో అతని భార్య నాగమణి రోదనలు అక్కడివారిని కలచివేసింది. అల్లుడు మరణంతో నాగమణి తల్లిదండ్రులు ఉషారత్నం, గోవింద్‌రాజు కుమార్తెను పట్టుకొని గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ప్రమాదంలో శ్రీనివాసరావు సోదరుడు వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దుఃఖసాగరంలో శ్రీను కుటుంబం స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విరోతి అప్పల శ్రీను, శిరీషకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రమాదంలో అతడు దుర్మరణం పాలవ్వగా, శిరీష తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు దేముడు, వరహాలమ్మ అనారోగ్యంతో ఉండడం వల్ల కుమారుని మరణవార్త వారికి చెప్పలేదు. కర్ణవానిపాలేనికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు ప్రమాదాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. కుటుంబసభ్యులు హుటాహుటిన రాజమండ్రికి తరలివెళ్లారు. మృత్యు శకటాలు మర్రిపాలెం, న్యూస్‌లైన్ : ప్రమోదంగా సాగాల్సిన ప్రయాణం ప్రమాదభరితంగా మారుతోంది. జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహ నాలు జనం ఉసురు తీస్తున్నాయి. నిత్యం రహదారులకు రక్తతర్పణం చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను అనాథలను చేసి నడిరోడ్డున పడేస్తున్నాయి. అయినా అధికారులు మొద్దు నిద్ర వీడడంలేదు. రహదారి నిబంధనలను కఠినంగా అమలుపరచడం లేదు. దీంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని నెలల క్రితం నక్కపల్లిలో ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో నగరానికి చెందిన నలుగురు యువకులు బల య్యారు. ఇటీవల ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో విశాఖకు చెందిన బాపట్ల మున్సిపల్ కమిషనర్ దుర్మరణం చెందారు. మంగళవారం రాజమండ్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడం తో విశాఖకు చెందిన ఐదుగురు మృతి చెందారు. హైవేపై వాహనాల పార్కింగ్ జాతీయ రహదారిపై ఇష్టానుసారంగా నిలిపే వాహనాల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా లారీలను రోడ్డుకు అ డ్డం గా, కాస్త పక్కగా ఆపేసి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అతి వేగంతో వచ్చే వాహనాలు గమనించక ప్రమాదాలకు గురవుతున్నాయి. పర్యవేక్ష ణ లోపం పోలీస్ పెట్రోలింగ్, హైవే అథారిటీ సిబ్బంది రోడ్లను నిరంతరం పర్యవేక్షించాలి. రోడ్డు పక్క గా నిలిపి ఉన్న వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు నో పార్కింగ్ కేసులు నమోదు చేయాలి. కానీ అలా జరగడం లేదు. రోడ్డుకు ఆనుకొని వెలసిన హోటల్స్, దాబాలు, రె స్టారెంట్లు, మద్యం షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేసినా చూసీచూడనట్టు వ్యవహరిసున్నారు. కాసులకు కక్కు ర్తి పడే మిన్నకుంటున్నారని ఆరోపణలు ఉన్నా యి. వీరు తమ విధుల్లో కాస్త కఠినంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. -
శివకుమార్‌కు సేవారత్న అవార్డు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పంచాయతీని అభివృద్ధి చేయడమేకాకుండా పలు ప్రజాహిత కార్యక్రమాల్లో చేపట్టిన పంచాయతీ అధ్యక్షుడు కేఎంఎస్ శివకుమార్ సేవారత్న అవార్డు ను అందుకున్నారు, గుమ్మిడిపూండి యూనియన్ పరిధి ఈగువారిపాళెం పంచాయతీకి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండు రోజుల కిందట రాష్ర్ట గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. తెలుగు గ్రామమైన ఈగువారిపాళెంకు 2012లో శివకుమార్ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఎంకామ్ చదవిన ఈయన ఒక పక్క పంచాయతీని అభివృద్ధి చేస్తూనే మరో పక్క పంచాయతీ పరిధిలోని ప్రైవేటు కంపెనీల సహాకారంతో ప్రజాహిత కా ర్యక్రమాలు చేపట్టారు. వైద్యశిబిరాలు, ప్లాస్టిక్ నిషేదం,మద్య నిషేదం,బడిమానివేసిన పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. అం తేకాకుండా బాల్యవివాహాలు,అంటరానితనంపై ప్రజల్లో అవగాహన కల్పిం చారు. పంచాయతీ పరిధిలో వంద శా తం మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగు, ప్రతి గ్రామంలో సభలో నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపుతూ అతి కొద్ది కాలంలోనే ఈ యువ పంచాయతీ అధ్యక్షుడు ప్రజల మన్నలు పొం దారు. అంతేకాకుండా చెన్నైకి చెందిన చెన్నై మెట్రో వార్త పత్రికలో ఈ పంచాయతీ అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళిక వ్యాసాలు రాశారు. వీటికి గుర్తింపుగా చెన్నై మెట్రో పత్రిక 2013 సంవత్సరంకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీ అభివృద్ధి చేసిన అధ్యక్షుడు ఎంపిక చేసింది. అందుకుగాను ఈ తెలుగు గ్రామ అధ్యక్షుడు శివకుమార్ సేవారత్న 2013 అవార్డును పొందారు. ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదగా శివకుమార్ రెండు రోజుల క్రితం అందుకున్నారు. ఈ సం దర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. తన సేవలను గుర్తించి సంస్థ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలి పారు. పంచాయతీ అభివృద్ధిలో తనకు సహకరించిన వార్డు సభ్యులు, గ్రామ నిర్వాహణాధికారి, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఏసీబీ వలలో లైన్‌మేన్
విజయవాడ, న్యూస్‌లైన్ : విద్యుత్తు లైన్ కేటగిరి మార్పు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన లైన్‌మ్యాన్‌ను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం రోడ్డులో నవభారత్ పబ్లిక్ స్కూల్ ఉంది. దీన్ని ఇటీవల భవనం రెండో అంతస్తులోని రేకుల షెడ్డులోకి మార్చారు. డొమిస్టిక్ కేటగిరీలో ఉన్న విద్యుత్తు కనెక్షన్‌ను కమర్షియల్ కేటగిరీలో మార్పుచేయాలని కరస్పాండెంట్ ముద్దాడ శివకుమార్ లైన్‌మ్యాన్ సాంబశివరావును కోరారు. అందుకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సాంబశివరావు డిమాండు చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని శివకుమార్ చెప్పడంతో కనెక్షన్ కట్ చేస్తానని లైన్‌మ్యాన్ హెచ్చిరించారు. దీంతో ఈ నెల 16వ తేదీన శివకుమార్ చిట్టినగర్ విద్యుత్తు కార్యాలయం ఏఈ సింహచలంకు కేటగిరి మార్పు చేయాలంటూ దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సాంబశివరావు డబ్బు కోసం మరోమారు శివకుమార్‌పై ఒత్తిడి పెంచారు. డబ్బు ఇవ్వకుంటే మూడు నెలల బకాయిలు ఉన్నట్లు చూపిస్తాననంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో శివకుమార్ ఏసీబీ డీఎస్పీ ఆర్ విజయ్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే శివకుమార్‌కు సాంబశివరావు ఫోన్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు సూచించినట్లు సాంబశివరావుకు ఫోన్ చేసి ఆదివారం ఉదయం ఒంటిగంటకు స్కూల్ వద్దకు రావాలని శివకుమార్ చెప్పారు. అక్కడికి చేరుకున్న సాంబశివరావు రూ.500 నోట్లు నాలుగు ఇచ్చారు. ఆ డబ్బు జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు సాంబశివరావును పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాం ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి ఉద్యోగుల్లో.. ఏసీబీ గుబులు ఏసీబీ వరుస దాడులతో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులను వణికిస్తోంది. గత నెలరోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ అధికారులు నాలుగు దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ వారం రోజుల్లో రోజువిడిచిరోజు వరుసగా ముగ్గురిని అరె స్టు చేశారు. ఈ నెల 10న నాగార్జునా యూనివర్సిటీలో ఓ ఉద్యోగి వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 23న విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయంపై దాడిచేసి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ శ్రీలతను, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను అరెస్టు చేశారు. నెలవారీ మూమూళ్ల కింద రూ.40 వేలు లంచం తీసుకున్నారని ఏసీబీ వారిద్దరిపై కేసు నమోదు చేసింది. ఈ ఘటనతో జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. సాక్షాత్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌నే అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకోవటం సంచలనం కలిగించింది. అనంతరం 28న మంగళగిరిలో హార్టీకల్చర్ అధికారి సత్యనారాయణను రూ.6 వేలు లంచం తీసుకుంటున్న కేసులో అరెస్టు చేశారు. తాజాగా 29వ తేదీ ఆదివారం విజయవాడ చిట్టినగర్‌లో లైన్‌మన్ సాంబశివరావు వినియోగదారుని సర్వీసు కేటగిరీ మార్చటానికి రూ.2 వేలు లంచం అడిగి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండటంతో ప్రభుత్వ శాఖల్లో అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఉద్యోగులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.