వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ | Law and order monitoring by web casting | Sakshi
Sakshi News home page

వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ

Published Thu, May 1 2014 2:55 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ - Sakshi

వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బుధవారం ఎస్పీ శివకుమార్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. త న కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ ప్రొజెక్టర్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు.

 అంతా ప్రశాంతం
 మానకొండూర్ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ శివకుమార్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొమ్మిదివేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట కరీంనగర్ రూరల్ సీఐ కమలాకర్‌డ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement