శిక్షణ ఐపీఎస్‌లకు ఎన్నికల విధులపై అవగాహన | IPS training in the understanding of election functions | Sakshi
Sakshi News home page

శిక్షణ ఐపీఎస్‌లకు ఎన్నికల విధులపై అవగాహన

Published Tue, Apr 29 2014 4:14 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

శిక్షణ ఐపీఎస్‌లకు ఎన్నికల విధులపై అవగాహన - Sakshi

శిక్షణ ఐపీఎస్‌లకు ఎన్నికల విధులపై అవగాహన

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: సార్వత్రికల ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల విధులు, అధ్యయనం కోసం విచ్చేసిన యువ శిక్షణ ఐపీఎస్ అధికారులకు ఎస్పీ శివకుమార్ సోమవారం ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సుమారు 20 మంది ఐపీఎస్ అధికారులు జిల్లాకు వచ్చారు.

 ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు చేపడుతున్న చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ విధులపై వారికి ఎస్పీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సుబ్బారాయిడు, ఎలక్షన్ సెల్ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement