IPS officers
-
ఐఏఎస్, ఐపీఎస్‌లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం బిగ్ టాస్క్ అన్నారు. కొత్తగా ఐఏఎస్‌గా వచ్చే వాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.చాలా మందికి కొంత మంది సీనియర్ ఐఏఎస్‌ల గురించి ఇప్పటికి తెలీదు.. శేషన్ ఐఏఎస్.. ఎన్నికల కమిషన్ ఉందని తట్టి లేపిన గొప్ప వ్యక్తి. రాజకీయ నాయకులను గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియడం లేదు. రాజకీయ నాయకులకు అవగాహన కల్పించే సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి. కొత్తగా సెలెక్ట్ అయిన కొందరు ఐపీఎస్‌లు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘కొత్త ఐపీఎస్‌లు యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయితీలు చూసుకోవడం దురదుష్టకరం. ఏసీ రూమ్ నుంచి బయటికి రావడానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇష్ట పడటం లేదు. జనంలోకి రండి అంటే రావడం లేదు. అధికారుల ఆలోచన విధానంంలో మార్పు రావాలి. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్‌లు వస్తాయి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
AP DGP పోస్టు కోసం మూడు ముక్కలాట
-
ఏపీలో ఒకేసారి 27 మంది ఐపీఎస్‌ల బదిలీలు
-
ఆమ్రపాలికి షాక్.. 9 మంది ఏఐఎస్‌లు ఏపీకి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీ కేడర్‌కు బదులుగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలన్న ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. వారిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన ఐదుగురు తెలంగాణలో పనిచేస్తున్నారు. అదేవిధంగా తమను తెలంగాణ కేడర్‌కు బదులు ఏపీ కేడర్‌కు కేటాయించాలన్న మరో ముగ్గురు ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తులనూ తిరస్కరించింది.తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రిలీవ్ చేయడంతోపాటు ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు షంషేర్ సింగ్ రావత్, జి.అనంతరాము ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తూ తమను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించి వారిద్దరినీ ఏపీలోనే కొనసాగాలని ఆదేశించింది. మిగిలిన వారంతా ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రానికి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది. వివాదం నేపథ్యం ఇది... రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏఐఎస్ అధికారుల కేటాయింపులను కేంద్రం చేపట్టింది. ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం. ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి. సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిష్త్, అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఆయా ఐఏఎస్, ఐపీఎస్‌లు గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వారి వాదనలు విన్న ట్రిబ్యునల్.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పుతో మారిన పరిస్థితి.. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో 2017, 2018లో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. సోమేశ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు... ఆ కేటాయింపును రద్దు చేస్తూ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలని 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది.. ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసులను సమర్ధించింది.. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్న సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.ఈ తీర్పును నాటి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకూ వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపులపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత సర్వీసు, మిగిలిన సర్వీసుతోపాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొని గతంలో జరిపిన తుది కేటాయింపులపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వివాదంపై నిర్ణయం తీసుకొనే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది.ఆ అధికారుల విజ్ఞప్తులపై కేంద్రం నిర్ణయం తీసుకొనే వరకు వారందరినీ ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ అధికారుల తుది కేటాయింపులపై పునఃపరిశీలన కోసం హైకోర్టు ఆదేశాల మేరకు డీవోపీటీ శాఖ మాజీ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ దీపక్ ఖండేకర్‌తో ఆ శాఖ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా అధికారుల నుంచి కమిటీ వినతిపత్రాలను స్వీకరించడంతోపాటు వారితో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరిస్తూ డీవోపీటీకి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను డీవోపీటీ ఆమోదించింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారులు 1..మల్లేల ప్రశాంతి 2. వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి 3. ఎ.వాణీ ప్రసాద్, ముఖ్యకార్యదర్శి, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ 4. డి.రోనాల్డ్ రోస్, ఇంధన శాఖ కార్యదర్శి 5. కాటా ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలంగాణకు కేటాయించాలన్న విజ్ఞప్తి తిరస్కరించడంతో ఏపీలోనే కొనసాగనున్న ఐఏఎస్ అధికారులు.. 1. షంషేర్ సింగ్ రావత్, స్పెషల్ సీఎస్, ఏపీ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు) 2.జి.అనంతరాము, స్పెషల్ సీఎస్, ఏపీ అటవీ శాఖ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు 1.అంజనీకుమార్, డీజీ, రోడ్ సేఫ్టీ ఆథారిటీ 2. అభిలాష భిస్త్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏపీ నుంచి తెలంగాణకు రానున్న ఐఏఎస్ అధికారులు... 1.శివశంకర్ లోతేటి – వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ 2. శ్రీజన, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ 3. సి.హరికిరణ్ -
ముగ్గురు ఐపీఎస్ లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు
-
జత్వాని ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
-
రెడ్‌బుక్ కుట్ర.. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అమలుచేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు పతాకస్థాయికి చేరుతున్నాయి. ఇందుకోసం పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించేందుకు బరితెగిస్తోంది. అందులో భాగంగానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్‌గున్నీలను సస్పెండ్ చేస్తూ ఆదివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ‘వలపు వల(హనీ ట్రాప్) వేసి బడా బాబులను బురిడీకొట్టించే కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. చంద్రబాబు ప్రభుత్వ కథా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో సాగిన ఈ కక్ష సాధింపు కుట్ర కోసం ఏకంగా న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడమే కాదు.. నిబంధనలనూ తుంగలో తొక్కారు. ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించకుండానే వారిని సస్పెండ్ చేయడంపట్ల పోలీసు వర్గాలు విభ్రాంతి వ్యక్తంచేస్తున్నాయి.విచారణ అధికారిగా జూనియర్ అధికారి..సాధారణంగా.. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వస్తే విచారణకు పాటించాల్సిన నిబంధనలను నిర్భీతిగా చంద్రబాబు సర్కారు ఉల్లంఘించింది. సస్పెన్షన్‌కు గురైన ముగ్గురిలో పీఎస్ఆర్ ఆంజనేయుడు డీజీ స్థాయి, కాంతిరాణ ఐజీ స్థాయి, విశాల్ గున్నీ డీఐజీ స్థాయి అధికారులు. వారిపై ఫిర్యాదులొస్తే వారికంటే ఉన్నతస్థాయి అధికారినిగానీ సమానస్థాయి అధికారికిగానీ విచారణ బాధ్యతలు అప్పగించాలి. కానీ, వారికంటే జూనియర్ అయిన ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న విజయవాడ డీసీపీ స్రవంతి రాయ్‌ను విచారణాధికారిగా నియమించడం గమనార్హం. ఆమె కూడా నిబంధనలను పాటించకుండానే విచారణ తంతు ముగించారు. ఫిర్యాదు వచ్చిన ముగ్గురు పోలీసు అధికారులను ఆమె కనీసం సంప్రదించనే లేదు. పైగా వారి నుంచి వివరాలు తెలసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ వాంగ్మూలాలు నమోదుచేయాలన్న కనీస నిబంధనను కూడా పాటించకపోవడం విడ్డూరం. మరి స్రవంతి ఏ ప్రాతిపదికన విచారణ నిర్వహించారన్నది అంతుబట్టడమే లేదు. ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లుగానే ఆమె ఏకపక్షంగా నివేదిక సమర్పించారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు కనుసన్నల్లోనే సాగినట్లు స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించారా లేదా అన్నది డీజీపీ కూడా పరిశీలించనే లేదు. ప్రభుత్వ ‘ముఖ్యనేత’ ఆదేశాల ప్రకారం ఈ ముగ్గుర్ని ఏకపక్షంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇదే కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను కొన్నిరోజుల క్రితమే సస్పెండ్ చేశారు.ఏకపక్షంగా సస్పెన్షన్ ఉత్తర్వులు..పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో అందుకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేదు. ముంబై నటి కాదంబరి జత్వానీని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుచేసినందునే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ, ఆమె అరెస్టు ఎలా అక్రమం అనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదు. ఎందుకంటే కాదంబరి జత్వానీ అరెస్టు అంశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి విజయవాడ పోలీసు అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారు. అదెలాగంటే..⇒ విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్ వారంట్ తీసుకుని మరీ పోలీసులు ముంబై వెళ్లారు.⇒ కాదంబరి జత్వానీని అరెస్టుచేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు. వారి సహకారంతో వారి సమక్షంలోనే ఆమెను అరెస్టుచేశారు. ⇒ అనంతరం కాదంబరి జత్వానీ అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు. ⇒ దాంతో ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తూ పీటీ వారంట్ జారీచేసింది. ⇒ అనంతరం.. కాదంబరి జత్వానీని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమె అరెస్టు సక్రమమేనని విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించి.. ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలతో సంతృప్తి చెందింది. అందుకే ఆమెకు రిమాండ్ విధించింది. ..ఇలా కాదంబరి జత్వానీ అరెస్టు ప్రక్రియలో అప్పటి విజయవాడ పోలీసులు ఇంతగా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే.. అసలు ఆమె అరెస్టు అక్రమమని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండటం విడ్డూరంగా ఉంది. కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకుండానే అక్రమ అరెస్టని ఏకపక్షంగా ప్రకటించడం ప్రభుత్వ కక్షసాధింపు చర్య తప్పా మరొకటి కాదని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి.కాదంబరి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు..వాస్తవానికి.. వలపు వల (హనీట్రాప్) వేసి బడాబాబులను బురిడీ కొట్టించడంతోపాటు కాదంబరి జత్వానిపై అనేక తీవ్రమైన అభియోగాలున్నాయి. తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాదంబరి జత్వానీనే తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇక ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించారనడానికి కూడా ఆధారాలున్నాయి. డాక్టర్ కాకుండానే తనను తాను డాక్టరుగా ఆమె చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడే తాను ఇబ్రహీంపట్నంలో రెండు నెలలపాటు ఉన్నానని ఆమె తన పిటిషన్లోనే అంగీకరించారు. ఆ సమయంలో తమకు సహాయం కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని కూడా తెలిపారు. అంటే.. అప్పటి విజయవాడ పోలీసులు నిబంధన మేరకే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రధారులుగా విజయవాడ పోలీసులు.. అంతటి నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పోలీసులకు విశిష్ట అతిథిగా మారిపోయారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసే కుట్ర అమలులో భాగంగా ఆమెకు ప్రభుత్వ అతిథి స్థాయిలో విజయవాడ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. నిజానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న మహిళలు, బాలికల అత్యాచారాలపై కూడా ఏమాత్రం స్పందించని పోలీసులు కాదంబరి విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించారు. గతంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా తప్పుల తడకగా ఉందని నెలక్రితం పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెతో తాజాగా మరో ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. రెండోసారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్టు చేసేందుకు డీసీపీ విశాల్ గున్నీని ప్రత్యేక విమానంలో ముంబై పంపించారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, విశాల్ గున్నీ తదితరులు సాధారణ విమానంలోనే ముంబై వెళ్లారని.. విమాన టికెట్లు ముందురోజే బుక్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు కుట్రలో విజయవాడ పోలీసులు పాత్రధారులు, భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారన్నది సుస్పష్టం. ‘వలపు వల’ కేసుకు సంబంధించి నిందితురాలి విషయంలో పోలీసు వ్యవస్థ స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు అధికారులు..ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా తమను సస్పెండ్ చేయడంపై పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించాలని పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ భావిస్తున్నట్లు సమాచారం. -
TG: పలువురు ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా విజిలెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ నియమితులయ్యారు.బదిలీల ప్రకారం.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ఏసీబీ డీజీగా విజయ్ కుమార్విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్‌కు అదనపు బాధ్యతలు. పోలీస్ పర్సనల్ ఏడీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు. -
ఐఏఎస్.. ఐపీఎస్‌ల ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి
వాళ్లు అఖిలభారత సర్వీసు అధికారులు.. ప్రజాసేవను వృత్తిగా ఎంచుకుని ఉన్నతమైన లక్ష్యాలతో ఎన్నో కఠినపరీక్షలు గెలిచి ఈ అత్యున్నత సర్వీసుకు ఎంపికైనవారు. అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ బాధ్యతలలో ఉన్న అధికారులను ఎలా చూడాలి? ఎవరి సామర్థ్యం ఏమిటో గుర్తెరిగి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటు వేరు. నచ్చనివారికి నరకం చూపిస్తూ ఆనందించడం వారికి అలవాటు. అదిగో అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో బాగా పనిచేసిన ఓ పలువురు ఐఎఎస్ ఐపీఎస్‌లను ఎంచుకున్నారు. వారి ఆత్మగౌరవంపై ఆటవికంగా దాడిచేస్తున్నారు.. ఓ హోం గార్డుతోనో.. ఓ రౌడీషీటరుతోనో కిందిస్థాయి అధికారులు కూడా వ్యవహరించని రీతిలో డీజీ స్థాయి అధికారులనూ ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అవమానిస్తోంది. పోస్టింగ్ ఇవ్వకపోగా.. ఉదయం డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకం చేసి సాయంత్రం వరకు వెయిటింగ్ చేసి వెళ్లమంటున్నారు.. ఇందుకోసం ఏకంగా ఓ ఉత్తర్వు కూడా జారీ చేయడం చూసి యావత్ అఖిలభారత సర్వీసు అధికారులందరూ విస్తుపోతున్నారు. ఈ ఉన్మాద మెమో గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం దేశ చరిత్రలో ఎవరూ తీసుకోలేదని మాజీ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్‌కుమార్, స్వరణ్‌జిత్‌సేన్ వంటివారు వ్యాఖ్యానించారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి కక్షపూరిత రాక్షస పాలన కరాళ నృత్యం చేస్తోంది. ఓ పక్క ప్రజలపైనే టీడీపీ శ్రేణులు రాత్రీ పగలూ దాడులతో భయంకర వాతావరణాన్ని సృష్టిస్తుంటే.. ఇంకో పక్క ప్రభుత్వమే అధికారులపై పడింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర కీలక అధికారులపై నారా లోకేశ్ విరచిత రెడ్ బుక్ రాజ్యాంగంతో విరుచుకుపడుతోంది. వెంటపడి వేధిస్తోంది. వారిపట్ల నిరంకుశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ, అవమానాలకు గురిచేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. అఖిల భారత సర్వీసుల అధికారుల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏపీలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వ పోకడలపై జాతీయ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చోదక శక్తిగా వ్యవహరించేందుకు దేశంలో ప్రత్యేకంగా అఖిల భారత సర్వీసులకు రూపకల్పన జరిగింది. ఈ ఉన్నతాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది’ అని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఐపీఎస్ అధికారులకు పొస్టింగులు ఇవ్వకుండా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్టు దుష్ట సంప్రదాయానికి తెరతీసిన చంద్రబాబురాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొంది, సీఎంగా బాధ్యతలు స్వీకరించక ముందే చంద్రబాబు దుష్ట సంప్రదాయాలకు తెరతీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అనంతరం ఏకంగా 10 మంది ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారులకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత కక్షపూరితంగా, నిరంకుశత్వంతో వ్యవహరించలేదు. ప్రభుత్వం మారిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం సహజమే. కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యతల ప్రకారం అధికారులకు పోస్టింగులు ఇస్తుంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయమని కూడా ఆదేశిస్తుంది. ఆ తరువాత కొద్ది రోజులకే వారికి ఇతర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చి, వారి సేవలను సద్వినియోగం చేసుకుంటుంది. అంతేగానీ ఏకంగా ఇన్నేసి రోజులు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టదు.అపాయింట్‌మెంటూ ఇవ్వని బాస్లుసాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి బాస్‌లైన సీఎస్, డీజీపీలను అపాయింట్మెంట్ అడిగి కలిసే వీలుంటుంది. తమ సర్వీసుకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా విషయాలను వారు సీఎస్, డీజీపీల దృష్టికే తీసుకువెళ్లాలి. వాటిని సరైన దృక్పథంతో పరిశీలించాల్సిన బాధ్యత సీఎస్, డీజీపీలపై ఉంది. కానీ సీఎం చంద్రబాబు చెప్పడంతో ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎస్, డీజీపీ రెండు నెలలుగా అపాయింట్మెంటే ఇవ్వడం లేదు. ఇక్కడితోనూ చంద్రబాబు రెడ్ బుక్ దాహం తీరలేదు. ఐపీఎస్ అధికారులను మరింతగా అవమానించాలని పట్టుబట్టారు. ఆ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ సీహెచ్ ద్వారకా తిరమలరావుకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో డీజీపీ ఈ నెల 12న ఓ విభ్రాంతికరమైన మెమో జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న 23 మంది ఐపీఎస్ అధికారుల్లో 16 మందికి ప్రతి రోజూ డీజీపీ కార్యాలయానికి రావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఉదయం 10 గంటలకు వచ్చి వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్లో సంతకం చేయాలని, సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి, మళ్లీ ఆ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలి’ అని ఆదేశించారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన డీజీపీ కేవలం రాజకీయ ఒత్తిడితో సాటి అధికారులను ఈ విధంగా ఆదేశించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వెయిటింగ్ మెమో.. ఇదేమి పద్ధతి?ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వనప్పుడు వారిని సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయమని ఆదేశిస్తారు. తరువాత కొద్ది రోజులకే వారికి పోస్టింగులు ఇస్తారు. ఇటీవల పోస్టింగులు ఇవ్వని 16 మంది ఐపీఎస్ అధికారులను కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాజా ఆదేశాల ప్రకారం వారు రోజూ డీజీపీ కార్యాలయానికి రావాలి. వెయిటింగ్ హాల్లో పడిగాపులు కాయాలి. అన్ని గంటలపాటు వారు ఏం చేస్తారు అన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబు సర్కారుకు లేదు. ఇలా అధికారులను రోజుకో రీతిలో అవమానిస్తూ చంద్రబాబు ఓ రాజకీయ సైకోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోమ్‌గార్డు స్థాయి ఉద్యోగి పట్ల కూడా గతంలో ఏ ప్రభుత్వమూ ఈ రీతిలో వ్యవహరించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.రాజ్యాంగహక్కుల ఉల్లంఘనే.. డీవోపీటీకి నివేదిక..!చంద్రబాబు ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపట్ల అమానవీయంగా, కర్కశంగా వ్యవహరించడం అధికారులుగానే కాదు.. పౌరులుగా కూడా వారి రాజ్యాంగప రౖమెన హక్కుల ఉల్లంఘనేనన్న విమర్శలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, డీజీపీలుగా, ఉన్నత హోదాల్లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల కక్షపూరిత చర్యలను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాన్ని వాట్సాప్ గ్రూపుల్లో, ప్రైవేటు సంభాషణల్లో నిరసిస్తున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు.టీడీపీ నేత వెంకటరెడ్డి ట్వీటో, ఎల్లో మీడియా పోస్టులో రాష్ట్రంలో అధికారుల పోస్టింగులను నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. – అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా హరితకు పోస్టింగ్ ఇచ్చి, ఆ వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించిన ఉదంతంపై రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుగత రెండు నెలలుగా రాష్ట్రంలో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు సామాన్యులే లక్ష్యంగా టీడీపీ గూండాలు వరుస హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలతో బీభత్సం సృష్టిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అధికారిక కక్ష సాధింపులు, వేధింపులకు అఖిల భారత సర్వీసు అధికారులు బాధితులుగా మారడం విభ్రాంతి కలిగిస్తోంది. – ఓ సామాజిక విశ్లేషకుడి అభిప్రాయమిదిటీడీపీ సోషల్ మీడియా వద్దంటే.. వద్దు పోస్టింగులు ఇచ్చి మరీ ఉపసంహరణ చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడుతనానికి మరో ఉదాహరణ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆడమన్నట్టల్లా ఆడటం. ఎవరికైనా పోస్టింగు ఇవ్వొద్దని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు ఆ అధికారిని ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సోషల్ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అంతే.. ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. మహిళా అధికారి డి.హరితను అనంతపురం జేసీగా నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం తాజా ఉదాహరణ. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన డి.హరిత కొద్ది నెలలుగా వెయిటింగ్లో ఉన్నారు. ప్రభుత్వం ఆమెను రెండు రోజుల క్రితం అనంతపురం జేసీగా నియమించింది. వెంటనే టీడీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు వ్యతిరేకించారు. అంతే.. 24 గంటల్లోనే ఆమె పోస్టింగ్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకొని, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారుల పోస్టింగులు, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. కానీ చంద్రబాబు వాటిని టీడీపీ ప్రధాన కార్యాలయం వ్యవహారంగా దిగజార్చేశారని అఖిలభారత సర్వీసు అధికారులు మండిపడుతున్నారు.ఇవీ ఉత్తమ సంప్రదాయాలువైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలో సీఎస్‌గా వ్యవహరించిన మోహన్ కందానే సీఎస్‌గా కొనసాగించారు. ఆయన రిటైరయ్యే వరకు ఆ పోస్టులోనే ఉన్నారు. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టింగులు ఇచ్చింది. చంద్రబాబు హయాంలో సీఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్‌ను కీలకమైన సీసీఎల్ఏ కార్యదర్శిగా, సతీష్‌చంద్రను ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా చేసిన ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించి, ఆయన రిటైరైన తరువాత కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడిగానూ నియమించింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువైన ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్‌ను గ్రేహౌండ్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేగానీ ఎవరికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచలేదు. చంద్రబాబు ఆ సత్సంప్రదాయాలను తుంగలో తొక్కింది.మూర్ఖమైన నిర్ణయంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు అధికారులను వేధిస్తోంది. ఇటువంటి దుర్మార్గమైన, హేయమైన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ దేశ చరిత్రలోగానీ ఎవరూ తీసుకోలేదు. ఏపీ, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. గొంతు విప్పలేనివారు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం గత నెల ఇద్దరు డీజీపీ స్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఏకంగా 16 మందికి పైగా ఐపీఎస్ అధికారులకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా అవమానిస్తోంది. వారి గాయాలపై కారం చల్లేలా ఏపీ డీజీపీ తాజాగా మెమో జారీ చేశారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించడం కేవలం కక్ష సాధింపు చర్యే. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను సంతృప్తి పరిచేందుకే ఈ మెమో జారీ చేశారు. ఇది అత్యున్నత స్థాయిలో తీసుకున్న మూర్ఖపు నిర్ణయం. వెయింటింగ్ హాల్లో కూర్చొని ఆ అధికారులు ఏం చేయాలి? గాసిప్పులు మాట్లాడుకోవాలా? ధ్యానం చేయాలా? సీనియర్ అధికారులను వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. బదిలీ చేసిన వారికి ఎక్కడో ఒక చోట పోస్టింగు ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిఏపీ ప్రభుత్వ చర్య అసంబద్ధం ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనలకు విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలని 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏమిటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి ఆ అధికారులకు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి, దేశానికే నష్టం. వారి సేవలను ఏదో రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణం పోస్టింగులు ఇవ్వాలి. – స్వరణ్‌జిత్ సేన్, ఉమ్మడి ఏపీ రిటైర్డ్ డీజీపీ -
సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష
-
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి
-
ఏపీలో 37 మంది ఐపీఎస్ ల బదిలీ
-
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఎల్. సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా నియమించారు.ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద సుబ్బారాయుడు ఓఎస్డీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆయన్ని డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపింది. బదిలీ చేసిన వారిలో 28 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మిగిలిన 9 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. -
TG: ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం(జులై1) బదిలీ చేసింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయలను ప్రభుత్వం నియమించింది. -
ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీ అయ్యారు. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా సునీల్‌కుమార్‌కు ఆదేశాలిచ్చింది. రిషాంత్‌రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.ఏసీబీ డీజీగా అతుల్‌సింగ్‌కు, ఫైర్ సేప్టీ డీజీగా శంకబ్రత బాగ్బీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. -
మారని బాబు.. మళ్లీ అదే రుబాబు
ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రాజ్యాంగం అంటే ఏనాడూ లెక్కలేదు. రాజ్యాంగబద్ధ సంస్థలంటే ఏమాత్రం గౌరవం లేదన్నది జగద్విదితం. ప్రజా విశ్వాసం ఏనాడూ చూరగొనలేని ఆయన ఉపయోగించే ఏకైక కుతంత్రందుష్ప్రచారం. అందుకు సాధనం ఈనాడు, ఇతర ఎల్లో మీడియా. రాజకీయ ప్రయోజనాల కోసం తాను పాల్పడే కుట్రలకు అడ్డువస్తే కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) వంటి రాజ్యాంగబద్ధ సంస్థపైనా దుష్ప్రచారం చేసేందుకు వెనుకాడనని 2019 ఎన్నికల ముందే ఆయన చేతల్లో చూపారు. ఏకంగా ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత బరితెగింపు చంద్రబాబుకే సాధ్యం. కానీ హైకోర్టు తీర్పుతో టీడీపీ కుట్రబెడిసికొట్టడం... ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరపరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే 2024 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు అదే రీతిలో దుష్ప్రచార కుట్రను తెరపైకి తెచ్చారు. ఈసారి కూడా ఏకంగా ఈసీతోపాటు యావత్ పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా విష ప్రచారానికి తెగించారు. ఈసీ నిర్ణయాలను అధికార వైఎస్సార్సీపీ హుందాగా స్వీకరిస్తూ గౌరవిస్తుంటే.... ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా మాత్రం రోజుకో రీతిలో విష ప్రచారంతో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు కుతంత్రం పన్నుతున్నాయి. ఈ కుట్ర రాజకీయాలపై రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం ఈసీకి ఫిర్యాదు చేయడం తాజా పరిణామం. – సాక్షి, అమరావతి 2019 ఎన్నికల ముందు.. ఈసీ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ సీఎస్ ద్వారా ఉత్తర్వులు 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తప్పదని స్పష్టం కావడంతో సీఎం హోదాలో చంద్రబాబు అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారు. అప్పటి నిఘా విభాగాధిపతిగా ఉన్న తన సన్నిహితుడు ఏబీవెంకటేశ్వరరావు ద్వారా కుట్రలకు తెరతీశారు. దీన్ని గుర్తించిన ఈసీ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు అప్పటి శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లా ఎస్పీలు అడ్డాల వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మలను 2019, మార్చి 26న బదిలీ చేసింది. వారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులివ్వడంతో పాటు వారికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని స్పష్టం చేసింది. తన కుట్ర బెడిసికొట్టడంతో ఏకంగా ఈసీనే తూలనాడుతూ చంద్రబాబు చిందులు తొక్కారు. ఈసీ ఆదేశాలను అమలు చేసేది లేదని తేలి్చచెప్పారు. ఈసీ రాజకీయ దురుద్దేశంతో నిర్ణయం తీసుకుందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది కూడా. ఇక చంద్రబాబు ఒత్తిడితో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠా నిఘా విభాగాధిపతిగా ఏబీ వెంకటేశ్వరరావును కొనసాగిస్తున్నట్టు 2019, మార్చి 27న ఉత్తర్వులివ్వడం దేశంలోనే సంచలనం సృష్టించింది. అసలు నిఘా విభాగాధిపతికి ఎన్నికల విధులతో సంబంధంలేదని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లా ఎస్పీలు తమను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు తెలుపుతూ ఏకంగా ఈసీకే లేఖ రాయడం కూడా సంచలనమే. అంటే ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగబద్ధ అధికారాలు కలిగిన ఈసీనే చంద్రబాబు ప్రశ్నించారు. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఈసీ జారీ చేసిన ఉత్వర్వులను కొట్టివేయలేమని హైకోర్టు 2019, మార్చి 28న తీర్పునిచ్చింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా నిఘా విభాగాధిపతిగా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను సీఎస్ పోస్టు నుంచి ఈసీ తొలగించింది. దాంతో అధికార యంత్రాంగాన్ని దురి్వనియోగం చేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్న చంద్రబాబు పన్నాగం పూర్తిగా బెడిసికొట్టింది. 2024 ఎన్నికల వేళ.. ► మళ్లీ అదే కుట్రకు తెరతీసిన చంద్రబాబు ► పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుతంత్రం ► ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దుష్ప్రచారం ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు 2019లో వేసిన పన్నాగం బెడికొట్టినా చంద్రబాబు తీరు మారలేదు. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్న తన వదిన దగ్గుబాటి పురందేశ్వరితో కలసి కుట్రకు తెరతీశారు. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు మొదలు పెట్టారు. వాటిని తనకు వత్తాసు పలికే ఈనాడు, ఇతర పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చి అటు ఈసీని ఇటు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభను విజయవంతం చేయడంలో విఫలమైన టీడీపీ ఆ నెపాన్ని పోలీసు అధికారులపై నెట్టివేసేందుకు యత్నించింది. ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా అటు పురందేశ్వరితోనూ ఇటు టీడీపీ నేతల ద్వారా ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయించింది. ఈ నేపథ్యంలో ఈసీ రాష్ట్రంలోని ఒక ఐజీ, అయిదుగురు ఎస్పీలు, ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో కొత్తవారిని నియమించింది. 2019లో చంద్రబాబు వ్యతిరేకించినట్టు ప్రస్తుతం ఈసీ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ వ్యతిరేకించలేదు. ఈసీ నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కానీ చంద్రబాబు మాత్రం తన కుట్రలకు తెరదించ లేదు. అటు ఈసీని ఇటు పోలీసు వ్వవస్థను లక్ష్యంగా చేసుకుని మళ్లీ దుష్ప్రచారానికి తెర తీశారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులకు వ్యతిరేకంగా టీడీపీ కరపత్రంగా ఉన్న ఈనాడు పత్రికలో ‘ వీళ్లా కొత్త ఎస్పీలు’అంటూ ఓ దురుద్దేశపూరిత కథనాన్ని బ్యానర్‌గా ప్రచురించేట్టు చేశారు. ఈసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, కొత్తగా నియమితులైన ఎస్పీలకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారానికి పాల్పడ్డారు. ఈనాడు పత్రిక తీరును ఖండిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటన జారీ చేస్తే... దానికి కూడా వక్రభాష్యం చెబుతూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా మరోసారి దుష్ప్రచారంతో చెలరేగిపోయాయి. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఎల్లో మీడియా రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీకి, పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా విషం చిమ్ముతోందన్నది స్పష్టమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలు, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో పత్రికలు, టీవీ చానళ్లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారుల సంఘం ఈసీకి ఫిర్యాదు చేసింది. -
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. సీఎస్ జవహర్‌రెడ్డి సీరియస్
సాక్షి, విజయవాడ: ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు రాసిన అబద్ధపు రాతలపై సీఎస్ ఖండన లేఖను విడుదల చేశారు. తన ఖండన ఈనాడు మొదటి పేజీలో ప్రచురించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారంటూ సీఎస్ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు ఏసీఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది. అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి. అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం. ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు. అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు. తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా’’ అని సీఎస్ జవహర్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్‌ల సంఘం ఆగ్రహం పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్‌ల సంఘం మండిపడింది. ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలకు దిగాలని నిర్ణయించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించమని ఐపీఎస్‌ల సంఘం తేల్చి చెప్పింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈసీకి పురేందశ్వరి ఫిర్యాదు చేయడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఐపీఎస్ అధికారుల సంఘం వెల్లడించింది. ఇదీ చదవండి: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా చంద్రబాబూ.. -
ఎన్నికల నిబంధనల మేరకే ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసుల నిస్వార్థ సేవలను, ప్రతిష్టను దెబ్బతీసేలా ఎల్లో మీడియా రాసిన కథనాలను తీవ్రంగా ఖండించింది. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించింది. పోలీసు అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్యకాదని హితవు పలికింది. పదేపదే బాధ్యతారాహిత్య కథనాలు ప్రచురిస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన అవసరాలకు తగ్గట్లుగా ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు చేసుకునే అధికారం ఉంటుందని స్పష్టంచేసింది. -
తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► నిజామాబాద్ అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్‌ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. ► ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ఉట్నూరు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చేతన్ బాజ్‌పాయ్‌ను తదుపరి పోస్టింగ్‌కు సాధారణ పరిపాలన శాఖను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాచకొండ సీపీగా తరుణ్‌జోషీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీగా మల్టీజోన్–2 ఐజీగా ఉన్న డా.తరుణ్‌జోషి నియమితులయ్యారు.రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుదీర్‌బాబును మల్టీజోన్ –2 ఐజీగా నియమించారు. మల్టీజోన్–1 ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. -
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ జరిగింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు బదిలీ కాగా, సుధీర్‌బాబును హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా నియమించారు. ఇక రాచకొండ సీపీగా తరుణ్జోషిని నియమించారు. రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ సౌత్‌వెస్ట్ డీసీపీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. -
తెలంగాణలో బయటపడుతోన్న పలువురు ఉన్నతాధికారుల బాగోతం
-
పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా, సామాజికంగా ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ అధికారుల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకొనిపోతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని తెలిపారు. పోలీసుల పాత్ర క్రియాశీలకం కావాలి.. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీసు ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లను సీఎం కోరారు. ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీ (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్)గా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను అదనపు డీజీ (రైల్వేస్)గా నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ (సీఐ) విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు
ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. -
తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతకముందే 26 మంది ఐఏఎస్‌ల బదీలీ చేసిన విషయం తెలిసిందే. కేవలం గంటల వ్యవధిలోనే ఐపీఎస్‌లకు కూడా స్థాన చలనం కల్పించడం గమనార్హం. బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే.. ►టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వీవీ శ్రీనివాసరావు నియామకం ►ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరి ►మల్టీజోన్-7 డీసీపీగా జోయల్ డెవిస్ ►సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్ ►హైదరాబాద్ ట్రాఫిక్-3 డీసీపీగా వెంకటేశ్వర్లు ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకీ దరావత్ ►ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్‌కుమార్ ►మేడ్చల్ డీసీపీగా నితికాపంత్ ►మాదాపూర్ సీడీపీగా వినిత్ ►కో-ఆర్డినేషన్ డీఐజీగా డా. గజారావ్ భూపాల్ ►రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్ ►రామగుండం సీపీగా ఎల్ఎస్ చౌహాన్ ►మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ ►నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మీల ►ఖమ్మం సీపీగా సునీల్ దత్ ►సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్ ►ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి ►ఆదిలాబాద్ ఎస్పీగా గౌష ఆలం ►ములుగు ఎస్పీగా శబరీష్ ►సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ ► కొత్తగూడెం ఎస్పీగా రోహిత్‌రాజు ►మెదక్ ఎస్పీగా బాలస్వామి ►జయశంకర్ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్ కుమార్ -
భారీగా ఐఏఎస్ బదిలీలు
-
డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఆయనకు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (హెచ్ఓపీఎఫ్)గా బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న కొందరికి పోస్టింగులు ఇచ్చింది. డీజీపీగా పనిచేస్తూ ఎన్నికల సంఘం సస్పెన్షన్‌కు గురై వెయిటింగ్లో ఉన్న అంజనీకుమార్‌ను రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా కూడా ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న మరో అధికారి సీవీ ఆనంద్‌ను ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. మొత్తం 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ, పోస్టింగులు ఇస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు
-
ఐపీఎస్‌ల ప్రజారవాణా సందేశం
బెంగళూరు : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలో ఐపీఎస్‌లు కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాట పట్టారు. బస్సులు, మెట్రో రైలులో ప్రయాణించి తమ కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వహించారు. బస్సు, మెట్రోరైలులో విధులకు వెళ్లే ఫొటోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు పెరిగి ట్రాఫిక్, కాలుష్యానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనైతే శీతాకాంలో సరి, బేసి పద్ధతిలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణం మంచి సందేశానిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Bengaluru: On #WorldPublicTransportDay, several IPS officers in the city took public transport while heading to the office. pic.twitter.com/nUwdcM807c — South First (@TheSouthfirst) November 10, 2023 -
20 మంది IAS, IPS, నాన్ కేడర్ ఎస్పీలపై EC వేటు
-
ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. కాగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందాయి. అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. అంతేగాక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేవంలో పలువురు అధికారుల పనితీరుపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికారుల పనితీరు, సంబంధిత ఇన్పుట్లను అంచనా వేసిన తర్వాత సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం అయిదు గంటల వరకు ప్యానెల్ లిస్ట్ పంపాలని ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఎస్‌ను ఆదేశించింది. తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ర్పరాజ్ అహ్మద్ , కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవిని కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. -
తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి, హోంగార్డు డీఐజీగా అంబారి కిషోర్, మేడ్చల్ డీసీపీగా శబరీస్, పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యామిశ్రా బదిలీ అయ్యారు. -
ఏపీలో భారిగా ఐపీఎస్ ల బదిలీ
-
TS: ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు... -
హైకోర్టు తీర్పు గుబులు.. ఆ 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితేంటి?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినందున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ రాష్ట్రానికే వెళ్లాలని మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నతాధికారుల్లో గుబులు రేపుతోంది. హైకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ తీర్పుతో మిగిలిన ఉన్నతాధికారులంతా విధిగా ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా అలాగే తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి) -
ఒక తీర్పు.. పలువురిలో కలవరం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ కేడర్‌లో కొనసాగడానికి రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోని సివిల్ సర్వీసెస్ అధికారులను ఆప్షన్లు అడిగిన తరువాత.. వారి సీనియారిటీ, స్థానికత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వారిని రెండు రాష్ట్రాలకు విభజించి కేటాయింపు జరిపింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పలు కారణాలు చూపిస్తూ.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ను ఆశ్రయించి ఏపీకి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి అనుమతులు తెచ్చుకున్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా వీరిలో ఉన్నారు. అయితే డీవోపీటీ 2017లోనే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం మంగళవారం తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం..సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు ఇవ్వడం.. పలువురు అధికారులను కలవరపరుస్తోంది. తామంతా ఏపీకి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సదరు ఐఏస్, ఐపీఎస్ అధికారుల్లో కొనసాగుతోంది. ఏపీకి కేటాయించిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన కొందరు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నారు. అక్కడివారు ఇక్కడ.. ఇక్కడివారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా కాగా తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇన్చార్జి డీజీపీగా అందుకేనా? తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్‌ను రెగ్యులర్ డీజీపీగా కాకుండా ఇన్చార్జి డీజీపీగా నియమించడానికి ప్రధాన కారణం హైకోర్టులో సోమేశ్‌కుమార్‌పై కొనసాగుతున్న కేసు నేపథ్యమేనన్న ప్రచారం ఉంది. తాజా తీర్పుతో ఇప్పుడు అంజనీకుమార్ పరిస్థితేంటన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా సీనియర్ ఐఏఎస్‌ల్లో వాకాటి కరుణ ప్రస్తుతం విద్యా శాఖ కార్యదర్శిగా, వాణీప్రసాద్ పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణా సంస్థలో డైరెక్టర్‌గా, రొనాల్డ్‌రోస్ ఆర్థికశాఖ కార్యదర్శిగా, ఎం.ప్రశాంతి అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాటా ఆమ్రపాలి కేంద్ర సర్వీస్‌ల్లోకి వెళ్లి ప్రస్తుతం పీఎంఓలో ఉన్నారు. -
తెలంగాణ ఐపీఎస్‌లకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల పోస్టింగ్‌ల విషయంలో తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. డీజీపీతో సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వగా.. వారిలో ఏ ఒక్కరు కూడా తెలంగాణ మూలాలున్న అధికారి లేరని వ్యాఖ్యానించారు. ‘‘కల్వకుంట్ల రాజ్యంలో ... నిన్న పార్టీలో... నేడు పరిపాలనలో మాయమైపోయిన తెలంగాణం’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. -
భారత భవిష్యత్తు మీ భుజాలపైనే..!
సాక్షి, హైదరాబాద్: భారత భవిష్యత్తు భారం యువ ఐపీఎస్ అధికారుల భుజస్కంధాలపైనే ఉందని, వారంతా భారత ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి మంగళవారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)ని సందర్శించారు. ఎన్పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ అకాడమీ తరఫున రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ ఆవరణలోని ఐపీఎస్ అధికారుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత అకాడమీలో శిక్షణ పొందుతున్న 195 మంది 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన సేవలోకి అడుగు పెడుతున్న యువ ఐపీ ఎస్‌లకు అభినందనలు తెలిపారు. ప్రభు త్వాల పనితీరును, ప్రతిష్టను పెంచే కీలక బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు చేరువ చేయ డంలో పోలీస్ అధికారుల వ్యక్తిత్వం, ప్రవర్తన కీలకమని సూచించారు. నేరాల కట్టడి, నేరాల దర్యాప్తు, ఉగ్రవాదం, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాల అదుపు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. పోలీసింగ్‌లో నాయకులుగా నిలవాలి సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషి స్తున్నారని, గత మూడేళ్లుగా ఎన్పీఏ శిక్షణ లోనూ మహిళా అధికారులు సత్తా చాటు తూ టాపర్లుగా నిలిచారని రాష్ట్రపతి చెప్పారు. మరో 25 ఏళ్లలో భారతదేశం వందో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందని, భవిçÙ్యత్ భారత నిర్మాణంలో ఈ యువ అధికారులది కీలక పాత్ర అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలకులకు మేలుకొలుపు!
‘ఉత్తములైన సివిల్ సర్వీస్ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్ మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది. రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్’. బాలికా సాధికారత ద్వారానే బిహార్ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్కిన్లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్‌లోనే అధికమని మొన్న ఏప్రిల్‌లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్కిన్లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది. కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్జోత్ కౌర్ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ‘ఇవాళ నాప్కిన్స్ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది. పైగా దేశాన్ని పాకిస్తాన్ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు. అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్కిన్ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్జోత్ కౌర్‌కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు. కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్కిన్ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. రెండేళ్లనాడు సివిల్ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. -
Telangana-IPS Officers: పోస్టింగ్ లేదు.. వెళ్లిపోదాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖలో పోస్టింగ్ లేకుండా నెలలకొద్దీ అటాచ్మెంట్ల మీద పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. దీంతో బయటకు చెప్పలేక, పోస్టింగ్ కోసం తిరగలేక కొంతమంది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది నుంచి వెయిటింగ్లో ఉన్న ఓ సీనియర్ ఐపీఎస్‌తోపాటు డీఐజీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న మరో అధికారి, ఇద్దరు సీనియర్ ఎస్పీ ర్యాంకు అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు జీఏడీకి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో ఎక్కడో ఒకచోట అవకాశం రాకపోతుందా అని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ లేకపోయినా కనీసం కేంద్ర సర్వీసులో అయినా మూడేళ్లు, అవకాశం ఉంటే మరో రెండేళ్లు అక్కడే పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు... కేంద్ర సర్వీసుల్లో పనిచేసి వచ్చిన రాష్ట్ర కేడర్ అధికారులు, ఇంటర్ కేడర్ డిప్యుటేషన్, కేడర్ మార్చుకొని వచ్చిన అధికారులు పోస్టింగ్ లేక ఏడాదిగా ఖాళీగా ఉన్నారు. అయితే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పూర్తి చేసుకున్నవారు మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలంటే ఏడాదిపాటు కూలింగ్ పీరియడ్‌గా సొంత కేడర్ స్టేట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే డిప్యుటేషన్ పూర్తిచేసుకొని వచ్చినవారికి ఏడాదిపాటు వెయిటింగ్లో ఉండటం నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడ చేసేదేమీలేక మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కేడర్ మార్చుకొని తెలంగాణకు వచ్చిన అధికారులు సైతం ఇదే పద్ధతిలో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. భారీగానే ఖాళీలు కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో డిప్యుటేషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జూలై చివరి వరకు ఉన్న వేకెన్సీ పరిస్థితిని పరిశీలిస్తే భారీగానే ఖాళీలున్నట్టు కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. డైరెక్టర్ జనరల్(డీజీ) ర్యాంకులో రెండు పోస్టులు, స్పెషల్ డైరెక్టర్ జనరల్ ర్యాంకులో రెండు పోస్టులు, ఐజీ ర్యాంకులో 25 పోస్టులు, డీఐజీ హోదాలో 102 పోస్టులు, ఎస్పీ ర్యాంకులో 116 పోస్టులు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పోస్టింగ్ లేని అధికారులు కేంద్రంలోకి వెళ్లేందుకే సానుకూలంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. -
Telangana: ఇదేమి ‘పని’ష్మెంట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని పలువురు ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఎలాంటి కచ్చితమైన విధులు లేకుండా, పోస్టింగుల్లేకుండా కాలం వెళ్లదీస్తున్న వైనం విస్మయానికి గురిచేస్తోంది. ఇలా మొత్తం 47 మంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్ / అటాచ్మెంట్ పేరుతో ఎలాంటి ఉద్యోగం, బాధ్యత లేకుండా గడిపేస్తున్నారు. ఏదో ఒక విభాగానికి అటాచ్ అయిన కొందరికి జీతభత్యాలు అందుతున్నా, పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నవారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఎప్పుడు శాశ్వత పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నట్టు పోలీసు అధికారులే చెబుతుండటం గమనార్హం. అసలు ఎందుకు ఐపీఎస్ అధికారులయ్యామో తెలియని దుస్థితిలో ఉన్నామంటూ అదనపు ఎస్పీ, ఏఎస్పీ స్థాయిలో ఉన్న కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పదోన్నతి పొందినా పరిస్థితి మారకపోవడం మానసికంగా కుంగుబాటుకు కారణమవుతోందని చెబుతున్నారు. సీనియర్ ఐపీఎస్‌ల పరిస్థితి ఇలా ఉంటే శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపీఎస్‌ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాల్సిన వారిని అటాచ్మెంట్ పేరుతో మూడేళ్లుగా గ్రేహౌండ్స్‌లోనే కొనసాగించడం వివాదాస్పదమవుతోంది. ఏళ్ల తరబడి ఒకే పోస్టులో.. ► కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతున్న వైనం కూడా విస్మయపరుస్తోంది. ► సీనియర్ ఐపీఎస్‌గా ఉన్న అదనపు డీజీపీ నాగిరెడ్డి, ప్రస్తుతం నార్త్‌జోన్ ఇన్చార్జి ఐజీగా ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ► అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్, ప్రొవిజనల్ అండ్ లాజిస్టిక్ ఐజీగా జూన్ 6, 2015 నుంచి కొనసాగుతున్నారు. పదోన్నతి వచ్చినా ఆయనకు మరోచోట పోస్టింగ్ ఇవ్వకుండా అవే బాధ్యతల్లో కొనసాగింపజేస్తున్నారు. ► బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ. ఈయన ఐజీ హోదాలో సెప్టెంబర్, 2016లో పోలీస్ శాఖ పర్సనల్ విభాగం బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరేళ్లు పూర్తిచేసుకొని పదోన్నతి పొందినా ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. ► కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అదనపున డీజీపీ. మార్చి, 2017 నుంచి గ్రేహౌండ్స్ ఐజీ. ప్రస్తుతం పదోన్నతి పొంది అక్కడే అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► ఐజీ సుధీర్‌బాబు ప్రస్తుతం రాచకొండ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ హోదాలో మార్చి, 2018లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఐజీగా పదోన్నతి కల్పించినా ఇంకా అక్కడే అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ► ఐజీ రాజేష్‌కుమార్ 2016, జూన్ 30వ తేదీ నుంచి ఇంటెలిజెన్స్ విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ నుంచి ఐజీ అయినా ఆరేళ్లుగా పాత పోస్టులోనే కొనసాగుతున్నారు. ► చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఐజీ. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఐజీ హోదా ఉన్నప్పటికీ ఎస్పీ హోదా కలిగిన రామగుండం కమిషనర్ పోస్టులో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 నెలలుగా ఆయన ఈ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కుర్చీలో ఖాళీగా.. ఐపీఎస్ అధికారికి పక్కా పోస్టింగ్ కల్పిస్తేనే పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహణ సాధ్యమవుతుంది. కానీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఓ పద్ధతి లేకుండా పోయింది. వెయిటింగ్/అటాచ్మెంట్ అనే పేరుతో ఏదో ఒక విభాగంలో కుర్చీ ఇచ్చి ఖాళీగా కూర్చోబెడుతున్నారు. అటాచ్‌మెంట్‌పై ఉన్న అధికారులు ఏదైనా పనిచేయడానికి కానీ, ఏదైనా విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవడం గానీ, ఆదేశాలివ్వడం గానీ, పరిపాలన చేయడం గానీ ఉండదు. ఈ పరిస్థితుల్లోనే అధికారులు తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. 2017లో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ అధికారులను సైతం అటాచ్మెంట్ పేరుతో పోలీస్ శాఖ కొనసాగించడం ఏమిటో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పదోన్నతులు పొందినా ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు. -
ఏపీలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది. ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్డీ రామకృష్ణ, కేవీ మోహన్ రావు, ఎస్ హరికృష్ణ, గోపినాథ్ జట్టి, కోయ ప్రవీణ్, విశాల్ గున్నీ, రవీంద్ర బాబు, అజిత వెజెండ్ల, జీ కృష్ణకాంత్, పీ జగదీశ్, తుహిన్ సిన్హా, బిందు మాధవ్ గరికపాటి, పీవీ రవికుమార్ బదిలీ జాబితాలో ఉన్నారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు అప్పగించగా, శాంతి భద్రతల డీఐజీగా రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్ హరికృష్ణకు, న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపీనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుంతకల్లు రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు డీఎన్ మహేష్‌ను బదిలీ చేశారు. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమ బాధ్యతలు ఎల్ కె వి రంగారావుకు, గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ శెట్టికి బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు కాకినాడ థర్డ్ బెటాలియన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్డీ రామకృష్ణ బదిలీ కాగా, 16వ బెటాలియన్ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ను బదిలీ చేశారు. పల్నాడు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్ బాధ్యతలు తీసుకోనున్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ తాజా జీవోలో పేర్కొన్నారు. -
పోలీస్ కొలువుకు మూడు టెక్నిక్‌లు.. పర్ఫెక్ట్, నాలెడ్జ్, స్మార్ట్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం అన్ని ప్రభుత్వం ఉద్యోగాల మాదిరి కాదని, ప్రతీ క్షణం అప్రమత్తతతోపాటు చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్ ఐపీఎస్ అధికారి పరిమళా హనా నూతన్ అభిప్రాయ పడ్డారు. అందుకే అభ్యర్థులు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అని భావించకుండా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేలా, ఒత్తిడి తట్టుకొని పనిచేసేలా మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె సూచించారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా అనుభవమున్న పరిమళా హనా నూతన్ పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పలు అంశాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి మాటల్లోనే... పాజిటివ్ దృక్పథంతో.. పోలీసు ఉద్యోగాలకు ప్రిపరేషన్ రెండు రకాలుగా ఉంటుం ది. భయపడకుండా సమయాన్ని బట్టి రాతపరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. ప్రతీ క్షణం ఉద్యోగం సాధిస్తామనే పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ అడుగువేయాలి. బలమైన సంకల్పంతో ప్రతీ సబ్జెక్టును శ్రద్ధపెట్టి చదవాలి. రావడంలేదు.. అర్థంకావడంలేదు అనే భావనను దరిచేరనీయొద్దు. 24 గంటలూ పుస్తకాలు పట్టుకొని వేలాడాల్సిన అవసరంలేదు. చదివిన కొద్ది గంటలైనా శ్రద్ధపెట్టి చదివితే సబ్జెక్టు అర్థమవుతుంది. గుర్తుండి పోతుంది. పర్ఫెక్ట్ (ఆయా అంశాలపై సందిగ్ధత లేకుండా స్పష్టతతో), నాలెడ్జ్ (బట్టిపట్టకుండా పరిజ్ఞానం పెంచుకోవడం), స్మార్ట్ (చాకచక్యంగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపరేషన్ అయ్యేలా).. అనే మూడు టెక్నిక్స్‌తో ప్రణాళిక వేసుకుంటే ఉద్యోగాన్ని సులువుగా కొట్టొచ్చు. సాంకేతిక రంగం నుంచి వచ్చే వాళ్లకు... యావత్ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతుండటంతో నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం అత్యంత కీలకమైంది. అందువల్ల టెక్నాలజీ రంగం నుంచి వచ్చిన వారికి పోలీస్ ఉద్యోగం అదనపు బలమవుతుంది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఉన్నంత వెసులుబాటు పోలీస్ ఉద్యోగాల్లో ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మానసికంగా సన్నద్ధులై ఉద్యోగంలోకి రావాలి. ఐటీసీ విభాగాలకు ప్రిపేరయ్యే వాళ్లు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం అంశాల్లో బేసిక్స్‌తోపాటు ప్రొఫెషనలిజం అంశాలపై కొంత దృష్టి పెట్టాలి. అర్థమెటిక్, రీజనింగ్‌కు... ఎస్ఐ ఉద్యోగమైనా, కానిస్టేబుల్ అయినా ఫండమెంటల్ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. అర్థమెటిక్, రీజనింగ్‌లాంటి సబ్జెక్టులకు కొంత అధిక సమయం కేటాయించాలి. లాజికల్ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సమస్యను పరిష్కరించే టెక్నిక్‌ను పట్టగలిగితే ప్రిపరేషన్ సులభతరం అవుతుంది. బట్టిపట్ట కుండా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోగలిగితే రాతపరీక్షను అనుకున్న సమయంలో తప్పులు లేకుండా రాయొచ్చు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ తదితర అంశాలపై కూడా ఫోకస్ చేయాలి. తెలంగాణ చరిత్ర, పోరాటం తదితర అంశాలనూ చదవాలి. ఒకేసారి 800 మీటర్లు వెళ్లొదు. పురుషులతో పోలిస్తే మహిళలు ఏ రంగంలోనూ వెనుకబడి లేరు. కాబట్టి ఇంట్లో పనులు, పిల్లలు, బాధ్యతలు ఎన్ని ఉన్నా గట్టి నిర్ణయంతో మహిళలు ముందడుగు వేస్తే తిరుగుండదు. ప్రిపరేషన్ కోసం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి, అవసరమైతే ఇంట్లో పనులను కుటుంబీకులకు అప్పజెప్పి పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. దేహదారుఢ్య పరీక్షలు కూడా కీలకం కాబట్టి ఒక క్రమపద్ధతిలో ప్రాక్టీస్ చేయాలి. మొదటి రోజు 300 మీటర్ల నుంచి పరుగు పందెం ప్రారంభించి క్రమక్రమంగా పెంచాలి. అతి వేగంగా పరిగెత్తాలని భావించి ఒకేసారి 800 మీటర్లు వెళ్లకూడదు. మెల్లమెల్లగా దూరాన్ని పెంచుతూ ప్రయత్నిస్తే శరీరం కూడా సహకరిస్తుంది. 5 నిమిషాల 20 సెకన్లలో చేరేలాగా చూసుకుంటే సరిపోతుంది. లాంగ్ జంప్, షార్ట్ పుట్కు టెక్నిక్స్ అవసరముంటాయి, నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటే అవి పెద్ద సమస్య కాదు. -
పక్కపక్కనే పోస్టింగ్‌లు
సాక్షి, అమరావతి: భార్యాభర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తçప్పదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో భార్యాభర్తలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఒకేచోట కాకపోయినా పక్క పక్క జిల్లాల్లో విధులు నిర్వహించే సువర్ణావకాశం లభించింది. రాష్ట్రంలో 13 జిల్లాలు 26 జిల్లాలుగా ఆవిర్భవించడంతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ దంపతులకు పక్క పక్క జిల్లాల్లోనే ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆయా జంటల్లో కొందరు వీరు.. ► పూర్వ తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. వాటిలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. వీరిద్దరూ భార్యభర్తలు. ► ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ ఇద్దరూ దంపతులే. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరూ భార్యాభర్తలు. è నంద్యాల జేసీగా పనిచేసిన డాక్టర్ మనబీర్ జిలానీ శామూన్‌ను ప్రభుత్వం నంద్యాల కలెక్టర్‌గా నియమించింది. ఆయన భార్య తమీమ్ అన్సారియా శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ అన్నమయ్య జిల్లా జేసీ గా బాధ్యతలు చేపట్టారు. è ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా దంపతులే. -
51 మంది ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్‌గా శ్రీకాంత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా మనీష్‌కుమార్ సిన్హాను నియమించింది. కొత్త జిల్లాలు, పాలన పరమైన కారణాల నేపథ్యంలో జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. -
‘బిహార్’.. హాట్‌హాట్..
సాక్షి, హైదరాబాద్: పొలిటికల్ వర్సెస్ పోలీస్.. ఇది కొత్తదేమీ కాదు కానీ తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా బిహారీ బ్యాచ్ అంటూ రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి వారం రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డీ.. రాజీనామా చేసి కేసీఆర్ ముఖాన కొట్టు అన్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు దీటుగానే స్పందించాయి. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం బుధవారమే తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి గురువారం సంబంధిత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు ఇచ్చిన కీలక పోస్టింగ్‌లపై రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదురుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే కుర్చీలో కూర్చోవడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ ఆ లేఖలో సూచించారు. దీనిపై తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించింది. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగుల్లో పక్షపాత వైఖరి తెలంగాణలో బిహార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలతో పాటు కీలకమైన విభాగాలను కేటాయించ డంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆ విభాగాలకు అధిపతులుగా పనిచేయడం వల్ల అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగులపై పక్షపాత వైఖరి వీడాలంటూ గురువారం సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్‌లు, 139 మంది ఐపీఎస్ అధికారులుండగా ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి నుంచి ఇన్చార్జి డీజీపీ వరకు బిహార్ అధికారులనే ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎందుకు లూప్లైన్లో పెడుతున్నారో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై ఐపీఎస్‌ల ఆగ్రహం రేవంత్‌రెడ్డి చేసిన బిహార్ బ్యాచ్ వ్యాఖ్యలను రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. ఆలిండియా సర్వీసు రూల్స్ తెలియకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించింది. అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం జరిగే అధికారుల కేటాయింపులపై వివాదాస్పదంగా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంది. పోస్టింగ్‌ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణతో కూడుకున్నదని కూడా స్పష్టం చేసింది. డీజీపీ మహేందర్‌రెడ్డి బలవంతంగా సెలవులో వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, బిహార్‌కు చెందిన ఐపీఎస్‌లను డీజీపీ చేసేందుకే ఇలా చేశారని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసోసియేçషన్ తీవ్రంగా ఖండించింది. మహేందర్‌రెడ్డి ఇంట్లో జారిపడటంతో డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి కోసం మెడికల్ లీవులో వెళ్లారని వివరించింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం అధికారుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. బలవంతపు సెలవు నిజం కాదు: డీజీపీ తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందం టూ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్త వం కాదని డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంట్లో జారిపడిన సంఘటనలో ఎడమ భుజంపైన ఎముకకు మూడు చోట్ల హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ జరిగిందని తెలిపారు. లోపలి గాయం మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని వివరించారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందం టూ తప్పుడు, బాధ్యతా రహిత ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక ఉన్నత స్థాయి, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమని, ప్రభుత్వంపై అపో హలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సచివాలయ మహిళా పోలీస్ దేశానికే ఆదర్శం
సాక్షి, మచిలీపట్నం: గ్రామ సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ, తక్షణమే పరిష్కరించే కార్యక్రమం చేపడుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలను పలు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు ప్రశంసించారు. గ్రామ సచివాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు అందించడంపై శిక్షణ తరగతి (ట్రైనింగ్ సెషన్) నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ శిక్షణ కార్యక్రమంపై నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన 87 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బ్రీఫింగ్ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకునేలా ఎస్పీ రూపొందించిన ‘ప్రత్యక్ష స్పందన’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు తిలకించారు. ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండకుండా, వారి గ్రామంలోనే మహిళా పోలీసుల ద్వారా సచివాలయాల నుంచి టైం స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయంలో వచ్చి ఎస్పీతో వారి సమస్యలను చెప్పుకొనేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఎస్పీతో పాటు వారి ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం ద్వారా పోలీస్ అధికారులతో వారి సమస్యను నేరుగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఎస్పీ ఫిర్యాదుదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వారి ఎదురుగానే సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదును బదిలీ చేసి, పూర్తి పారదర్శకంగా పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఫిర్యాదు పురోగతి గురించి బాధితులు మహిళా పోలీస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి చూసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు.. సచివాలయ వ్యవస్థను, మహిళా పోలీసుల ఏర్పాటును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గ్రామ సచివాలయాల్లోనే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్న సచివాలయ మహిళా పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని చెప్పారు. -
‘కుర్చీ’ మార్చరా? నాలుగేళ్లుగా ఒకే పోస్టులో..
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారుల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పదోన్నతి లభించినా పాత పోస్టులోనే ఏళ్ల తరబడి కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రతిపాదనలు వెళ్లినా అటకెక్కడం తప్ప పోస్టింగ్‌లపై ఆదేశాలు వచ్చిన దాఖాలాలు లేవు. ఇటీవల కొందరు ఐపీఎస్‌ల బదిలీ జరిగినా ఇంకా చాలామేరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నాలుగేళ్లుగా ఒకే పోస్టులో ఉన్న ఐపీఎస్‌లు తలలు పట్టుకుంటున్నారు. పరిస్థితి మారదా? ►సీఐడీ చీఫ్‌గా ఉన్న గోవింద్‌సింగ్ అదనపు డీజీపీగా పదోన్నతి పొందినా నాలుగున్నరేళ్లుగా ఇదేపోస్టులో ఉన్నారు. కొద్ది రోజులపాటు ఏసీబీ, విజిలెన్స్ ఇన్చార్జి డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ►శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జితేందర్ సైతం నాలుగేళ్లుగా అదే పోస్టింగ్‌లో కొనసాగుతున్నారు. అదనంగా జైళ్ల శాఖను పర్యవేక్షిస్తున్నారు. ►ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఐజీ ర్యాంకు నుంచి పోలీస్ శాఖలోని పర్సనల్ విభాగానికి బదిలీపై వచ్చిన శివధర్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా అదేపోస్టులో ఉన్నారు. అదనపు డీజీపీగా పదోన్నతి వచ్చినా పాత స్థానంలోనే కొనసాగుతున్నారు. ►ప్రొవిజినల్, లాజిస్టిక్ ఐజీగా నాలుగేళ్ల క్రితం వచ్చిన సంజయ్‌కుమార్ జైన్ ఇటీ వల అదనపు డీజీపీగా పదోన్నతి పొం దిన ఇంకా అక్కడే కొనసాగిల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపకశాఖతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ►అపరేషన్స్ విభాగాలుగా ఉన్న గ్రేహౌం డ్స్, ఆక్టోపస్ యూనిట్లకు అదనపు డీజీపీగా శ్రీనివాస్‌రెడ్డి ఐదేళ్లకుపైగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐజీగా బదిలీపై వెళ్లిన ఆయన అదనపు డీజీపీగా పదోన్నతి పొంది రెండేళ్లు దాటినా ఇంకా పాత స్థానంలోనే కొనసాగాల్సి వస్తోంది. ►సీనియర్ ఐపీఎస్ రవిగుప్తా, పోలీస్ టెక్నాలజీ, కంప్యూటర్ సర్వీసెస్ అదన పు డీజీపీతోపాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లి మూడున్నరేళ్లు కావస్తోంది. డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందినా బదిలీకి నోచుకోలేదు. ►పోలీస్ ఆర్గనైజేషన్ అదనపు డీజీపీగా సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ మూడున్నరేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిసున్నారు. ►రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ సందీప్ శాండిల్యా దాదాపు నాలుగేళ్లుగా అదే పోస్టులో కాలం వెళ్లదీస్తున్నారు. ►రాచకొండ కమిషనర్‌గా మహేష్ భగవత్ దాదాపు నాలుగున్నరేళ్లుగా అక్కడే ఐజీగా, ప్రస్తుతం అదనపు డీజీపీగా కొనసాగుతున్నారు. ►హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా ఉన్న దేవేంద్రసింగ్ చౌహాన్ మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పదోన్నతి పొందినా అక్కడే తిరిగి విధులు నిర్వర్తిస్తున్నారు. ►నార్త్‌జోన్ (వరంగల్) ఐజీగా వై. నాగిరెడ్డి మూడున్నరేళ్లుగా అక్కడే కొనసాగుతుం డగా స్టీఫెన్ రవీంధ్ర బదిలీతో వెస్ట్‌జోన్ (హైదరాబాద్) ఐజీ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిసున్నారు. ఇటీవల అదన పు డీజీపీగా పదోన్నతి పొందినా ఐజీ ర్యాంకు పోస్టులోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ►కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీపీ విజయ్‌కుమార్ ఇంకా వెయిటింగ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులపాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా నియమించినా మళ్లీ ఆయన్ను బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ►ఇంటెలిజెన్స్‌లో డీఐజీగా నాలుగేళ్లు, ప్రస్తుతం ఐజీగా పదోన్నతి పొందిన శివకుమార్ అక్కడే నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో ఎస్పీ, డీఐజీగా, ఐజీగా రాజేష్‌కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా ఐదున్నరేళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తించడం గమనార్హం. ►వీబీ కమలాసన్‌రెడ్డి ఇటీవలే ఐజీగా పదోన్నతి పొందినా వెయిటింగ్‌లోనే ఉన్నారు. అంతకుముందు ఐదేళ్లపాటు కరీంనగర్ కమిషనర్‌గా పనిచేసి ఆయన రికార్డు సృష్టించారు. ►డీసీపీ (ఎస్పీ ర్యాంకు)లో నగర కమిషనరేట్‌లోని ఈస్ట్‌జోన్‌కు బదిలీపై వెళ్లిన ఎం రమేష్‌రెడ్డి, డీఐజీగా పదోన్నతి పొంది దాదాపు మూడున్నరేళ్లు కావస్తోంది. ఇంకా ఆయన డీసీపీ పోస్టులో జాయింట్ సీపీగా పనిచేస్తున్నారు. ►డీఐజీ రమేష్‌నాయుడు, ఎస్పీ నవీన్‌కుమార్ పోలీస్ అకాడమీలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్లు బదిలీపై వెళ్లి దాదాపు నాలుగున్నరేళ్లు కావస్తోంది. ►ఎస్పీగా సీఐడీకి బదిలీ అయిన ఐపీఎస్ శ్రీనివాస్, డీఐ జీగా పదోన్నతి రెండేళ్లు అయినా ఇప్పటివరకు స్థానచలనం రాలేదు. అలాగే సీఐడీకి వచ్చి మూడేళ్లు కావస్తున్న ఐపీఎస్ పరిమళహనా నూతన్‌కు సైతం స్థానచలనం కలగలేదు. డీఐజీగా ఉన్న సుమతి మూడేళ్లుగా సీఐడీ నుంచి అటాచ్మెంట్లో ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ►కొత్తగా ఐపీఎస్ కన్ఫర్డ్ పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులు వెయిటింగ్‌లోనే ఉన్నారు. మరో ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లు సైతం నెలల తరబడి వెయిటింగ్లో ఉన్నారు. -
టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరిక
సాక్షి, అమరావతి: టీడీపీ నేత వర్ల రామయ్య, ఆ పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు డీజీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ పరుష పదజాలంతో దూషించడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు వర్ల రామయ్య తరచు ఉద్దేశపూర్వకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి తప్ప అధికారులను తరచుగా వివాదాల్లోకి లాగి వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదన్నారు. ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాట్లాడేటప్పుడు పదప్రయోగం అత్యంత ముఖ్యమన్నారు. ఇదే రకమైన వ్యవహారశైలి కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో అనేకమంది బ్యూరోక్రాట్లు తమ రెండో ఇన్సింగ్స్‌ను రాజకీయాల్లో మొదలు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఖద్దరు చొక్కా వేసుకొని ప్రజలకు మరింతగా సేవ చేసుకోవాలని ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవలే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినా ఆశిమ్ అరుణ్ రెండ్రోజుల కిందటే బీజేపీలో చేరడం, ఆయనతో పాటు మారో మాజీ ఐఏఎస్ రామ్ బహదూర్ సైతం బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిధ్దపడుతుండటం ప్రస్తుతం ఆసక్తి రేపే అంశంగా మారింది. అఖిలేష్ అడ్డా నుంచే ఆశిమ్ పోటీ... 1994 బ్యాచ్‌కు చెందిన 51 ఏళ్ల ఆశిమ్ అరుణ్ పదిరోజుల కిందటే స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు. 2017 ఎన్నికల్లో గెలిచిన అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్ ఆశిమ్ను కాన్పూర్ మొదటి పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ రౌడీ మూకల ఆట పట్టించి ఆశిమ్ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అంతకుముందు ఆశిమ్ అలీఘర్, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి జిల్లాల్లో పోలీసు బలగాలకు నాయకత్వం వహించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు నేతృత్వం వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన దళిత ఉపకులం ‘జాతవ్’ వర్గానికి చెందిన ఆశిమ్ అరుణ్ యూపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే వీఆర్ఎస్ ప్రకటించి ఈ నెల 16న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కన్నౌజ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గతంలో ఎంపీగా గెలిచారు. ఇక్కడి నుంచే ఆశిమ్ అరుణ్ పోటీ చేస్తుండటంతో అప్పుడే ఆయన చేరికపై అఖిలేష్ ఘాటుగా స్పందించారు. ‘ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఆశిమ్ అరుణ్ సహాయపడుతున్నారని నేను ఆరోపించాను. బీజేపీలో చేరికతో అది నిజమైంది’ అని విమర్శలు గుప్పించారు. ఇక ఆశిమ్ అరుణ్‌తో పాటే మాజీ ఐఏఎస్ అధికారి రామ్ బహదూర్ సైతం ఆదివారం బీజేపీలో చేరారు. 2017కు ముందే బీఎస్పీలో చేరి మోహన్‌లాల్‌గంజ్ నుంచి పోటీ చేసి ఓడిన రామ్ బహదూర్ ప్రస్తుతం అదే స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. బ్రిజ్‌లాల్ స్ఫూర్తితో.. యూపీ మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్ స్ఫూర్తితోనే ఆశిమ్ అరుణ్ బీజేపీలో చేరారని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అయిన బ్రిజ్లాల్లో 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. పాసీ దళితుడైన బ్రిజ్‌లాల్ 2010–12లో బీఎస్పీ అధినేత్రి మాయావతి హయాంలో యూపీ డీజీపీగా పనిచేసిన సమయంలో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‘గా పేరు గడించారు. బీజేపీలో చేరాక ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు యూపీలో నేరస్థులు, మాఫియాల అణిచివేతలో ఆయన సహాయాన్ని యోగి ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక 1988 బ్యాచ్‌కు చెందిన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఏ.కే. శర్మ గత ఏడాది బీజేపీలో చేరేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా పనిచేసిన సమయంలో, ఆ తర్వాత ప్రధాని అయ్యాక ఆయన కార్యాలయంలో పని చేసిన ఏ.కే. శర్మ, వీఆర్ఎస్ తీసుకున్నాక బీజేపీ ఆయన్ను శాసనమండలికి పంపింది. గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మోదీ ఆశీస్సులతో యోగి కేబినెట్లో చేరతారనే అంతా భావించారు. కానీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతారనే భయంతో ఏకే శర్మను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి యోగి సుముఖత చూపలేదు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన శర్మ... మోదీ నియోజకవర్గం వారణాసితో పాటు తూర్పు యూపీలో క్రియాశీలంగా వ్యహరిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల సంందర్భంగా మరో ఐపీఎస్ అధికారి, ముంబాయి పోలీస్ కమిషనర్‌గా ఉన్న సత్యపాల్‌సింగ్‌ను యూపీలోని భాగ్‌పట్ నుంచి పార్లమెంట్‌కు పోటీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్‌ను ఓడించి వార్తల్లో నిలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయన అజిత్‌సింగ్ కుమారుడు జయంత్ చౌదరీని ఓడించారు. గతంలోనూ అనేకమంది... యూపీలో బ్యూరోక్రాట్ల నుంచి పొలిటీషియన్లుగా మారిన వారి లిస్టు పెద్దదిగానే ఉంది. మాజీ ఐఏఎస్ అధికారులు కున్వర్ ఫతే బహదూర్, పన్నా లాల్ పునియా, అహ్మద్ హసన్, శిరీష్ చంద్ర దీక్షిత్, దేవేంద్ర బహదూర్ రాయ్, దేవి దయాల్, ఐసీఎస్ అధికారులు మహేంద్ర సింగ్ యాదవ్, బీపీ సింఘాల్ తదితరులు ఉన్నారు. వీరిలో చాలామంది ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల్లో రాష్ట్ర మంత్రులగానూ పనిచేశారు. – సాక్షి, న్యూఢిల్లీ -
కలిసి పనిచేయండి.. దేశసేవకు అంకితమవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారులంతా కలిసి ఓ కుటుంబంలా పనిచేస్తూ దేశసేవకు అంకితం కావాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం జరిగిన ఐపీఎస్ ప్రొబేషనరీల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వారు మాత్రమే కాదని, దేశ సౌభాగ్యం కోసం శాంతి భద్రతల్ని పరిరక్షించడం కూడా వారి విధుల్లో భాగమేనని ఉద్బోధించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులను గుర్తు చేసుకున్న ఆయన.. వారి త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ఎప్పటికప్పుడు తమ సాంకేతిక ప్రతిభను మెరుగు పరుచుకోవాలని ధోవల్ సూచించారు. సమకాలీన అవసరాలను బట్టి పోలీసు విధుల్లో పాదర్శకతను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఐపీఎస్‌లకు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఎన్పీఏ డైరెక్టర్ అతుల్ కర్వాల్ మాట్లాడుతూ ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు శిక్షణలో భాగంగా విధి నిర్వహణతో పాటు నైతిక విలువలతో అనేకాంశాలు బోధించామని వివరించారు. ఈ ఫేజ్–1 శిక్షణలో ప్రొబేషనరీ అధికారిణి దర్పన్ అహ్లువాలియా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. ధోవల్ చేతుల మీదుగా అహ్లువాలియాకు ఉత్తమ ప్రొబేషనరీ అవార్డుతో పాటు ఆయా అంశాల్లో ప్రతిభ కనబరిచిన కేడెట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఎన్పీఏలో శిక్షణ పొందిన ఈ 73వ బ్యాచ్‌లో మొత్తం 132 మంది ప్రొబేషనరీలున్నారు. వీరిలో 27 మంది మహిళలు కాగా.. ఆరుగురు భూటాన్, మరో ఆరుగురు మాల్దీవులు, ఐదుగురు నేపాల్ వంటి మిత్రదేశాలకు చెందిన వారూ ఉన్నారు. -
ఐపీఎస్‌ల సంఖ్య పెంచండి.. అమిత్‌షాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లా లు ఏర్పాటు చేసినందున, ఐపీఎస్ కేడర్‌ను సమీక్షించి పోస్టుల సంఖ్యను 195కు పెంచాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారుల కొరత తీరుతుందని వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి 8:45 నుంచి 10:05 వరకు అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సాధారణంగా సీఎం కాన్వాయ్‌లో ఉండే ఇతర వాహనాలు ఏవీ లేకుండా, కేవలం ఒకే వాహనంలో అమిత్ షా ఇంటికి కేసీఆర్ వెళ్ళారు. కొత్త జిల్లాలపై వివరణ విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వేగవంతంగా చేర్చేందుకు వీలుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయాన్ని మరోసారి కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్ళారు. అందులో భాగంగానే ఐపీఎస్ కేడర్ సమీక్ష అంశాన్ని ప్రస్తావించారు. పునర్ వ్యవస్థీకరించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. అప్పటివరకు ఉనికిలో ఉన్న 9 పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో.. 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లతో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లో పోలీసు పరిపాలనకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. పాలనకు సంబంధించి కొత్త వ్యవస్థలో భాగంగా పోలీసు యూనిట్లు ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను అనుసరించి కొత్తగా పలు ప్రాదేశిక పోస్టులు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది ‘తెలంగాణకు సంబంధించి ఐపీఎస్ కేడర్‌ను 2016లో కేంద్రం సమీక్షించింది. 139 అధీకృత పోస్టులను ఆమోదించింది. ప్రస్తుతం పునర్ వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, కొత్త మల్టీ జోన్లకు పోలీస్ ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల ఐపీఎస్ కేడర్ అధికారుల సంఖ్య 195కి పెంచాలి’ అని సీఎం కోరారు. ప్రత్యేక అంశంగా పరిగణించండి ‘పోలీసు శాఖ పరిపాలన అవసరాల రీత్యా దీనిని ప్రత్యేక అంశంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఐపీఎస్ పోస్టుల సంఖ్యను పెంచితే విభిన్న ప్రాదేశిక యూనిట్లలో కమిషనర్లుగా, ఎస్పీలుగా, జోనల్ డీఐజీలుగా, మల్టీ జోనల్ ఐజీలుగా నియమించే వీలు కలుగుతుంది. అందువల్ల ప్రస్తుత ఐపీఎస్ క్యాడర్ సమీక్షను అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి..’అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు విభజన చట్టం హామీలకు సంబంధించి అమిత్ షాతో కేసీఆర్ చర్చించారని సమాచారం. -
లైంగిక వేధింపుల కేసు: మాజీ డీజీపీకి ఊరట
సాక్షి, చెన్నై: ఓ మహిళా ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన కేసులో మాజీ డీజీపీ రాజేష్ దాస్ సోమవారం విల్లుపురం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. వివరాలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక డీజీపీ రాజేష్ దాసు ఓ మహిళా ఐపీఎస్‌తో అసభ్యకరంగా వ్యవహరించినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం పళనిస్వామి పర్యటన బందోబస్తుకు వెళ్లి.. చెన్నైకి తిరుగు పయనంలో ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ.. తనను వేధించినట్లు ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీనిని మరికొందరు ఐపీఎస్‌లు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. వ్యవహారం మీడియాలో రావడంతో అన్నాడీఎంకే పాలకులు విశాఖ కమిటీని రంగంలోకి దించారు. సీబీసీఐడీ సైతం విచారణ చేపట్టింది. రాజేష్ దాస్‌తో పాటుగా ఆయనకు వత్తాసు పలికిన పోలీసు అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే రాజేష్ దాస్ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం విల్లుపురం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. దీంతో విచారణకు మాజీ డీజీపీ హాజరయ్యారు. సీబీసీఐడీ 400 పేజీలతో చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాదనల అనంతరం మాజీ డీజీపీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: Lockdown Update: ఈనెల 23 వరకు పొడిగింపు: సీఎం -
నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్
సాక్షి, హైదరాబాద్: నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్ నిర్వహించారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఏపీ, తెలంగాణకు నలుగురి చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు 58 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చారు. 144 మంది ఐపీఎస్ ప్రొబేషనరీలతో పాటు 34 మంది ఫారిన్ ఆఫీసర్లు శిక్షణ పొందారు. 2019 బ్యాచ్‌లో 73 శాతం టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారే. -
పోలీసు ఇమేజీ పెంచేలా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు మెరుగైన ప్రవర్తనతో ప్రజల్లో వారి ప్రతిష్ట పెంచే విధంగా శిక్షణాంశాలపై దృష్టి పెడుతున్నట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) డైరెక్టర్ అతుల్ కర్వాల్ తెలిపారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ప్రజల పట్ల, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోలీసు అధికారుల్లో మరింత సానుభూతి, సానుకూల వైఖరి పెరిగేందుకు అవసరమైన అంశాలు శిక్షణ కార్యక్రమాల్లో చేర్చుతున్నామన్నారు. ఎన్పీఏలో 72వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. 2019 బ్యాచ్‌లోని మొత్తం 178 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం ఎన్పీఏ జాయింట్ డైరెక్టర్లు అమిత్ గార్గ్, ఎన్.మధుసూదనరెడ్డి, అసిస్టెంట్ డైర్టెకర్ సి.వంశీకృష్ణలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాల విస్తృతి పెరిగే అవకాశం ఉన్నందున, ఈ నేరాల దర్యాప్తులో మెళకువలకు సంబంధించిన అంశాలను ట్రైనింగ్‌లో చేర్చినట్టు కర్వాల్ చెప్పారు. తెలంగాణ కేడర్‌కు నలుగురు తెలంగాణ, ఏపీ కేడర్లకు నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మందిని కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణకు అక్షాన్ యాదవ్, అశోక్ కుమార్, రష్మి పెరుమాళ్, కేకన్ సుధీర్ రామనాథ్‌లను, ఏపీకి కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదిరాజ్ సింగ్ రానా, ప్రేరణా కుమార్, మహేశ్వర రెడ్డి (వైఎస్సార్ జిల్లా)లను కేటాయించినట్టు చెప్పారు. మహిళలు పోలీస్ ఫోర్స్‌ను ఎంచుకోవాలి: రష్మీ పెరుమాళ్ మహిళలు పోలీస్ ఫోర్స్‌ను ఎంచుకోవాలి. ఐపీఎస్‌లుగా అయితే మరింత బాగా పనిచేసే, సేవ చేసే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన నన్ను తెలంగాణకు కేటాయించడం సంతోషంగా ఉంది. నా తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఐపీఎస్‌ను ఎంచుకున్నా. తొలిసారిగా మహిళకు ఆల్‌రౌండ్ ట్రోఫీ మహిళా అధికారులు పురుషులతో పోటీపడుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కర్వాల్ తెలిపారు. గత 72 ఏళ్లుగా పురుష ప్రొబేషనరీ అధికారులు ఔట్‌డోర్ ఆల్‌రౌండ్ ట్రోఫీ గెలుస్తుండగా.. ఈ ఏడాది హరియాణకు చెందిన రంజీత శర్మ (రాజస్థాన్ కేడర్) ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకున్నారని తెలిపారు. రెండో స్థానంలోనూ శ్రేయాగుప్త (తమిళనాడు కేడర్) అనే మరో అధికారి నిలవడం గొప్ప విషయమన్నారు. రంజీత శర్మ ప్రధానమంత్రి బేటన్ హోం మంత్రిత్వ శాఖ రివాల్వర్ అవార్డు, ఇతర ట్రోఫీలు అందుకోనున్నారు. ‘బెస్ట్ ఔట్‌డోర్ ప్రొబేషనర్’గా ఐపీఎస్ అసోసియేషన్ స్వోర్డ్ ఆఫ్ హానర్’లభించనుంది. శ్రేయ గుప్తా శ్రీ బుబానంద మిశ్రా స్మారక ట్రోఫీ అందుకోనున్నారు. నాన్నే నాకు ప్రేరణ: రంజీత శర్మ సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ కావడం. శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ, ప్రదర్శనకు నాన్న సతీష్‌కుమారే ప్రేరణ. ఆరోప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా కృషి చేస్తే అసాధ్యమనేది ఏదీ లేదనేది నిజమైంది. -
4 జిల్లాలకు పోలీసు బాస్‌లు లేరు..
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాలకు, కమిషనరేట్లకు పూర్తిస్థాయి పోలీసు బాస్‌లు లేరు. కొందరికి పదోన్నతులు లభించినా పాతస్థానాల్లో కొనసాగుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగపోవడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ఒకేసారి ఏర్పడిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్లలో ఖమ్మం, సిద్ధిపేటలకు కమిషనర్లు మారినా రామగుండం సీపీ సత్యనారాయణ, నిజామాబాద్‌లో కార్తికేయ కమిషనర్లుగా అక్కడే ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వం అటాచ్ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లా లకు పూర్తిస్థాయి ఎస్పీలను నియ మించలేదు. నల్ల గొండ ఎస్పీగా ఉంటూ డీఐజీగా ప్రమోషన్ పొం దిన రంగనాథ్ కూడా 2018 నుంచి అక్కడే ఎస్పీగా కొనసాగుతున్నారు. 2019 ఏప్రిల్‌లో 23 మంది ఐపీఎస్ అధికారులకు పదో న్నతులు ఇచ్చినా పాత స్థానాల్లోనే 90 శాతం మంది కొనసాగుతున్నారు. వీరికి అదనపు బాధ్యతలు.. ఏడీజీ వీవీ శ్రీనివాసరావు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పదవితోపాటు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంజయ్‌జైన్– ఏడీజీ (పీ అండ్ ఎల్), పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యతలు చూస్తున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు విజిలెన్స్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఎస్పీ రమణకుమార్ బదిలీతో ఏసీబీలో జాయింట్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయింది. త్వరలో ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు రిటైర్ కానున్నారు. దీంతో ఏసీబీలో కీలకమైన రెండు పోస్టులు ఖాళీ అవనున్నాయి. ఎస్పీలుగా పదోన్నతులుగా లభించినా... మార్చి ఆఖరివారంలో ప్రభుత్వం 32 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో మెజారిటీ అధికారులకు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పదవీవిరమణ వయసును 58 నుంచి 61కి పెంచడంతో వీరికి పోస్టింగులు ఇవ్వడం సవాలుగా మారిందని సమాచారం. ఇన్‌చార్జీలతోనే... కీలకమైన నాలుగు జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు లేరు. నిర్మల్ జిల్లాకు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆదిలాబాద్‌కు అడిషనల్ ఎస్పీ రాజేశ్ చంద్ర ఇన్చార్జి ఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు కూడా పోలీసుబాసులు లేరు. ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు రామగుండం సీపీకి, ములుగు జిల్లా బాధ్యతలను జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌కి అప్పగించారు. ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ఖమ్మం సీపీగా విష్ణువారియర్‌ను నియమించగా, ఖమ్మం సీపీగా ఉన్న ఇక్బాల్ బదిలీ మీద ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా, తన స్థాయి కంటే తక్కువ పోస్టులో విధులు నిర్వహించడం ఇష్టంలేక మిన్నకుండిపోయారని సమాచారం. -
డీజీపీతో పాటు ఎస్పీ కన్నన్ మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ రాజేష్ దాసుతో పాటు చెంగల్పట్టు ఎస్పీ కన్నన్‌పై సీబీసీఐడీ గురిపెట్టింది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం విచారణకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ కేసును మద్రాసు హైకోర్టు సైతం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. మహిళా ఐపీఎస్ అధికారికి లైంగిక వేదింపులు ఇచ్చినట్టుగా ప్రత్యేక డీజీపీ రాజేష్ దాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీసీఐడీకి డిజీపీ త్రిపాఠి అప్పగించారు. లైంగిక వేధింపుల వ్యవహారం విల్లుపురం జిల్లా పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కేసు విచారణను విల్లుపురం సీబీసీఐడీ అడిషన్ డీఎస్పీ గోమతి నేతృత్వంలోని బృందానికి అప్పగించారు. అక్కడ విచారణ అనంతరం చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సీబీసీఐడీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణపై దృష్టి పెట్టబోతున్నారు. మూడు సెక్షన్ల కింద రాజేష్ దాసుపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చెంగల్పట్టు ఎస్పీ కన్నన్ కూడా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనివ్వకుండా ఎస్పీ కన్నన్ అడ్డుకున్నట్టు తేలింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు కావడం గమనార్హం. సుమోటో కేసు సీబీసీఐడీ విచారణకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో లైంగిక వేధింపులపై మద్రాసు హైకోర్టు సైతం దృష్టి పెట్టింది. ఉదయం విచారణ సమయంలో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ ఈ వ్యవహరాన్ని ప్రస్తావించారు. పోలీసు మహిళా ఉన్నతాధికారులకే భద్రత కరువై ఉండడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా, విచారణ న్యాయబద్ధంగా జరిగే రీతిలో కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: సీబీసీఐడీకి కీచక వ్యవహారం -
తెలంగాణకు నలుగురు కొత్త ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా నలుగురు ఐపీఎస్‌లను కేటాయించింది. 73వ ఐపీఎస్ (ఆర్ఆర్) బ్యాచ్‌కు చెందిన 150 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు బుధవారం పోస్టింగులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. వీరిలో ఏడుగురిని తెలుగు రాష్ట్రాలకు (తెలంగాణకు నలుగురు, ఏపీకి ముగ్గురు) కేటాయించింది. తెలంగాణ కేడర్‌కు కేటాయించినవారిలో పరితోష్ పంకజ్ (ర్యాంకు 142, బిహార్), సిరిశెట్టి సంకీర్త్ (ర్యాంకు 330, తెలంగాణ), పాటిల్ కాంతిలాల్ సుభాష్ (ర్యాంకు 418, మహారాష్ట్ర), అంకిత్‌కుమార్ శంక్వార్ (ర్యాంకు 563, ఉత్తర్‌ప్రదేశ్)లు ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం రాష్ట్రానికి 11 మంది ఐపీఎస్‌లను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన ఎంవీ సత్యసాయి కార్తీక్ (ర్యాంకు 103)ను మహారాష్ట్రకు, శీతల్‌కుమార్ (ర్యాంకు 417)ను అసోంకు, రాజనాల స్మృతిక్ (ర్యాంకు 466)ను ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించారు -
జిల్లా ఎస్పీలకు డీజీపీ సవాంగ్ దిశా నిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఆలయ ఘటనల పట్ల ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దని, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాటిని ఛేదించి మత సామరస్యాన్ని కాపాడాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వెబినార్ నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టులతోపాటు గ్రామ రక్షణ దళాల (విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్) ఏర్పాటుపై సమీక్షించారు. శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్ తదితర ఐపీఎస్ అధికారులతో కలిసి ఆలయాల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగే ఆలయ విధ్వంస ఘటనలకు అడ్డుకట్ట వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్ధేశాలు బయట పడుతున్నందున, ఆయా ఘటనల్లో రాజకీయ ప్రమేయాన్ని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. సమాజంలో దేవుడి సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని అలజడి రేపి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసే వారిని ఆధారాలతో సహా గుర్తించి ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. కుట్రలను భగ్నం చేయాలి ► రాజకీయ లబ్ధి కోసం మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా జరిగే కుట్రలను ఛేదించి, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడకూడదు. ► సెప్టెంబర్ తర్వాత జరిగిన ఘటనల దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ► సిట్‌తోపాటు రెవెన్యూ, దేవదాయ శాఖలతో పోలీసు శాఖ సమన్వయంతో పని చేయాలి. గ్రామాల్లో దేవాలయాలు, మతపరమైన సంస్థల రక్షణకు ప్రజల సహకారం తీసుకోవాలి. ► గత నాలుగు నెలల్లో 59,529 మత పరమైన సంస్థలను గుర్తించి జియో ట్యాగింగ్ చేశాం. ఇప్పటి వరకు 16,712 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాం. 212 కేసుల్లో 180 కేసులను ఛేదించి 337 మందిని అరెస్టు చేశాం. ► ఆలయ ఘటనల్లో క్లూస్ ముఖ్యమని, నేరం జరిగిన వెంటనే క్లూస్‌పై దృష్టి పెట్టాలని సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అభినందనలు గుంటూరులో కుసుమ హరనాథ్ దేవాలయంలో చొరబడిన దుండగులను పట్టుకునేందుకు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అర్చకుడి భార్య హైమావతి, శ్రీకాకుళం జిల్లాలో సరస్వతి దేవి, నంది విగ్రహాల విధ్వంసం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో జరిగిన దు్రష్పచారాన్ని గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసిన రమణ, శ్రీనివాసులు, శ్రీరాములకు అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామ రక్షణ దళాల ఏర్పాటు అభినందనీయం రాష్ట్ర పోలీస్ శాఖ గ్రామ రక్షణ దళాలు (విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్) ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం. ఆలయాలను కాపాడుకునేందుకు మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పని చేయడానికి మహిళలు కూడా ముందుకు రావడం ఆదర్శనీయం. (ఈ మేరకు చిన్న జీయర్ ప్రసంగం వీడియోను వెబినార్‌లో ప్రదర్శించారు) – ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి -
ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం
సాక్షి, అమరావతి : డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తనకు మద్దతు తెలపాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందంటూ లేఖలో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు లేఖపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించింది. ఆయనపై ప్రభుత్వం సస్పెన్సన్ విధించడం సరైనదే అని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, విచారణను ఎదుర్కొక తప్పదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కొన్ని ఛానళ్లలో తాము ఏబీకి మద్దతు తెలిపామని వస్తున్న వార్తలు అవాస్తవమని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి మద్దతు తెలపలేదని పేర్కొంది. అలాగే ఐపీఎస్ అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని.. ఏబీ వెంకటేశ్వరరావుకు హెచ్చరిచ్చింది. (ఏబీకి ఎదురు దెబ్బ) చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
గ్రేటర్ ఎన్నికలు: పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శిఖా గోయల్ (ఈస్ట్ జోన్), అనిల్‌కుమార్ (వెస్ట్ జోన్), చౌహన్ (సౌత్ జోన్), అవినాష్ మొహంతి (నార్త్ జోన్), తరుణ్ జోషి (సెంట్రల్ జోన్)లను నియమించారు. (చదవండి: ప్రచారానికే పరిమితమైన జనసేన) గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.62.21 లక్షల నగదు సీజ్ చేశారు. 11 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 1,899 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని, ఇప్పటివరకు 2,393 మందిని బైండోవర్ చేశామని పేర్కొంది. 148 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: భారీ బందోబస్తు..) -
కరోనాను జయించిన ఐపీఎస్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇటీవల కరోనా బారిన పడిన ఐపీఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్ దంపతులకు డీజీపీ గౌతం సవాంగ్ ఘనస్వాగతం పలికారు. (చదవండి: ఆ తర్వాతే ఏపీలోకి అనుమతి..) ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లడుతూ.. కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏ మాత్రం అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కోవిడ్ బారినపడిన పోలీసులు కోలుకొని విధుల్లో రావడం ఆనందంగా ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. పాటిల్ దంపతులు మాట్లాడుతూ.. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే త్వరగా కోలుకున్నామని తెలిపారు. -
నలుగురు ఐపీఎస్‌ల పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు మంగళవారం పదవీ విరమణ పొందారు. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్పీ బి.మల్లారెడ్డి, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ.రవీందర్, మాదాపూర్ జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, నిర్మల్ ఎస్పీ సి.శశిధర్‌రాజులు రిటైర్ అయ్యారు. వీరి స్థానంలో కొత్త అధికారులకు కాకుండా సీనియర్లకే పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్లారెడ్డి స్థానంలో పీ అండ్ ఎల్ విభాగం ఐజీ సంజయ్‌కుమార్ జైన్‌ను, రవీందర్ బాధ్యతలను సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌కు, వెంకటేశ్వరరావు స్థానాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు, శశిధర్ బాధ్యతలను ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాగా, మంగళవారమే మరో ఐపీఎస్ అధికారి, ఎస్ఐబీ విభాగం ఐజీ ప్రభాకర్‌రావు సైతం పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ప్రభాకర్‌రావు సేవలను ప్రభుత్వం మరోసారి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఎస్ఐబీలోనే ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభాకర్‌రావు మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. బదిలీలు.. మరికొంత జాప్యం ఐపీఎస్‌ల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బదిలీలకు మరికొంత సమయం పట్టవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలు, ఏడీజీలుగా పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం వారిని బదిలీ చేయబోతుంద ని ప్రచారం జరిగింది. ఇక ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు పదవీ విరమణ చేయడంతో జూన్ ఆఖరునాటికి బదిలీలు ఉంటాయని అంతా భావించారు. కానీ, పదవీ విరమణ పొందిన వారి బాధ్యతలను సీనియర్లకు అదనపు బాధ్యతలుగా అప్పగించడంతో బదిలీలపై మరికొంత జాçప్యం జరుగుతుందని తెలుస్తోంది. ఇటీవల బదిలీ అయిన టీఎస్పీఏ చైర్మన్ బాధ్యతలను కూడా తెలంగాణ స్టేట్ పోలీస్ స్థాయి రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి. శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతల కింద అప్పగించిన విషయం తెలిసిందే. -
తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటి వరకు కింది స్థాయి సిబ్బందినే చుట్టేస్తున్న కరోనా వైరస్ ఉన్నతాధికారులకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఓ ఐపీఎస్ అధికారి వైరస్ బారినపడగా తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్ వచ్చింది. వీరు నగరం కేంద్రంగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయా అధికారుల వద్ద పని చేసిన, చేస్తున్న గన్మెన్లు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది) అలాగే మహిళా ఐపీఎస్ ఉన్నతాధికారి కూడా కరోనా బారినపడ్డారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలో సైతం ఉద్యోగికి కరోనా సోకింది. తన వద్ద పనిచేసే సహాయకుడికి కూడా పాజిటివ్ రావడంతో అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఒకరు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇక ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని హోమ్ ఐసోలేషన్‌కు తరలించారు. (ఒక్క రోజులోనే 14,516 కరోనా కేసులు) 19 రోజులు.. 3026 పాజిటివ్ కేసులు ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు గ్రేటర్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ..అక్కడ..వీరు..వారు అనే తేడా లేకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగి స్తుంది. గురువారం 302 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శుక్రవారం రికార్డు స్థాయిలో 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గ్రేటర్లో ఈ నెలలో ఇప్పటి వరకు 3026 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 116 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇప్పటికే ఓ ఉద్యోగికి పాజిటివ్ రాగా...తాజాగా జిల్లా అధికారికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. (విధుల విభజనతో కరోనాపై యుద్ధం) గాంధీ సెక్యూరిటీ సూపర్వైజర్ మృతి గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్ ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. జనగాం జిల్లా, బచ్చన్నపేటకు చెందిన బాలరాజు (55) మల్లాపూర్‌లో ఉంటూ ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన బాలరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈనెల 17న రాత్రి ఆస్పత్రిలో చేరిన అతను ఐసీయులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. (మూడు నెలలుగా గాంధీలోనే తిండి.. ఠికానా..) -
తెలంగాణలో 6గురు ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వారంతా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పదోన్నతి పొందినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు.. కార్మికేయ కే రమేష్ నాయుడు వీ సత్యనారాయణ బీ సుమతి ఎమ్ శ్రీనివాసులు వెంకటేశ్వరరావు -
డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు బాస్ డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశంలో తమ పనితీరుతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 25 మంది ఐపీఎస్ అధికారుల జాబితాలో ఆయనకు చోటుదక్కింది. ‘ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్, పీఎస్‌యూ వాచ్’ మీడియా సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి ఈ జాబితా రూపొందించాయి. ఇందులో 1984 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్ , రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) చీఫ్ సమత్‌కుమార్ గోయల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డీజీ ఎస్ఎస్ దేశ్వాల్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా సీఆర్పీఎఫ్ డీజీ మహేశ్వరి, ఎన్ఎస్జీ చీఫ్ అనూప్‌కుమార్‌సింగ్, ఢిల్లీ సీపీ ఎస్ఎన్ సిన్హా, బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే, తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి (8వ స్థానం) ఉన్నారు. 25 అంశాల ఆధారంగా.. మెరుగైన పనితీరుతో సమాజంలో మార్పునకు కృషిచేసిన ఐపీఎస్ అధికారుల గుర్తింపునకు ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందుకోసం 1995కు ముందు బ్యాచ్‌ల్లోని 4వేల మంది ఆఫీసర్ల పనితీరును మదించి, వడపోశాయి. ఈ అధికారుల తొలి పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు వారి పనితీరు, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఇంకా, ఆయా అధికారులపై వివిధ ఏజెన్సీలు రూపొందించిన అంతర్గత నివేదికలు, మీడియా కథనాలు, ఇతర సమాచారం ఆధారంగా 25 అంశాలకు ప్రాధాన్యమిస్తూ టాప్–200 జాబితాను తయారు చేశాయి. దీనిని మళ్లీ మదిస్తూ.. నేరాల కట్టడిలో ఈ అధికారుల పాత్ర, నిజాయతీ, నిష్పక్షపాతంగా విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, దార్శనికత, రెస్పాన్సిబిలిటీ వంటివి ఆధారంగా 25 మంది ఐపీఎస్ అధికారులతో తుది జాబితా రూపొందించాయి. ఈ జాబితాను పీఎస్‌యూ వాచ్ వెబ్సైట్ మంగళవారం ప్రచురించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1986 బ్యాచ్‌కు చెందిన డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి 8వ స్థానం దక్కింది. ఉత్తమ పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శంగా.. డీజీపీ మహేందర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పోలీసింగ్, సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. షీటీమ్స్, విమెన్ సేఫ్టీవింగ్, వర్టికల్ విధానంలో మార్పులు, పాపిలాన్ తరహా సాఫ్ట్వేర్, పాస్‌పోర్టు ఎంక్వైరీలో వేగం, నక్సలిజం పీచమణచడం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఠాణాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ల సాధన, టెక్నాలజీ వినియోగం వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన తీసుకున్న శ్రద్ధతో కేసుల దర్యాప్తులో, నిందితులకు శిక్షలు వేయించడంలో తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. దేశంలో కీలకమైన నిఘా, సైనిక సంస్థలకు నాయకత్వం వహించే సీనియర్ అధికారుల సరసన డీజీపీ మహేందర్‌రెడ్డి నిలవడం ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితమేనని ఆయన కార్యాలయ సిబ్బంది అభివర్ణించారు. ఆయన సంస్కరణలకు పరిశ్రమ వంటివారని ప్రశంసించారు. ఇది తెలంగాణ పోలీస్‌కు దక్కిన గుర్తింపు దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులపై జరిగిన సర్వేలో 25 మంది జాబితాలో నాకు చోటుదక్కడం సంతోషం. కానీ, ఇది నా ఒక్కడితోనే సాధ్యం కాలేదు. మొత్తం తెలంగాణ పోలీసు సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుంది. డిపార్ట్మెంటులోని హోంగార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరి సంకల్పం, పట్టుదల ఈ గుర్తింపు రావడానికి దోహదపడ్డాయి. తెలంగాణ సమాజం కూడా పోలీసులకు ఎంతగానో సహకరిస్తోంది. అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. – ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ -
ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అదనపు డీజీగా ఆర్ కే మీనా.. ఎస్ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్.. మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్.ఖాన్.. ప్రొవిజినల్ లాజిస్టిక్ ఐజీగా నాగేంద్రకుమార్..ఇంటెలిజెన్స్ ఐజీగా రఘురామిరెడ్డి.. ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్.. గుంటూరు రేంజ్ ఐజీగా జె. ప్రభాకర్‌రావు.. ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్‌కుమార్.. ఏలూరు రేంజ్ డీఐజీగా కేవీ మోహన్ రావులతో పాటు మరికొందరు పదోన్నతి పొందారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా హరీష్‌కుమార్ గుప్తా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్.. నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్.. ఎపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్ బర్దార్, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి, ఎపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి. క్రిష్ణారావు బదిలీ అయ్యారు. వీరిలో వినీత్ బ్రిజ్‌లాల్‌కు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ఢిల్లీ అల్లర్లు: ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 22మంది ప్రాణాలు కోల్పోవడం.. అల్లరిమూకల తుపాకీ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలు కావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. కాగా సీఏఏ అనుకూల, ప్రతికూల నిరసనలతో రగిల్చిన చిచ్చుతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా 20 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున వారిలో మరో ఇద్దరు కూడా మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో జీటీబీ ఆస్పత్రిలో ఒకరు, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. చదవండి: ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని -
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్ఎమ్ కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీల వివరాలు.. రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్ఎమ్ కిషోర్ కుమార్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ రైల్వేస్ అడిషనల్ డీజీగా బాలసుబ్రహ్మణ్యం సీఐడీ డీఐజీగా సునీల్ కుమార్ నాయక్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా అభిషేక్ మహంతి ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్ (అదనపు బాధ్యతలు) ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ హరికుమార్, కృపానంద త్రిపాఠిని డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 18 మంది ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సూపర్ టైం స్కేల్ ప్రకారం ఐపీఎస్‌లకు జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ అధికారులకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కే మీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఎ.ఎస్.ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్ లకు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కె. రఘురామ్, అకె రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్.జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయకుమార్, ఎస్.హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర బాబు, కెవీ.మోహన్ రావు, పీహెచ్డీ రామకృష్ణలకు డీఐజీలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. -
తెలంగాణలో ఐపీఎస్‌లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేష్ కుమార్, ఎన్.శివశంకర రెడ్డి, డాక్టర్.వి.రవీంద్రకు ఐజీలుగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ,కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు,ఏ.వెంకటేశ్వరరావుకు డీఐజీలుగా ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. (50 మంది ఐఏఎస్‌ల బదిలీ) ఐజీలుగా రాజేష్ కుమార్ ఎన్.శివశంకర రెడ్డి డాక్టర్.వి.రవీంద్ర డీఐజీలుగా కార్తికేయ కె.రమేష్ నాయుడు వి.సత్యనారాయణ బి.సుమతి ఎం.శ్రీనివాసులు ఏ.వెంకటేశ్వరరావు కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఐపీఎస్ బదిలీలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. నేడు, రేపు అంటూ ఊరిస్తోన్న ట్రాన్స్ఫర్ల ప్రచారంతో పోలీసు అధికారులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 50మంది ఐఏఎస్‌లోను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాత రోజు ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని భారీగా ప్రచారం సాగింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం కూడా ఇదే తరహా ప్రచారం సాగింది. కొందరు ఔత్సాహికులు ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగి పోయిందంటూ పోస్టింగ్‌లతో సహా సోషల్ మీడియాలో పెట్టేసారు. ఈ సందేశాలు క్షణాల్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. పలువురికి స్థాన చలనం.. వాస్తవానికి ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు 2018లోనే జరగాల్సింది. కానీ, అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి. దీంతో ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. 2019 ఏప్రిల్‌లో రాష్ట్ర హోంశాఖ కేంద్రం అనుమతితో 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. వాస్తవానికి పదోన్నతితోపాటు బదిలీ తప్పనిసరి. కానీ, వీరికి పదోన్నతి దక్కినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 నెలలుగా తమకు కొత్త పోస్టింగ్‌లు వస్తాయని ఎదురు చూశారు. 12 మంది ఐపీఎస్‌లు నగరానికి..! ఇక జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న దాదాపు 12 మంది ఐపీఎస్ అధికారులను నగరానికి తీసుకురావాలన్న యోచనలో డీజీపీ ఉన్నట్లు సమాచారం. వీరికి గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో, ఇతర రాష్ట్రస్థాయి విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘‘రైట్ పర్సన్ ఎట్ రైట్ పొజిషన్’’ అన్న విధానంలో ఆయన పోస్టింగ్‌లు ఇవ్వనున్నారని సమాచారం. ఎలాంటి పైరవీలకు తావులేకుండా.. పనితీరు ఆధారంగా సరైన స్థానంలో సరైన అధికారికి బాధ్యతలు అప్పజెప్పనున్నారు. -
మీ మాట తీరు ఇక మారదా బాబూ!
బోస్టన్ కమిటీ నివేదిక సారాంశాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున వివరించిన దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను అక్కసుకొద్దీ చంద్రబాబు ఆ ‘విజయ్‌కుమార్‌గాడు’ మాకు పాఠాలు చెబుతాడా అని నోరు పారేసుకోవడం బాబులో పేరుకుపోయిన ‘కుల’ అహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ‘పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో పోదన్న’ సామెతను బాబు అక్షరాలా నిరూపించాడు. మన సభ్యతా, సంస్కృతీ ఎంతో గొప్పవని గొప్పలు చెప్పుకున్నా, దేశ ప్రజల్లోని మూడోవంతు ప్రజల్ని అంటరాని వారిగా చేసిందని రాహుల్ సాంకృత్యాయన్ అందుకే శఠించాడు. ఇలాంటి ధోరణులు చావనందునే, కుల వ్యవస్థకు ప్రతీకగా బాబు, ‘దళితుడుగా పుట్టాలని ఎవడైనా కోరు కుంటాడా’ అని ఎత్తిపొడిచి మనస్సులను ఇంతకుముందూ గాయపరిచిన విషయం మరవరానిది. తప్పును తప్పుగా అంగీకరించే గుణం ఆయనకి ఏనాడూ లేదు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర పుంగనూరు సంస్థానమని వెనకటికొక సంస్థానం ఉండేది. ఆ సంస్థానానికి ‘వెర్రిబాగులది’ అనే పేరుండేదట. అదొకప్పటి జమీందారీ పట్టణం. జమీందారీ దర్జాకు తగ్గట్టు దానికి మంచి పేరుండాలి కదా, మరీ ‘వెర్రిబాగులది’ అన్నపేరు ఎందుకొచ్చి ఉంటుంది? ఎందుకంటే, పుంగనూరు రాజూ (జమీందారు), అతడి మంత్రీ, వారి అనుయాయులూ– అందరూ ‘వెర్రివెంగళప్ప’ చేష్టలకు అలవాటు పడ్డారట. అలాగే నెల్లూరు తాలూకాలో ఒక పుంజులూరు పాటి కుటుంబాన్ని కూడా ఎగతాళి పట్టిస్తూ ‘పోరా పుంజులూరు’ అని తిట్టు అర్థంలో వాడేవారట! చంద్రబాబు పేరిట ఇలాంటి సామెతలు ఉనికిలో లేకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఆయన చేస్తున్న కుప్పిగంతులవల్ల విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ అంతకంతా అనుభవిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొంపాగోడూ కోల్పోయిన స్థితిలో కొత్త రాజధాని నిర్మాణానికి తగిన స్థల నిర్దేశానికి శాశ్వత కట్టడాలకు వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం పదేళ్లపాటు హైదరాబాద్‌లోనే శాసనసభ సమావేశాలు నిర్వహించుకునే హక్కును కల్పించింది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఆ పదేళ్ల వ్యవధిలో నూతన రాష్ట్రానికి శక్తిమంతమైన ప్రదేశంలో రాజధాని నిర్మాణాన్ని సానుకూలం చేసుకోవలసింది. కానీ ఈలోగా ఓటుకు కోట్లు కేసులో దొరికి పోయిన బాబు ఆ కేసునుంచి బయటపడే మార్గంలేక అర్థరాత్రి అధికార సరంజామాను ఉమ్మడి సచివాలయం నుంచి ఆగమేఘాల మీద పెట్టే–బేడాతో విజయవాడ వైపునకు తరలించుకుపోవలసి వచ్చింది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం తరఫున నూతన రాజధాని నిర్మాణానికి అనువైన భూసార, పర్యావరణ, వాస్తుశిల్ప ప్రమాణా లకు అనుగుణమైన ప్రాంతాలను సందర్శించి రాజధానికి, సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి వివిధ శాఖలకు చెందిన సకల సాంకేతిక, నిర్మాణ, పర్యావరణ నిపుణులతో కూడిన శివరామకృష్ణ్ణన్ కమిటీ నివేదిక సమర్పించగా, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా బాబు తొక్కిపెట్టడం ఓ పెద్ద ప్రహసనం. ఆ నివేదిక స్థానే నాటి మంత్రి నారాయణతో ఒక నివేదికను తయారుచేయించి, నిపుణుల నివేదికను బేఖాతరు చేయించారు. రాజధానిగా అమరావతిని నిర్ణ యించినట్లు చెప్పకుండా కొంతసేపు నూజివీడనీ, గన్నవరం అనీ, విజయవాడ–గుంటూరు మధ్యన అనీ.. ఊహాగానాలు వ్యాప్తి చేశారు. అమరావతిలోని మూడు–నాలుగు పంటలు పండే భూము లపై కన్నుపడి, ఆ భూముల స్వాధీనానికి భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) పేరుతో, మధ్యతరగతి ప్రజలనుంచి తక్కువ రేటుకు భూములు గుంజేశారు, కానీ మోతుబరులు ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చని ఆశించి రాజధానికోసం భూములిచ్చారు. తీరా చూస్తే జరిగింది రాజధాని నిర్మాణం కాదు, సినిమా సెట్టిం గులు చూపి అమరావతి ప్రజల్ని మోసగించటం. మంచి పంట భూముల్ని వదులుకోడానికి ఇష్టపడని పేద రైతుల్ని బెదిరించారు, అర్ధరాత్రి పంట భూముల్ని తగలబెట్టించి, పంట భూముల వినా శనం కనబడకుండా తిరిగి అర్ధరాత్రిపూట దున్నించి చదును చేయించ డమూ స్థానిక ప్రజలు కళ్లారా గమనించారు. అన్నింటికన్నా అసలు విషయం–అమరావతిపై కేంద్రీకరణ రాజధాని నిర్మాణం కోసం కాదు, అక్కడి చుట్టుపట్ల భూముల పైన, వాటి విలువపైన, స్పెక్యు లేషన్ విలువను పెంచుకోవడం కోసం... పైగా ఒక్క మొన్నటి శివ రామకృష్ణన్ కమిటీయే కాదు, నిన్నటి జీఎన్ రావు ఉన్నతాధికార కమిటీ, నేటి బోస్టన్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల కమిటీ ఇచ్చిన నివే దికలు కూడా–ఒకే ప్రాంతంలో పరిపాలన, అధికారాల కేంద్రీకర ణకుగాక అభివృద్ధి వికేంద్రీకరణకు ఏక ముఖంగా సానుకూలత వెలిబుచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణ, భూసార పరిస్థితులు, తుఫానులు, సముద్ర మట్టానికి అతి తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతా లకు, పంటలకు, వరదలవల్ల ప్రజలకు, నిర్మాణాలకు కలిగే బీభత్సం, హాని వగైరా అంశాలను దృష్టిలో పెట్టుకున్నందునే నివే దికలు వేరుగా వెలువడినా నిర్ణయాలు దాదాపు ఒక తీరుగానే ఉండటం అనుభవ నైపుణ్యంగా పరిగణించాలి. చివరికి శివరామకృష్ణ కమిటీకన్నా ఆరేడేళ్ల ముందే అమరావతి ప్రాంతానికి 15 అడుగుల్లోనే నీరు పైకి ఉబికి వచ్చి ముంచే ప్రమాదం ఉందనీ.. గుంటూరు, విజయవాడ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హైద రాబాద్ పర్యావరణ రక్షణ సంస్థ సర్వే వరద హెచ్చరిక చేసింది. వీటన్నింటి సారాంశాన్ని క్రోడీకరించుకుని ప్రజలకు ఓపికతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరఫున వివరించిన ఐఏఎస్ అధికారి, దళిత అధికారి అయిన విజయ్‌కుమార్‌ను అక్కసుకొద్దీ చంద్రబాబు ఆ ‘విజయ్‌కుమార్‌గాడు’ మాకు పాఠాలు చెబుతాడా అని నోరు పారేసుకోవడం వర్గ, వర్ణ వ్యవస్థా చట్రంలో ‘కుల’ అహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ‘పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో పోదన్న’ తెలుగు సామెతను బాబు అక్షరాలా నిరూపించాడు. మన సభ్యతా, సంస్కృతీ ఎంతో గొప్పవని గొప్పలు చెప్పుకున్నా దేశ ప్రజల్లోని మూడోవంతు ప్రజల్ని అంటరానివారిగా చేసిందని రాహుల్ సాంకృ త్యాయన్ అందుకే శఠించాడు. అంతేగాదు, ఈ కుల భేదాల్ని బ్రహ్మ ముఖం నుంచి వెలువడ్డ వ్యవస్థగా ప్రకటించి దేశంలో జాతీయ ఐక్యతకు అవకాశమే లేకుండా చేసిందనీ, ‘ఈ ధోరణి సృష్టిలో సర్వ శ్రేష్టుడైన మానవుణ్ణి ఆవుముందూ, కోతిముందూ సాగిలపడేట్టూ చేసిందనీ, పాప పరిహారం పేరిట మానవుల చేత ఆవుపేడనూ తిని పించిందనీ, ఈ ధోరణే సగం జనాభా అయిన స్త్రీలకు నాగరిక అధి కారాలు లేకుండా చేసిందనీ, వందల సంవత్సరాల వరకూ సహగ మనం పేర కోట్లాది తరుణుల జీవితాన్ని బుగ్గిపాలు చేసిందనీ’ మహా పండిత రాహుల్జీ ఆక్రోశించవలసి వచ్చింది. ఇలాంటి ధోర ణులు చావనందుననే, కుల వ్యవస్థకు ప్రతీకగా చంద్రబాబు, ‘దళి తుడుగా పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా’ అని ఎత్తిపొడిచి మన స్సులను ఇంతకుముందూ గాయపరిచిన విషయం మరవరానిది. తప్పును తప్పుగా అంగీకరించే గుణం ఆయనకి ఏనాడూ లేదు. పైగా, చంద్రబాబు ఎంతటి అబద్ధమైనా, అంత సులువుగా ఆడ గలడంటే– తన ‘దార్శనిక దృష్టి’ ఎంతవరకూ కొడిగట్టుకు పోయిం దంటే, తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివరంగా తయారు చేసిన ‘విజన్–2029’ నివేదికను బోస్టన్ కన్సల్టెన్సీ (బీసీజీ) నిపు ణులు తమ రిపోర్ట్‌లో ‘కట్ అండ్ పేస్ట్’ చేసుకొని కాపీకొట్టి సిద్ధం చేశారని ‘కోత’లు కోయగలిగినంతగా ఆయన ‘విజన్’ మసకబారి పోయింది. ఆయన ‘దార్శనిక దృష్టి’ ఎంతగా కొడిగట్టుకుపోయిం దంటే– అమరావతి రైతులతో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి వర్గం స్వయంగా వచ్చి వారికి, వారి భూములకు ల్యాండ్‌ఫూలింగ్ బాధలవల్ల కలిగిన కష్టనష్టాలను చెవులారా విన్న తరువాత చంద్రబాబు కలలు సాకారం కావడానికి నిధులు ఇవ్వడాన్ని నిలిపివేస్తూ బ్యాంక్ ప్రకటన చేసింది. ఇదే ప్రపంచబ్యాంకు చంద్రబాబు ‘విజన్–2020’కి కూడా నిధులు హామీ పడి షరతులతో బిగించినప్పుడు, ఇదే బాబు పళ్లబిగువు కోసం ‘అబ్బే, ఎలాంటి షరతులు లేవని’ నాడు కోతలు కోస్తే, వెంటనే బ్యాంకు ‘అన్ని షరతులను బాబు అంగీకరించాడ’ని లిఖితపూర్వక పత్రంలో పేర్కొన్నది. ‘అబద్ధాల కోరు నోటికి అరవీశెడు సున్నం’ పెట్టుకున్న సామెత ఎందుకు వచ్చిందో అప్పుడుగానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు. చివరికి వరల్డ్ బ్యాంక్ అధినేతలతో (ఉల్ఫోవిజ్ వగైరాతో) ఢిల్లీలో ముఖ్యమంత్రి హోదాలో రుణాల కోసం జరిపిన చర్చలలో తాను తప్ప రాష్ట్ర అధికారులు ఎవరినీ ఆయన పాల్గొన నివ్వలేదు. పైగా, బ్యాంకు అనుబంధ సంస్థ అయిన డీఎఫ్ఐడీ రుణ సంస్థ అంతవరకూ అందించిన రుణాలు ఎంతవరకు క్షేత్రస్థాయిలో ప్రజల ప్రయోజనాలకు దోహదపడ్డాయో విచారించి బ్యాంకుకు నివే దిక అందించిన సంస్థ నిపుణ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జేమ్స్మానర్స్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అవినీతి ఏరులై పారుతోందని పేర్కొన్నాడు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని, ఆయన ఎరుక లేకుండా ఏ పనీ జరగడంలేదనీ ప్రొఫెసర్ మానర్స్ ఉదహరించాడు. అందుకే మహో న్నత మానవుడు, మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ ‘కమాల్ పుటి కబీర్ వంశాన్ని నట్టేట ముంచాడ’ని చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు ప్రవేశం ఒక్క ఎన్టీఆర్కే కాదు, యావ దాంధ్ర ప్రజల శ్రేయస్సుకు, రాష్ట్ర ప్రగతికీ వినాశకర పరిణామం. ఎలాగూ ‘దేవతాపురం’గా అమరావతి పేరుండిపోయింది గనుక, దాన్ని అలా తలచుకుంటూ కొలుచుకుంటేనే మంచిదేమో! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
డీజీపీని కలిసిన ఏపీ కేడర్ ఐపీఎస్‌లు
సాక్షి, విజయవాడ : ఏపీ కేడర్‌కు కేంద్ర హోంశాఖ కేటాయించిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారంతా నేషనల్ పోలీస్ అకాడమి ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణకాంత్, వీఎస్ మణికంఠ, కృష్ణకాంత్ పాటిల్ (తెలంగాణ), పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి (రాజస్థాన్)లను కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ఏపీ కేడర్‌కు కేటాయించింది. వారికి బాధ్యతలు అప్పగించేలా ఏపీ పోలీస్ అకాడమి డైరెక్టర్ సంజయ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారంతా డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ట్రైనింగ్ కిట్లు అందించిన డీజీపీ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మంచి పోలీసు అధికారులుగా ప్రజల మన్ననలు పొందాలని అభిలషించారు. కొత్త ఐపీఎస్ అధికారులకు సీఐడీ, ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్, విజిలెన్స్, ఏసీబీ, గ్రేహౌండ్స్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సంజయ్‌ను సవాంగ్ ఆదేశించారు. -
తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా సంతోష్ మెహ్రాను బదిలీ చేయగా, ఆయన స్థానంలో వీకే సింగ్ నియామకం అయ్యారు. ఫైర్ సేఫ్టీ డీజీ గోపీకృష్ణ స్థానంలో సంజయ్ కుమార్ జైన్‌ను నియమించింది. అలాగే గోపీకృష్ణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉగ్రవాదంపై ‘వర్చువల్’ పోరు!
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారులకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానని నేషనల్ పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ అభయ్ అన్నారు. బుధవారం ఉదయం అకాడమీ అధికారుల ఘనస్వాగతం అనంతరం నూతన డైరెక్టర్‌గా అభయ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1986 ఐపీఎస్ బ్యాచ్ ఒడిశా కేడర్‌కి చెందినవారు. అనంతరం అభయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భావి ఐపీఎస్ ఆఫీసర్లను తీర్చిదిద్దే అకాడమీ బాధ్యతలను స్వీకరించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాను గతంలో సీబీఐ (బ్యాండ్ఫ్రాడ్), సీఆర్పీఎఫ్, నార్కోటిక్స్ బ్యూరోలో విధులు నిర్వహించానన్నారు. దేశంలో అధిక సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక అకాడమీలో ప్రస్తుతం 350 మంది ఆఫీసర్లు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. వీరిలో 147 మంది ఆఫీసర్లు ఫేజ్–1, మరో 121 మంది ఫేజ్–2 ట్రైనింగ్‌లో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిలో ఫారిన్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వివరించారు. గడిచిన పదేళ్లలో అకాడమీలో కాలానుగుణంగా శిక్షణ విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. సీబీఐ, ఎన్ఐఏలో కేసు దర్యాప్తు తర్వాత న్యాయ విచారణను పర్యవేక్షించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా ఆధునిక పద్ధతిలో వర్చువల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దర్యాప్తు విధానంలో (ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు) అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వర్చువల్ తరగతులు అంటే..? వర్చువల్ తరగతులు అనగా కంప్యూటర్ సాయంతో భారీ తెరలను ఏర్పాటు చేసి టార్గెట్‌ను ఛేదించే ఒక ఆధునిక విధానం. చాలామంది పిల్లలు ప్లే స్టేషన్ పేరిట వివిధ గేమ్స్‌ని నిజంగా ఆడిన అనుభూతిని పొందినట్లే.. ఉగ్రవాద దాడి జరిగినపుడు శత్రువుపై ఎలా దాడి చేయాలి? ఎటునుంచి ముప్పు పొంచి ఉంది? క్షణాల్లో ఎలా దాడి చేయాలి? సురక్షితంగా ఎలా రావాలి? అన్న విషయాలపై శిక్షణ ఇస్తారు. -
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో 15 రోజుల వ్యవధిలో రెండు దశల్లో రాష్ట్రంలో 47 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అప్పట్లో బదిలీ చేసిన వారిలో ఐదుగురు మరోసారి బదిలీ అయ్యారు. టీడీపీ హయాంలో ప్రత్యేకంగా డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ను అనంతపురం పీటీసీకి బదిలీ చేయగా తాజాగా ఆయన్ను పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోయ ప్రవీణ్, జీవీజీ అశోక్‌కుమార్, సర్వశ్రేష్ట త్రిపాఠి, విక్రాంత్ పాటిల్‌పై ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. -
26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది జిల్లాలకు కొత్త ఎస్పీలను నియ మించారు. ముగ్గురు డీఐజీలు, ఒక జాయింట్ సీపీ, ముగ్గురు డీసీపీలు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ, సీఐడీ ఎస్పీలను కూడా బదిలీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల సమన్వయం పేరుతో ప్రత్యేకంగా పోస్టు సృష్టించి నియమించిన ఘట్టమనేని శ్రీనివాస్‌ను అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)కి బదిలీ చేశారు. సీఎం నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రెండు దఫాలు భేటీ అయ్యారు. ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల బదిలీలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. పలువురు ఐపీఎస్‌ల పనితీరుపై డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాస ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ సవాంగ్ పరిశీలించారు. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు శాఖ ఆ ప్రాంతంలో నిఘాను పెంచింది. సీఎం నివాసం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానించారు. బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
సుపరిపాలన దిశగా..
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎంతో నమ్మకంతో వైఎస్సార్ సీపీకి అఖండ మెజార్టీ అందించిన ప్రజలకు అత్యుత్తమ, ప్రజారంజక పాలన అందించడంపై కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పుడే దృష్టి సారించారు. ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై ఆయన కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలసి పరిస్థితిని వివరించి రాష్ట్ర ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు. ఢిల్లీ నుంచి సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన జగన్‌ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా పరిపాలనలో తేవాల్సిన సంస్కరణలపై సీనియర్ ఐఏఎస్‌లతో ప్రాథమికంగా సమీక్షించారు. చేసి చూపాలనే తపన.. ‘తాను కోరుకుంటున్నట్లుగా పారదర్శకత, సుపరిపాలన అందించాలంటే ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రస్తుతం జగన్ అదే చేస్తున్నారు. ఏయే శాఖల్లో ఏం జరిగింది? ఏయే మార్పులు అవసరం. వాటిని చేయడానికి ఏం కావాలి? అధ్యయనం చేయడం కోసం ప్రాథమిక కసరత్తును కాబోయే ముఖ్యమంత్రి అప్పుడే ప్రారంభించారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎవరూ ఇలాంటి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. పారదర్శకపాలన అందిస్తానని చెప్పడం కాదు, చేసి చూపించాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు తనకోసం వచ్చిన వారిని కలుస్తూనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదారు రోజులు ఆయా శాఖలతో సమీక్ష, సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని మార్పులకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది శుభ సంకేతం...’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తెలిపారు. జగన్‌ను కలసిన పలువురు ఉన్నతాధికారులు వైఎస్ జగన్‌ను సోమవారం కలసిన వారిలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, ఎంటీ కృష్ణబాబు, ఉదయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, లక్ష్మీకాంతం, సంధ్యారాణి, ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, వరప్రసాద్, సంజయ్, కార్తికేయ మిశ్రా, మేరి ప్రశాంతి, రవిప్రకాశ్, అరుణ్ కుమార్, సత్యనారాయణ, ముత్యాల రాజు, రేఖారాణి, ఇంతియాజ్, మురళీ, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జి.చంద్రుడు, కె.వెంకట రమణారెడ్డి, సూర్యకుమారి, గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్ర, త్రిపాఠి, సిద్ధార్థ కౌశల్, ప్రొటోకాల్ అధికారి అశోక్ బాబు తదితరులు ఉన్నారు. ఈ అధికారులను అడిషనల్ సెక్రటరీ ధనుంజయరెడ్డి దగ్గరుండి జగన్‌కు పరిచయం చేశారు. అదేవిధంగా గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ కార్మిక విభాగం నేత గౌతమ్ రెడ్డి తదితరులు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.55కు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, నందిగం సురేశ్, మార్గాని భరత్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. వైఎస్ జగన్‌కు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, గన్నవరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్, పలువురు అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి బయలుదేరివెళ్లారు. నేడు తిరుమలకు పయనం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. నాడు శ్రీవారి ఆశీస్సులతో పాదయాత్రకు శ్రీకారం వైఎస్ జగన్ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2017, నవంబర్ 4న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన తర్వాతే జగన్ నవంబర్ 6న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకుని ఈ ఏడాది జనవరి 9న ఆయన నేరుగా ఇచ్ఛాపురం నుంచి తిరుపతికి వచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లి జనవరి 10న స్వామివారిని దర్శించుకున్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేయాలని, ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని కోరనున్నారు. -
తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు ఐపీఎస్‌ల చూపు ఇప్పుడు ఏపీ వైపు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్ అధికారులు ఇంటర్‌స్టేట్ డిప్యుటేషన్‌పై వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌ల విషయంలో దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన ఐపీఎస్‌లలో పలువురు రిటైర్ అయ్యారు. అప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు ఇప్పుడు జగన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఇప్పటికే జగన్‌ని కలిసిన ఓ ఐపీఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. కానీ, వీరికి ఇంకా స్థానచలనం లభించలేదు. పదోన్నతులు పొందినా వారు పాతస్థానంలోనే అంటే తమ హోదా కంటే తక్కువ పదవిలో పనిచేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక.. అంటే మే 28 తరువాత స్థానచలనం/ బాధ్యతల మార్పుపై హోంశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఈలోగా ఆరుగురు తెలంగాణ ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. వీరిలో ఒక అధికారి ఇప్పటికే విజయవాడ వెళ్లి జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను ఏపీలో పనిచేయాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టుకున్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం వీరి విజ్ఞప్తులపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఇద్దరు కేంద్ర సర్వీసులకు! తెలంగాణ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. వీరిలో సివిల్ సప్లయ్ కమిషనర్‌గా ఉన్న డీఐజీ అకున్ సబర్వాల్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ(టీఎస్పీఏ) డైరెక్టర్‌గా ఉన్న సంతోశ్ మెహ్రాలు ఉన్నారని సమాచారం. ఎలక్షన్ కోడ్ తరువాత వీరి బదిలీకి రాష్ట్ర హోంశాఖ కూడా సుముఖంగా ఉందని, త్వరలోనే పచ్చజెండా ఊపనున్నందని తెలిసింది. -
ఆస్తులెంతో చెప్పమంతే!
సాక్షి, బెంగళూరు : చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన ఐపీఎస్ అధికారులు తమవరకూ వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. కర్ణాటకలో 45 ఐపీఎస్ అధికారులు ఆస్తి వివరాలు వెల్లడించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2018 ఆఖరు నుంచి ఈ ఏడాది జనవరి ఆఖరిలోగా ఐపీఎస్ అధికారులు తమ తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ ఇంతవరకు 45 మంది ఐపీఎస్ అధికారులు వాటిని సమర్పించలేదు. వీరిలో ఎస్పీల నుంచి అదనపు డీజీపీ స్థాయివరకూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నిర్లక్ష ధోరణి అవలంబిస్తుండటంపై రాష్ట్ర హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ.. డీజీపీ నీలమణిరాజుకు లేఖ రాశారు. ప్రతి ఏడాది ఐపీఎస్ అధికారులు తమ, తమ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు తెలియజేయాలనే నిబంధన ఉంది. ఈ సమాచారాన్ని నమోదు చేయడానికి ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అధికారులు అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్థిర, చరాస్తుల వివరాలు అందించడానికి ఐపీఎస్‌లు వెనుకంజ వేస్తున్నారని, దీనిపై డీజీపీ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.