12మంది ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు | Govt shortlists for promotions to IAS and IPS | Sakshi
Sakshi News home page

12మంది ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు

Published Fri, Feb 26 2016 3:32 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

12మంది ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు - Sakshi

12మంది ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐదుగురు ఐఏఎస్ అధికారులు రజిత్ కుమార్, రామకృష్ణారావు, హరిప్రీత్ సింగ్, అరవింద్ కుమార్, అశోక్ కుమార్లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది.

అలాగే  1991 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారులను అడిషనల్ డీజీలుగా...  1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు ఐజీలుగా... 2002 బ్యాచ్ ఐపీఎస్లకు డీఐజీలుగా పదోన్నతలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశాలు జారీ చేశారు. సీవీ ఆనంద్, రాజీవ్ రతన్కు అడిషనల్ డీజీగా ప్రమోషన్... విక్రమ్ సింగ్, ఆర్బి నాయక్, బి.మల్లారెడ్డి, మురళీకృష్ణ, శివప్రసాద్కు ఐజీలుగా పదోన్నతి రాగా, ఇక రాజేశ్ కుమార్, శివశంకర్ రెడ్డికి డీఐజీలుగా ప్రమోషన్ లభించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement