సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐదుగురు అధికారులు బూసాని వెంకటేశ్వరరావు, ఎన్.శివశంకర్, సి.పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్‌లకు కార్యదర్శి నుంచి ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం బూసాని వెంకటేశ్వరరావు ఎంసీహెచ్‌ఆర్‌డీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా, శివశంకర్ ఆర్థిక శాఖ కార్యదర్శి, పార్థసారథి వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, వీఎన్ విష్ణు రాష్ట్ర గెజిట్స్ కమిషనర్‌గా, చంద్రవదన్ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
పదోన్నతితో పాటు ప్రస్తుత పోస్టుల్లో వీరిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు సీఎస్ ఎస్.కె.జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు 2004, 2005 బ్యాచ్‌లకు చెందిన ఆరుగురు ఐఏఎస్ అధికారులు కె.నిర్మల, గౌరవ్ ఉప్పల్, కె.ఇలంబర్తి, కె.మాణిక్ రాజ్, ఎ.శరత్, ఎల్.శర్మన్‌లకు సెలెక్షన్ గ్రేడ్ స్కేల్ అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. అలాగే 2008, 2009 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్‌లు దేవసేన, సర్ఫరాజ్ అహ్మద్, ఎన్. సత్యనారాయణ, ఎస్. అర్విందర్ సింగ్, ఎం. ప్రశాంతిలకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ అధికారులుగా పదోన్నతి కల్పించారు.
12 మంది ఐపీఎస్‌లకూ..
ఐఏఎస్‌లతో పాటు 2005, 2006 బ్యాచ్‌లకు చెందిన 12 మంది ఐపీఎస్ అధికారులకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వి.శివకుమార్, వి.బి.కమలాసన్‌రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం.రమేశ్, ఆర్.రమేశ్‌నాయుడు, ఏవీ రంగనాథ్, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, వి.సత్యనారాయణ, ఏ.వెంకటేశ్వరరావు పదోన్నతి పొందిన జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment