సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా నలుగురు ఐపీఎస్‌లను కేటాయించింది. 73వ ఐపీఎస్ (ఆర్‌ఆర్) బ్యాచ్‌కు చెందిన 150 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు బుధవారం పోస్టింగులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. వీరిలో ఏడుగురిని తెలుగు రాష్ట్రాలకు (తెలంగాణకు నలుగురు, ఏపీకి ముగ్గురు) కేటాయించింది. తెలంగాణ కేడర్‌కు కేటాయించినవారిలో పరితోష్ పంకజ్ (ర్యాంకు 142, బిహార్), సిరిశెట్టి సంకీర్త్ (ర్యాంకు 330, తెలంగాణ), పాటిల్ కాంతిలాల్ సుభాష్ (ర్యాంకు 418, మహారాష్ట్ర), అంకిత్‌కుమార్ శంక్వార్ (ర్యాంకు 563, ఉత్తర్‌ప్రదేశ్)లు ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం రాష్ట్రానికి 11 మంది ఐపీఎస్‌లను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన ఎంవీ సత్యసాయి కార్తీక్ (ర్యాంకు 103)ను మహారాష్ట్రకు, శీతల్‌కుమార్ (ర్యాంకు 417)ను అసోంకు, రాజనాల స్మృతిక్ (ర్యాంకు 466)ను ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించారు
Comments
Please login to add a commentAdd a comment