newly appointed
-
రష్యాకు కొత్త రాయబారి.. నియమించిన కేంద్రం
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహరాల్లో నిపుణుడైన ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి వినయ్‌కుమార్‌ను రష్యా రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం(మార్చ్ 19) విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వినయ్‌కుమార్ 2021 నుంచి మయన్మార్‌లలో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రష్యా రాయబారిగా పనిచేస్తున్న పవన్‌కుమార్ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సాధారణంగా మాస్కో, వాషింగ్టన్, లండన్, టోక్యో, కాన్బెర్రా నగరాలు భారత ఐఎఫ్ఎస్ అధికారులకు కీలక పోస్టింగ్‌లుగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిత్ర దేశం రష్యాతో సంబంధాలు మరింత మెరుగుపరిచుకునేందుకు అనుభవజ్ఞుడైన వినయ్‌కుమార్‌ను నియమించినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. రష్యాతో నాటో ఘర్షణకు దిగితే మూడో ప్రపంచ యుద్ధమే -
సత్య నాదెళ్లకు ‘డబుల్’ ఆనందం
న్యూయార్క్: భారతీయ అమెరికన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పనితీరుకు పదోన్నతి లభించింది. ఏడేళ్లుగా సీఈఓ బాధ్యతల్లో ఉన్న ఆయనకు కంపెనీ చైర్మన్‌గానూ బాధ్యతలను అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చైర్మన్ బాధ్యతల్లో ఉన్న జాన్ థామ్సన్ ముఖ్య ఇండిపెండెంట్ డైరెక్టర్ బాధ్యతల్లోకి తిరిగి వెళ్లనున్నారు. బోర్డు స్వతంత్ర డైరెక్టర్లు ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2014లో మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు థామ్సన్ ముఖ్య స్వతంత్ర డైరెక్టర్ బాధ్యతలనే నిర్వహించడం గమనార్హం. టెక్నా లజీ ఎగ్జిక్యూటివ్‌గా థామ్సన్‌కు దశాబ్దాల అనుభవం ఉంది. 2014లో సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా ప్రకటించిన బిల్‌గేట్స్.. చైర్మన్ పదవికి థామ్సన్‌ను ప్రతిపాదిస్తూ ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నారు. నూతన పదవిలో సత్య నాదెళ్ల కంపెనీ బోర్డు ముందు ఎజెండాను ఉంచడంతోపాటు సరైన వ్యూహాత్మక అవకాశాలను వెలుగులోకి తీసుకురావడం, కీలకమైన సమస్యలను గుర్తిం చి వాటి పరిష్కారాలను బోర్డు దృష్టికి తీసుకువస్తారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2014లో స్టీవ్ బాల్మర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో పగ్గాలు స్వీకరించిన సత్య నాదెళ్ల.. ఏడేళ్ల తన నాయకత్వంతో క్లౌడ్ కంప్యూటింగ్‌లో మైక్రోసాఫ్ట్‌ను దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దినట్టు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. దీంతో కంపెనీకి లాభాల వర్షం కురియడమే కాకుండా.. 2 లక్షల కోట్ల డాలర్లకు మార్కెట్ విలువ విస్తరించినట్టు పేర్కొంది. సత్య రాక ముందు మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్స్ వ్యాపారంలో చేతులు కాల్చుకుంది. కానీ, సత్య నాదెళ్ల కంపెనీకి భవిష్యత్తునిచ్చే విభాగాలపై దృష్టి సారించారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీలో మైక్రోసాఫ్ట్‌ను బలంగా ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. 2016లో లింక్డ్ఇన్ కొనుగోలు సైతం ఆయన వ్యూహంలో భాగమే. సత్య పనితీరు కంపెనీ బ్యాలెన్స్షీట్లో స్పష్టంగా ప్రతిఫలించింది. దాంతో మైక్రోసాఫ్ట్ షేరు ఏడేళ్లలో 150% లాభాలను ఇచ్చింది. ఆ పనితీరుకు కితాబుగా కంపెనీ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. -
తెలంగాణకు నలుగురు కొత్త ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా నలుగురు ఐపీఎస్‌లను కేటాయించింది. 73వ ఐపీఎస్ (ఆర్ఆర్) బ్యాచ్‌కు చెందిన 150 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు బుధవారం పోస్టింగులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. వీరిలో ఏడుగురిని తెలుగు రాష్ట్రాలకు (తెలంగాణకు నలుగురు, ఏపీకి ముగ్గురు) కేటాయించింది. తెలంగాణ కేడర్‌కు కేటాయించినవారిలో పరితోష్ పంకజ్ (ర్యాంకు 142, బిహార్), సిరిశెట్టి సంకీర్త్ (ర్యాంకు 330, తెలంగాణ), పాటిల్ కాంతిలాల్ సుభాష్ (ర్యాంకు 418, మహారాష్ట్ర), అంకిత్‌కుమార్ శంక్వార్ (ర్యాంకు 563, ఉత్తర్‌ప్రదేశ్)లు ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం రాష్ట్రానికి 11 మంది ఐపీఎస్‌లను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన ఎంవీ సత్యసాయి కార్తీక్ (ర్యాంకు 103)ను మహారాష్ట్రకు, శీతల్‌కుమార్ (ర్యాంకు 417)ను అసోంకు, రాజనాల స్మృతిక్ (ర్యాంకు 466)ను ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించారు -
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కుష్బు
కాంగ్రెస్‌లో గ్రూపులు లేవని అందరిదీ ఒకే గ్రూప్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బు అన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ప్రత్యేక గౌరవం, మర్యాద అని వ్యాఖ్యానించారు. పదవి దక్కించుకున్న కుష్బుకు సత్యమూర్తి భవన్లో ఘన స్వాగతం లభించింది. సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఉన్నత పదవిని కుష్బు దక్కించుకున్నారు. ఆ పార్టీలో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్బు వాక్ చాతుర్యాన్ని గుర్తించిన అధిష్టానం అందుకు తగ్గ పదవిని అప్పగించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమితులైన కుష్బు బుధవారం సత్యమూర్తి భవన్‌కు వచ్చారు. అధికారిక హోదాతో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టిన ఆమెకు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. నాయకులు చిరంజీవి, రామచంద్రన్, జ్యోతి, తదితరులు పుష్ప గుచ్ఛాలను అందించి ఆహ్వానం పలికారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో సత్యమూర్తి భవన్‌కు రావడం విశేషం. అనంతరం సత్యమూర్తి భవన్లో మీడియాతో కుష్బు మాట్లాడారు. తన మీద నమ్మకంతో అతి పెద్ద బాధ్యతను అప్పగించిన తమ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పరంగా తనను ఉన్నత పదవిలో చూడాలని ఈవీకేఎస్ కాంక్షించే వారని, అందుకు తగ్గట్టుగానే అతి పెద్ద పదవిని పార్టీ అధిష్టానం అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. తాను పార్టీలోకి వచ్చి ఐదు నెలలవుతోందని, ఈ కాలంలో తనను పార్టీలోని నాయకులు అందరూ తమ ఇంట్టి బిడ్డగా ఆదరించారన్నారు. రాష్ట్ర పార్టీలో గ్రూపులు లేవని, అందరిదీ కాంగ్రెస్ అనే ఒకే ఒక గ్రూప్ మాత్రమేనన్నారు. మీడియా మాత్రమే వేర్వేరుగా నాయకుల్ని చూపిస్తూ, గ్రూపుల్ని అంటగట్టుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుంటే, కామరాజర్ లేరని, కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేరని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి వీధి పోరాటాల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆయన మీద ప్రత్యేక మర్యాద ఉందని మరో ప్రశ్నకు కుష్బు సమాధానం ఇచ్చారు.