
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా సంతోష్ మెహ్రాను బదిలీ చేయగా, ఆయన స్థానంలో వీకే సింగ్ నియామకం అయ్యారు. ఫైర్ సేఫ్టీ డీజీ గోపీకృష్ణ స్థానంలో సంజయ్ కుమార్ జైన్‌ను నియమించింది. అలాగే గోపీకృష్ణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.