Gopikrishna
-
అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపీకృష్ణ. బీటెక్ వరకు చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో ఉద్యోగం కోసం సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు.ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్ రాష్ట్రం డెల్లాస్ సిటీలోని సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడు మృతి
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్ రాష్ట్రం డల్లస్ సిటీలోని సూపర్ మార్కెట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లి కతో వివాహం జరిగింది. వీరికి ఏడాది న్నర కుమారుడు ఉన్నాడు. ్రప్రజాప్రతి నిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని గోపీకృష్ణ కుటుంబసభ్యులు కోరుతున్నారు. గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిఅమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి భారీ కుంభకోణానికి పాల్పడే ప్రయత్నాల్లో గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్న గోపీ కృష్ణ వ్యవహారాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహా స్కామ్‌లు చేసిన చెన్నై పోలీసులకు మూడుసార్లు చిక్కిన ఇతగాడు విలాసాలు, జల్సాలకే భారీ మొత్తాలు ఖర్చు చేసినట్లు తేలింది. ఇతడి వ్యవహారాలను హైదరాబాద్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దీనికోసం చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ►చెన్నైలోని భారతినగర్‌కు చెందిన గోపీ కృష్ణ ఆరేళ్ల నుంచి కాల్ సెంటర్ మోసాలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో స్కీముల పేరుతో స్కాములు చేశాడు. ఈ నేరాలకు సంబంధించి అక్కడి పోలీసులు 2015, 2016ల్లో అరెస్టు చేశారు. ►జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి కొత్త ప్రాంతంలో, మరో పేరుతో తన దందా మొదలెట్టేవాడు. 2020లో చెన్నైలోని వలసరివక్కం కేంద్రంగానే మరో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ►ప్రతి సందర్భంలోనూ తక్కువ జీతాలకు ఎక్కువ మంది టెలీకాలర్లను నియమించుకునే వాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 400 మందిని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు. చదవండి: (మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..) ►లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆకర్షించేలా పలు ఇన్వెస్టిమెంట్ స్కీములు రూపొందించాడు. తమ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే ప్రతి రోజూ కనీసం రూ.200 వరకు రాబడి ఉంటుందని నమ్మించాడు. ఇలా మూడు సందర్భాల్లోనూ కలిపి దాదాపు 2 వేల మంది నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశాడు. 2020లో ఇతడిపై చెన్నై పోలీసులు గూండా యాక్ట్ ప్రయోగించి ఏడాది జైల్లో ఉంచారు. ►గతేడాది అరెస్టు చేసినప్పుడు ఇతడితో పాటు అనుచరుల నుంచి చెన్నై పోలీసులు బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్, హోండా తదితర కంపెనీలకు చెందిన 13 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ►విలాసాలకు అలవాటు పడిన వీరంతా తరచూ థాయ్‌లాండ్, దుబాయ్, హాంగ్‌కాంగ్‌లకు వెళ్లి వారాల పాటు గడిపి వచ్చే వాళ్లు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ప్రముఖ క్యాసినోల్లో ఒకటైన బల్లీస్కు గోపీ రెగ్యులర్ కస్టమర్. ►ఆ క్యాసినోలో పేకాట ఆడటానికి వెళ్లే వాళ్లు టేబుల్ కోసం కొన్ని గంటలు, రద్దీ ఎక్కువ ఉంటే రోజులు ఎదురు చూడాలి. అయితే గోపీకి మాత్రం అందులో శాశ్వతంగా ఓ టేబుల్ ఉండేది. దీనికోసం ఇతడు రూ.కోటి ఖర్చు పెట్టినట్లు చెన్నై పోలీసులు గుర్తించారు. ►ఆఖరుసారిగా చెన్నై పోలీసులకు తిరుముల్లాయ్వోయల్ ప్రాంతంలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ చిక్కాడు. మూడుసార్లు ఒకే తరహా నేరాలు చేస్తూ చిక్కడంతో ఇతడిపై అక్కడి పోలీసుల నిఘా పెరిగింది. ►దీంతో జైలు నుంచి వచ్చిన ఇతగాడు తిరుమలగిరికి మకాం మార్చాడు. యునైటెడ్ ఇండియా హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. అతడి పథకం పారక ముందే టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. -
ఎక్కడికో ఈ అడుగు
‘ఎఫెక్ట్స్ రాజు’ గా చిత్ర పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. గోపీకృష్ణ, ప్రియాంకా చౌదరి జంటగా నటించారు. స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అట్లూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు, శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. 1990లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా కోసం 55 రోజులు రేయింబవళ్లు పని చేసిన యూనిట్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, కెమెరా: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు. -
సీఎంకు పింగళి వెంకయ్య చరిత్ర పుస్తకం
మాచర్ల: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన మనవడు గోపీకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం అందజేశారు. తమ తాతయ్య 100 సంవత్సరాల క్రితం త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారని, ఆయన ప్రయత్నాన్ని అన్ని వర్గాలకూ తెలిపేందుకు తమ సోదరుడు జీవీఎన్ నరసింహం పుస్తకాన్ని రచించారని గోపీకృష్ణ తెలిపారు. -
ఎక్కడికో...
గోపీకృష్ణ, ప్రియాంకా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. ‘ఎఫెక్ట్స్ రాజు’గా చిత్రపరిశ్రమకు సుపరిచితుడైన శ్రవణ్ బొనగాని దర్శకత్వంలో అట్లూరి శ్రీనివాస్ నిర్మించారు. ‘‘విభిన్న ప్రేమకథా చిత్రమిది. 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, కెమెరా: ఈశ్వర్ ఎల్లుమహంతి. -
తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా సంతోష్ మెహ్రాను బదిలీ చేయగా, ఆయన స్థానంలో వీకే సింగ్ నియామకం అయ్యారు. ఫైర్ సేఫ్టీ డీజీ గోపీకృష్ణ స్థానంలో సంజయ్ కుమార్ జైన్‌ను నియమించింది. అలాగే గోపీకృష్ణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అత్యాశకు పోతే...
‘‘ప్రతి మనిషి జీవితంలో ఎవరికో ఒకరికి ఋణపడుతుంటాడు. ఆ ఋణం తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ అనేది మనిషి జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథః పాతాళానికి తొక్కుతుంది. అత్యాశ వల్ల కలిగే అనర్థాలను ‘రుణం’ చిత్రంలో వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం’’ అన్నారు దర్శకుడు ఎస్. గుండ్రెడ్డి. గోపీకృష్ణ, మహేంద్ర, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో భీమినేని సురేశ్, జి. రామకృష్ణారావు నిర్మిస్తున్న సినిమా ‘రుణం’. పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అన్నారు. చిత్ర సమర్పకులు గాలిరెడ్డి, గోపీకృష్ణ, మహేంద్ర, ప్రియాంక, విలన్ పాత్రధారి ప్రదీప్ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్.వి. మల్లిక్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్. -
వాళ్లిద్దరూ క్షేమంగానే ఉన్నారు...
న్యూఢిల్లీ : లిబియాలో బందీలుగా ఉన్న తెలుగువారు క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. అక్కడ అంతర్గత పరిస్థితే కల్లోలంగా ఉందని, తిరుగుబాటుదారుల మధ్య గొడవులు జరుగుతున్నాయని ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. బందీలుగా ఉన్న తెలుగువారిని విడిపించడానికి మార్గం సుగమం కాలేదని వికాశ్ స్వరూప్ తెలిపారు. లిబియాలో భారత రాయబార కార్యాలయం కూడా లేదని, మూడో వ్యక్తి ద్వారా విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్.. లిబియాలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను అపహరించిన విషయం తెలిసిందే.. నెల రోజులు దాటినా ఇప్పటికీ వారు విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. జూలై 29న... లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తెలుగువారు బలరామ్ కిషన్, టి.గోపీకృష్ణ, కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్లు కిడ్నాప్ అయ్యారు. అయితే వారిలో కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్, లక్ష్మీకాంత్లు విడుదల అయ్యారు. బలరామ్ కిషన్, గోపీకృష్ణ మాత్రం ఇంకా బందీలుగానే ఉన్నారు. -
ఆ ‘శుక్రవారం’ ఎప్పుడొచ్చేనో..!
⇒ నెల క్రితం లిబియాలో ప్రొఫెసర్ల కిడ్నాప్ ⇒ వారి విడుదలపై ఇంకా తొలగని ప్రతిష్టంభన ⇒ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు ⇒ ప్రతీ శుక్రవారం ఎదురు చూపులు హైదరాబాద్: శుక్రవారం రాగానే ఆ రెండు కుటుంబాల్లో ఎన్నో ఆశలు.. తమ ఇంటి పెద్ద వస్తారని... కుటుంబంలో వెలుగులు నింపుతారని.. కానీ, శుక్రవారాలు వస్తూనే ఉన్నాయి.. వారు మాత్రం రావడం లేదు.. కనీసం ఆచూకీ కూడా తెలియడం లేదు.. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్.. లిబియాలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను అపహరించిన విషయం తెలిసిందే.. నెల రోజులు దాటినా ఇప్పటికీ వారు విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. సరిగ్గా నెల రోజుల కిందట.. జూలై 29న... లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తెలుగువారు బలరామ్ కిషన్, టి.గోపీకృష్ణ, కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్లు ఇండియాకు రావడానికి బయలుదేరారు. ప్రతి ఏడాది వీరు జూలైలో వచ్చి సెప్టెంబర్‌లో తిరిగి అక్కడికి వెళ్తారు. ఈ సారి కూడా అలాగే బయలుదేరారు. అయితే, లిబియా నుంచి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పొరుగు దేశం ట్యునీషియా నుంచి భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సిర్త్ నుంచి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలోనే ఐఎస్ఐఎ స్ ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌లను వదిలేశారు. కానీ, తెలుగు ప్రొఫెసర్లు బలరా మ్ కిషన్, గోపీకృష్ణలను తమ వద్దే బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి వారి విడుదలకు ఆ రెండు కుటుంబాలు కంటి మీద కును కు లేకుండా ఎదురు చూస్తున్నాయి. కానీ, ప్రొ ఫెసర్ల విడుదలపై ప్రభుత్వ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. భారత రాయబార కార్యాలయం నుంచి వారు ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం మాత్రం అందుతోంది. కానీ విడుదలపై ఎలాంటి పురోగతి లేదు. ఆందోళనలో కుటుంబాలు.. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ బలరామ్ కిషన్ లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్. ఆయన భార్య శ్రీదేవి నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక నాచారానికి చెందిన టి.గోపీకృష్ణ కూడా ఇదే వర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. భార్య కల్యాణి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. కిడ్నాప్ వార్త తెలిసినప్పటి నుంచి ఈ రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడిపోయాయి. లిబియాలోని భారత రాయబార కార్యాలయం నుంచి ‘వారు బాగున్నారు. త్వరలోనే విడుదలవుతారు’.. అని వచ్చే సందేశాలే ఆ కుంటుంబాలకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. నాన్న ఎప్పుడొస్తారని అడుగుతున్నారు.. ప్రతి రోజు నాన్న ఎప్పుడొస్తారు అని పిల్లలు అడుగుతున్నారు. వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి. ప్రతి క్షణం భయంతో బతుకుతున్నాం. ఏ దేవుడికీ మా పైన దయ కలగడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ జీవితంపై విరక్తి కలుగుతోంది. ప్రభుత్వం మా బాధలను పట్టించుకోవడం లేదు. - గోపీకృష్ణ భార్య కల్యాణి ధైర్యం కోల్పోతున్నాం.. పవిత్రమైన శుక్రవారం రోజు ఉగ్రవాదులు మా వారిని విడుదల చేస్తారేమోననే ఆశతో నాలుగు వారాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏ ఫోన్ కాల్ వ చ్చినా శుభవార్త తెలుస్తుందేమోననే ఆశ. ప్రతి గుడికి వెళ్తున్నాం. మొక్కని దేవుడు లేడు. వాళ్లు బాగానే ఉన్నారు అని ప్రభుత్వం చెబుతుంది. కానీ నెల రోజులైనా ఎందుకు విడుదల కావడం లేదు. చర్చలు ఏ దశలో ఉన్నాయో తెలియడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ధైర్యం కోల్పోతున్నాం. - బలరామ్ భార్య శ్రీదేవి. -
నా భర్తను విడిపించండి: కల్యాణి
హైదరాబాద్ : లిబియాలో కిడ్నాప్‌కు గురైన తన భర్తను క్షేమంగా విడిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని గోపీకృష్ణ భార్య కల్యాణి కోరారు. గత ఏడేళ్లుగా తన భర్త లిబియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారని ఆమె తెలిపారు. కిడ్నాప్ విషయం తనకు నిన్న తెలిసిందని, తన భర్తతో పాటు మరో ముగ్గురు విధులకు వెళ్తుండగా కారు ఆపి డ్రైవర్‌ను దించేసి అపహరించి తీసుకు వెళ్లారన్నారు. బుధవారం సాయంత్రం తన భర్తతో చివరిసారిగా మాట్లాడినట్లు చెప్పారు. గోపికృష్ణ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాచారంలో నివాసం ఉంటోంది. బలరాం శ్రీకాకుళం జిల్లా వాసి. కాగా గోపీకృష్ణ కిడ్నాప్ అయ్యాడా, మరొకటా అనేది తమకు ఇంకా స్పష్టత రాలేదని ఆయన సోదరుడు మురళీ అన్నారు. తాము లిబియా ఎంబసీతో మాట్లాడామని, అయితే ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారా, లేదా అనేది తమకు తెలియాల్సి ఉందన్నారు. లిబియా రాజధాని ట్రిపోలిలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురైన విషయం విదితమే. కాగా, ఇందులో ఇద్దరు కర్ణాటక వారు, ఒకరు తెలంగాణ, మరొకరు ఆంధ్రప్రదేశ్ వాసి అని సమాచారం. -
లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ : లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వీరంతా బుధవారం సాయంత్రం అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా కిడ్నాప్‌కు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. తెలుగువారిలో హైదరాబాద్ కు చెందిన గోపీకృష్ణ, బలరామ్ గా గుర్తించారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా తమవారు కిడ్నాప్ అయిన వార్త తెలుసుకున్న బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమవారిని క్షేమంగా విడిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
అచ్చంపేట : మండలంలోని కొండూరు కొండ ప్రాంతాల్లో బుధవారం ఇంట్లో నుంచి 50 రోజుల కిందట వెళ్లిపోయిన యువకుడి పుర్రె, ఎములకు గుర్తించారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన గరటా రవితేజ (16) తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శ్రీలక్ష్మిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 30 రాత్రి ఎనిమిది గంటలకు తమ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అదేరోజు రాత్రి 10:15కు కొండూరుకు చెందిన పులి వీరంరాజు కుమారుడు గోపీకృష్ణ ఫోను చేసి రవితేజ ఉన్నాడా అని అడిగాడని, విషయం ఏమిటని అడిగేంతలో ఫోను పెట్టేశాడని చెప్పాడు. ఆ తరువాత తమ కుమారుడి కోసం వెతకని చోటు లేదని, బంధువులు, స్నేహితులు అందరిని విచారించి సమాచారం దొరకకపోవడంతో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా, మరో రెండు రోజులు చూడు మీ అబ్బాయి తప్పక వస్తాడని చెప్పారని తెలిపారు. అవశేషాలు లభించిన ప్రదేశంలో మృతుడి పుర్రె, ఎముకలు, మిగిలిన అవశేషాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మృతుని చొక్కా, ప్యాంటు, చెప్పులు పడి ఉన్నాయి. అవి తమ పిల్లవాడివేనని తల్లిదండ్రులు గుర్తించారు. అక్కడే పురుగుమందు బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అచ్చంపేట ఎస్ఐ అనిల్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ చేపట్టారు. పుర్రె, ఎముకలను సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. ముమ్మాటికీ హత్యే : మృతుడి తండ్రి మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దొడ్లేరు పాలకేంద్రంలో పాలు పోయించుకుంటానని, తమ కుమారుడు సత్తెనపల్లిలోని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివాడని, గోపీకృష్ణ కూడా అదే కాలేజీలోనే చదివాడని తెలిపాడు. తమ పిల్లవాడు పాసయ్యాడని, గోపీకృష్ణ తప్పి ఇంట్లో పాసైనట్లు చెప్పాడని ఈ క్రమంలో ఏదైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించాడు.