నా భర్తను విడిపించండి: కల్యాణి | gopikrishna wife kalyani requesting govt to save her husband | Sakshi
Sakshi News home page

నా భర్తను విడిపించండి: కల్యాణి

Published Fri, Jul 31 2015 12:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

నా భర్తను విడిపించండి: కల్యాణి

నా భర్తను విడిపించండి: కల్యాణి

హైదరాబాద్ : లిబియాలో కిడ్నాప్కు గురైన తన భర్తను క్షేమంగా విడిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని గోపీకృష్ణ భార్య కల్యాణి కోరారు.  గత ఏడేళ్లుగా తన భర్త లిబియాలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారని ఆమె తెలిపారు.  కిడ్నాప్ విషయం తనకు నిన్న తెలిసిందని, తన భర్తతో పాటు మరో ముగ్గురు విధులకు వెళ్తుండగా కారు ఆపి డ్రైవర్ను దించేసి అపహరించి తీసుకు వెళ్లారన్నారు. బుధవారం సాయంత్రం తన భర్తతో చివరిసారిగా మాట్లాడినట్లు చెప్పారు. గోపికృష్ణ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లోని నాచారంలో నివాసం ఉంటోంది. బలరాం శ్రీకాకుళం జిల్లా వాసి.

కాగా గోపీకృష్ణ కిడ్నాప్ అయ్యాడా, మరొకటా అనేది తమకు ఇంకా స్పష్టత రాలేదని ఆయన సోదరుడు మురళీ అన్నారు. తాము లిబియా ఎంబసీతో మాట్లాడామని, అయితే ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారా, లేదా అనేది తమకు తెలియాల్సి ఉందన్నారు. లిబియా రాజధాని ట్రిపోలిలో నలుగురు భారతీయులు కిడ్నాప్కు గురైన విషయం విదితమే. కాగా, ఇందులో ఇద్దరు కర్ణాటక వారు, ఒకరు తెలంగాణ, మరొకరు ఆంధ్రప్రదేశ్ వాసి అని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement