vk singh
-
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు -
తెలంగాణలో కొత్తగా 3 ఎయిర్‌పోర్టులే సాధ్యం: వీకే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూడు ప్రాంతాలను మాత్రమే కొత్తగా విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతికంగా అనువైన ప్రదేశాలుగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) చేసిన అధ్యయనం ప్రకారం ఈమేరకు కేంద్రం వెల్లడించింది. వరంగల్ (బ్రౌన్‌ఫీల్డ్), ఆదిలాబాద్ (బ్రౌన్‌ఫీల్డ్), జక్రాన్‌పల్లి (గ్రీన్‌ఫీల్డ్) ప్రాంతాలు మాత్రమే సాంకేతికంగా సాధ్యమయ్యేవని ఏఏఐ నివేదికలో పేర్కొంది. అయితే తక్షణ భూసేకరణ అవసరాన్ని నివారించడానికి చిన్న విమానాల ప్రైవేట్ కార్యకలాపాల కోసం ఈ మూడు ప్రాంతాల్లో సాధ్యమయ్యే స్థలాలను అభివృద్ధి చేసి, ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏఏఐ కోరిందని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏవియేషన్ వర్సిటీకి నో హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ జాతీయ ఏవియేషన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి 2018లో వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఆర్జీఎన్ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించలేదని వెల్లడించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈమేరకు బదులిచ్చారు. -
నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. హత్యలు, దోపిడీలతో పాటు ఈ మధ్య కాలంలో సైబర్, ఆర్థిక నేరాలు, లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోంది. పర్యవసానంగా ఖైదీలతో జైళ్లు నిండిపోతున్నాయి. జైళ్ల సామర్ధాద్యనికి మించి ఖైదీలు కిక్కిరిసి పోతున్నారు. ఈ కారణంగా జైళ్లలో శుచి, శుభ్రత కరువవడంతో పాటు రక్షణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖైదీల మధ్య గొడవలు, దాడులు చేసుకుంటున్నాయి. పెరగని జైళ్ల సామర్థ్యం 2016 నుంచి 2021 వరకు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన జైళ్లు అప్పటి జనాబా దామాషాకు సరిపోయేలా ఏర్పడినివి. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగి, నేరాలు పెరుగుతున్నా జైళ్ల సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. అవే జైళ్లలో ఖైదీలను కుక్కుతున్నారు. 73 శాతానికి పైగా విచారణ ఖైదీలే.. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 73 శాతం వరకు విచారణలో ఉన్న ఖైదీలే ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. వివిధ రకాల నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తీర్పులు వెలువడక, ఇతరత్రా కారణాలతో జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్ పొందడానికి న్యాయ సహకారం అందనివారు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 1,319 జైళ్లలో 2021 నాటికి 5,54,034 మంది ఖైదీలు ఉండగా.. వీరిలో విచారణ ఖైదీలే 4,27,165 మంది ఉండటం గమనార్హం. అంటే వీరంతా నేరారోపణలకు గురై, ఇంకా శిక్షపడకుండా, న్యాయస్థానాల్లో కేసులు వివిధ స్థాయిల్లో విచారణలో ఉన్నవారన్నమాట. వీరందరికీ శిక్ష పడుతుందా? లేదా? అన్నది న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. యూపీలో అత్యధికం.. జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే.. అత్యల్పంగా లక్షద్వీప్‌లో ఉన్నారు. శిక్ష పడిన ఖైదీలతో పాటు విచారణ ఖైదీలు, ముందస్తుగా అదుపులోకి తీసుకునే నేరస్తుల జాబితాలోనూ సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 63,571 ఖైదీలకు సరిపోయే విధంగా జైళ్లు ఉంటే.. ప్రస్తుతం ఆ జైళ్లలో ఏకంగా 1,17,789 మంది ఖైదీలు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లో వంద మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైలులో 185 మంది వరకు ఉంటున్నారు. దాని తర్వాత స్థానాల్లో బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో 56.1 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జైళ్ల సామర్థ్యం కంటే ఖైదీలు పది శాతం తక్కువగా ఉండడం గమనార్హం జైళ్ల శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బడ్జెట్లో హర్యానా వంద శాతం ఖర్చు చేస్తూ మొదటి స్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్ 96.8 శాతంతో రెండో స్థానంలో ఉంది. జైళ్లలో చికిత్స కష్టమే.. జైళ్లలో కిక్కిరిస్తున్న ఖైదీల కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయి. జైళ్లలో ఏళ్లకేళ్లు ఉంటున్న వారికి అస్వస్థత ఏర్పడితే.. తక్షణమే వారికి వైద్య సదుపాయం కల్పించడానికి అనువైన సౌకర్యాలు లేవు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది లేక వారికి చికిత్స అందించడం ఆలస్యం అవుతోంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలు ఉండే సామర్థ్యంతో పోల్చుకుంటే మెడికల్ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. గోవాలో 84.6 శాతం, కర్ణాటక 67, లద్దాక్ 66.7, జార్ఖండ్ 59.2, ఉత్తరాఖండ్ 57.6 శాతం తక్కువ సిబ్బంది ఉన్నట్లు ప్రిజన్స్ స్టాటిస్టిక్స్ ఇండియా–2021 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంస్కరణ శూన్యం సంస్కరణల కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లలో..ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారా? నేరస్తులు పరివర్తనం చెందుతున్నారా? జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నారు? మళ్లీ నేరాల వైపు మళ్లుతున్నారా? ఈ మేరకు పరిశీలన జరుగుతోందా? అంటే..లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏవైనా ఘోరమైన నేరాలు జరిగినప్పుడు తాత్కాలికంగా ఈ అంశంపై దృష్టి పెడుతున్నారని, ఆ తర్వాత షరా మామూలే అనే విమర్శలు ఉన్నాయి. సంస్కరణలతోనే నేరాల సంఖ్య తగ్గుతుందని, తద్వారా ఖైదీల సంఖ్య తగ్గుతుందని జైళ్ల విభాగం విశ్రాంత ఉన్నతాధికారులు అభిప్రాయం పడుతున్నారు. సంస్కరణలు అవసరం జైళ్లలో ఖైదీలను పశువుల్లా చూస్తున్నారు. ఖైదీలంటే పూర్తి చులకన భావన సరికాదు. వారిని సన్మార్గంలో నడిపించడానికి జైళ్ల సంస్కరణలు అవసరం. జైలుకు వచ్చేవారిని కఠినంగా శిక్షించాలనే అభిప్రాయం సరికాదు. కఠిన శిక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేయడమే. జైళ్ల సంస్కరణలు రాకుండా సమాజంలో నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. బ్రిటిష్ హయాంలో స్వాంతంత్య్ర సమరయోధులను తప్ప.. మిగిలిన ఖైదీలను బాగానే చూసేవారు. జైళ్ల సంస్కరణలు తీసుకురావాలని కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు నేను పలుమార్లు విజ్ఞప్తి చేశా. కానీ స్పందన లేదు. – జైళ్ల విభాగం మాజీ డీజీపీ వీకే సింగ్ -
లిథియం అయాన్ నుంచి బయటకు రావాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడకం విషయంలో భారత్ ఆరంభంలోనే బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. ఈ కమోడిటీపై మన దేశానికి ఎటువంటి నియంత్రణ లేదంటూ ఈ సూచన చేశారు. భవిష్యత్తులో గ్రీన్ రవాణా కోసం హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ కీలకమని, దీనికి ఎంతో భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని కంపెనీలు ఏక కాలంలో కొత్త టెక్నాలజీలపైనా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో ‘ఈవీ ఇండియా 2022’ సదస్సు జరిగింది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. లిథియం అయాన్ బ్యాటరీలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఎలా అన్న దానిపై దేశీయంగా ఎంతో పరిశోధన కొనసాగుతున్నట్టు చెప్పారు. సోడియం అయాన్, జింక్ అయాన్ టెక్నాలజీలపై పరిశోధనలు నడుస్తున్నాయని వివరించారు. లిథియం అయాన్‌ను మన దేశం ఉత్పత్తి చేయడం లేదంటూ.. దీనిపై మనకు ఎటువంటి నియంత్రణ లేని విషయాన్ని సింగ్ గుర్తు చేశారు. దీన్ని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఈవీలన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీతో తయారైనవే కావడం గమనార్హం. ‘‘గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనం జపాన్ స్థాయిలోనే ఉన్నాం. సోలార్ ఇంధనం ధర మన దగ్గర చాలా తక్కువ. కనుక గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనకు ఎంతో అనుకూలత ఉంది’’అని సింగ్ పేర్కొన్నారు. -
సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్
అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్‌పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. ఇక, తాజాగా కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై వీకే సింగ్ మండిపడ్డారు. వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్ నచ్చకపోతే అభ్యర్థులు.. దానిని ఎంచుకోవద్దని ఘాటుగా స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని కోరారు. భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చేయదని, సైన్యంలో చేరాలనుకునే వారు తమ ఇష్టానుసారం డెసిషన్ తీసుకోవచ్చని తెలిపారు. ‘‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ నచ్చకపోతే, అందులో చేరండి అని మిమ్మల్ని అడుగుతున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా బస్సులు, రైళ్లను తగలబెడుతున్న వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిపథ్ గురించి ప్రస్తావన వచ్చిందని ఆయన వెల్లడించారు. #WATCH | Nagpur | It's a voluntary scheme... Those who want to come can come...Who is saying you to come? You are burning buses and trains, has anyone told you that you will be taken to the army?..: Union Minister and former Army chief VK Singh on #AgnipathScheme pic.twitter.com/Egh1VqQX7Y — ANI (@ANI) June 19, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత -
సిరాలో తప్ప చట్టాల్లో నలుపు ఎక్కడ?
బస్తి(ఉత్తరప్రదేశ్): వ్యవసాయ చట్టాలను రాయడానికి వినియోగించిన సిరా మాత్రమే నలుపు అని, చట్టాల్లో ‘నలుపు’ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి వి.కె.సింగ్ రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను ఈ నాయకులు పట్టించుకోరా? అని నిలదీశారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పిన మర్నాడు శనివారం కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ విలేకరుల సమావేశంలో రైతు సంఘాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇటీవల ఒక రైతు సంఘం నాయకుడితో తాను జరిపిన సంభాషణని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక్కోసారి మనం విషయాలన్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. కానీ వేరేవరో ఏదో చెప్పగానే గుడ్డిగా వారిని అనుసరిస్తాం. నన్ను కలిసిన ఒక రైతు సంఘం నాయకుడిని నేను ఇదే విషయాన్ని అడిగాను. చట్టాల్ని లిఖించడానికి వాడిన సిరాలో తప్ప నలుపు ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించాను’’ అని వీకే సింగ్ అన్నారు. -
ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్‌సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్‌గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. -
నా తమ్ముడికి బెడ్ కేటాయించండి: కేంద్రమంత్రి అభ్యర్థన
లక్నో: కరోనా దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్టాల్లో ప్రజలు ఆక్సిజన్ సిలెండర్లు, బెడ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా, సాక్షాత్తు కేంద్రమంత్రి ఒకరు.. కరోనా సోకిన తన సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించాల్సిందిగా కోరారు. దీన్ని బట్టి చూస్తే... వీఐపీలకే ఇలాంటి పరిస్థితుంటే.. ఇక మాముల ప్రజలు పరిస్థితులను ఊహించుకొవచ్చు. అయితే, కేంద్రమంతి వీకే సింగ్ ఘజియాబాద్ నియోజకవర్గంలో తన సోదరుడికి బెడ్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ మన దేశంలో వైద్యపరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒక కేంద్ర మంత్రి మెడికల్ సాయం కావాలని కోరడం బాధకరమని, దీన్ని బట్టి మనం చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైన ప్రజలందరు విధిగా మాస్క్‌ను ధరించి, కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదేవిధంగా కోవిడ్ టీకాను వేసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలి! -
ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్ పంపిణీ రంగం!
సాక్షి, హైదరాబాద్: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్డ్ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. ‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్కే తెలిపారు. క్రాస్ సబ్సిడీ కోసం సెంట్రల్ ఫండ్.. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్ సబ్సిడీ అంటారు. విద్యుత్ టారీఫ్‌లో క్రాస్ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్’పేరుతో ప్రత్యేక ఫండ్ పెట్టనున్నామని ఆర్కే సింగ్ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్‌లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. పీపీఏలన్నీ పంచుకోవాలి.. ‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్కే సింగ్ వెల్లడించారు. ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్.. భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్ కొనసాగిస్తారా? విద్యుత్ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్ రీడింగ్ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్) ప్రాంతీయ బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి. మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ విద్యుత్ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్‌రావు కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
వీకే సింగ్ వీఆర్ఎస్కు టీ సర్కార్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్(వీకే సింగ్) వీఆర్ఎస్కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. రెండు కేసుల్లో శాఖపరమైన పెండింగ్‌లో ఉన్న కారణంగా వీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు వీకే సింగ్‌కు ప్రభుత్వం తెలిపింది. కాగా జూన్ 26న వీకే సింగ్ వీఆర్ఎస్ అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే వీకే సింగ్ పెట్టుకున్న వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు అక్టోబర్ 2న తెలంగాణ సర్కార్ ఆయనకు నోటీస్ పంపించింది. ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2న ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా) అయితే కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా వీకే సింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే జూన్ 26న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్‌కు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్ రాజీనామాకు కూడా సిద్దపడ్డారు. -
కరోనా ఎఫెక్ట్! వీకే సింగ్‌పై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావుకు టీఎస్పీఏ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. (చదవండి: రాజకీయాల్లో చేరను: వీకే సింగ్) కారణాలివేనా కాగా, తనకు ప్రి మెచ్యూర్ రిటైర్మెంట్ కావాలని ఈనెల 24న కేంద్ర హోం మంత్రికి వీకే సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పోలీసు అకాడెమీలో 180 మందికి కరోనా సోకినట్టుగా వీకే సింగ్ నేడు ధ్రువీకరించారు. అయితే, ప్రభుత్వ ప్రకటన వెలువడకముందే కేసుల విషయాన్ని బహిర్గతం చేయడం కూడా వీకే సింగ్ బదిలీకి కారణం కావొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీస్ అకాడమీలో మొత్తం 200 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. (చదవండి: తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం) -
రాజకీయాల్లో చేరను: వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో చేరడం లేదని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్ అన్నారు. ముందస్తు రాజీనామాను ఆమోదించాలని కేంద్రానికి తాను రాసిన లేఖపై పలు ప్రచారాలు జరుగుతున్న వేళ గురువారం ఆయన మరో లేఖను విడుదల చేశారు. ‘రాజకీయ నేతలు ఏ రాష్ట్రాన్నీ బంగారంగా మార్చలేరు, రాజ్యాంగపరంగా ప్రజలే కీలకమైనా, వారు బలవంతుల చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. దీనికి రాజకీయాలను, నేతలను తప్పుబట్టలేం, లోపం ప్రజల్లోనే ఉంది. అందుకే వివేకానంద, మహాత్మాగాంధీ, అన్నాహజారే బాటలో పయనిస్తూ ప్రజల కోసం పాటుపడతా. సుపరిపాలనతో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన దేశాలకంటే మంచి ప్రగతిని సాధిస్తుంది. దీనికి టీఎస్పీఏనే చక్కటి ఉదాహరణ. ముందస్తు రిటైర్మెంట్కు కేంద్రం అనుమతించగానే నా భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తా’అని లేఖలో స్పష్టం చేశారు. -
రాజీనామా చేసిన వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్ (వీకేసింగ్) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా వీకే సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. తన రాజీనామాను కేంద్ర హోం శాఖ మంత్రికి పంపించారు. కాగా, కొద్ది రోజుల క్రితమే తన రాజీనామా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2 ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
'చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలి'
సాక్షి, ఢిల్లీ : చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని కేంద్ర రోడ్లు, రవాణా సహాయశాఖ మంత్రి, మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ విజయ్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. చైనాతో యుద్దం అనేది చివరి అస్త్రంగా వాడాలని, మొదట చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని దానికి చాలా దారులు ఉన్నాయని తెలిపారు. హిందుస్తాన్ టైమ్స్ ఇంటర్య్వూలో పాల్గొన్న వీకే సింగ్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. (పక్కా ప్రణాళితోనే భారత సైన్యంపై దాడి) మాజీ ఆర్మీ చీఫ్‌గా మీ గ్రౌండ్ రిపోర్టు ఏమిటి ? ప్రస్తుతం అక్కడ పరిస్థితి భారత బలగాల నియంత్రణలోనే ఉంది. ఘర్షణ జరిగిన గల్వాన్ లోయ పిపి 14 పాయింట్ వద్ద చైనా సైనికుల నుంచి ఎలాంటి ఆక్రమణలు, చొరబాట్లు లేవు. పిపి 15 పాయింట్ నుంచి చైనా ప్రతీ ఏడాది అక్రమంగా రావాలనుకున్న ప్రతీసారి భారత బలగాలు వారిని అడ్డుకుంటూనే ఉంటాయి. గల్వాన్ లోయ తమదేనని చైనా అంటుంది.. దీనిపై మీ స్పందన ? అదంతా తప్పుడు ప్రచారం. గల్వాన్ లోయ చైనా ఎల్ఏసీలో లేదు. వారు మన భూభాగంలో లేరు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అనేది 1959లో ఇచ్చిన మ్యాప్ నుంచి ఒక వివరణగా మాత్రమే ఉంది. మొదటినుంచి ఈ అంశంపై చైనీయులు ఏదో విధంగా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. కానీ ఇరు దేశాలు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని రక్షించుకోవడానికే ఎప్పుడు ప్రాధాన్యతనిస్తాయి. ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే దానిపై ఆ దేశం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 1962లో భారత్- చైనా మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఎంతమంది మరణించారనేది వెల్లడించలేదు. మనకు తెలిసినంత వరకు ఇరు దేశాల నుంచి దాదాపు 2వేల మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. కానీ అప్పుడు కూడా చైనా అసలు లెక్క వివరించకుండా కేవలం 200 మందే ప్రాణాలు కోల్పోయారని వాదించింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వ లెక్కల ప్రకారం 43 మంది చైనా సైనికులు హతమయ్యారని పేర్కొన్నారు. ఆ సంఖ్య ప్రకటించాలా వద్దా అనేది చైనా నిర్ణయించుకోవాలి. అసలు ఆరోజు ఘర్షణలో దాదాపు 600 మంది ఉండి ఉంటారని అనిపిస్తుంది. ఒకరినొకరు తోసుకోవడం, రాడ్లతో కొట్టకోవడం వంటివి చేశారు. ఏదైతేనేం ఇరు దేశాల సైనికులకు నష్టం జరిగింది. (గల్వాన్ ఘటన: ఏం జరుగుతుందో చూడాలి!) అఖిల పక్ష సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. దీనిపై మీ సమాధానం? దీనిపై నేను నేను స్పందించలేను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగం రా(రిసెర్చ్ అనాలిసిస్ వింగ్) ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఇంటలిజెన్స్ వైఫల్యం మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను . ఎందుకంటే వారు ఎల్వోసీ, ఎల్ఏసీ వద్ద జరిగే ఘర్షణల్లో తలెత్తకుండా నిషేదించబడ్డాయి. ఈ నిర్ణయం వారి ప్రభుత్వ హయాంలోనే(2012)లో జరిగిందని సోనియా గాంధీ తెలుసుకుంటే మంచింది. -
డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్ (వీకేసింగ్) మరోసారి వార్తల్లో నిలిచారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కు డైరెక్టర్‌గా ఉన్న వీకే సింగ్ (ఏడీజీ) ఈనెల 21న ప్రభుత్వ సీఎస్‌కు లేఖ రాశారు. ఓ కాపీని సీఎం కేసీఆర్‌కు కూడా పంపిన ఆ లేఖలో ..1987 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తనకు 33 ఏళ్లు సేవలందించిన అనుభవం ఉందని, తాను ఇప్పటికే డీజీపీ పోస్టు కోసం ఎంప్యానెల్ అయ్యానని, నిబంధనల ప్రకారం ఆ పదవికి తాను అన్ని విధాలా అర్హతలు కలిగి ఉన్నానని తెలిపారు. -
డంపింగ్ యార్డుల్లా పోలీస్ శిక్షణ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శిక్షణ కేవలం తంతులా మారిందని, దేశం, రాష్ట్రాల్లోని వివిధ పోలీసు శిక్షణ కేంద్రాలు డంపింగ్ యార్డుల్లా మారాయని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణ ఒక తంతులా మారింది. దేశంలోని పోలీసు ట్రైనింగ్ అకాడమీలు డంపింగ్ యార్డుల్లా మారాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీఎన్పీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఐపీఎస్‌లలో కూడా అంకితభావం కొరవడటం బాధాకరం. ప్రస్తుత శిక్షణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చేలా పోలీసు శిక్షణను సంస్కరించాలి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పోలీసు విధానాల్లో మార్పులు రావాలి. డబ్బులు, పరపతి ఉన్న వారితో పోలీసులు స్నేహంగా మెదులుతున్నారు. విధి నిర్వహణలో నిత్యం వందలాది మంది ప్రాణాలర్పిస్తున్నా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకభావం కారణంగా పోలీసులపై సదభిప్రాయం కలగట్లేదు. ఈ విషయంలో మార్పురావాలి. అందుకే పోలీసు శిక్షణలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు అనుకూలంగా లేదు. జైలులో ఉంటున్న ఖైదీల్లో 90 శాతం పేదవారే, 70 శాతం శరణార్థులు ఉన్నారు. వారు ఎందుకు అరెస్టయి జైల్లో ఉన్నారో తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. శిక్షణలో ఒకలా.. విధుల్లో మరోలా.. ‘శిక్షణలో పోలీసులు నేర్చుకున్న దానికి, విధుల్లో చేరాక చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదు. ప్రజల బాధలు తెలిసేలా.. శిక్షణ సమయంలోనే అనాథ, వృద్ధ, షెల్టర్‌హోమ్‌లు సందర్శించేలా చూస్తున్నాం. ఇంటెలిజెన్స్, ఏసీబీ ఇతర శాఖల అధికారులతో తరగతులు నిర్వహిస్తాం. అంకితభావంతో పనిచేసే పోలీసులను తయారు చేయడం మా సంకల్పం. అందుకే ప్రతి పోలీసు అ«ధికారికి శిక్షణ కాలం నుంచే అబ్జర్వేషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నాం. భవిష్యత్తులో పోస్టింగులు, బదిలీల్లో ఇదే ప్రామాణికం కానుంది. దీనికి డీజీపీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. సమాజంలో పోలీసు కావాలంటే దేహదారుఢ్యమే ముఖ్యం కాదు.. శారీరక లోపాలున్నా నిజాయతీగా పనిచేయొచ్చు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలంగాణ అవినీతిలో ముందు ఉండటం బాధాకరం. పోలీసులు సమర్థంగా పనిచేస్తే ఇలాంటివి జరగవు. నేషనల్ పోలీస్ అకాడమీనే కాదు.. దేశంలో ఎవరూ చేయలేని నూతన సంస్కరణలను టీఎస్‌పీఏలో తీసుకొస్తాం. చట్టాలు, ఆయుధ, శారీరక, ఆత్మరక్షణ శిక్షణే కాదు.. ప్రజలకు సేవలు చేసేందుకు దోహదపడేలా ప్రయోగశాలగా మారుస్తాం. వ్యవస్థను మార్చలేను.. కానీ శిక్షణ విధానాన్ని మార్చగలను. ఈ నెల 24 నుంచి ఎస్సైలకు శిక్షణ ప్రారంభమవుతుంది’అని వీకే సింగ్ వివరించారు. -
పోలీస్ అకాడమీ డైరెక్టర్ హాట్ కామెంట్స్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని, దీని కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బు వృథా అవుతోందని ఆయన గురువారం పేర్కొన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రవర్తన సరిగ్గా లేదని ఆయన తప్పుబట్టారు. జైల్లో ఉన్నవారు 90 శాతంమంది పేదవారేనని, తినడానికి తిండి కూడా లేనివారే జైళ్లలో మగ్గుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరికొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే డంపింగ్ యార్డ్‌లుగా పోలీస్ అకాడమీలు నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఐపీఎస్‌లు సైతం ప్రజల్లో పోలీసులుపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారు. దేశంలోని పోలీస్ అకాడమీలన్నీ డంపింగ్ యార్డ్‌లుగా మారాయి. ఈ అకాడమీలో పోలీసులు తీసుకుంటున్న శిక్షణ వల్ల సమజానికి ఎలాంటి ఉపయోగం లేదు. జైలుకు వచ్చే నేరస్తులు తోటి ఖైదీలను చూసి నేరాల్లో చేయడంలో కొత్త టెక్నీక్ నేర్చుకొంటున్నారు. కానీ పోలీసులు మాత్రం వాస్తవానికి అనుగుణంగా ఉండలేకపోతున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే నేటికీ.. పోలీసులు సామాజిక కార్యకర్తలగా వ్యవహరించాలి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే ఇప్పటికీ కొనసాగుతోంది. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదు.. చట్టానికి, న్యాయానికి మాత్రమే జవాబుదారీ. అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ లెవల్‌కు లింకై ఉండాలి. పోలీస్ శిక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. కానీ దానివల్ల ఎలాంటి లాభం లేదు. పోలీస్ శిక్షణ కేంద్రాలు కాలేజ్‌లు, స్కూళ్లు కావు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలనేది శిక్షణలో నేర్పించాలి. పోలీసులు చెప్పిన మాట ప్రజలు వింటున్నారు. అయినా, ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు. దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రజలకు విరుద్ధంగా ఉంది. దేశంలో ఎంతమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రజల నుంచి ప్రశంసలు లభించడం లేదు. అది నన్ను తీవ్రంగా బాధించింది ఎస్పీ నుండి ఎస్‌హెచ్‌వో వరకు గ్రౌండ్ లెవల్లో వారి పనితీరు ఆధారంగా అబ్జర్వేషన్ రిపోర్ట్‌ను డీజీకి అందజేస్తున్నాం. ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలి. దీనిపై డీజీపీ కూడా హామీ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బాధ్యతలు తీసుకున్న తరువాత నూతన మార్పులు తీసుకొస్తున్నాను. వ్యక్తిత్వ వికాసం, కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ఈ నెల 24న ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్‌కి నూతన పద్ధతులను అమలు చేస్తాం. పోలీస్ ఆఫీసర్ కావాలంటే.. దేహ దారుఢ్యం అవసరం లేదు. దివ్యాంగులు కూడా పోలీస్ ఆఫీసర్ కావొచ్చు. పోలీస్ ఆఫీసర్‌కి వ్యక్తిత్వం ఉండాలి, బాధితులు పట్ల సానుభూతి ఉండాలి. అవినీతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్న ఓ సర్వే నన్ను తీవ్రంగా బాధించింది. వ్యవస్థను మార్చలేను కానీ, శిక్షణలో మార్పులు తీసుకొస్తా. గతంలోనూ సంచలన వ్యాఖ్యలు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసి.. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఉన్న సమయంలోనూ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని, తెలంగాణ కోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు -
పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సంజయ్ కుమార్‌ను ఫైర్ సర్వీస్ డీజీగా నియమించగా, ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న గోపీకృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేశారు. -
తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా సంతోష్ మెహ్రాను బదిలీ చేయగా, ఆయన స్థానంలో వీకే సింగ్ నియామకం అయ్యారు. ఫైర్ సేఫ్టీ డీజీ గోపీకృష్ణ స్థానంలో సంజయ్ కుమార్ జైన్‌ను నియమించింది. అలాగే గోపీకృష్ణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..
సాక్షి, హైదరాబాద్ : ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డీజీ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపియన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు. జైళ్ల శాఖలో పనిచేసిన కాలంలో ఆనంద ఆశ్రయం ఏర్పాటు చేసి 15 వేల మంది బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. సర్వీస్‌లో బదిలీలు సాధారణం అని అన్నారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోవడంతో తాను రాజకీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. జైళ్ల శాఖలో అవినీతి చేయడంతోనే తనను బదిలీ చేశారనే ప్రచారం అవాస్తవం అని తెలిపారు. కావాలంటే తనపై విచారణ చేపట్టవచ్చన్నారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే అనేక ఆరోపణలు వస్తాయని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ శాఖలో నార్త్ ఆఫీసర్స్‌కు ప్రాముఖ్యత లేదనిది వాస్తవం కాదని.. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కాగా, చాలా కాలంగా జైళ్ల శాఖలో పనిచేస్తున్న వీకే సింగ్‌ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
నిర్మాణ రంగంలోకి జైళ్ల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోన్న జైళ్లశాఖ.. ఖైదీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సఫలీకృతమైంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 జైళ్లు మూసివేసింది. 2014లో 80 వేల మంది ఖైదీలు ఉండగా 2018కి 55 వేలకు తగ్గడమే ఇందుకు కారణం. ఇపుడు వాటిని యాచకులు, వృద్ధులకు పునరావాస కేంద్రాలుగా మార్చి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. 1.25 లక్షలమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మరో సంచలనం దిశగా ఆ శాఖ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిపుణులైన ఖైదీలు, నిష్ణాతులైన జైలు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులతో రాష్ట్రంలో రెండు చోట్ల హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వరంగల్, హైదరాబాద్‌లో ఏర్పాటు రాష్ట్రంలో 2 చోట్ల ఈ హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రతిపాదించారు. మొదటిది వరంగల్‌లో, రెండోది హైదరాబాద్ శివారులో. ఒక్కో హౌసింగ్ సొసైటీకి దాదాపు 20 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. దీనికి ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లోని శంషాబాద్, శ్రీశైలం రోడ్డులో స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం దొరకగానే ఆ భూముల్లో హౌసింగ్ సొసైటీలను నిర్మించనున్నారు. ఇప్పటికే పలువురు ఖైదీలు నిర్మాణరంగం, ఎలక్ట్రిసిటీ, కార్పెంటరీ, పెయింటింగ్, ప్లంబింగ్ పను ల్లో నైపుణ్యం సాధించారు. వీరి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఖైదీలకు అనుభవం, మానవ వనరుల వినియోగం 2 విధాలా మంచి ఫలితాలు సాధించాలన్నది యోచన. ఇందుకోసం జైలు ఉన్నతాధికారులు, కొందరు విశ్రాంత ఉద్యోగులతో కలసి ఈ సొసైటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏం చేస్తారు: పలు భారీ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందం లేదా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం.. భారీ నిర్మాణాలను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం జైళ్లశాఖ ఓ నివేదిక రూపొందిస్తోంది. అది పూర్తయి, అనుమతి వస్తే, నిర్మాణ రంగంలోకి జైళ్లశాఖ రాక ఇక లాంఛనమే కానుంది. ఖైదీల్లో సత్ప్రవర్తన కోసమే రాష్ట్ర జైళ్లను ఖైదీల రహిత జైళ్లుగా మార్చాలన్న ఉద్దేశంతో చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటం శుభపరిణామం. ఇపుడు మేం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే జైళ్లలో ఖైదీలకు నిర్మాణం, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ పనుల్లో శిక్షణ ఇస్తున్నాం. నేరస్తులను నిపుణులైన ఉద్యోగులుగా మలిచి బయటికి పంపడమే లక్ష్యంగా వీటిని చేపడుతున్నాం. కొత్త ఉపాధి కలిపిస్తే వారి జీవితాల్లో తప్పకుండా పరివర్తన ఉంటుంది. – వీకే సింగ్ డీజీ, జైళ్ల శాఖ -
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ శిక్షణా సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంకుల ద్వారా 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయం గడించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్న విధంగానే, జైళ్ల శాఖ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సరసమైన ధరలకే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మధ్య తరగతికి ఇళ్లు కట్టి ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విడుదలైన ఖైదీలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. జైళ్ల శాఖ ఏ వ్యాపారం చేపట్టినా విజయవంతమైందని, ఈ ప్రాజెక్టు కూడా విజయం సాధిస్తుందన్నారు. మరో 3 నెలల వ్యవధిలో 20 నూతన పెట్రోల్ బంకులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రైవేటు భూముల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని, వాటి నిర్వహణను ప్రభుత్వం జైళ్ల శాఖకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. మరో 6 నెలల్లో 400 మంది విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నేరాల అదుపు వల్ల 49 జైళ్లలో 17 మూసివేశామన్నారు. ఆ జైళ్లలో ఆశ్రమాలను నెలకొల్పేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. హౌసింగ్ సొసైటీ ద్వారా వరంగల్, హైదరాబాద్ జైళ్ల సిబ్బందికి సొంత ఇళ్లు అందించనున్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ విదేశీయానం ఖర్చు 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయా నానికి రూ.2,021 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను ప్రధాని సందర్శించారని వివరించారు. ప్రధాని పర్యటనల కారణంగా భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2014–18 సంవత్సరాల మధ్య ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో ఎఫ్‌డీఐలు అత్యధికంగా వచ్చే మొదటి పది దేశాలు కూడా ఉన్నాయన్నారు. 2014లో 30,930.5 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు పర్యటనల ఫలితంగా 2017 నాటికి 43,478.27 మిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. యూపీఏ–2 హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు 2009–14 సంవత్సరాల మధ్య రూ.1,346 కోట్లని వీకే సింగ్ పేర్కొన్నారు. -
అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూయార్క్: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్‌పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ పాస్‌పోర్ట్ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. -
‘ఆర్మీ చేతిలో ఆయన కీలుబొమ్మ’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్‌పై భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ పలు ఆరోపణలు చేశారు. పాక్ సైన్యం చేతిలో ఆయన కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని వీకే వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కూడా పాక్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదని.. ఇంతకు ముందు పాక్‌ను పాలించిన వారి అడుగు జాడల్లోనే ఇమ్రాన్ కూడా నడుస్తున్నాడని ఆయన అభిప్రాయడ్డారు. ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహంచిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై చర్చించారు. ఇమ్రాన్ ఖాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మలా వ్యవరించడం వల్లే పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు మునుపటిలానే ఉన్నాయని పేర్కొన్నారు. సైన్యాన్ని ఆసరాగా తీసుకుని ఆయన పాలన చేస్తున్నారని.. పాక్ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరిని కలిగి ఉందన్నారు. పంజాబ్‌లో గల వివాదాస్పద కర్తార్‌పూర్ రహదారిని తిరిగి ప్రారంభించాల్సిందిగా పాక్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్న వార్తలను సింగ్ తోసిపుచ్చారు. పాక్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెల్చిచెప్పారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే సిక్కుల గురువైన గురు నాయక్ 550వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆ కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా గురు నాయక్ 550వ జయంతి ఉత్సవాలను 2019లో నిర్వహించనున్నారు.