దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ నాయకత్వంలో 'ఆపరేషన్ సంకట్ మోచన్' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ నాయకత్వంలో 'ఆపరేషన్ సంకట్ మోచన్' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం భారతప్రభుత్వం దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సీ 17 అనే రెండు మిలటరీ విమానాలను గురువారం పంపింది.
వీకే సింగ్ తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అమర్ సిన్హా, సత్ బిర్ సింగ్, అంజన్ కుమార్ లు వెళ్లారు. దక్షిణ సూడాన్ లోని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ ఈ ఆపరేషను ఆర్గనైజ్ చేస్తున్నారు. సూడాన్ లో 500 మంది భారతీయులున్నారని సమాచారం. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.