South Sudan
-
ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి
జుబా: సౌత్ సూడాన్‌లో (south sudan) ఘోర విమాన (plane crash) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు.యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్‌వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది.ప్రమాదంతో చమురు క్షేత్రాల సమీపంలో విమాన శకలాలు తలక్రిందులుగా పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న విమాన శిధిలాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Maker Makoi, one of the two survivors that survived today’s Plane Crash in Unity State, South Sudan which resulted to the death of 19 passengers. pic.twitter.com/LEykATYz4W— South Sudan Eagles Media (@ssemtv) January 29, 2025ప్రమాదంపై సౌత్ సూడాన్ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్వెచ్ బిపాల్ బోత్ స్పందించారు. విమానం ప్రమాదంలో 20 మంది మరణించారని, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. స్థానిక అధికారుల వివరాల మేరకు.. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్ సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సౌత్ సూడాన్ 2011లో స్వాతంత్ర్యం పొందించింది. నాటి నుంచి దక్షిణ సూడాన్ పేలవమైన రవాణా కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదాలు సర్వసాధారణమని సమాచారం. 👉చదవండి: నల్లపెట్టె మౌనరాగం! -
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్‌కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్‌స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష!
మన దేశంలో ఎవరైన హత్యలు చేస్తే వారికి శిక్ష పడటానికి చాలా టైం పడుతుంది. ఆధారాలు, సాక్షాలు పక్కాగా ఉండి నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలోనో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే సదరు జంతువు యజమాని మంచివాడైతే నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తేరేమో గానీ ఎక్కువ శాతం మంది తప్పించుకునేందుకే చూస్తారు. కానీ ఇక్కడొక ఆఫ్రికా దేశంలో ఒక జంతువు మనిషిని దాడి చేసి చంపినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే...దక్షిణ సూడాన్‌లో రామ్ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రామ్ అనే గొర్రెని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్ చేశారు. ఈ మేరకు కోర్టు రామ్ అనే గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది. రామ్(గొర్రె) యజమాని డుయోని మాన్యాంగ్ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా రామ్(గొర్రె) లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతుందని తెలిపింది. అంతేకాదు శిక్ష ముగింపులో గొర్రెని యజమాని డుయోని కోల్పోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అంటే దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం ఏదైన జంతువు దాడిలో వ్యక్తి చనిపోతే ఆ జంతువుని శిక్షా కాలం ముగింపులో బాధితుడు కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇదిలా ఉండగా గొర్రెల దాడిలో వ్యక్తి మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా అమెరికాలో ఓ మహిళ పొలంలో గొర్రెల దాడికి గురై మరణించింది. (చదవండి: సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..) -
125 మందిపై అత్యాచారం
జుబా: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దక్షిణ సూడాన్‌లో మహిళలపై లైంగిక హింస కొనసాగుతోంది. గడిచిన పది రోజుల వ్యవధిలో 125 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలు, భౌతిక దాడులు జరిగినట్లు తెలిసింది. బెంటియూ అనే ప్రాంతంలో ఆహార పంపిణీ కేంద్రానికి వెళ్లగా వారిపై ఈ ఘోరం జరిగినట్లు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. బాధితుల్లో గర్భిణీలు, వృద్ధులు, బాలికలున్నట్లు సహాయక కార్యకర్తలు తెలిపారు. ఈ ఘోరం గురించి చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల దుస్తులు, పాదరక్షలు, రేషన్ కార్డులు లాక్కుని వారిపై భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు చెప్పారు. మిలిటరీ సిబ్బంది, సాధారణ పౌరులే ఈ దారుణాలకు ఒడిగడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి మిషన్ చీఫ్ డేవిడ్ షీర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది తొలి పది నెలల కాలంలో అదే ప్రాంతంలో 104 మంది లైంగిక దాడి బాధితులకు వైద్యం అందించినట్లు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది. -
కూలిన విమానం : 44 మంది మృతి
-
కూలిన విమానం.. అందులో 44 మంది
జుబా: దక్షిణ సూడాన్‌లో విమానం కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమానంలో కనీసం 44 మంది ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల క్షేమం గురించి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. విమానంలోని 44 మంది మరణించినట్టు వార్తలు రాగా మరికొన్ని వార్త సంస్థలు చాలామంది ప్రయాణికులు గాయపడినట్టు మాత్రమే పేర్కొన్నాయి. ఈ విమానం ఎక్కడికి వెళ్తోంది, ప్రమాదానికి కారణమేంటన్న వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది. -
అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలు
జుబా: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న దక్షిణ సూడాన్‌లో దాదాపు 48 లక్షల మంది ప్రజలు ఆకలిమంటలతో అలమటిస్తున్నారని ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ సూడాన్ డెరెక్టర్ జాయిస్ కన్యాంగ్వా లూమా తెలిపారు. ముఖ్యంగా దక్షిణ సూడాన్‌లోని ఉత్తర ప్రాంతంలోవున్న బహర్ ఎల్ ఘజల్ ఆహార కొరత సమస్య మరీ తీవ్రంగా ఉందని, అక్కడ ప్రతి పది మందిలో ఆరుగురు ఆకలితో అలమటిస్తున్నారని, ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని లూమా తెలిపారు. ముందుగా ఆ ప్రాంతంలోని 8,40,000 మంది ప్రజలకు ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం కింద ఆహారాన్ని విమానాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించామని లూమా చెప్పారు. ప్రభుత్వ దళాలకు, మాచర్ దళాలకు మధ్య అంతర్యుద్ధం తిరిగి జూలై నెలలో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం బహర్ ఎల్ ఘజల్ ప్రాంతంలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. అంతర్యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటాయని, కాలం కలసిరాక ప్రజల కొనుగోలు శక్తి కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని లూమా చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎల్ ఘజల్ ప్రాంతానికి సరకులను వ్యాపారులు తరలించినా కొనే పరిస్థితి అక్కడి ప్రజలకు లేదని అన్నారు. -
భారతీయులతో ఢిల్లీ చేరిన ఫ్లైట్
-
156 మంది భారతీయులు తిరిగొచ్చారు
తిరువనంతపురం: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న 156 మంది భారతీయులు స్వదేశానికి క్షేమంగా తిరిగొచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో వీరు శుక్రవారం ఉదయం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. వీరిలో 46 మంది కేరళ, ఇద్దరు నేపాలీలు, ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, దక్షిణ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. దక్షిణ సూడాన్ లో మొత్తం 500మంది భారతీయులున్నారు. వీరిలో 300 మంది తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం అక్కడే ఉంటామని తెలిపారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. వారి క్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ దేశ ఉపాధ్యక్షుడు తనకు వివరించారని ఆయన తెలిపారు. దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు 'ఆపరేషన్ సంకట్ మోచన్' ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం గురువారం రెండు సీ-17 విమానాలు ఆ దేశానికి బయలుదేరి వెళ్లాయి. ఈ ఆపరేషన్ కు వీకేసింగ్ నాయకత్వం వహించారు. -
భారతీయుల కోసం 'ఆపరేషన్ సంకట్ మోచన్'
ఢిల్లీ: దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ సంకట్ మోచన్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం రెండు విమానాలలో సుడాన్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణకు చెందిన 54 మంది, ఏపీకి చెందిన 11 మందిని కేంద్ర విదేశాంగశాఖ భారత్‌కు తీసుకురానుంది. గత కొంతకాలం నుంచి దక్షిణ సుడాన్ లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటులో ఇప్పటివరకే రెండు వందల మందికి పైగా పౌరులు మరణించారు. తిరుగుబాటు నేపథ్యంలో భారతీయులను సురక్షితంగా ఇక్కడికి తీసుకొస్తామని విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ ఇదివరకే పేర్కొన్నారు. -
అచ్చం ఎయిర్‌లిఫ్ట్ సినిమాలాగే..
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న దక్షిణ సూడాన్ ప్రాంతంలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం నడుంకట్టింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి అచ్చం ‘ఎయిర్‌లిఫ్ట్’ సినిమాలో ఉన్నట్లే భారతీయ విమానాలు అక్కడకు వెళ్లాయి. అయితే ఈ విమానాలతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ కూడా వెళ్లడం విశేషం. సూడాన్ చేరుకున్న ఆయన.. అక్కడి ఆర్థికమంత్రి డెంగ్ అలోర్ కౌల్‌తో సమావేశమయ్యారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు సి-17 గ్లోబ్ మాస్టర్ రకం విమానాలను అక్కడకు పంపారు. వాటిలో అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 300 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. మొదటి విమానం ఇప్పటికే సూడాన్ రాజధాని జుబా నగరంలో ల్యాండ్ అయింది. దీనికి ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ అని పేరు పెట్టారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బృందంలో భాగంగా ప్రస్తుతం దక్షిణ సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారతీయ సైనికులు కూడా అక్కడున్న ప్రవాస భారతీయులను ఖాళీ చేయించడంలో సాయపడుతున్నారు. వాళ్లందరినీ జుబా విమానాశ్రయానికి తీసుకొచ్చి.. విమానాలు ఎక్కించారు. -
భారతీయుల కోసం 'ఆపరేషన్ సంకట్ మోచన్'
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ నాయకత్వంలో 'ఆపరేషన్ సంకట్ మోచన్' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం భారతప్రభుత్వం దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సీ 17 అనే రెండు మిలటరీ విమానాలను గురువారం పంపింది. వీకే సింగ్ తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అమర్ సిన్హా, సత్ బిర్ సింగ్, అంజన్ కుమార్ లు వెళ్లారు. దక్షిణ సూడాన్ లోని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ ఈ ఆపరేషను ఆర్గనైజ్ చేస్తున్నారు. సూడాన్ లో 500 మంది భారతీయులున్నారని సమాచారం. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. -
దక్షిణ సూడాన్ లోని భారతీయులు క్షేమం
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ లోని భారతీయులు క్షేమంగా ఉన్నారని ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. గత కొంత కాలంగా ఆదేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 270 మంది పౌరులు మరణించారు. దీంతో ఆదేశంలో ఉన్న భారతీయుల క్షేమంపై విదేశాంగ శాఖ దృష్టి సారించింది. సూడాన్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ తెలిపారు. జరుగుతున్న ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
ఇది సూడాన్ గోకులం..
దక్షిణ సూడాన్.. నైలు నదీతీరం.. తెలవారింది.. ముండరీ తెగ నిద్రలేచింది.. పళ్లు తోముకున్నారు..తర్వాత గోమూత్రాన్ని నెత్తిన పోసుకున్నారు!! యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయనే కాదు. ఆవు అమ్మలాంటిది, తమను ఎలాంటి ఆపదనుంచైనా రక్షిస్తుందన్నది వారి నమ్మకం. నేరుగా పొదుగు నుంచి పాలు తాగారు.. ఢంకా మోగించారు.. పశువులను మేతకు తీసుకెళ్లే సమయమైంది అనడానికి సంకేతంగా.. ఇది సూడాన్ గోకులం.. ఆవుతోనే వీరికి రోజు మొదలవుతుంది. ఆవుతోనే ముగుస్తుంది. గోవులు.. ముండరీ తెగ బలం, గర్వం, ఆస్తి, ఆత్మాభిమానం. పశువులను వీరు తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. గోమూత్రంతో స్నానం చేస్తారు. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంతోపాటు వారి జుత్తు కూడా ఎర్రగా మారి ఎంతో అందంగా ఉంటుందట. అంతేకాదు పిడకలను కాల్చి, పొడి చేసి, టాల్కం పౌడర్లా ఒళ్లంతా రాసుకుంటారు. పశువులకూ రాస్తారు. యాంటీసెప్టిక్‌గా ఉండటంతోపాటు దోమల కాటు నుంచీ రక్షణ కల్పిస్తుందట. అటు ఎండల నుంచి కూడా కాపాడుతుందట. ముండరీ తెగ ప్రజల జీవితాలు శతాబ్దాలుగా పశువులతో పెనవేసుకుపోయాయి. ఇక్కడి పశువులు ఎంతో బలంగా ఉంటాయి. వీటిని దొంగిలించుకుపోవడానికి దాడులూ జరుగుతుంటాయి. వీటిని కాపాడుకోవడానికి వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పశువులను అమ్మరు. ఎందుకంటే.. వీరికి ఆవు అమ్మ.. ఆవే అన్నీనూ.. -
కుప్పకూలిన విమానం; 36 మంది మృతి
36 మంది మృతి.. సూడాన్‌లో దుర్ఘటన జుబా: ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్‌లో బుధవారం ఓ రవాణా విమానం కూలిపోయింది. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి సుమారు 800 మీటర్లదూరంలోనే నైలునదిలోని ఓ చిన్న ద్వీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో సుమారు 36 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి సహాయంతో నడుస్తున్న రేడియో మరియా తెలిపింది. విమానం కూలిన ద్వీపంలో కొన్ని రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, విమానం కూలినకారణంగా దానికిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, విమానం శకలాలు నది వెంట చెల్లాచెదురుగా పడ్డాయని ఆ వార్తలు తెలిపాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారని ఓ వార్తాసంస్థ విలేకరి తెలిపారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సూడాన్‌లో జుబా విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. పలు వాణిజ్య, రవాణా విమానాలే కాకుండా మిలిటరీ విమానాలు కూడా ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ద్వీపం వద్ద కూలి ముక్కలుచెక్కలైన విమానం. పక్కన పడి ఉన్న మృతదేహాలు -
సూడాన్‌లో కూలిన విమానం
-
ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది మృతి
జుబా: ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది దుర్మరణం చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడినట్టు అక్కడి ప్రభుత్వం అధికారకంగా గురువారం వెల్లడించింది. దక్షణ సూడన్ రాజధాని జూబాకు 250 కిలోమీటర్ల దూరంలో మార్థి అనే చిన్న టౌన్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఇంధనాన్ని వెలికితీస్తుండగా ప్రమాదవాశాత్తూ ఆయిల్ ట్యాంకర్ పెద్ద శబ్ధంతో పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ పేలుడు ధాటికి తీవ్ర గాయాల పాలైన బాధితులందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం మార్ధి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మంటల తీవ్రత కారణంగా శరీర భాగాలు కాలిపోవడంతో మంట భరించలేక క్షతగాత్రులంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్పత్రిలో ఇచ్చే మందులు కూడా బాధితులకు ఉపశమనం అందించలేకపోతున్నాయని చాంధీ సేవియర్ అనే వైద్యుడు తెలిపారు. -
దక్షిణ సుడాన్లో శాంతి పవనాలు
జుబా: అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న ప్రపంచంలోనే అతిపిన్న దేశం దక్షణ సుడాన్లో శాంతి స్థాపనకు బీజం పడింది. తిరుగుబాటు దళాలకు, ప్రభుత్వానికి మధ్య బుధవారం శాంతి ఒప్పందం జరిగింది. దీంతో నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడినట్లయింది. రాజధాని నగరం జుబాలో బుధవారం దేశాధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు దళాల నాయకుడు రిక్ మచార్ ల ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. నిజానికి గతవారమే ఈ ఒప్పందం జరగాల్సిఉండేది కానీ తిరుగుబాటుదారుల డిమాండ్లకు అధ్యక్షుడు సల్వా నో చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాగా, శాంతిఒప్పందానికి అంగీకరించకుంటే అంతర్జాతీయ సమాజం నుంచి బహిష్కరణ వేటు తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడంతో సాల్వా దిగివచ్చారు. శాంతి ఒప్పందం విజయవంతానికి దక్షిణ సుడాన్ పొరుగుదేశాలైన కెన్యా, ఉగాండా, ఇథియోపియా తదితర దేశాల అదినేతలు సహకరించారు. 2011లో దక్షిణ సుడాన్ స్వతంత్ర్యదేశంగా ఆవిర్భవించింది. అధ్యక్షుడు సాల్వా.. ఉపాధ్యక్షుడైన రిక్ మచార్ ను పదవి నుంచి తొలగించడంతో ప్రారంభమైన విబేధాలు తీవ్ర రూపందాల్చి అంతర్యుద్ధానికి దారితీసింది. నేటి శాంతి ఒప్పందంతో రిక్ తిరిగి ఉపాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. -
హమ్మయ్య.. 250 మంది చిన్నారులకు విముక్తి
న్యూయార్క్: దక్షిణ సుడాన్‌లోని ఓ సాయుధ బలగాల గ్రూపు నుంచి 250 మంది బాల సైనికులకు విముక్తి కలిగింది. మరో రెండు రోజుల్లో 400 మంది చిన్నారులను విడిపించాల్సి ఉందని ది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (యూనిసెఫ్) ప్రకటించింది. దక్షిణ సుడాన్‌లోని డెమొక్రటిక్ ఆర్మీ కోబ్రా ఫ్యాక్షన్ అనే సాయుధ సంస్థ దాదాపు 12,000 మంది బాలబాలికలను బలవంతంగా తమ గ్రూపులో చేర్చుకుంది. అప్పటి నుంచి వారికి కఠిన శిక్షణ ఇస్తూ సైనికులుగా మార్చే పనిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వారికి విముక్తి కలిగించేందుకు పూనుకున్న యూనిసెఫ్.. అప్పటి నుంచి ఆ సంస్థతో పలు దఫాలుగా శాంతి చర్చలు జరిపింది. చర్చలు ఫలించడంతో విడతల వారిగా తమ వద్ద ఉన్న బాల సైనికులను సౌత్ సుడాన్ డెమొక్రటిక్ ఆర్మీ కోబ్రా ఫ్యాక్షన్ విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 250 మంది చిన్నారి సైనికుల్లో బాలికలు కూడా ఉన్నారు. విడుదలైన వారితో యూనిసెఫ్ బుధవారం ప్రత్యేకంగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో బాధితులైతున్న చిన్నారుల గురించే చర్చించనున్నారు. -
తీన్మార్ స్టెప్పులు.. బతుకమ్మ ఆటలు
ముక్తాపూర్ (భూదాన్‌పోచంపల్లి) : పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో విదేశీయులు ఆదివారం సందడి చేశారు. తీన్మార్ స్టెప్పులు, బతుకమ్మ ఆటలతో ఆకట్టుకున్నారు. గ్రామీణ కుల వృత్తులు, పంచాయతీ పాలనపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్త(నిర్డ్), పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జింబాబ్వే, సిరియా, ఎరిథ్రియా, టంజానియా, తజకిస్తాన్, సూడాన్, సౌత్ సూడాన్, మారిషస్, ఘనా, మయన్మార్ దేశాలకు చెందిన 16మంది గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, మహిళా సంక్షేమ శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మునుకుంట్ల బాలచంద్రం, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, వీఆర్వో శ్రీకాంత్, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. గామ పంచాయతీ పాలన, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, వారి విధులను అడిగి తెలుసుకొన్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. కులవృత్తుల అధ్యయనంలో భాగంగా చేనేత, గీత, మత్స్య, కుమ్మ రి వృత్తులను పరిశీలించారు. వారితో ముచ్చటించారు. కల్లు గీసే విధానం, మగ్గాలు, స్థానిక చెరువులో చేపల పెంపకాన్ని పరిశీలించారు. గ్రామ కూడలిలో స్థానికులతో కలిసి విదేశీయులు బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. ఈత కల్లు రుచి చూశారు. అనంతరం గ్రామంలో అధ్యయనం చేసిన సామాజిక, ఆర్థిక అంశాలపై సోషల్ మ్యాప్‌ను గీశారు. ముక్తాపూర్ గ్రామ పర్యటన ఎంతో ఆకట్టుకొందని, ఇక్కడి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ కోర్సు డైరక్టర్ డాక్టర్ టి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్ఐఆర్డీలో ‘సముదాయక భాగస్వామ్యంతో అభివృద్ధి’ అనే అంశంపై ఆరు వారాల అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందు లో భాగంగానే క్షేత పర్యటన నిమిత్తం ముక్తాపూర్‌ను సందర్శించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు ప్రవీణ, అనిత, శోభ, ఉపసర్పంచ్ కళమ్మ, వార్డు సభ్యులు బండారు ప్రకాష్‌రెడ్డి, ఇటమోని లక్ష్మయ్య, కొండమడుగు రామేశ్వర్, కె. మహేష్, జి.ధనమ్మ, గొలనుకొండ కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో 56 మంది మృతి
కర్తోమ్: దక్షిణ సూడాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 56 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉగాండ, దక్షిణ సూడాన్ కలిపే రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. క్షతగాత్రలను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని... ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను ఇప్పటికే పోస్ట్‌మార్టం నిమిత్తం అస్పత్రికి తరలించామని తెలిపారు. దక్షిణ సూడాన్ నుంచి పొరుగు దేశాలకు కలిపే జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. -
సంపదే ఆ దేశానికి శాపం
ఆఫ్రికా ఖండంలో ఎప్పడు ఏం జరిగినా అది దానికి కీడుగానే పరిణమించాలని ‘రాసిపెట్టి’ ఉంది. అందుకే దక్షిణ సూడాన్ నేడు నెత్తురోడుతుంది. కాబట్టే ఆఫ్రికాలోనే అతి సుదీర్ఘమైన యాభయ్యేళ్ల అంతర్యుద్ధం తదుపరి 2011లో ఆవిర్భవించిన దక్షిణ సూడాన్ ముచ్చటగా మూడేళ్లయినా కాకముందే అంతర్యుద్ధం అంచులకు చేరింది. పుట్టిన నాడే అది తన ‘కాళ్ల మీద లేచి నిలబడలేని దేశం. కాలు కదిపి అడుగు వేయలేని దేశం’ అని విజ్ఞులు అన్నారు. అరైవె కి పైగా జాతుల తెగలతో కూడిన ప్రజలు ఉత్తర సూడాన్ పాలకుల వివక్షకు, అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా ‘సూడాన్ ప్రజా విముక్తి ఉద్యమం’ (ఎస్పీఎల్ఎమ్)గా ఐక్యమయ్యారు. వారిని ఒక జాతిగా ఐక్యం చేయాల్సిన దేశాధ్యక్షుడు సల్వా కిర్ ఆ బాధ్యతను స్వీకరించలేదు. న్యూర్ తెగకు చెందిన మచార్ అనుకూల సైనికాధికారులు ఆయనతో చేయి కలిపారు. డింకా తెగకు చెందిన సల్వా కీర్‌ను గద్దె దించేవరకు పోరాటం సాగుతుందని మచార్ సైతం హెచ్చరించారు. అమెరికా వంటి సంపన్న దేశాలు అక్కడి చమురు కోసం అంతర్యుద్ధంలో... పశువులనే అమూల్య సంపదగా ఎంచి బతికే పశుపాలక తెగల చేతులకు అత్యాధునిక మారణాయుధాలను అందించారే గానీ దక్షిణ సూడాన్ మనుగడకు, ప్రజాస్వామ్యానికి పూచీ పడలేదు. అందుకే ఇంచుమించు కోటి జనాభాలో 90 శాతంగా ఉండే డింకా, న్యూర్ తెగల వారు ఒకరి నొకరు తెగ నరక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ మారణ హోమంలో సమిధలవుతున్న అమాయక పౌరులను శరణార్థి శిబిరాలకు తర లించే కృషిలో సైతం ప్రపంచ పెద్దల పత్తా లేదు. ఇరాక్, అఫ్ఘాన్ల వంటి యుద్ధాలకు లక్షల సైన్యాన్ని తరలించిన శక్తివంతులు తమ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిం చడంలో తలమునకలవుతున్నారు. ప్రాణాలు తీయడమే ఎరిగిన వారికి ప్రాణాలర్పించైనా ప్రాణాలను నిలపడం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి ‘అల్పమైన’ బాధ్యతలను నెరవేర్చడానికి మనలాంటి బడుగు దేశాల సైనికులున్నారు. ఇద్దరు జవాన్లను పోగొట్టుకున్న భారత శాంతి దళాలు తెగువ చూపకపోతే కొన్ని వేల నిండు ప్రాణాలు బలై పోయేవని ఐరాస పేర్కొంది. ఇంతవరకు కనీసం వెయ్యి మంది పౌరులు ఈ మారణకాండలో హతమై ఉంటారని, అంతర్గత నిర్వాసితుల సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అది భావిస్తోంది. సల్వాకిర్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా ఉన్న ఈయక్ మచార్ సైనిక కుట్రకు పాల్పడటంతో డిసెంబర్ 15 నుంచి దేశ జనాభాలో 90 శాతంగా ఉన్న రెండు ప్రధాన తె గలైన డింకా, న్యూర్ తెగల మధ్య అల్లర్లు చెలరేగాయని అధికారిక కథనం. అయితే ఈ అశాంతి, అస్థిరతలకు సల్వా కిర్ జూలైలో నాంది పలికారు. మచార్‌తో పాటూ ప్రభుత్వం లోని అందర్నీ పదవుల నుంచి తొలగించారు. ఫిబ్రవరిలో వంద మందికిపైగా సైనిక అధికారులను తొలగించే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణ సూడాన్ ఐక్యతకు పునాది తెగల ఐక్యతే. దాన్ని పటిష్టం చేయగలిగితే అత్యంత వెనుకబడిన దేశం అభివృద్ధి చెందడానికి కావలసిన సకల వనరులు ఉన్నాయి. దేశం పొడవునా పారే నైలు నదీ జలా లతో పచ్చగా ఉండే దక్షిణ సూడాన్‌లో పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, క్రోమియమ్, జింక్, టంగస్టిన్, మైకా, వెండి, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ సంపదలున్నాయి. దేశంలోని చమురు నిక్షేపాలపై చైనాకు అది సూడాన్‌లో భాగంగా ఉన్నప్పటి నుంచి ఆధిపత్యం ఉంది. అధికారం కోసం కుమ్ములాడుతున్న పక్షాలు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే దేశం జాతి మారణహోమంలోకి, మరో సుదీర్ఘ అంతర్యుద్ధంలోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు, చైనా ప్రస్తుతం అక్కడి ఖనిజ సంపదలను చక్కబెట్టే పనిలో ఉన్నాయి. దక్షిణ సూడాన్ చమురును రవాణా చేసే పైపు లైన్ల వ్యవస్థ ఉత్తరాన ఉన్న సూడాన్‌లోనే ఉంది. ‘అబేయీ’ అనే కీలకమైన చమురు పట్టణం విషయంలో ఆ రెండు దేశాల మధ్య వివాదం, ఘర్షణలు రగులుతున్నాయి. దీంతో ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం మరిన్ని అత్యాధునిక ఆయుధాలను, సాయుధ సంపత్తిని సమకూర్చుకుంది. చైనా దానికి సరికొత్త ఆయుధ సరఫరాదారు. అందుకే పశు పోషక తెగల మధ్య పశు సంపదకోసం, పచ్చిక మైదానాల కోసం జరిగే సర్వసాధారణమైన సంఘర్షణలు శైశవ ప్రాయంలోని దేశాన్ని కుక్కలు చింపిన విస్తర్ని చేసే ముప్పు దిశకు దిగజారుతున్నాయి. ఒకప్పుడు బ్రిటన్ వలస పాలకులు సూడాన్‌ను మత ప్రాతిపదికపై దక్షిణ, ఉత్తర ప్రాంతాలుగా విభజించి, మతాల చిచ్చును రగిల్చి పాలించారు. చివరికి సూడాన్ రెండు ముక్కలు కావడానికి కారణమయ్యారు. నేటి అశాంతికి ప్రపంచ శక్తుల తెర వెనుక రాజకీయాలు కూడా తోడైతే పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. -పిళ్లా వెంకటేశ్వరరావు